Posts

Showing posts with the label Gajanan Maharaj

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 115 / Sri Gajanan Maharaj Life History - 115

Image
🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 115 / Sri Gajanan Maharaj Life History - 115 🌹 ✍️. దాసగణు స్వామి 📚. ప్రసాద్ భరద్వాజ 🌻. 21వ అధ్యాయము - 3 🌻 చివరి భాగం శ్రీమహారాజు ఒకరోజు మధ్యాహ్నం సమయంలో ఒక ఆస్తికుని వేషంలో అతని దగ్గరకు వెళ్ళి, రామచంద్రపాటిల్ను బయటకు పిలిచి, తినడానికి ఏదయినా ఆహారం ఇమ్మని అడిగారు. రామచంద్ర పవిత్రుడు అవడంతో శ్రీగజానన్ మహారాజులా కనిపిస్తున్న ఆ ఆస్తికుని పిలుపువిని గుమ్మం దగ్గరకు వచ్చాడు. ఆ ఆస్తికుని చేతిని అతను గౌరవ పూర్వకంగా పట్టుకుని, ఇంటిలోకి తీసుకువచ్చి కూర్చునేందుకు పీట ఇచ్చాడు.  తరువాత ఆయన పాదాలకు పూజ అర్పించి చేతులు కట్టుకుని ఆయన ముందునిలబడ్డాడు. అటుపిమ్మట... ఓ కుర్రవాడా ఒకవిషయం చెప్పడానికి నేను ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడకు వచ్చాను, జాగ్రత్తగా విను. నీ అప్పుల గురించి చింతించకు. త్వరలో అవి చెల్లించబడతాయి. గోదావరినది ఎండాకాలంలో కొద్దిగా ఎండుతుంది అని గుర్తుంచుకో.  కానీ శ్రీహరి, వానలాటి దీవెనల వల్ల నీకు అభివృద్ధి వరదలాగా వస్తుంది. నేను ఎక్కడయితే భోజనం చేస్తానో ఆఇంటిలో దేనికీ కొరవ ఉండదు. నాకోసం తినడానికి స్వాధిష్టమయిన భోజనం పళ్ళెం నిండా తీసుకునిరా, నీకు ఇ...

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 114 / Sri Gajanan Maharaj Life History - 114

Image
  🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 114 / Sri Gajanan Maharaj Life History - 114 🌹 ✍️. దాసగణు స్వామి 📚. ప్రసాద్ భరద్వాజ 🌻. 21వ అధ్యాయము - 2 🌻 శ్రీగజానన్ మహారాజు తనమందిర నిర్మాణంలో ఎవరికీ హానిజరగనివ్వలేదు. ఈఘటనవల్ల శ్రీమహారాజు చేతిస్పర్శ పొందిన ఆపనివాడు చాలా అదృష్టవంతుడు. క్షుద్రశక్తుల ప్రభావితురాలయిన ఒక రాజ్పుత్ స్త్రీ జైపూరునుండి షేగాం వచ్చింది. దత్తాత్రేయ భగవానుడు, శ్రీరామనవమి రోజున షేగాం వెళ్ళి శ్రీగజానన్ మహారాజు కృపతో ఆ క్షుద్రశక్తుల నుండి విముక్తి పొందవలసిందిగా ఆమెను ప్రేరేపించారు. ఆవిధంగా ఆమె రామనవమి రోజున షేగాంకి వచ్చింది.  చైత్రమాసం పాడ్యమి రోజునుండి రామనవమి ఉత్సవాలు అక్కడ ఆరంభంఅయి, నవమిరోజున రాముని జన్మదినం జరిపేందుకు చాలామంది జనం గుమిగూడారు. ఆ సమయంలో సభామండపం పనిజరుగుతూ ఉండడంవల్ల 1.5 5 అడుగుల కొలతగల రాయిస్తంభాలు, సరిఅయిన ఆధారంలేకుండా ఉంచబడి శ్రీరామనవమి ఉత్సవాల కారణంగా పని తాత్కాలికంగా ఆపివెయ్యడంతో వాటిని అక్కడ అలానే వదిలి వేసారు.  శ్రీరాముని జననం అయిన తరువాత, జనం అంతా ప్రసాదం కోసం దూసుకు పోవడం ప్రారంభించారు. ఆ స్త్రీ తన ఇద్దరు పిల్లలతో సురక్షితం కోసం ఒకస...

