Posts

Showing posts with the label Sai Philosophy

సాయి తత్వం - మానవత్వం - 59 / Sai Philosophy is Humanity - 59

Image
🌹. సాయి తత్వం - మానవత్వం - 59  / Sai Philosophy is Humanity - 59 🌹 🌴. అధ్యాయము - 8  🌴 📚. ప్రసాద్ భరద్వాజ 🌻. బాయి జాబాయ యొక్క ఎవలేని సేవ 🌻 1. తాత్యాకోతే పాటీలు తల్లి పేరు బాయజాబాయి. ఆమె ప్రతిరోజు మధ్యాహ్నము తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకొని, సమీపముననున్న చిట్టడవిలో ముండ్లు పొదలు లెక్కచేయక క్రోసులకొద్ది దూరమునడచి, ఆత్మధ్యానములో నిశ్చలముగ యెక్కడో కూర్చునియున్న బాబాను వెదకి పట్టుకొని, భోజనము పెట్టుచుండెను. 2. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి, వారి యెదుట విస్తరొకటి వేసి తాను తెచ్చిన రొట్టె కూర మొదలగు భోజన పదార్థములను వడ్డించి, కొసరికొసరి వాటిని బాబాచే తినిపించుచుండెను. 3. ఆమె భక్తివిశ్వాసములు అద్భుతమైనవి. ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరువలేదు. 4. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడగు తాత్యాపాటీలును యెంతో ఆదరించి ఉద్ధరించెను. ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసముండెను. 5. కొన్ని సంవత్సరముల తదుపరి బాబా యడవులకు బోవుట మాని మసీదులోనే కూర్చుండి భోజనము చేయసాగిరి. 6. అప్పటినుంచి పొలములో తిరిగి బాబాను వెతకిపట్టుకొను శ్రమ బాయజాబాయికి తప్పినది. సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 🌹....

సాయి తత్వం - మానవత్వం - 58 / Sai Philosophy is Humanity - 58

Image
🌹. సాయి తత్వం - మానవత్వం - 58  / Sai Philosophy is Humanity - 58 🌹 🌴. అధ్యాయము - 8  🌴 📚. ప్రసాద్ భరద్వాజ 🌻. బాబా యొక్క బిక్షాటనం 🌻 1. శిరిడీజనులు పుణ్యాత్ములు. ఎందుకనగా, వారి యిండ్ల యెదుటనేగదా బాబా భిక్షుకునివలె నిలచి, "అమ్మా! రొట్టెముక్క పెట్టు" డనుచు, దానిని అందుకొనుటకు చేయి చాచెడివారు! చేత ఒక రేకుడబ్బా పట్టుకొని, భుజానికి ఒక గుడ్డజోలె తగిలించుకొని భిక్షాటనకు పోయెడివారు. 2. బాబా కొన్ని యిండ్లకు మాత్రమే భిక్షకు పోయెడివారు. పులుసు, మజ్జిగ వంటి ద్రవ పదార్థములు, కూరలు మొదలగునవి రేకు డబ్బాలో పోసుకొనెడివారు. 3. అన్నము, రొట్టెలు మొదలగునవి జోలెలో వేయించుకొనెడివారు. బాబాకు రుచి యనునది లేదు. 4. వారు జిహ్వను స్వాధీనమందుంచుకొనిరి. కాన అన్ని పదార్థములను రేకుడబ్బాలోను, జోలెలోను వేసికొనెడివారు. 5. అన్ని పదార్థములను ఒకేసారి కలిపివేసి భుజించి సంతుష్టి చెందేవారు. పదార్థముల రుచిని పాటించేవారుకాదు. 6. వారు నాలుకకు రుచి యనునది లేనట్లే కాన్పించుచుండెను. బాబా భిక్షకు యొక పద్ధతి, కాలనియమము లేకుండెను. 7. ఒక్కొక్కదినము కొన్ని యిండ్లవద్ద మాత్రమే భిక్షచేసెడివారు. ఒక్కొక్కసారి 12 సార్లు కూడా భిక...

సాయి తత్వం - మానవత్వం - 57 / Sai Philosophy is Humanity - 57

Image
🌹. సాయి తత్వం - మానవత్వం - 57  / Sai Philosophy is Humanity - 57 🌹 📚. ప్రసాద్ భరద్వాజ 🌴. అధ్యాయము - 8  🌴 🌻. మానవుని విధ్యుక్త ధర్మం   🌻 1. మానవజన్మ విలువైనదనియు, దానికెప్పటికైననూ మరణము అనివార్యమనియు గ్రహించి మానవుడెల్లప్పుడూ జాగరూకుడై యుండి జీవిత పరమావధిని సాధించుటకై యత్నించవలయును. 2. ఏ మాత్రమును అశ్రద్ధగాని ఆలస్యముగాని చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలెను. 3. భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొఱకెంత ఆతురపడునో, తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి యెంతగా వెదకయత్నించునో యటులనే, విసుగు విరామములేక రాత్రింబవళ్ళు కృషి చేసి యాత్మసాక్షాత్కారమును సంపాదించవలెను. 4. బద్ధకమును, అలసతను, కునుకుపాట్లను దూరమొనర్చి అహోరాత్రములు ఆత్మయందే ధ్యానము నిలుపవలెను. 5. ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయుమగుదుము. 🌻. తక్షణ కర్తవ్యం 🌻 1. మన ధ్యేయము సత్వరము ఫలించు మార్గమేదన, వెంటనే భగవత్సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్దకేగుట. 2.ఆధ్యాత్మికోపన్యాసములెన్ని వినినప్పటికి పొందనట్టిదియు, ఆధ్యాత్మికగ్రంథములెన్ని చదివినను తెలియనట్టిదియునగు ఆత్మసాక్షాత్కారము సద్గురువుల సాంగత్యముచే సులభముగా పొందవ...

సాయి తత్వం - మానవత్వం - 56 / Sai Philosophy is Humanity - 56

Image
🌹. సాయి తత్వం - మానవత్వం - 56  / Sai Philosophy is Humanity - 56 🌹 🌴. అధ్యాయము - 8  🌴 📚. ప్రసాద్ భరద్వాజ 🌻. మానవ జన్మ ప్రాముఖ్యత 🌻 1. ఈ యద్భుత విశ్వమందు భగవంతుడు కోటానుకోట్ల జీవులను సృష్టించి యున్నాడు.  దేవయక్షగంధర్వాదులు, జంతుకీటకాదులు మనుష్యులు మొదలగువానిని సృష్టించెను. 2. స్వర్గము, నరకము, భూమి మహాసముద్రము, ఆకాశమునందు నివసించు జీవకోటి యంతయు సృష్టించెను. 3. వీరిలో నెవరి పుణ్యమెక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలము ననుభవించిన పిమ్మట త్రోసి వేయబడుదురు. 4. ఎవరి పాప మెక్కువగునో వారు నరకమునకు పోదురు. అచ్చట వారు పాపములకు తగినట్లు బాధలను పొందెదరు. 5. పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్షసాధనమునకై యవకాశము గాంచెదరు. 6. వారి పాప పుణ్యములు నిష్క్రమించునప్పుడు వారికి మోక్షము కలుగును. వేయేల మోక్షముగాని, పుట్టుకగాని వారు వారు చేసికొనిన కర్మపై ఆధారపడియుండును. 🌻. మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువ 🌻 1. జీవకోటి యంతటికి ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము. మానవునివిగాక మరొక్క ప్రజ్డ గలదు. 2. అదియే జ్ఞానము. దీని సహాయముననే మానవుడు భగవత్ సక్షాత్కారమును...