శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 5 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 5
. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 5 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 5
. చతుర్థ దత్తావతారము
. విద్యాభ్యాసము
ప్రభువు యొక్క బాల్యం చాలా వరకు కళ్యాణిలోనే గడిచింది. శ్రీకృష్ణుని బాల్య క్రీడలు ఏ విధంగా గోకులంలో, బృందావనంలో చిరస్మరణీయం అయ్యాయో అలాగే ప్రభు లీలలు కూడా చిరస్మరణీయమే. ప్రభువుకి వ్యవహారిక జ్ఞానం (విద్యాభ్యాసం) ఎవరి నుండి లభించిందో తెలిసే మార్గం లేదు. ప్రభు ఏ బడికి వెళ్ళలేదు.
ఆ రోజులలో అధ్యాపకుల ఇంట్లో అక్షరజ్ఞానం, పత్ర లేఖనం, గణితం, జమాఖర్చులాంటి వ్యవహారిక జ్ఞానం నేర్పించేవారు. కానీ ప్రభు ఎన్నడూ ఏ అధ్యాపకుని వద్దకు వెళ్లినట్టు కనిపించలేదు.
ప్రభువుకి ఉపనయన సంస్కారం చేసి గాయత్రి మంత్ర ఉపదేశం తండ్రిగారైన మనోహరనాయక్ గారు చేశారు. తండ్రి ఆధ్వర్యంలోనే అక్షరజ్ఞానం తెలిసి ఉండాలి. వ్యవహార జ్ఞానం కూడా మనోహరనాయక్ నుండే వచ్చి ఉండాలి.
చాలా చిన్నప్పటినుండి ప్రభువు అలౌకిక దివ్య పురుషుడని అవగతమవుతుంది. బాల్యంలో చేసిన లీలల వలన వారు అవతార పురుషుడని అందరికీ దృఢమైన నమ్మకం కలిగింది.
ప్రభువు యొక్క బాల్యంలోని ముఖ్యమైన సమయం స్వతంత్ర ప్రవృత్తితో అడవిలో తిరిగి మిత్రులను ప్రోగుచేసి నానా విధాలైన ఆటలు ఆడడంలోనే గడిచిపోయింది. ఈ విధమైన ఆటల్లో కూడా ప్రభు యొక్క విశిష్టత కనిపించేది. జన్మతః దివ్యతేజస్సుతో జ్ఞాన సంపన్నుడైన ప్రభువుకి ఎవరి నుండి విద్య నేర్చుకొనే అవసరం ఉండేది కాదు. కానీ ప్రభు యొక్క మామ కు (మావయ్య) మాత్రం ప్రభుకి మంచి అధ్యాపకులతో విద్య చెప్పించాలని ఉండేది. కానీ ప్రభువు మాత్రం ఒక్కొక్కసారి స్నేహితులతో, ఒక్కొక్కసారి ఒంటరిగా అడవిలోను, గుళ్ళల్లలోనూ తిరుగుతుండేవారు. ప్రభు మామ పేరు బలవంతరావ్ అప్పారావ్. ఈయన నవాబుల ఆస్థానంలో పెద్ద అధికారిగా ఉండేవారు. వారి దగ్గర సిపాయిలు, జవానులుండేవారు. ప్రభువుని బడికి పంపించే ప్రయత్నం విఫలమైనందున ప్రభువుతో సిపాయిలను కూడా బడికి పంపేవారు. వాళ్ళని తప్పించుకొని ప్రభువు సహజ లీలలతో మాయమయ్యేవారు. *బడికి పోకుండా ఎక్కడకి వెళ్తున్నాడో అని చూద్దామని మామ ప్రభువుని రహస్యంగా వెంబడించారు. అక్కడ అడవిలో ఒక భయంకరమైన పులి ముందు నిలబడి ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. బడికి పంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యే సరికి చివరికి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