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 113 / Sri Gajanan Maharaj Life History - 113

Image
🌹.  శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 113 / Sri Gajanan Maharaj Life History - 113  🌹 ✍️. దాసగణు స్వామి 📚. ప్రసాద్ భరద్వాజ 🌻. 21వ అధ్యాయము - 1  🌻 చివరి అధ్యాయం  శ్రీగణేశాయనమః ! ఓ అనంతవేషా జై, ఓ అవినాశా జై, ఓబ్రహ్మాండదిశా నేను మీకు నమస్కరిస్తున్నాను. ఓ భగవంతుడా మిమ్మల్ని మీరు పతిత పావనుడనని పిలుచుకుంటారు అన్నది గుర్తుంచుకోండి. మీకు నిజంగా పాపులంటేనే ఆత్మీయత ఎక్కువ, ఓ కృపాలూ వాళ్ళేమీకు ప్రాముఖ్యత తెస్తారు. కావున దయచేసి, నాపాపాలను చూడకండి. మురికి బట్టలు, శుభ్రం అవడంకోసం మంచి నీళ్ళదగ్గరకు వస్తాయి.  కావున భగవంతుడా దిగజారిన వాళ్ళని విశ్మరించకండి. భూదేవి ఎప్పుడయినా ముళ్ళ మొక్కలను తిరస్కరించిందా ? మీరు ఎపులను, పుణ్యాత్ములనూ ఇద్దరినీ కాపాడే వారు, అయినా వీరద్దరి స్పర్శనుండి దూరంగా ఉంటారు. సూర్యునికి, చీకటిని నాశనం చేయడానికి ఏవిధమయిన ప్రయత్నం అవసరంలేదు. సూర్యోదయం అవుతూనే, చీకటి మాయం అవుతుంది.  పాపం, పుణం అనే పరిస్థితులు మీరు సృష్టించినవే, మీరు మీగొప్పతనం నిభాయించడంకోసం, పాపులనుకూడా మీరే సృష్టిస్తారు. ఏది ఏమయినా సరే, మీ ఆశీర్వచనాలద్వారా నన్ను అన్ని చింతలనుండి స్వత...

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 112 / Sri Gajanan Maharaj Life History - 112

Image
🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 112 / Sri Gajanan Maharaj Life History - 112 🌹 ✍️. దాసగణు స్వామి 📚. ప్రసాద్ భరద్వాజ 🌻. 20వ అధ్యాయము - 7 🌻 అదే విధంగా శ్రీగజానన్ మహారాజు కృపవల్ల, దాదా కొల్హాట్కరుకు కుమారుడు కలిగాడు. అతని పేరు రాజా. ఈ యొగి కృపకి హద్దులులేవు. 16 సం. వయసుగల శ్రీరామచంద్రపాటిల్ కుమార్తె చంద్రభాగకు కష్టతరమైన కాన్పు అయింది. సాధారణంగా కాన్పు అనేది, స్త్రీ జాతికి, బాధతో కూడిన విషయం. ఆనవాయితీ ప్రకారం లాడెగాం నుండి తన తల్లి ఇంటికి కాన్పుకు వచ్చింది. కాన్పు తరువాత కొన్నిరోజులు జ్వరంతో బాధ పడింది. దానిని మొదట టైఫైడుగా ఘోషించారు. చాలామంది వైద్యులు చికిత్స చేసారు కానీ జ్వరం తగ్గలేదు. ప్రతి వైద్యుడు ఆమెవ్యాధిని వేరు వేరుగా విశ్లేషించారు. వారి అభిప్రాయాలలో ఏకతలేదు. ఈ ఫలితం లేని చికిత్సలతో అలసిపోయి, చికిత్సకోసం శ్రీమహారాజును శరణు కోరడం కోసం పాటిల్ నిర్ణయించాడు. శ్రీగజానన్ మహారాజును ధ్యానిస్తూ ఆమెకు విభూది, తీర్ధం అతను ఇవ్వడం మొదలు పెట్టాడు. శ్రీమహారాజులో అతనికి ఉన్న గొప్ప విశ్వాశానికి చంద్రభాగ కోలుకుంటున్న చిహ్నాలు కనిపించాయి. ఒకానొక సమయంలో మంచమీదనుండి కదలలేని ఆమె, ఇప్పుడు శ్ర...

