సాయి తత్వం - మానవత్వం - 57 / Sai Philosophy is Humanity - 57
🌹. సాయి తత్వం - మానవత్వం - 57 / Sai Philosophy is Humanity - 57 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. అధ్యాయము - 8 🌴
🌻. మానవుని విధ్యుక్త ధర్మం 🌻
1. మానవజన్మ విలువైనదనియు, దానికెప్పటికైననూ మరణము అనివార్యమనియు గ్రహించి మానవుడెల్లప్పుడూ జాగరూకుడై యుండి జీవిత పరమావధిని సాధించుటకై యత్నించవలయును.
2. ఏ మాత్రమును అశ్రద్ధగాని ఆలస్యముగాని చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలెను.
3. భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొఱకెంత ఆతురపడునో, తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి యెంతగా వెదకయత్నించునో యటులనే, విసుగు విరామములేక రాత్రింబవళ్ళు కృషి చేసి యాత్మసాక్షాత్కారమును సంపాదించవలెను.
4. బద్ధకమును, అలసతను, కునుకుపాట్లను దూరమొనర్చి అహోరాత్రములు ఆత్మయందే ధ్యానము నిలుపవలెను.
5. ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయుమగుదుము.
🌻. తక్షణ కర్తవ్యం 🌻
1. మన ధ్యేయము సత్వరము ఫలించు మార్గమేదన, వెంటనే భగవత్సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్దకేగుట.
2.ఆధ్యాత్మికోపన్యాసములెన్ని వినినప్పటికి పొందనట్టిదియు, ఆధ్యాత్మికగ్రంథములెన్ని చదివినను తెలియనట్టిదియునగు ఆత్మసాక్షాత్కారము సద్గురువుల సాంగత్యముచే సులభముగా పొందవచ్చును.
3.నక్షత్రములన్నియు కలిసి యివ్వలేని వెలుతురును సూర్యుడెట్లు ఇవ్వగలుగుచున్నాడో యట్లనే ఆధ్యాత్మికోపన్యాసములు, గ్రంధములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు.
4.వారి చర్యలు, సామాన్య సంభాషణలే మనకు మౌనప్రబోధములు. శాంతి, ఖమ, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేహములను స్వాధీన మందుంచుకొనుట, అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణమలను - వారి ఆచరణలో చూచి, భక్తులు నేర్చుకొందురు.
5.వారి పావనచరితములు భక్తుల మనములకు ప్రబోధము కలుగజేసి వారిని పారమార్థికముగా ఉద్ధరించును.
6.సాయిబాబా యట్టి మహాపురుషుడు; సద్గురువు.
7. బాబా సామాన్య ఫకీరువలె సంచరించుచున్నప్పటికి వారెప్పుడును ఆత్మానుసంధానమునందే నిమగ్నులగుచుండిరి.
8.దైవభక్తిగల పవిత్ర హృదయులు వారికి సదా ప్రీతిపాత్రులు. వారు సుఖములకు ఉప్పొంగువారు కారు, కష్టముల వలన క్రుంగిపోవువారుకారు.
9.రాజైననూ, నిరుపేదలైననూ వారికి సమానమే. తమదృష్టి మాత్రమున ముష్టివానిని చక్రవర్తిని చేయగలశక్తి యున్నప్పటికి బాబా ఇంటింటికి తిరిగి భిక్ష నెత్తెడివారు! వారి భిక్ష యెట్టిదో చూతుము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sai Philosophy is Humanity - 57 🌹
✍️. Sri NV. Gunaji
📚. Prasad Bharadwaj
Chapter 8
🌻 Man's Endeavours 🌻
Realizing how precious the human life is, and knowing that Death is certain and may snatch us at any time, we should be ever alert to achieve the object of our life.
We should not make the least delay but make every possible haste to gain our object, just as a widower is most anxious to get himself married to a new bride, or just as a king leaves no stone unturned to seek his lost son.
So with all earnestness and speed, we should strive to attain our end, i.e., self-realization. Casting aside sloth and laziness, warding off drowsiness, we should day and night meditate on the Self.
If we fail to do this, we reduce ourselves to the level of beasts.
🌻 How to Proceed? 🌻
The most effective and speedy way to gain our object is to approach a worthy Saint or Sage - Sadguru, who has himself attained God-vision.
What cannot be achieved by hearing religious lectures and study of religious works, is easily obtained in the company of such worthy souls.
Just as the sun alone gives light, which all the stars put together cannot do, so the Sad-Guru alone imparts spiritual wisdom which all the sacred books and sermons cannot infuse. His movements and simple talks give us 'silent' advice.
The virtues of forgiveness, calmness, disinterestedness, charity, benevolence, control of mind and body, egolessness etc. are observed by the disciples as they are being practiced in such pure and holy company.
This enlightens their minds and lifts them up spiritually. Sai Baba was such a Sage or Sad-Guru.
Though He acted as a Fakir (mendicant), He was always engrossed in the Self. He always loved all beings in whom He saw God or Divinity.
By pleasures He was not elated. He was not depressed by misfortunes. A king and a pauper were the same to Him.
He, whose glance would turn a beggar into a king, used to beg His food from door to door in Shirdi, and let us now see how He did it.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