శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 8 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 8

Image may contain: 1 person, sitting and beard
🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 8  / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 8  🌹
🌻. చతుర్థ దత్తావతారము  🌻
📚 ప్రసాద్ భరద్వాజ 
🌻  8వ భాగము.  ప్రభువు బాల్యలీలలు 🌻
  
🌸. తెల్ల తేలు  🌸
       ప్రభు ఆటలలో ఎలాంటి విచిత్రాలు జరిగేవో వాటిని సమయానుకూలంగా పిల్లలకు అర్థమయ్యేటట్లు బోధించడంలో ప్రభు ఉత్సాహం చూపించేవారు. పాములు, తేళ్లు హాని కలిగించే ప్రాణులు అని మనకు తెలుసు. 

అలాగే ఆ సమయంలో పిల్లలందరూ పాము కనిపించగానే చంపడానికి ప్రయత్నించేవారు. కాని ప్రభు అడ్డు చెప్పేవారు. *వాటిని ఏమీ అనకుంటే అవి కూడా మనల్ని కూడా ఏమీ చేయవు* అని ఎప్పుడూ అనేవారు. ఏ ప్రాణికి కష్టం కలగకూడదని ప్రభు అనుకునేవారు. 
అప్పుడప్పుడు పిల్లలు ఆడుతూ ఉంటే చూస్తూ కూర్చునేవారు. ఒకరోజు అడవిలో ఆడుతూ ఉంటే కొంతమంది పిల్లలు ఒక పుట్టలోనుంచి కొన్ని తేళ్లు బయటకి రావడం చూసారు. అవి కనపడగానే నాలుగైదు తేళ్లను కొట్టి చంపేశారు. 

అది చూసి ప్రభు 'చంపడం ఆపండి. ఇక ముందు అమాయక ప్రాణులను చంపొద్దు. ముందు ఏమి జరుగుతుందో చూస్తూ కూర్చోండి'* అని చెప్పారు. అలా అనగానే వెళ్లి దూరంగా కూర్చున్నారు. 
ఆ పుట్టలోంచి ఇంకా చాలా తేళ్లు బయటకి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్లాయి. చివరికి ఒక నల్ల తేలుపై ఒక తెల్ల తేలు కూర్చుని బయటకి వచ్చి చచ్చిన తేళ్ల చుట్టూ తిరిగి మళ్ళీ పుట్టలోనికి వెళ్ళిపోయింది. తరువాత చూస్తే చనిపోయిన ఒక్క తేలు కూడా కనిపించలేదు. 
చనిపోయిన తేళ్లు ఏమయ్యాయని పిల్లలకు సందేహం కలిగింది. కొందరు మిగతా తేళ్లు వచ్చి వాటిని తీసుకెళ్లాయేమో అన్నారు. కాని, ప్రభు వాళ్లకు అర్థమయ్యేటట్లు వివరించారు. తెల్లతేలు అన్ని తేళ్లకు రాజు. 

అది ఇంకొక తేలుపై వచ్చి తన దగ్గర ఉన్న సంజీవిని మణి సహాయంతో చచ్చిన వాటిని బ్రతికించి తీసుకెళ్లింది. రాజు యొక్క సామర్ధ్యం అది. తన ప్రజలను రక్షించగలిగిన వాడే నిజమైన రాజు. ఇలా మాట్లాతుండగా ఒక పిల్లవాడు చనిపోయిన రామచిలుకను తీసుకువచ్చాడు. 
అది చూసి పిల్లలు విలవిలలాడారు. అది ప్రభు చూడలేక చనిపోయిన పక్షిని చేతిలోకి తీసుకొని ప్రేమతో నిమురుతూ, అరె బాలా! నీకు ఏమయింది! లే, లేచి గూటిలోకి వెళ్ళు. పిల్లలు చూస్తుండగానే జీవించి ఉన్న పక్షిలాగే ఎగురుతూ తన గూటికి వెళ్ళిపోయింది. పిల్లలు ఆశ్చర్యచకితులయ్యారు.

తరువాయి భాగము రేపు చదువుకుందాము....... 
దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 8 🌹
✍️. Nagesh  D.  Sonde
📚. Prasad Bharadwaj 

🌻03. In jungles, hills and woods - 1 🌻

Yajnavalkya explains in Brihad Aranyak Upanishad (III.5.1) that it is the Self that transcends hunger and thirst, sorrow and delusion, old age and death. The knowers of Brahman having known this Self, having overcome the desire for sons, the desire for wealth, the desire for worlds, live the life of mendicants. (Because) that which is the desire for sons is the desire for wealth, the desire for wealth is the desire for the worlds. 

Therefore, let the knower of Brahman, after he has done with learning, desire to live like a child. When he has done with the state of childhood and with learning, then he becomes a silent mediator. Having done with both the non-meditative and meditative states, then he becomes the knower of Brahman.
These appear to be the graphic stages through which Shri Manik was passing. Perceiving the manifestation of the Brahman in the expansive Nature, living in the lap of Nature, being instructed by the forces of Nature, he became one with Nature, one with manifestation, one with the Lord, of whom he himself was a part and parcel.

In his discourse with Prahlad, Shri Dattatreya has described the life of one who has realised the Brahman. “The very best among our Teachers in this world are the bees and pythons. Following their example we have acquired non-attachment and contentment. Strangers may rob the honey which was collected with great effort and pain by the bees yet the bees do not despair.
 Seeing that, I cultivated from the bees aversion towards all objects. Like the python I remain effortless and contented in mind with whatever I get it. If I do not get anything, I lie for many days depending upon my own strength. Some times I eat plenty and sometimes but little, no matter whether it is delicious or tasteless. Some times I partake rich food, some other time I gulp even worthless things.
 Sometimes I eat food given with respect and sometimes given without any honour. Enjoying what is ordained by destiny and contented in mind, I put on silk or linen, deer skin or rags, bark of the trees or whatever is available at that time. Some times I lie on the ground, sometimes on straw, on leaves, on stones or in ashes. 

Some times I sleep on soft quilt at the desire of others or on a bed inside a palace. I bathe besmeared with sandal paste, finely dressed, wearing garlands and bedecked in jewels. I drive in chariots, or ride on a horse or on an elephant, while on other occasions I wander stark naked like an evil spirit. 
I neither revile nor eulogies men of varied natures or having predominance of one or the other of the Gunas. I have told you about my conduct, even though it may appear to you as being against the canons of the Vedas…” (Bhagavat Purana VII.13)

This extensive quotation reminds one of the strange behaviour patterns Shri Manik exhibited throughout these years of his adolescence. If, therefore, people considered him to be an Avatar (incarnation) of Shri Dattatreya, then the future events, as they unfolded, seemed to justify such conclusion.

Even though the family members accepted the strange behaviour of Shri Manik, it nonetheless created anxiety in their minds, especially when he would wander from place to place without notice. He would come and go like the breeze. 

He was like ‘Aniketa’, one without any settled place of residence. Becoming unattached with everything that was not of Brahman, he lived in the ever-blissful state, delivered, as it were, from the bondage of life. He had become a Jeevanmukta. From that time onward, 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