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 111 / Sri Gajanan Maharaj Life History - 111

Image
🌹.  శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 111 / Sri Gajanan Maharaj Life History - 111  🌹 ✍️. దాసగణు స్వామి 📚. ప్రసాద్ భరద్వాజ 🌻. 20వ అధ్యాయము - 6 🌻 అతను అలాగే చేసి ఒక పెద్దరోడ్డు చేరాడు. అక్కడ విచారించగా, వాళ్ళు ఇంకా షేగాం శివార్లలోనే ఉన్నారని తెలిసింది. అప్పడు కావర్ ఆ బండివాడితో, షేగాం వెనక్కి తీసుకు వెళ్ళమని అన్నాడు. వాళ్ళు తెల్లవారుఝాము సమయంలో షేగాం చేరారు. తరువాత బాలాభవోకు జరిగినదంతా వర్ణించి చెప్పాడు. శ్రీమహారాజు మిమ్మల్ని వ్యతిపతి(చతుర్దశి) నాడు వెళ్ళనివ్వక పోవడం మంచిది అయింది. ఈరోజు ప్రసాదం తీసుకుని, రేపు తెల్టరా వెళ్ళండి. శ్రీమహారాజు ప్రసాదం ఎవరూ ఎప్పుడూ తిరస్కరించరాదు. మిమ్మల్ని క్షేమంగా వెనక్కి తీసుకు వచ్చింది ఆయనే. యోగులు ఏది కోరుకుంటే అది అవితుంది. ఆయన మీద పూర్తి విశ్వాసంతో మనం నిశ్బధంగా ఉండాలి అని బాలాభవ్ అన్నాడు.  మరుసటిరోజు డా. కావర్ ప్రసాదం తీుకున్నాక తెల్టరా వెళ్ళాడు. ఇప్పడు ఇంకొక కధ వినండి...భవసార్ కులానికి చెందిన రతనా అనే అతను ఒకడుండేవాడు. ఒక సం. వయస్సు ఉన్న అతని కొడుకు దినకరు ఏదో అనారోగ్యంసోకి పాలిపోయి నీరసించిపోయాడు. చాలామంది వైద్యలను సంప్రదించి, చా...

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 110 / Sri Gajanan Maharaj Life History - 110

Image
🌹.  శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 110 / Sri Gajanan Maharaj Life History - 110  🌹 ✍️. దాసగణు స్వామి 📚. ప్రసాద్ భరద్వాజ 🌻. 20వ అధ్యాయము - 5 🌻 ఆ భిక్షకుడే కనుక శ్రీమహారాజు అయితే తనకు తప్పకుండా వ్యాపారంలో, మంచి లాభాలు రావాలని అతను అనుకున్నాడు. అదే రోజున అతని దూదినింపిన బళ్ళు వార్ధాకు అమ్మకానికి తేబడ్డాయి. వాటికి మంచిధర వచ్చింది. అప్పడు యాదవ్ శ్రీగజానన్ మహారాజు తన దగ్గరకు ఆభిక్షకుని రూపంలో వచ్చినట్టు నమ్మాడు.. శ్రీమహారాజు తన భక్తులను సదా కాపాడుతారు.  ఇప్పుడు కావర్ అనుభవం వినండి ...... భవ్ రాజారాం కావర్ ఖాంగాంలో వైద్యుడు, అతనికి తెల్టరా బదిలీ అయింది. తెల్టరాలో పనిలో చేరేముందు, అతను తన కుటుంబంతోపాటు షేగాం దర్శనానికి వచ్చాడు. షేగాంలో ఒక ఎడ్లబండిని తెల్లరా వెళ్ళేందుకు అద్దెకు తీసుకున్నాడు. అతను సాయంత్రం బయలుదేరబోతూ ఉంటే, రేపు ప్రసాదం తీసుకున్నాకా మీరు షేగాంనుండి వెళ్ళాలని నావినంతి.  ఇంతకు ముందు ఎప్పుడూ మీరు షేగాంనుండి భోజనం చెయ్యకుండా వెళ్ళలేదు. మరి ఈరోజు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు ? పైగా ఈరోజు వ్యాతిపతి, ప్రయాణానికి అశుభమయిన రోజు అని బాలాభవ్ అన్నాడు. కావర్ పాక్ష...

