శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 7 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 7

🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 7 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻

7వ భాగము.....
ప్రభువు బాల్యలీలలు

🌸ఎనిమిది గవ్వలు🌸

అప్పారావు హైదరాబాద్ లో నిజాం ప్రభుత్వ సైన్యమునకు చెందిన అరబ్బుల కంపెనీలో జమాదారుగా ఉండేవారు. ఆయన బ్రాహ్మణ జాతీయుడు. మనస్సు మంచిది. వారి భార్య పేరు భీమాబాయి. భీమాబాయి పిల్లలు కావాలని నోములు వ్రతాలు చేసింది. ఇలా అనేక వ్రతాలు, ఉపవాసాలు చేసినా కూడా ఉపయోగం లేక నిరాశ పడిపోయింది. అంతలో కళ్యాణ్ లోని ప్రభువు యొక్క కీర్తి ఆమె చెవిలో పడింది. ప్రభువు ఏది మాట్లాడితే అది సత్యమవుతుందని విని ఒకసారి ప్రభువుని దర్శించుకోవాలనే ప్రబలమైన కోరిక ఆమెలో కలిగింది. ఆమె తన భర్త అంగీకారాన్ని తీసుకొని పల్లకిలో కూర్చొని హైదరాబాద్ నుండి కళ్యాణికి రావడానికి బయలుదేరింది. పల్లకితో పాటు బోయీలు, సిపాయిలు కొంతమంది గుర్రంపై స్వారీ చేస్తూ దాసీ జనంతో పల్లకి వెళ్తూ ఉంది. మధ్య మధ్యలో ఆగుతూ బీదర్ పై నుండి కళ్యాణికి వస్తుండగా కళ్యాణి ఇంకా ఒక మైలు దూరంలో ఉండగా ఒక మైదానంలో పిల్లల అల్లరి వినిపించింది. సహజంగా ఆ వైపుకు చూడగానే కొంతమంది పిల్లలు ఒక పిల్లవాడిపై పడి కొట్టసాగారు. ఆ పిల్లల కొట్లాటను విడిపించాలని పల్లకిని ఆ పిల్లల వైపుకు తీసుకు వెళ్లాల్సిందిగా బోయీలకు చెప్పింది. పల్లకి దగ్గరికి వస్తుండగా ఆ కొట్లాట ఇంకా ఎక్కువయింది. ఆ పిల్లవాణ్ణి విడిపించాలని సిపాయిలు చాలా ప్రయత్నం చేశారు. కానీ ఆ పిల్లలు 'మా కొట్లాట మీకెందుకు? మాది మేము చూసుకుంటాము. మీ దారిన మీరు వెళ్ళండి' అన్నారు. ఈ చమత్కారమైన కొట్లాట చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏం చేయాలో వారికి తోచలేదు. *ఆ పిల్లలలో ఒకరు అరుస్తూ ముందుకు వచ్చి నన్ను విడిపించాలనుకుంటే ఎనిమిది గవ్వలు ఇచ్చి విడిపించాలి. ఒక గవ్వకి ఒక కొడుకు పుడతాడు అన్న విలక్షణమైన మాటలు విని ఆ స్త్రీ ఆశ్చర్యపోయింది. ఎవరి దగ్గరైనా గవ్వలున్నాయా అని అందరినీ అడిగింది. కానీ, అంత శ్రీమంతురాలైన స్త్రీ వద్ద గవ్వలు ఎలా ఉంటాయి? ఆ పిల్లవాడి మాటలు నిజమవచ్చని ఎనిమిది గవ్వలు ఇచ్చి ఆ మాటల్ని నిజం చేసుకోవాలని ఆత్రుతపడింది. గవ్వలు ఎలా దొరుకుతాయి? గవ్వల బదులు పైసలు ఇస్తే సరిపోతుందా? అని అడిగింది. కానీ మిగతా పిల్లలు మాకు పైసలు వద్దు, గవ్వలే కావాలని చెప్పి మళ్ళీ ఆ పిల్లవాడిపై పడి అల్లరి చేశారు. ఏం చేయాలో అని నిరాశ చెందగా ఆ స్త్రీ యొక్క భాగ్యం మంచిదై ఒక బోయి యొక్క డబ్బు ఉంచే సంచికి గవ్వలు కనిపించాయి. అవి తీసి ఆ పిల్లవాడికి ఇచ్చింది. ఆ స్త్రీ వైపు సంతోషంతో చూసి నీకు ఎనిమిది మంది పుత్రులను ఇచ్చాను, వెళ్ళు అని చెప్పి నడుస్తూ ఆ బాలుడు వెళ్ళిపోయాడు. గవ్వలు దొరకగానే మిగతా పిల్లలందరూ సంతోషంతో అక్కడనుండి వెళ్లిపోయారు. ఆ బాలుడు ఎవరో ఏమిటో ఆ స్త్రీ కి అప్పుడు తెలియలేదు.

