శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 6 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 6

Image may contain: one or more people
🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 6 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 6 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌴. ప్రభువు బాల్య లీలలు 🌴
🌸. గోవిందను బ్రతికించుట 🌸
ప్రభువుతో చిన్నతనంలో ఆటలాడే పిల్లలలో గోవింద అనే గొల్లపిల్లవాడు ఉండేవాడు. వాడు గొర్రెలను మేపడానికి రోజూ అడవిలోనికి వెళ్ళేవాడు. ప్రభువుతో ఆటలు ఆడడానికి ఇంకా చాలామంది గొల్లపిల్లలు ఉండేవారు. గోవింద అనే పిల్లవాడు నాలుగైదు రోజులు ఆటలో కనిపించలేదు.
ఆటలలో కనిపించని తమ తోటి స్నేహితులను ప్రభువు ఎప్పుడూ అడిగేవారు. అలా ఒకరోజు ఉదయం ప్రభు, గోవింద ఆడటానికి ఎందుకు రావడం లేదని అడగడానికి గోవింద ఇంటికి వెళ్లారు.
వాకిట్లో నిలబడి 'గోవిందా! గోవిందా' అని పిలిచారు. ఇలా పిలవగానే ఆ ఇంట్లోనుండి ఏడుపు వినిపించింది. అది వినగానే ప్రభు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగారు. గోవింద తల్లి ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంది.
నాలుగైదు రోజులు నుండి జ్వరంతో బాధపడుతూ ఈరోజు ఉదయం గోవింద మరణించాడని అక్కడున్నవారు ప్రభువుకి చెప్పారు. ప్రభు, గోవింద తల్లి దగ్గరకి వెళ్లి, తల్లీ, నీవు ఊరికే ఏడవకు.
గోవింద చనిపోలేదు. నీవు ఒకసారి గట్టిగా పిలువు. వాడు లేచి కూర్చుంటాడు. మనిషి జీవించి ఉండగా ఏడవటం మంచిదా? అని ప్రభువు అన్నారు. కానీ అక్కడున్నవారికి ప్రభు మాటలు నిజం అనిపించలేదు.
వాళ్లంతా గోవింద చనిపోయాడని అంత్యక్రియలకు తయారుచేశారు. గోవింద తల్లికి మాత్రం ప్రభువు మాటపై పూర్తి విశ్వాసం ఉండేది. అప్పుడు ఆమె 'గోవిందా' లేవు ఇంకా ఎంతసేపు పడుకుంటావు.
నిన్ను పిలవడానికి భావు (ప్రభువు) వచ్చాడు. ఇలా అనగానే గోవింద నిద్రలోంచి లేచినట్లుగా లేచి కూర్చున్నాడు. తల్లి యొక్క ఆనందంకి అంతులేదు. ఇతరులైతే ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు.
ఈ ఘటనకు కారణం తను కాదన్నట్లు 'ఎంత పిచ్చివాళ్ళు జీవించియున్న మనుష్యుని కాల్చడానికి తీసుకెళ్తున్నారు.' ఇలా అంటూ గోవిందునితో గొర్రెలను తీసుకొని అడవిలోనికి రమ్మనిచెప్పి తను అక్కడినుండి వెళ్లిపోయారు ప్రభు. ఈ విషయం గ్రామమంతా ప్రాకింది.
గోవిందను చూడడానికి గ్రామమంతా తరలింది. ప్రభువు మాత్రం ఆ తర్వాత రెండు మూడు రోజులు అదృశ్యమవడం వలన తన ఆచూకీ ఎవరికీ దొరకలేదు.
🌸. సంతానం అనుగ్రహించుట 🌸
ఒకరోజు ఒక పండ్లు అమ్మే స్త్రీ తలపై మామిడిపండ్ల బుట్ట పెట్టుకొని 'పండ్లు తీసుకుంటారా' అని అరుస్తూ వెళ్తోంది.
నలుగురైదుగురు పిల్లలను వెంటపెట్టుకొని ప్రభువు ఆ స్త్రీ వద్దకు వచ్చి "మాకు పండ్లు కావాలి ఇస్తావా?" అని అడిగారు. ధర అడగకుండా పండ్లు అడిగే ఆ పిచ్చివాళ్లను చూసి పైసలు లేకుండా పండ్లు ఊరికే ఇవ్వనని చెప్పి వెళ్ళిపోయింది.
కొంచెం దూరము వెళ్లిన తర్వాత ప్రభువు మెల్లగా 'పిల్లలు కావాలనుకుంటే మాకు పండ్లు ఇవ్వాల్సిందే' అన్నారు. ఈ విషయం ఆ స్త్రీ చెవిన పడగానే వెనక్కి తిరిగి తన ఆంతరంగిక విషయం ఆ పిల్లాడికి ఎలా తెలిసిందని ఆమెకు ఆశ్చర్యం కలిగింది.