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 109 / Sri Gajanan Maharaj Life History - 109

Image
🌹.  శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 109 / Sri Gajanan Maharaj Life History - 109  🌹 ✍️. దాసగణు స్వామి 📚. ప్రసాద్ భరద్వాజ 🌻. 20వ అధ్యాయము - 4 🌻 జోషీ రాత్రి షేగాం చేరాడు, శ్రీమహారాజు సమాధిముందు సాష్టాంగపడి, సాయంత్రం ఊరేగింపులో పాల్గొన్నాడు. మరుసటిరోజు జోషీ ఉదారమయిన సేవలుచేసి, బాలభవోకు బ్రాహ్మణుల భోజనం కోసం కొంతడబ్బు తన మొక్కప్రకారం ఇచ్చి, అగత్యమయిన పని ఉండడంతో జోషీ వెంటనే షేగాంనుండి వెళ్ళిపోయాడు.  యాదవ్ గణేష్ సుబేదార్ పాంగణిలో పత్తి వర్తకంలో దలాలీ చేసేవాడు. ఒకసారి తన వ్యాపారంలో పదవేల రూపాయలు నష్టంరావడంతో అతని ఆరోగ్యంమీద చాలాప్రభావం పడింది. ఈనష్టంనుండి తేరుకుని తిరిగి వ్యాపారం పునస్థాపించుకోడానికి అతను తన సాధ్యమయినంత ప్రయత్నాలు చేసాడు, కానీ ఫలితం లేకపోయింది.  అటువంటి సమయంలో వార్ధాలో ఉన్న తన స్నేహితుడయిన అసర్కరు దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో ఒక భిక్షకుడు అసర్కరు ఇంటికి భిక్షకోసరం వచ్చాడు. అతను మరాఠీ మనిషిలా వస్త్ర ధారణతో ఉన్నాడు. అతను ముసలి వానిమాదిరి వణుకు తున్నాడు. అసర్కరు అతనిని చూసి చికాకుపడి ఇంటి గుమ్మం దగ్గర నిలబడి భిక్ష అడగమని అతనితో అన్నాడు.  ఆ భిక్షకుడు...

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 108 / Sri Gajanan Maharaj Life History - 108

