శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 10 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 10

Image may contain: 5 people, people sitting and beard, text that says "శ్రీ మాణిక్య చరితామృతము చతుర్థ దత్తావతారులైన శ్రీ సద్గురు మాణిక్యప్రభు మహారాజులవారి సమగ్ర చరిత్రాత్మక నిత్య పారాయణ గ్రంథము"
🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 10 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 10 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻
🌻. ప్రభువు బాల్యలీలలు 🌻
🌸. భాలచంద్ర దీక్షిత్ 🌸

కళ్యాణ్ నుండి సుమారు ఎనిమిది క్రోసుల దూరంలో హాళిఖేడ్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో భాలచంద్ర దీక్షిత్ అనే పేరుగల అగ్నిహోత్రి బ్రాహ్మణుడు నివసించేవారు. ఈ దీక్షితులు ఆ కాలంలో విద్వాంసులలో అగ్రగణ్యులు. పూర్వ వైదిక పరంపరలో ఈయనకు సమానంగా ఎవరూ ఉండేవారు కాదు.

ఈయన వేదశాస్త్ర, సదాచారపరులై ఉండేవారు. శిష్య సముదాయం కూడా పెద్దగానే ఉండేది. ఈయన అప్పుడప్పుడు కళ్యాణ్ వెళ్లేవారు. కళ్యాణ్ లోని మనోహరనాయక్ ఇంట్లో ఉండేవారు. వారికి బయమ్మ అతిథి సత్కారాలు చేసేవారు. మనోహరనాయక్ కుమారుడు మాణిక్ ని చూసి వీరు ఆశ్చర్యచకితులయ్యారు.

ప్రభువు ముఖము తేజోవంతమై ఉండేది. ఒక రకమైన ఆకర్షణ ఆ ముఖములో కనిపించేది. వారి గురించి, వారి విద్యాభ్యాసం గురించి అడిగితే, ఎప్పుడూ అడవిలో తిరుగుతూ ఉంటాడు. చదువుపై శ్రద్ధ లేదు.

అప్పుడప్పుడు దిగంబరముగా శరీరానికి బూడిద పూసుకొని ఇంట్లో ఉన్నా లేకున్నా, అన్నీ అందరికీ పంచుతూ తిరుగుతాడని బయమ్మ చెప్పింది. ఇలా అనేక రకాలైన ప్రభువు యొక్క గుణాలు చెప్పి, 'మీరయినా ఈ బాలుణ్ణి హాళిఖేడ్ తీసుకువెళ్లి మంచిదారిలో పెట్టండి' అని విన్నవించుకుంది.

ప్రభువును దీక్షితులు తనతో పాటు తీసుకెళ్లడానికి ఒప్పుకొని హాళిఖేడ్ తీసుకొని వచ్చారు. అక్కడకు వచ్చిన తర్వాత కూడా ప్రభువులో కొద్దిగా కూడా నడవడిక మారలేదు. అక్కడ ఎలాగో, ఇక్కడ అలాగే ప్రవర్తించేవారు. భాలచంద్ర దీక్షిత్ కు మాత్రం ప్రభువు యొక్క యోగ్యత తెలుసు. అందుకని ప్రభువు ఎలా నడుచుకున్న ఎవరూ ఏమి అనకూడదని ఇంట్లో అందరికీ ఆజ్ఞాపించారు.

అక్కడ ప్రభువు ఇష్టానుసారంగా అడవులలో తిరిగి మధ్యాహ్నవేళలో ఇంటికి వస్తే, స్వయంగా దీక్షితులు మడిలో ఉన్నా కూడా ముట్టుకొని స్నానం చేయించి స్వయంగా ఆహారం ప్రభువుకు తినిపించేవారు. అనేకరకాలుగా ప్రభువు, దీక్షితుల ఇంట్లో వారి సహనానికి పరీక్ష పెట్టారు. చివరికి హోమము (అగ్ని) గుండములో మల విసర్జన చేశారు.

