శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 13 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 13
🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 13 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 13 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌸. అమృతకుండము 🌸
కళ్యాణ్ నుండి సుమారు 3 క్రోసుల దూరంలో 'మంటాల' అనే గ్రామానికి దగ్గరలో 'అమృతకుండము' అనే అత్యంత పురాతన తీర్థక్షేత్రం ఉంది.
పూర్వం ఆర్య సంస్కృతి యొక్క వైభవకాలంలో ఎంతోమంది తపోనిధులు తపస్సు చేసి ఈ తీర్థము యొక్క మహత్యాన్ని పెంచారు. ఈ కుండము నాలుగు దిక్కులా రాళ్లతో నిర్మించబడింది. ఏ కాలంలోనై నీటిధార కుండమునుండి బయటకు వస్తూ ఉంటుంది. ఈ నీళ్లుతో పొలాలు కూడా బాగా పండుతాయి.
దీనికి ఉత్తర దిశలో శంకరుని దేవాలయం ఉంది. ఇక్కడే గుహలాగ ఒక ప్రదేశం ఉంది. సాధు, గోసావి, బైరాగులు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. శివాలయము యొక్క పూజారి మంటాల గ్రామంలో ఉంటారు.
మంటాల గ్రామానికి చెందిన కులకర్ణి గారు నిత్యం అమృతకుండముకు దైవదర్శనార్ధము వచ్చేవారు.
ఈయన రోజులాగే శంకరుని దర్శనానికి వచ్చి ప్రదక్షిణ చేసే దారిలో దూరంగా పదహారు-పదిహేడు సంవత్సరాల వయస్సులో ఉన్న యువకుడు అతని దృష్టిలో పడ్డాడు. ఆ యువకుని శరీర వర్ఛస్సును చూసి ఆ గృహస్థు విస్మయం చెందారు.
శరీరంపై లంగోటితో భస్మధారియైన ఆ యువకుని స్వరూపం చూడగానే సాక్షాత్ శంకర భగవానుని దర్శనం అయినట్లు అనిపించింది. అతని దగ్గరికి వెళ్లి మీరెవరు? ఎక్కడినుండి వచ్చారు? ఈ భయానక నిర్జన ప్రదేశానికి ఎందుకు వచ్చారు? అని అడగాలని ఆ బాలుని వద్దకు వెళ్లాలని ఆ వైపు నడిచాడు.
ఆ యుక్త బాలకుడు ముందు ముందుకు వెళ్తున్నాడు. ఆ బాలుడిని వెంబడించి, వెనకనే ఆ గృహస్థు వెళ్ళాడు. చెట్ల మధ్యలో బాలకుడు కనిపించలేదు. కానీ, ఒక భయంకరమైన పులి కనిపించింది.
అతనికి భయం కలిగి, ముందుకు వెళ్లాలన్న ఆలోచన విరమించుకొని, అక్కడనుండి పరిగెత్తుకుని మంటాల గ్రామానికి చేరుకున్నాడు. కానీ ఆ బాలకుని యొక్క రూపము మరువలేకపోయాడు.
అతను దైవ స్వరూపమేమో? అతనికి పులి అంటే భయం లేదా? మనుష్యుడైతే ఆ బాలకుడు భయంతో పులి అని అరిచేవాడు. మనసులో మళ్ళీ అమృతకుండముకు వెళ్లాలనిపించినా పులియొక్క భయం వలన మళ్ళీ చాలా రోజులు వరకు ఆ వైపుకు వెళ్ళలేదు.
తరువాత రెండు నెలలకు చెక్క గుర్రముపై కూర్చొని ఒక యుక్తవయస్సులో ఉన్న బాలుడు మంటాల గ్రామంలో కనిపించాడు. ఆ ఊరి పిల్లలకు ఆ చెక్కగుఱ్ఱము విచిత్రంగా అనిపించి ఆ బాలకుడి చుట్టూ చేరారు. ఈ అందరి పిల్లలతో కలిసి ఆ బాలుడు కులకర్ణి ఇంటికి చేరుకున్నాడు.
కులకర్ణి దగ్గరికి వెళ్ళగానే అతనిని కళ్యాణ్ కి చెందిన మాణిక్ ప్రభు అని గుర్తుపట్టాడు. తను రెండు నెలలు క్రితం అమృతకుండము వద్ద చూసిన బాలుడు ఇతనే అని నిర్దారించుకున్నాడు.