Image
  🌹.  శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 108 / Sri Gajanan Maharaj Life History - 108  🌹 ✍️. దాసగణు స్వామి 📚. ప్రసాద్ భరద్వాజ 🌻. 20వ అధ్యాయము - 3 🌻 ఆ ముని ఈవిషయాలన్నీ గుర్తుచేయడం లక్ష్మణును కలవరపెట్టి ఈ మనిషి ఎవరా అని అతను ఆలోచనలో పడ్డాడు. లక్ష్మణ వినయంగా అతనికి వంగి నమస్కారం చేసాడు. అతను అకస్మాత్తుగా అదృశ్యం అయ్యారు. లక్ష్మణ ఇంటికి తిరిగివచ్చి తనయొక్క సాధారణ నడవడి ప్రారంభించి, ప్రతిసంవత్సరం పుణ్యతిధి జరపడం మొదలు పెట్టాడు.  శ్రీ మహారాజు అవధూత జైరాంఖేడ్కరును మునివస్త్రాలలో రోహిత్ గ్రామందగ్గర కలిసారు. ప్రభుత్వ రెవిన్యు అధికారి అయిన మాధవ మార్తాండ జోషీ ఒకసారి కాలంబ కాసుర్ గ్రామ భూమి సర్వేకి వచ్చాడు. అతను శ్రీగజానన్ మహారాజు భక్తుడు అవడంవల్ల, ఆరోజు గురువారం అవడంవల్ల సాయంత్రం దర్శనంకోసం షేగాం వెళ్ళలని అతనికి అనిపించింది. అందువల్ల అతను తన గుమాస్తా కుతుబుద్దీన్ను షేగాం వెళ్ళేందుకు ఎడ్లబండి తయారు చెయ్యమని చెప్పాడు.  కుతుబుద్దీన్ వినయంగా, వాతావరణం మబ్బుగా ఉందనీ, మాన్ నది మట్టినీళ్ళతో పొంగుతోందని అన్నాడు. అతని అభ్యర్ధన విస్మరించి, జోషీ బండిలోకి ఎక్కి కుతుబుద్దీన్ ను షేగ...

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 107 / Sri Gajanan Maharaj Life History - 107

Image
  🌹.  శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 107 / Sri Gajanan Maharaj Life History - 107  🌹 ✍️. దాసగణు స్వామి 📚. ప్రసాద్ భరద్వాజ 🌻. 20వ అధ్యాయము - 2 🌻 గణపత్ రావుకు తనభార్య యొక్క ఈవిధమయిన సలహా ఏమాత్రం నచ్చక, తను సామాజిక జీవితంకంటే పరమార్ధం గొప్పదిగా భావిస్తానని ఆమెతో అన్నాడు. అదేరోజు రాత్రి శ్రీమహారాజు అతని భార్యకలలో కనబడి, నీభర్తను ఏమాత్రం ఇకహింసించకు. అతనికి ఇష్టమయినట్టు చెయ్యనీ, దానివల్ల నువ్వు నష్టపోయేది ఏమీలేదు.  ఈ అశాశ్వతమయిన వస్తువుల కోసం ప్రేమ, మక్కువ ఉంచుకోకు. చివరికి ఈడబ్బు అంతా ఇక్కడే ఉండి, చేసిన మంచి చెడుపనులు మాత్రమే నీకుతోడుగా వస్తాయి. అభిషేకం, బ్రాహ్మణులకు భోజనం పెట్టడం అనేది చాలా మంచి పని ఎందుకంటే ఇందులో త్యాగం ఉంది, మరియు ఇతరుల కొరకు ఏదో చెయ్యబడుతోంది. దీనికోసం ఖర్చుపెట్టిన ధనం ఎప్పటికీ వృధాకాదు. ఇది భూమిలో విత్తనం నాటినట్టు, కాబట్టి అతనిని అటకాయించవద్దుని నేను చెపుతున్నాను అని అన్నారు.  మరుసటి రోజు ఉదయం ఆమె ఈస్వప్నం గురించి తనభర్తకు చెప్పగా అతను అదివిని చాలా సంతోషించాడు. అప్పుడు అతను షేగాంలో శ్రీమహారాజు ఇప్పటికీ ఉన్నారన్న పూర్తివిశ్వాసం ఉంచమని ...

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 106 / Sri Gajanan Maharaj Life History - 106