అది చూసి దీక్షితుల భార్య సహించలేక దీక్షితులకు ఫిర్యాదు చేస్తే, అది విని అలాకానే కాదు, నిజంగా మల విసర్జన చేస్తే అది తీసి చూపించు అనగానే ఆ స్త్రీ అగ్ని కుండంలో చూస్తే ఒక బంగారు బంతి కనిపించింది. అది బయటకి తీసి చూస్తే నిజంగానే అది బంగారం ముద్ద అని ఆమెకు తెలిసింది. దీక్షిత్ వైపు ప్రభు చూస్తూ, 'మీరు మీ అపూర్వ ప్రేమతో నన్ను కట్టి పడేశారు.

మీ ఇంటిపై దత్తుని యొక్క అపూర్వ కృపాదృష్టి ఎప్పటికీ ఉంటుంది' అన్నారు. తరువాత ప్రభువు యొక్క కృపతో భాలచంద్ర దీక్షిత్ ధనకనక వస్తు సంపదతో ఆనందంగా జీవించారు. ప్రభు సాక్షాత్ అగ్ని నారాయణుడని దీక్షితులు అనేవారు. కొన్నిరోజులు హాళిఖేడ్ లో ఉండి దీక్షితుల ఆజ్ఞతో సంతోషంగా ప్రభువు కళ్యాణ్ కి తిరిగి వచ్చారు.

తరువాయి భాగము రేపు చదువు కుందాము.....

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏

సశేషం...
🌹 🌹🌹 🌹 🌹

🌹 SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 10 🌹
✍️. Nagesh D. Sonde
📚. Prasad Bharadwaj

🌻 04. In search of the Self - 1 🌻

Shri Prabhu was greatly attracted to the hills around Manthal. The caves in the hills were cool and far from the maddening crowd.

The locale was quiet and peaceful and conducive for communion with the Supreme Self. He lived for many days immersed in the blissful state of realisation. Some time he would come down from the hills and roam around the town.

His behaviour was some times so different from normal ways of life, that people would shun him as though he was demented.

His favourite pastime seemed to be to sit on a stick and play like a child, treating the stick for a horse. While children and less intelligent people would treat this event with amusement and ridicule, the wise ones would see this unusual spectacle and wonder who this person may be! A saint, a Yogi or a simpleton to be neglected.

They had heard that many ancient yogis used to behave in a manner which would appear unnatural to the common man. However ordinary people did not have the required spiritual comprehension to see the great man through his Leela (sport).

For one who is wise, doubts need not arise. There have been instances where Jeevanmuktas, those who were liberated even when alive, were not bound by the norms of the social life. Jabala Upanishad (6) tells us about Samvartaka, Aruni, Svetaketu, Durvasa, Ribhu, Nigadha, Jadabharata, Dattatreya, Raivataka and others were Paramahamsas.

They were of un-manifested nature, of un-manifested ways of life, seen (by others) to behave like mad men though they were in no way mad.

The wise ones, therefore, recognizing Shri Prabhu as a great Yogi honoured and worshipped him, which Shri Prabhu accepted as though all this was natural for him.

But at the same time like a simple, unassuming child of nature, he would distribute the things received by him among the assembled persons. Indeed, strange are the ways of those who are absorbed in the bliss of Brahman.

As Shri Krishna says, “Sages see with equal eye, a learned and humble Brahman, a cow, an elephant, and even a dog or an outcast” (Bhagavad Gita.V.18). The empirical diversity prevalent in the manifested world does not hide the metaphysical Reality abiding within.

Often when in spiritual rapture, he would sing and dance and many of his bhajans were the product of such ecstatic moods.

When he sang these bhajans, which in Marathi are known as “Abhanga”, he seemed to be inseparable from “Datta-Dayaghana” his chosen deity. The state of a-bhanga is surely that state when one is not separate from the Lord.

One is reminded of the words of Shri Krishna (Bhagavad Gita.XVIII.20) when he says that the Satvic attribute is that wisdom by which the one Imperishable Being is seen in all existence, undivided in the divided.

In fact bhajans were to play an important role in the Sampradaya of Shri Manik Prabhu Maharaj, in the generations to come. It is only through such unalloyed communion with the Lord that His creatures come back to Him.

Bhajana, therefore basically represents the unity of Bhagavan (the Lord) and Jana (the devotees). Shri Prabhu also encouraged this medium of ‘naad-upasana’.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