ప్రభువు యొక్క ఈ స్వతంత్ర ప్రవృత్తి చాలా మందికి ఈ పిల్లవాడు పిచ్చివాడుగా ఉండొచ్చని ప్రభుని వేడా భావు (పిచ్చి సోదరుడు) అని పిలిచేవారు. కొంతమంది మాత్రం ప్రభు సామాన్య మానవుడు కాదని నమ్మేవారు. *ప్రభువుకి వాక్సిద్ధి ఉందని చాలామందికి తెలిసింది. చాలా చిన్నవయస్సులోనే అమృతమయ వాక్కుతో లోక కళ్యాణం జరగడం అన్ని ఊర్లలోకి పాకిపోయింది. జనులంతా తమ పనులు ఎలా అవుతాయి? ఎప్పుడు అవుతాయి? ఇలాంటి ప్రశ్నలతో ప్రభువు వద్దకు వచ్చేవారు. వేడాభావు వాక్కు నిజమవుతుందని జనాల్లో నమ్మకం పెరిగిపోయింది. అందువలన వారి మీద ఒక రకమైన ఆదరణ పెరిగింది. ఈ వేడాభావు రూపం మంచి దర్పంతో ఉండేది. అప్పుడపుడు శరీరానికి బూడిద పూసుకొని దిగంబరముగా కనిపిస్తుండేవారు. కొన్ని సమయాల్లో ప్రతిష్ఠగల మనుష్యుల వలె పెద్ద చర్చా గోష్టుల్లో మాట్లాడుతుండేవారు. ప్రభు భాషలో, వ్యవహారంలో ఒకరకమైన ఆకర్షణ ఉండేది. చక్కెరకు ఎలా చీమలు పడతాయో అలా పిల్లలు ఎప్పుడూ ప్రభువు చుట్టూ చేరేవారు. ప్రభువుతో ఏ ప్రదేశంలో అయినా, ఏ కాలంలోనైనా పిల్లలు ఆనందంగా ఉండేవారు. వారు ప్రభు సహవాసంలో నిర్భయంగా ఉండేవారు.
ప్రభువుతో ఆటలు ఆడినవారు పెద్దయ్యాక ఇలా అనుకునేవారు. వారితో బాల్య క్రీడలను గుర్తుచేసుకొని వాటిని వర్ణిస్తూ ఉద్విగ్నతకు లోనై 'హాయ్ రే ప్రభు, ఆ సమయంలోనే మాకు ముక్తిని ప్రసాదించలేదు. మేము నీ నిజరూపాన్ని గుర్తించలేక మీతో కుస్తీ పట్టాము, చెట్లు ఎక్కాము, అనేకవిధాలా ఆటలు ఆడాము అంటూ ప్రేమోద్వేగానికి లోనై అశ్రుధారలు జల జల కారుతుండగా అంతఃకరణ ప్రేమతో నిండిపోయి, తమ మాట నిలిచిపోయిందంటూ, ప్రభువుతో తమ అనుబంధాన్ని వివరిస్తూ, ప్రభు నామస్మరణ చేసేవారని, వారిని ప్రత్యక్షంగా కలుసుకున్న ప్రభువు యొక్క మరాఠీ చరిత్ర రచయిత శ్రీ గణేష్ రఘునాథ్ కులకర్ణి గారు వర్ణించారు.
ప్రభువు హిందీ, మరాఠీ, కన్నడ, తెలుగు, ఉర్దూ, పార్సీ, అరబీ, ఇలాంటి అన్ని భాషలు మాట్లాడేవారు. ఆధ్యాత్మిక జ్ఞానసంపద ప్రభువులో మూర్తివంతమై ఉండేది.