Image
🌹.  శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 106 / Sri Gajanan Maharaj Life History - 106  🌹 ✍️. దాసగణు స్వామి 📚. ప్రసాద్ భరద్వాజ 🌻. 20వ అధ్యాయము - 1 🌻 శ్రీగణేశాయనమః ! ఓ రుక్మిణీవరా మీకు జై. చంద్రభాగ నదీతీరాన్న నివసించే భగవంతుడా ఈదాసగణును దయచేసి ఆశీర్వదించండి. మీరు రాజాధిరాజు. ప్రతీదీ మీచేతులలోనే ఉంది. మరినన్ను ఎందుకు విస్మరిస్తున్నారు ?  మీయొక్క కృపచేతనే పాపాలు చింతలు నాశనం చేసి నామనసును మీగుణగానం చేసేవిధంగా ఉల్లాస పరచండి. అలా చెయ్యకపోతే, అనవసరమయిన అపనిందమీకు వస్తుంది. గొప్పవాళ్ళు అటువంటి అపనిందను రానీయకూడదు. కాబట్టి ఓశ్యామసుందరా, ఓరుక్మిణీపతీ, ఓదయామయా పాండురంగా నాకోరిక నెరవేర్చండి.  శ్రీగజానన్ మహారాజు నిర్యాణం తరువాత, కొంత ధూళితప్ప షేగాంలో మరి ఏమీ మిగల లేదని ప్రజలు అనడం ప్రారంభించారు. నీళ్ళు లేకుండా సముద్రం, పూలమొక్కలు పువ్వు లేకపోతే వాటి ప్రత్యేకత కోల్పోతాయి. కాబట్టి షేగాం దర్శించడంలో ఫలితంలేదు. ఎందుకంటే భగవంతుడులేని గుడిలో పువ్వులు అర్పించడం అర్ధంలేని పని. ఇలా చాలామంది అన్నారు, కానీ ఇది సరికాదు.  అగోచరమైన శ్రీమహారాజు జీవాత్మ ఇప్పటికీ షేగాంలో ఉంది. ఇంద్రియాణి న...

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 105 / Sri Gajanan Maharaj Life History - 105

Image
🌹.  శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 105 / Sri Gajanan Maharaj Life History - 105  🌹 ✍️. దాసగణు స్వామి 📚. ప్రసాద్ భరద్వాజ 🌻. 19వ అధ్యాయము - 13 🌻 శ్రీమహారాజు తన జీవాత్మను తననుదుటియందు, తన ఆత్మీయులయిన భక్తులు దర్శనంచేసుకునే వరకూ ఉంచుతారని విద్వాంసుడయిన శ్రీగోవింద శాస్త్రి అన్నారు. అది నిరూపించడానికి శ్రీశాస్త్రి, కొద్ది వెన్న శ్రీమహారాజు తలమీద పెట్టగానే తలలో ఉన్న వేడివల్ల ఆవెన్న కరిగిపోయింది.ఇది శ్రీమహారాజు సాధించిన యోగశాస్త్ర ఫలితం. శ్రీమహారాజు ఆ తన్మయంలో ఒక సంవత్సరమయినా జీవించగలరని శ్రీగోవింద శాస్త్రి అన్నారు, కానీ ఆయన భక్తులు అందరూ దర్శనం చేసుకున్నాక సమాధిలో మూసివెయ్యడం ఉచితం అని అన్నారు. అందరూ దానికి అంగీకరించారు.  శ్రీమహారాజు ముందు భజనలు ప్రారంభం అయ్యాయి, సుమారు 1000 మంది ఇందులో పాల్గొన్నారు. దూరంగా ఉన్నభక్తులకు శ్రీమహారాజు తనే స్వయంగా వాళ్ళ కలలో కనపడి ఈవార్త అందచేసారు. ఆ ఋషిపంచమి రోజున లెఖ్కలేనంతమంది ప్రజలు షేగాంలో శ్రీమహారాజు దర్శనం కోసం గుమిగూడారు. ఒక రధం ఆయన యాత్రకోసం తయారు చెయ్యబడింది.  భజనలు చేసేవారు ఊరేగింపుగా షేగాం చేరారు. ఆడవాళ్ళు ఆవుపేడ కలిపిన నీళ్...

