సాయి తత్వం - మానవత్వం - 58 / Sai Philosophy is Humanity - 58

Image may contain: 1 person
🌹. సాయి తత్వం - మానవత్వం - 58  / Sai Philosophy is Humanity - 58 🌹
🌴. అధ్యాయము - 8  🌴
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. బాబా యొక్క బిక్షాటనం 🌻

1. శిరిడీజనులు పుణ్యాత్ములు. ఎందుకనగా, వారి యిండ్ల యెదుటనేగదా బాబా భిక్షుకునివలె నిలచి, "అమ్మా! రొట్టెముక్క పెట్టు" డనుచు, దానిని అందుకొనుటకు చేయి చాచెడివారు! చేత ఒక రేకుడబ్బా పట్టుకొని, భుజానికి ఒక గుడ్డజోలె తగిలించుకొని భిక్షాటనకు పోయెడివారు.

2. బాబా కొన్ని యిండ్లకు మాత్రమే భిక్షకు పోయెడివారు. పులుసు, మజ్జిగ వంటి ద్రవ పదార్థములు, కూరలు మొదలగునవి రేకు డబ్బాలో పోసుకొనెడివారు.

3. అన్నము, రొట్టెలు మొదలగునవి జోలెలో వేయించుకొనెడివారు. బాబాకు రుచి యనునది లేదు.

4. వారు జిహ్వను స్వాధీనమందుంచుకొనిరి. కాన అన్ని పదార్థములను రేకుడబ్బాలోను, జోలెలోను వేసికొనెడివారు.

5. అన్ని పదార్థములను ఒకేసారి కలిపివేసి భుజించి సంతుష్టి చెందేవారు. పదార్థముల రుచిని పాటించేవారుకాదు.

6. వారు నాలుకకు రుచి యనునది లేనట్లే కాన్పించుచుండెను. బాబా భిక్షకు యొక పద్ధతి, కాలనియమము లేకుండెను.

7. ఒక్కొక్కదినము కొన్ని యిండ్లవద్ద మాత్రమే భిక్షచేసెడివారు. ఒక్కొక్కసారి 12 సార్లు కూడా భిక్షకువెళ్ళెడివారు.

8. భిక్షలో దొరికిన పదార్థములనిన్నింటిని ఒక మట్టిపాత్రలో వేసేవారు. దానిని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండెడివి.

9. వాటిని తరిమే వారుకారు. మసీదు తుడిచి శుభ్రము చేయు స్త్రీ 10-12 రొట్టెముక్కలను నిరాటంకముగా తీసికొనుచుండెడిది.

10. కుక్కలను, పిల్లులనుగూడ కలలో సైతము అడ్డుపెట్టనివారు, ఆకలితోనున్న పేదల ఆహారమునకు అడ్డుచెప్పుదురా? "ఫకీరు పదవియే నిజమైన మహరాజపదవియనీ, అదియే శాశ్వతమనీ, మామూలు సిరిసంపదలు క్షణభంగురాలనీ", బాబాయనుచుండెడివారు.

11. ఆ పావనచరితుని జీవితము వంటి జీవితమేగదా మిగుల ధన్యమైనదు!

12.  మొదట శిరిడీ ప్రజలు బాబానొక పిచ్చిఫకీరని భావించి, అటులనే పిలిచెడివారు. భోజనోపాధికై రొట్టెముక్కలకై గ్రామములో భిక్షనెత్తి పొట్టపోసికొనెడు పేదఫకీరన్న ఎవరికి గౌరవమేమియుండును? కానీ, యీ ఫకీరు పరమవిశాలహృదయుడు, ఉదారుడు, ధనాపేక్ష లేశమాత్రము లేని నిరాసక్తుడు.

13. బాహ్యదృష్టికి వారు చంచలునిగను, స్థిరత్వము లేనివారుగను గాన్పించినను, లోన వారు స్థిరచిత్తులు.

14. వారి చర్యలు అంతుబట్టనివి. ఆ కుగ్రామములో కూడ ఒక గొప్ప మహాత్మునిగ గుర్తించి, సేవించిన ధన్యజీవులు కొద్దిమంది గలరు.

15. అట్టివారిలో నొకరి వృత్తాంతమిక్కడ చెప్పబోవుచున్నాను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sai Philosophy is Humanity - 58  🌹
✍️. Sri NV. Gunaji
📚. Prasad Bharadwaj

Chapter 8
🌻. Baba Begging Food 🌻

Blessed are the people of Shirdi, in front of whose houses, Baba stood as a beggar and called out, "Oh Lassie, give Me a piece of bread" and spread out His hand to receive the same. 

In one hand He carried a Tumrel (tinpot) and in the other a zoli or choupadari, i.e., a rectangular piece of cloth. He daily visited certain houses and went from door to door. 

Liquid or semi-liquid things such as soup, vegetables, milk or butter-milk were received in the tinpot, while cooked rice, bread, and such solid things were taken in the zoli. 

Baba's tongue knew no taste, as He had acquired control over it. 

So how could He care for the taste of the different things collected together? whatever things He got in His zole and in the tinpot were mixed together and partaken by Baba to His heart's content. 

Whether particular things were tasty or otherwise was never noticed by Baba as if His tongue was devoid of the sense of taste altogether.

 Baba begged till noon, but His begging was very irregular. Some days He went a few rounds, on other days up to twelve noon. 

The food thus collected was thrown in a kundi, i.e. earthen pot. Dog, cats and crows freely ate from it and Baba never drove them away. 

The woman who swept the floor of the Masjid took some 10 or 12 pieces of bread to her house, and nobody prevented her from doing so. 

How could, He, who even in dreams never warded off cats and dogs by harsh words and signs, refuse food to poor helpless people? 

Blessed indeed is the life of such a noble person! People in Shirdi took Him in the beginning for a mad Fakir. He was known in the village by this name. 

How could one, who lived on alms by begging a few crumbs of bread, be revered and respected? But this Fakir was very liberal of heart and hand, disinterested and charitable. 

Tough He looked fickle and restless from outside. He was firm and steady inside. His way was inscrutable. 

Still even in that small village, there were a few kind and blessed people who recognized and regarded Him as a Great Soul. One such instance is given below.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