కళ్యాణి మాణిక్ ప్రభు అనగానే ఊరంతా ప్రభు దర్శనానికి కదిలి వచ్చింది. ఆ సమయంలో *కులకర్ణి ఇంట్లో ఆయన భార్య ప్రసవవేదన పడుతుండెను. ఎంతసేపైనా ప్రసవం జరగలేదు.
అప్పుడు ప్రభువు అతనితో, భయపడకు, ఊరిలో నలుగురు బ్రాహ్మణుల వద్ద నుండి తీర్థం తీసుకొని వచ్చి నీ భార్యకు త్రాగిస్తే మంచి జరుగుతుంది అని చెప్పారు. ఆ విధంగా చేయగానే సుఖప్రసవం అయి పుత్రుడు జన్మించాడు.
కులకర్ణి ఆనందం చెప్పనలవి కాదు. ప్రభువు అక్కడనుండి వెళుతుంటే బెల్లంతో చేసిన లడ్డు కులకర్ణి గారు ప్రభువు చేతిలో పెట్టారు, అది తిని ప్రభువు సంతుష్టులయ్యారు.
ఈ విషయం తెలిసి గ్రామస్థులందరూ పోగయ్యారు. కానీ, ప్రభువు చెక్కగుఱ్ఱంపై స్వారీ చేస్తూ వెళ్ళిపోయారు. ప్రభువును వెంబడించడం వారికి సాధ్యం కాలేదు.
తరువాయి భాగము రేపు చదువుకుందాము.......
దిగంబర దిగంబర
శ్రీపాదవల్లభ దిగంబర 🙏
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 13 🌹
✍️. Nagesh D. Sonde
📚. Prasad Bharadwaj
🌻. 05. Venkamma 🌻
Mailar is one of the ancient holy places, popularly known as ‘Dakshina Kashi’. Shiva is worshipped here as Martanda Bhairava and is also venerated locally as Khandoba. The temple received many donations from far and wide, including from the Peshwas.
During the period when Shri Prabhu arrived here the town was a prosperous trading centre. During the annual festival of the temple innumerable devotees thronged this town.
As long as Shri Prabhu stayed there, it became normal for the devotees to take his blessings after taking the Darshan of Martanda Bhairava. For many, Shri Prabhu appeared as Shiva himself in the garb of a wandering recluse.
During this period, his fame as an Avatar of Shri Dattatreya spread further in the surrounding areas. Among the many frequent visitors, there was one lady of exceptional spiritual competence.
She had all the potential for being spiritually awakened but seemed to be waiting for the grace of a Guru. She belonged to the Komti caste, a trading community (vaishya) and appeared to be endowed with wealth and prosperity.
None noticed her, for she had been keeping to herself at the far end. Each day she would come and take Shri Prabhu’s blessings and sit in the corner till the close of the day when all the crowd would disperse.
Thus, on each day she was experiencing the Grace of Shri Prabhu, for it appeared that she had finally met her ordained Guru. The Grace was silently flowing through her and preparing her for the path chosen for her in the Sampradaya.
This remarkable lady was none other than Venkamma, who became a powerful force, Shakti Svarupini, in Shri Manik Prabhu Sampradaya.
Great saints have an insight which is unlike that of normal persons. Among the large crowd which was coming over for his Darshan, he had seen her spiritual preparedness with his mystic eye.
No one has admittance in spiritual matters unless they are so authorised. The person has to be an Adhikari, qualified to receive initiation and retain the extraordinary power bestowed on him.
An unqualified person will not be able to receive, let alone sustain the power of penance. Shri Prabhu realised that here was one such personality who was well equipped for being initiated. Therefore, when all the persons left his presence, he called her.
“You have taken Prasad more than once”, he told her, “Why do you then come again and again. Why don’t you go back to your family?” When the reference to her home and family was made, she seemed to come out of a trance.
Where was her home? Who were her father, mother, brothers and sisters? She replied, “I do not know where my home is or my family. I have therefore come to you to seek guidance to the place of my abidance. Your lotus feet appear to me to be the place where I can take shelter”.
These words had more significance than was prima facie apparent. She was receptive to the resonance which was passing from Shri Prabhu and she was so much immersed in that Grace that the entire surrounding seemed to have become full of Shri Manik Prabhu.
Continues....