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 104 / Sri Gajanan Maharaj Life History - 104

Image
🌹.  శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 104 / Sri Gajanan Maharaj Life History - 104  🌹 ✍️. దాసగణు స్వామి 📚. ప్రసాద్ భరద్వాజ 🌻. 19వ అధ్యాయము - 12 🌻 హరిపాటిల్ నుండి వేరు అవుతాననే ఆలోచనతో కళ్ళు నీళ్ళతో నిండాయి. ఓగురుదేవా మీ ఈకళ్ళలో నీళ్ళు ఎందుకు ? నేను ఏవిధంగానయినా మిమ్మల్ని నొప్పించానా ? దయచేసి వెంటనే చెప్పండి అని హరిపాటిల్ చేతులు కట్టుకుని అన్నాడు. నేను దీనికి కారణం చెప్పినా నువ్వు బహుశ అర్ధం చేసుకోలేవు. ఇది చాలాగూఢమయిన జ్ఞానం. దానిగురించి తెలుసుకుందుకు నువ్వు ఇప్పుడు చితించనవసరంలేదు.  మన సాంగత్యం ఇక పూర్తి అవవచ్చింది అన్నది ఒక్కటే నేను చెప్పగలను, పద మనం షేగాం వెనక్కి వెళదాం, నీకు నీతరువాత కుటుంబీకులకి ఎప్పటికీ ఏవస్తువుకి కొరతరాదు అని శ్రీమహారాజు జవాబు ఇచ్చారు.  పండరపూరు నుండి తిరిగి వచ్చాక, దైవిక విధులు అన్నీ జరపబడ్డాయి, కానీ హరిపాటిల్ మాత్రం ఆదుర్దాతో ఉన్నాడు.  తనసాంగత్యం అంతం అయ్యేసమయం వచ్చిందని శ్రీమహారాజు తనతో అన్న విషయం మిగిలిన వారందరితో అతను చెప్పాడు. శ్రావణమాసం పూర్తి అయింది. శ్రీమహారాజు రోజురోజుకీ నీరసిస్తున్నారు. తరువాత భాద్రపదమాసం వచ్చింది.ఇకవినండి...

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 103 / Sri Gajanan Maharaj Life History - 103

Image
🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 103 / Sri Gajanan Maharaj Life History - 103 🌹 ✍️. దాసగణు స్వామి 📚. ప్రసాద్ భరద్వాజ 🌻. 19వ అధ్యాయము - 11  🌻 ఆ ఎర్రగుళకరాయిని రోజూ భక్తితో పూజిస్తూ దానిముందు యోగాసనాలు చెయ్యమని నిమోన్కరుకు ఆయన ఉపదేశించాడు. ఆ విధంగా శ్రీమహారాజు కృపవల్ల శ్రీనిమోన్కరు యోగాసనాలు నేర్చుకున్నాడు.  షేగాం వాసిఅయిన తుకారాం కొకాటేకు పిల్లలు చిన్నతనంలోనే చనిపోవడం అనేదురదృష్టం ఉండేది.అందుకు తనపిల్లలు బతికితే ఒక పిల్లవాడిని శ్రీమహారాజుకు ఇస్తానని అతను మొక్కుకున్నాడు. అటు పిదప కొకాటేకు ముగ్గురు పిల్లలు పుట్టి అందరూ బతికారు, కానీ అతను తనమొక్కు మరిచి, వాగ్దానం ప్రకారం ఒక పిల్లవాడిని శ్రీమహారాజుకు ఇవ్వలేదు. అతని పెద్దకుమారుడు నారాయణ జబ్బుపడి ఏవిధమయిన ఔషదానికి తేరుకోలేదు. రోజురోజుకు అతని పరిస్థితి క్షీణించి పోతోంది. తుకారాంకు అకస్మత్తుగా తనమొక్కు గుర్తువచ్చి, నారాయణకు నయం అవగానే అతనిని శ్రీమహారాజుకు ఇచ్చవేస్తానని అనుకున్నాడు.  నారాయణ నిజంగా నయమయి, తరువాత అతనిని మొక్కుప్రకారం శ్రీమహారాజు సేవ కొరకు ఇచ్చారు, నారాయణ ఇంకా షేగాంలో ఉన్నాడు మరియు శ్రీమహారాజుకు ఒకసారి మొక్కు...

