శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 111 / Sri Gajanan Maharaj Life History - 111

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 111 / Sri Gajanan Maharaj Life History - 111 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 20వ అధ్యాయము - 6 🌻

అతను అలాగే చేసి ఒక పెద్దరోడ్డు చేరాడు. అక్కడ విచారించగా, వాళ్ళు ఇంకా షేగాం శివార్లలోనే ఉన్నారని తెలిసింది. అప్పడు కావర్ ఆ బండివాడితో, షేగాం వెనక్కి తీసుకు వెళ్ళమని అన్నాడు. వాళ్ళు తెల్లవారుఝాము సమయంలో షేగాం చేరారు. తరువాత బాలాభవోకు జరిగినదంతా వర్ణించి చెప్పాడు. శ్రీమహారాజు మిమ్మల్ని వ్యతిపతి(చతుర్దశి) నాడు వెళ్ళనివ్వక పోవడం మంచిది అయింది. ఈరోజు ప్రసాదం తీసుకుని, రేపు తెల్టరా వెళ్ళండి. శ్రీమహారాజు ప్రసాదం ఎవరూ ఎప్పుడూ తిరస్కరించరాదు. మిమ్మల్ని క్షేమంగా వెనక్కి తీసుకు వచ్చింది ఆయనే. యోగులు ఏది కోరుకుంటే అది అవితుంది.

ఆయన మీద పూర్తి విశ్వాసంతో మనం నిశ్బధంగా ఉండాలి అని బాలాభవ్ అన్నాడు. 

మరుసటిరోజు డా. కావర్ ప్రసాదం తీుకున్నాక తెల్టరా వెళ్ళాడు. ఇప్పడు ఇంకొక కధ వినండి...భవసార్ కులానికి చెందిన రతనా అనే అతను ఒకడుండేవాడు. ఒక సం. వయస్సు ఉన్న అతని కొడుకు దినకరు ఏదో అనారోగ్యంసోకి పాలిపోయి నీరసించిపోయాడు. చాలామంది వైద్యలను సంప్రదించి, చాలా ఔషదాలు ఇచ్చారు కానీ ఉపశమనం దొరకలేదు. అతను పాలు కూడా తీసుకోవటలేదు. మరియు తీవ్రజ్వరం వల్ల ఏడుస్తున్నాడు. ఈ వ్యాధి నివారించబడేది కాదని వైద్యులు రతనాతో అన్నారు. 

రతనా చాలా దుఖించాడు. కాళ్ళు చేతులూ చల్ల బడుతూ, కళ్ళలో కాంతి తగ్గి, నాడి తప్పుతూ, ఆపిల్లవాడు చావుకు దగ్గరవుతున్నాడు. అటువంటి ఆరోగ్య పరిస్థితిలో రతనా ఆ పిల్లవాడిని శ్రీగజానన్ మహారాజు సమాధి ద్వారం దగ్గరకు తెచ్చి, అక్కడ ఉంచి, నాపిల్లవాడిని దయచేసి నయం చెయ్యండి, ఇతను బతికితే నేను 5 రూపాయలు విలువచేసే మిఠాయిలు పంచి పెడతాను అని శ్రీమహారాజుకు మొక్కకున్నాడు. 

మీరు అనేక మంది భక్తులను దీవించారు, నాకు కూడా ఇప్పుడు మీకృప యొక్క అనుభవం కావాలి. నేను కూడా మీభక్తుడను, కావున నన్ను విశ్మరించకండి, మీద్వారంలో నాపిల్లవాడు చనిపోతే, అదిమీకే అవమానం తెస్తుంది. మీ పాదస్పర్శ అమృతం లాంటిది అని ప్రజలు అంటారు, కావున మీ ఆశీర్వాదాలతో నన్ను కరుణించండి. నాకొడుకు చనిపోతే నేను మీద్వారం దగ్గర నాతల పగల కొట్టుకుంటాను. 

ఓ గజాననా మీ యొక్క అమృతమయిన ఆ గొప్ప చూపును నాయందు ఉంచి, నాపిల్లవాడిని రక్షించండి అని అన్నాడు. కొద్దిసేపటి తరువాత ఆపిల్లవాడు కదిలి ఏడవడం మొదలు పెట్టాడు. ఆ అద్భుతంచూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. అదంతా శ్రీమహారాజు కృపవల్లనే. సూర్యుని ముందు చీకటి ఏమి చెయ్యగలదు. కొద్దిరోజులలోనే దినకరు పూర్తిగా నయమయి, చలాకీగా, ఆరోగ్యంగా అయ్యాడు. ఇది పూర్తి విశ్వాసంతో అతను మొక్కుకున్న ఫలితం. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Gajanan Maharaj Life History - 112 🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 20 - part 6 🌻


Then Kavar asked the cart man to drive them back to Shegaon. They reached Shegaon in the early hours of the morning, and narrated everything to Balabhau. Balabhau said, It was good that Shri Gajanan Maharaj did not allow you to go on Vyatipat day. Now take Prasad today and go to Telhara tomorrow. 

One should never refuse the Prasad of Shri Gajanan Maharaj . It is He who brought you back safe. One should not expect fulfillment of all of our desires. Whatever the saints wish will happen. So with full faith in Him we should keep quiet. Next day Doctor Kavar went to Telhara after taking Prasad. Now listen to another story. 

There was a man named Ratansa, a Bhavsar by caste. His one year old son, Dinkar was afflicted by some disease which made him pale and weak. Many doctors were consulted and medicines given, but he got no relief. He did not take any milk, and the continuous high fever made him cry. Doctors told Ratansa that the case was beyond any cure. 

Ratansa was very grieved. The child was nearing death with hands and feet getting cold, eyes becoming dull and pulse missing. With such state of the health, Ratansa brought the child to the doors of Shri Gajanan Maharaj Samadhi and putting him there, said, Maharaj, please cure my child. If he survives, I will distribute sweets worth Rs. 5. 

You have blessed so many devotees, and now I too want to experience that grace of yours. I am also your devotee, so please do not ignore me. If my child dies at your doors, it will bring disgrace to you. People say that touch of your feet is like nectar, so please oblige me by your blessings. If my son dies, I will break my head at your doors. 

O Gajanan the Great! Look at me by your nectar like glance and save this child. A little later on, the child moved and started crying. All were surprised and happy to see this miracle. It was all by the grace of Shri Gajanan Maharaj . What can darkness do before the sun? In few days, Dinkar was fully normal, hale and hearty. It was the result of the vow which was taken with full faith. 

Similarly by the grace of Shri Gajanan Maharaj, Dada Kolhatkar got a son whose name is Raja. The grace of saints has no limits. Sixteen year old Chandrabhaga, daughter of Shri Ramchandra Patil, had a difficult delivery. Generally delivery is a very painful affair in womanhood. 

As per tradition, she came from Ladegaon to her mother's place for the delivery. After the delivery, she was running a high fever for some days. It was declared to be the case of typhoid. Many doctors treated her fever, but it did not come down. She was, therefore, taken to Akola for better treatment. 

Every doctor diagnosed her illness differently and there was no unanimity in their opinion. Tired of all the treatment without any result, Patil decided to surrender to Shri Gajanan Maharaj for her treatment. He started giving her Udi and Tirtha every day and implored Shri Gajanan Maharaj to cure her. With his great faith in Shri Gajanan Maharaj , Chandrabhaga showed signs of recovery. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


19 Nov 2020