పృథ్వి, వాయువు, ఆకాశం, నీరు, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, కపోతపక్షి, కొండచిలువ, సముద్రం, పతంగి, మధుకరము, ఏనుగు, మధూహరణం చేసే మనిషి, హరిణము, పింగళము, కుదరపక్షి, బాలకుడు, కుమారి, బాణము తయారుచేసేవారు, పాము, కోడి, కుండలు చేసేవారు, ఇలా 24 రకాలైన గురువులుండేవారని అవధూత గీతలో వర్ణించబడింది. సృష్టిలోని సర్వ పదార్థముల నుండి ఉత్తమమైన భాగాన్ని తీసుకోవడం మొదలుపెట్టి చివరికి ప్రభువు 'సకలమత సాంప్రదాయము' ఈ ఉద్దేశ్యాన్ని స్థిరపరిచారు.
జగత్తులోని అన్ని ధర్మాలలోని ఉత్తమభాగం ఏదైతే ఉందో దాన్ని గ్రహించి దోషయుక్తమైనదాన్ని విడిచిపెట్టి సర్వాంతర్యామి ప్రభువే అయి, అందరిలో ఆ విశ్వాసము కలిగించి, అన్ని ధర్మాలను ఒక్కత్రాటిపై తేవటం, ఇదే ప్రభు సంప్రదాయము యొక్క మర్మము. 'సర్వాంతరీ ఆత్మా, నకో కుణాచి నిందా' (అందరి హృదయంలో ఒకే పరమాత్మ ఆత్మస్వరూపములో నివాసం చేయడం వలన ఎవరు ఎవరినీ నిందించకూడదు) ఇదీ ప్రభు ఉద్దేశ్యం.
దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర
SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 5
. Nagesh D. Sonde
. Prasad Bharadwaj
02. Birth and early life - 3
Strange are the ways by which the true seekers and aspirants are communicated the nuances of Truth. While the normal person is busy in collecting information (which he erroneously considers to be knowledge) and material possessions, the person graced by the Lord is seeped with wisdom and extraordinary powers which are beyond the imagination of even the most learned human beings.
For the man of wisdom, the realisation does not come bit by bit but all of a sudden like a flash of lightning, brilliant and all-illuminating. As said in Kena Upanishad, “Of this Brahman, there is this teaching: this is, as it were, like lightning which flashes forth or is like the winking of the eye” (IV.4).
The men of wisdom tell us that when there is such realisation, there is, as it were, a sudden expansion of the mind, a flash of light illumining the innermost recesses of the intellect, an inflow of the Divine Will into the Individual Will causing vibrancy and joy ineffable. But few had the eyes to see or the vision to appreciate the change that was taking place in the life of Manik.
They took his wandering in the woods to be lethargy and non-interest in formal education or to his being naïve. It was, therefore, natural for them to consider a change in his environment by way of sending him to his uncle, who, it was considered, would put some sense in his mind and make him a fit person to take the burden of life.
Even here, Manik was neither receptive to education nor to the admonitions of elders. While children of his age were busy in play or in studies, he often would be found lying in his bed and absorbed in his own thoughts. But as far as Manik was concerned, he seemed to be going through an intense spiritual transformation and a great aversion to life around him. As time would show he was almost ripe for the first step to be taken.
The very first verse of Avadhoota Gita declares that “It is only with the Grace of God that in men of wisdom is born the inclination for non-dual experience which protects them from great danger” (Avadhoot Gita I.1). Manik seemed to be waiting, for the moment when the last leaf attached to the tree of worldly life would fall. And that moment was not far.
Manik’s uncle sincerely felt that this boy should grow up like a normal child and should be trained and educated to take up the responsibilities of life. He was deeply frustrated by the failure of his measures in sending this boy to school. He then thought that employment may inculcate a sense of responsibility in him and thus got him appointed as a clerk in the octroi check post on the outskirts of Kalyan town.
Manik was made to sit there and to collect duty on goods entering the town. However, Manik was least interested in his job. He would sit there engrossed in deep thought. He would distribute all the cash collected over there amongst his friends who were needy and poor and was thus dismissed the very next day.
Continues....