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 102 / Sri Gajanan Maharaj Life History - 102

Image
🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 102 / Sri Gajanan Maharaj Life History - 102 🌹 ✍️. దాసగణు స్వామి 📚. ప్రసాద్ భరద్వాజ 🌻. 19వ అధ్యాయము - 10  🌻 అందుకని పవిత్రదినాలలో ప్రజలు అక్కడ స్నానం చేసేందుకు వెళ్ళేవారు. కావున నిమోన్కర్ కూడా ఒక పవిత్రదినంనాడు అక్కడికి వెళ్ళాడు. ఇతనికి యోగ గూర్చి ప్రాధమిక జ్ఞానం ఉంది. దానిని తదుపరి అభివృద్ధి చేసుకోవాలని, అక్కడ కలసిన ప్రతి ఆస్తికుడినీ అభ్యర్ధించాడు. అందరూకూడా అతని ఈ అభ్యర్ధనను నిరాకరించారు, కావున అతను చాలా నిరుత్సాహపడ్డాడు.  అతను చేతులు కట్టుకుని, తనకు యోగ నేర్పించేవ్యక్తిని చూపమని భగవంతుని వేడుకున్నాడు. అకస్మాత్తుగా ఒక ఋషిలా కనిపిస్తున్న ఆజానుబాహుడిని కపిలధారలో అతను చూసాడు. ఈ ఆజాను భాహుడు, నిర్మల మయిన మనసుతో దీక్షలో కూర్చుని ఉన్నాడు. నిమోన్కరు అతనికి సాష్టాంగపడి, సాయంత్రంవరకు ఆయన కళ్ళు తెరవడంకోసం వేచిచూసాడు. కానీ ఆయోగి కళ్ళు తెరవలేదు, ఏమీ మాట్లాడలేదుకూడా. రోజంతా అతను భోజనం లేకుండా ఉన్నాడు. సాయంత్రం అవుతూంటే మిగిలిన ఆస్తికులు కపిలధారనుండి వెనుతిరగడం మొదలు పెట్టారు.  కావున శ్రీనిమోన్కరు ఆయోగిని తనకు యోగ నేర్పవలసిందిగా చేతులు కట్టుక...

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 101 / Sri Gajanan Maharaj Life History - 101

Image
  🌹.  శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 101 / Sri Gajanan Maharaj Life History - 101  🌹 ✍️. దాసగణు స్వామి 📚. ప్రసాద్ భరద్వాజ 🌻. 19వ అధ్యాయము - 9 🌻 నాగర్ జిల్లాలో ప్రవదనది తీరాన్న చిన్నదే కానీ సుందరమయిన పట్టణం సంగమనేరు నిర్మించబడి ఉంది. ప్రఖ్యాత కవి ఆనంద్ ఫండి ఈఊరి వాడే. ఇప్పుడు ఈఊరివాడయిన హరీజఖడ్యా కధవినండి:......ఇతను ఒకచోట నుండి ఇంకొకచోటుకి భుక్తికి తిరిగే యజుర్వేద బ్రాహ్మణుడు. తన ప్రయాణంలో షేగాంచేరి శ్రీమహారాజు దర్శనం చేసుకున్నాడు. శ్రీమహారాజు కృపవల్ల తమవాంఛలు పూర్తి అయిన మీదట, ప్రసాదం పంచడం కోసం, లేదా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం కోసం వేలకొలది ప్రజలు అక్కడకు రావడం అతను చూసాడు. అదిచూసి ఈమహాయోగి దగ్గర నుండి ఏమీ పొందకుండానే నేను వెనక్కి వెళ్ళిపోవాలి, ఇది రాయిమీద గడ్డికూడా మొలకెత్తని విధంగా, నా దురదృష్టం వల్లనే.  నాకు ఒకరోజు భోజనం దొరుకు తుంది, కానీ మరుసటిరోజు అదృష్టం ఎలా ఉంటుందో తెలియదు. ఇంతవరకూ నాజీవితం ఇలా ఉంది. నాదగ్గర ధనంకానీ, ఆఫ్రికానీ లేవు. నాకు వధువును ఎవరు ఇస్తారు ? ఓ స్వామీ గజాననా ఆనందభండారా నాకు సంసారిక జీవితం గడపాలని తీవ్రమయిన కోరిక ఉంది. మంచి కుటంబం ను...