పెళ్లి అయ్యి చాలా సంవత్సరాలు గడిచినా కూడా సంతానము కలగలేదు. ఎన్నో నోములు నోచింది. పిల్లల కోసం చాలా ఆత్రుతగా ఉండేది. ఇలాంటి సమయంలో ప్రభువు యొక్క మాట అమృతంలా వినిపించింది.
"బాలా! నీ నోరు తీపికాని, నీకు ఎన్నికావాలో అన్ని పండ్లు తీసుకో" ఇలా అని పండ్ల బుట్ట ప్రభువు ముందు పెట్టింది. పదకొండు పండ్లు తీసుకుంటాను, నీకు పదకొండు మంది పిల్లలు పుడతారు అని అనగానే ఆమెకు అమితానందం కలిగింది.
ప్రభువు పిల్లలతో కలిసి ఆడుకుంటూ అక్కడినుండి వెళ్ళిపోయారు. ప్రభువు యొక్క ఈ అమృతవాక్కు వలన ఆ స్త్రీకి ఐదు మంది పిల్లలు కలిగారు. తర్వాత పిల్లలు కావాలన్న కోరిక తగ్గింది.
బాలింత కష్టాలు పడలేక ప్రభు దగ్గరికి వెళ్లి విన్నవించుకుంది. "నీ ఇష్టం ఇకముందు కూడా నీ ఇష్టప్రకారమే జరుగుతుందని, ఇక పిల్లలు పుట్టరని చెప్పి నవ్వుతూ ప్రభువు ఆమెను వెళ్ళమని చెప్పారు. ఇలా ప్రభువు యొక్క చమత్కారాలు అనంతమైనవి. వారి మాట అమృతమయమైనదని అందరికీ నమ్మకం ఉండేది.
దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 6 🌹
✍️. Nagesh D. Sonde
📚. Prasad Bharadwaj

🌻 02. Birth and early life - 4 🌻
Already frustrated and furious over this episode, one afternoon Manik’s uncle happened to see him resting on the bed, as if unconcerned with the world around him. Seeing him lazing thus, his uncle scolded him and asked him whether he thought himself to be a king to receive food and clothing without working for the same.
That was enough. The words were so sharp for Manik’s keen intellect, that at that very moment aversion towards life came over him and the vision of his life’s mission flashed before him. He got up without uttering a word; discarding his clothes he left home wearing but a loincloth. As he left he made this prophetic statement:
“Who else be my saviour,
save the compassionate Lord?
Creator and the Destroyer
as well, my lone Controller.
Through delusion, ‘I AM’,
thus does a person consider.
Who, verily, is the servant
and who, indeed, is the Lord?
Worthless, verily,
is this distress for one to worry,
Even in one’s mother’s womb,
He alone was the Witness.
Thus, verily, does Manik speak.”
From then onwards, his journey on the Pathless Path was within the folds of Mother Nature. As he breathed in the fresh, unconditioned atmosphere, a new wave of awareness came over him, spreading before him the universality of the Divine presence in every thing he saw, touched or heard. One by one the mysteries, long concealed, came to be revealed to him.
“Sarvam Khalvidam Brahma” “neha nanasti kinchana” “Verily, that Imperishable, O Gargi, is unseen but is the seer, is unheard but is the hearer, unthought but is the thinker, unknown but is the knower. There is no other seer but this, there is no other knower but this. By this Imperishable, O Gargi, is space woven like warp and woof” (Brihad Aranyak Upanishad. III.8.11).
What does all this mean? When one speaks of the tree, one also assumes it to be each leaf, each flower, each fruit as well as the trunk, the branches and the unseen roots. However, when one speaks of the Lord, one rarely assumes the Earth (with its minutest molecules), the water, the air, the fire, the space to be nothing but the Lord.
This apparent division between the Lord and his creation is no division at all. This division is only unreal, for there can be no demarcation. Nor is any separation possible. As Shri Krishna puts it, “He (the Lord) stands undivided in beings and yet as if divided. He is to be known as the Creator, the Supporter and Devourer as well” (Bhagavad Gita XIII.17).
This made Manik a completely changed person. Shri Krishna’s assurance seemed to echo in every action of his. “He who sees Me everywhere and sees all in Me, I am not lost to him nor is he lost to Me” (Bhagavad Gita VI.30). Consequently within himself and without himself, in nature, in creatures, in trees and streams, hills and dales, in the wise as well as in the foolish, in the saint as well as in the sinner, in those who love and in those who hate, he saw only the same Divine essence, the Brahman.
Continues.....
🌹 🌹 🌹 🌹 🌹