సాయి తత్వం - మానవత్వం - 56 / Sai Philosophy is Humanity - 56
🌹. సాయి తత్వం - మానవత్వం - 56 / Sai Philosophy is Humanity - 56 🌹
🌴. అధ్యాయము - 8 🌴
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. మానవ జన్మ ప్రాముఖ్యత 🌻
1. ఈ యద్భుత విశ్వమందు భగవంతుడు కోటానుకోట్ల జీవులను సృష్టించి యున్నాడు.
దేవయక్షగంధర్వాదులు, జంతుకీటకాదులు మనుష్యులు మొదలగువానిని సృష్టించెను.
2. స్వర్గము, నరకము, భూమి మహాసముద్రము, ఆకాశమునందు నివసించు జీవకోటి యంతయు సృష్టించెను.
3. వీరిలో నెవరి పుణ్యమెక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలము ననుభవించిన పిమ్మట త్రోసి వేయబడుదురు.
4. ఎవరి పాప మెక్కువగునో వారు నరకమునకు పోదురు. అచ్చట వారు పాపములకు తగినట్లు బాధలను పొందెదరు.
5. పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్షసాధనమునకై యవకాశము గాంచెదరు.
6. వారి పాప పుణ్యములు నిష్క్రమించునప్పుడు వారికి మోక్షము కలుగును. వేయేల మోక్షముగాని, పుట్టుకగాని వారు వారు చేసికొనిన కర్మపై ఆధారపడియుండును.
🌻. మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువ 🌻
1. జీవకోటి యంతటికి ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము. మానవునివిగాక మరొక్క ప్రజ్డ గలదు.
2. అదియే జ్ఞానము. దీని సహాయముననే మానవుడు భగవత్ సక్షాత్కారమును పొందగలడు. ఇంకే జన్మయందును దీని కవకాశము లేదు.
3. ఈ కారణముచేతనే దేవతలు సైతము మానవజన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడ భూమిపై మానవజన్మమెత్తి మోక్షమును సాధించవలెనని కోరెదరు.
4. కొంతమంది మానవజన్మము చాల నీచమైనదనియు; చీము, రక్తము, మలములతో నిండియుండు ననియు, తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమగుననియునందురు.
5. కొంతవరకదికూడ నిజమే. ఇన్ని లోపములున్నప్పటికి మానవునకు జ్ఞానమును సంపాదించు శక్తి కలదు.
6. శరీరముండుట చేతనే మానవుడు తన దేహము యొక్క, జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి, ఇంద్రియసుఖముల పట్ల విరక్తి పొంది, నిత్యానిత్యవివెకముతో కడకు భగవత్సాక్షాత్కారమును బొందుచున్నాడు.
7. శరీరము మలభూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించు అవకాశమును పోగొట్టుకొనెదము.
8. దేహమును ముద్దుగా పెంచి విషయసుఖములకు మరగినచో నరకమున బడెదము.
ఉచితమార్గమేమన, దేహము నశ్రద్ధ చేయకూడదు; దానిని లోలత్వముతో పోషింపనూగూడదు.
9. తగు జాగ్రత్త మాత్రమే తీసికొనవలెను. గుఱ్ఱపురౌతు తన గమ్యస్థానము చేరువరకు గుఱ్ఱమును ఎంత జాగ్రత్తతో చూచుకొనునో యంతజాగ్రత్త మాత్రమే తీసికొనవలెను.
10. ఈ శరీరమును మోక్షసాధన, లేక యాత్మసాక్షాత్కారము కొరకు వినియోగించవలెను. ఇదియే జీవుని పరమావధియై యుండవలెను.
11. భగవంతుడనేకజీవులను సృష్టించినప్పటికి అతనికి సంతుష్టి కలుగలేదట. ఎందుకనగా భగవంతుని శక్తిని యవేవియు గ్రహించలేక పోయినవి.
12. అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మానవుని సృష్టించెను. వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తినిచ్చెను.
13. మానవుడు భగవంతుని లీలలను, అద్భుతకార్యములను, శేముషీవిజ్డానములను జూచి పరవశమొంది నప్పుడు భగవంతుడు మిక్కిలి సంతుష్టిజెంది యానందించును.
14. అందుచే మానవజన్మ లభించుట గొప్ప యదృష్టము. బ్రాహ్మణజన్మ పొందుట అందులోని శ్రేష్టము.
15. అన్నిటికంటె గొప్పది సాయిబాబా చరణారవిందములపై సర్వస్య శరణాగతి చేయునవకాశము కలుగుట.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sai Philosophy is Humanity - 56 🌹
✍️. Sri NV. Gunaji
📚. Prasad Bharadwaj
Chapter 8
🌻 Importance of Human Birth 🌻
In this wonderful universe, God has created billions (84 lacs according to Hindusastra calculation) of creatures or beings (including Gods, demigods, insects, beasts and men) inhabiting heaven, hell, earth, ocean, sky and other intermediate regions.
Of these, those creatures or souls, whose merits preponderate, go to heaven and live there till they enjoy the fruits of their actions, and when this is done, they are cast down while those souls, whose sins or demerits preponderate, go down to hell, and suffer the consequences of their misdeeds for so long a time as they deserve.
When their merits and demerits balance each other, they are born on earth as human beings, and are given a chance to work out their salvation.
Ultimately when their merits and demerits both drop down (are got rid of) completely, they get their deliverance and become free.
To put the matter in a nutshell, souls get their births or transmigrations according to their deeds and intelligence (development of their minds).
🌻 Special Value of the Human Body 🌻
As we all know, four things are common to all the creatures, viz. food, sleep, fear and sexual union. In the case of man, he is endowed with a special faculty, viz. knowledge, with the help of which he can attain God-vision, which is impossible in any other birth. It is for this reasons that Gods envy man's fortune and aspire to be born as men on earth, so as to get their final deliverance.
Some say, that there is nothing worse than the human body, which is full of filth, mucus, phlegm and dirt, and which is subject to decay, disease and death.
This is no doubt true to a certain extent; but inspite of these drawbacks and defects, the special value of the human body is - that man has got the capacity to acquire knowledge: it is only due to the human knowledge that one can think of the perishable and transitory nature of the body itself, and of the world and get a disgust for the sense-enjoyments and can discriminate between the unreal and the real, and thus attain God-vision.
So, if we reject or neglect the body because it is filthy, we lose the chance of God-vision, and if we fondle it, and run after sense - enjoyments, because it is precious, we go to hell.
The proper course, therefore, for us to pursue is the following; that the body should neither be neglected nor fondled, but should be properly cared for, just as a traveler on horse-back takes care of his pony on the way till he reaches his destination and returns home.
Thus the body should ever be used or engaged to attain God-vision or self-realization, which is the supreme end of life.
It is said that though God created various sorts of creatures he was not satisfied, for none of them was able to know and appreciate His work. So he had to create a special being - Man, and endow him with a special faculty, viz.
Knowledge and when He saw that man was able to appreciate His Leela - marvellous work and intelligence. He was highly pleased and satisfied. (Vide, Bhagawat 11-9-28).
So really it is good luck to get a human body, better luck to get birth in a Brahmin family, and best one, to get an opportunity of having recourse to Sai Baba's Feet and surrendering to Him.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