శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 14 / 𝙎𝙃𝙍𝙄 𝙈𝘼𝙉𝙄𝙆 𝙋𝙍𝘼𝘽𝙃𝙐 - 𝙃𝙄𝙎 𝙇𝙄𝙁𝙀 𝘼𝙉𝘿 𝙈𝙄𝙎𝙎𝙄𝙊𝙉 - 14
🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 14 / 𝙎𝙃𝙍𝙄 𝙈𝘼𝙉𝙄𝙆 𝙋𝙍𝘼𝘽𝙃𝙐 - 𝙃𝙄𝙎 𝙇𝙄𝙁𝙀 𝘼𝙉𝘿 𝙈𝙄𝙎𝙎𝙄𝙊𝙉 - 14 🌹 🌻. చతుర్థ దత్తావతారము 🌻 🌸. అమృతకుండము - 2 🌸 ప్రభువు కళ్యాణి నుండి వెళ్ళిపోగానే ఇంట్లోని వారందరికీ బాధ కలిగింది. మామకు కూడా చాలా దుఃఖం కలిగింది. తానొకటి తలిస్తే, దైవం మరొకటి తలిచింది అనిపించింది. నాలుగుదిక్కులా ప్రభు కోసం వెతికించారు. చాలా రోజులు వెతికినా ప్రయోజనం లేకపోయేసరికి అందరూ నిరాశ చెందారు. ప్రభువుతో ఆటలాడిన పిల్లలకు కూడా చాలా దుఃఖం కలిగింది. కళ్యాణి నుండి వెళ్ళినతర్వాత మూడు నాలుగు నెలలు తర్వాత మంటాల గ్రామంలో కనిపించారు. బయమ్మ, హనుమంత్ రావు దాదా, నృసింహతాత్యాలను తీసుకొని మామ మంటాలకు వచ్చారు. మంటాలలో కూడా ప్రభువు, కుటుంబ సభ్యులకు కనిపించలేదు. అమృతకుండము, సీతా గుహ ఇలా అన్నీ చోట్ల ప్రభువు కోసం అడిగారు. కానీ ఫలితం లేదు. వీరందరూ మంటాలలో కొద్దిరోజులు ఉన్నారు. కొద్దిరోజులు తర్వాత ప్రభువు అమృతకుండము దగ్గర ఉన్నారని తెలిసి, కుటుంబ సభ్యులు అందరూ అమృతకుండముకు చేరుకున్నారు. ప్రభువు కనిపించగానే అందరికీ చాలా సంతోషం అనిపించింది. అక్కడ రెండు మూడు రోజులుండిపోయారు. ప్...