సాయంత్రముకు తన మంది మార్బలంతో కళ్యాణికి చేరుకుంది.  మనోహరనాయక్ యొక్క పుత్రుడే దత్తాత్రేయ అవతారమని ఆయననే అందరూ 'వేడాభావూ' అంటారని ఆమెకు తెలుసు.
ఆమె ఆ పిల్లవాడి గురించి అందరినీ అడిగింది. దర్శనము చేసుకొని భోజనము చేయాలని ఆమె మనసులో అనుకుంది. కానీ, ఎంత రాత్రి అయినా ప్రభువు రాలేదు. ఎదురుచూసి నిరాశతో అలాగే ఉపవాసం ఉండిపోయింది. రెండోరోజు కూడా బ్రాహ్మణ భోజన వేళలో ఎదురుచూస్తే రాలేదు. వారి ఆచూకీ దొరకలేదు. ప్రభువు రెండు మూడు రోజులు అడవిలో అదృశ్యమైపోయి కనిపించరని ఇంట్లో అందరికీ తెలుసు. మూడురోజులు ఆ స్త్రీ (భీమాబాయి) అన్నము లేకుండా ఉపవాసం ఉంది. చివరికి ఆమెపై ప్రభువుకి కరుణ కలిగి మూడోరోజు ఇంటికి వచ్చారు. 

కళ్యాణ్ కు రాకపూర్వం గవ్వలు ఇచ్చి విడిపించిన పిల్లవాడే ఈ పిల్లవాడని తెలిసింది. ఆ స్త్రీని చూడగానే నీకు ఒకసారి ఎనిమిది మంది పిల్లలను ఇచ్చాను కదా? మళ్ళీ ఎందుకు కష్టపెడుతున్నావు? అని అంటూ ప్రభువు తల్లి వైపు చూసి అమ్మా, 'ఆకలి అవుతుంది తినడానికి ఏమైనా ఇవ్వు' అనగానే తల్లి ఇచ్చినది తిని అక్కడినుండి వెళ్ళిపోయారు. ఆ స్త్రీ చూసినప్పుడు ప్రభువు విలక్షణంగా కనిపించినా ఆయన వర్ఛస్సును చూసి ఆ స్త్రీకి పరమానందమయింది. తను వచ్చిన పని అయినట్లుగా ఆ స్త్రీకి అనిపించింది. ఆ స్త్రీ కళ్యాణిలో ఒకరోజు ఉండి దానధర్మాలు చేసి అన్నసంతర్పణం చేయించి మాతృశ్రీ బయమ్మకు, కొడుకుకి వస్త్రాలు సమర్పించి హైదరాబాద్ వెళ్ళిపోయింది. కొన్ని నెలలు తర్వాత ఆ స్త్రీకి పుత్రుడు కలిగాడు. ఆ స్త్రీ యొక్క ఆనందానికి హద్దు లేకుండా పోయింది. *ప్రభువు సాక్షాత్తూ దత్తాత్రేయ అవతారమనే నమ్మకం నిజమయింది. తరువాత ఆమె మొదటికంటే ఎక్కువగా దానధర్మాలు చేసి ప్రభు దర్శనం చేసుకొని తిరిగి వచ్చింది. ఆ తరువాత పుత్రులు కలుగుతూంటే, తన మొక్కులు తీరుస్తూ వెళ్ళింది.

తరువాయి భాగము రేపు చదువుకుందాం......

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర
🌹 🌹 🌹 🌹 🌹

🌹 SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 7 🌹
✍️. Nagesh D. Sonde
📚. Prasad Bharadwaj

🌻 02. Birth and early life - 5 🌻

The entire world experience was spiritualised and became self-experience. His love and compassion for all beings from the creatures to the creepers became all-embracing, for he had seen the face of the Lord unveiled to him with all its mysterious secrets.

He could not bear to see any of the Lord’s creatures being ill-treated. Once, he saw a boy riding a pregnant buffalo and goading her to run faster and faster. He reprimanded the boy and bade him to dismount. Ignoring Manik’s remonstration the boy continued his torture of the buffalo. Manik once more cautioned him and warned him that if he failed to dismount immediately, he may find himself stuck to the buffalo.

When the boy failed to dismount, suddenly the buffalo commenced galloping and then he could not dismount as he found his hands stuck to the back of the buffalo. Fearing for his life, he pleaded to Manik to release him and promised not to misbehave with any animal ever again. Then, Manik approached the buffalo and requested her to release the boy and immediately the boy was able to dismount.

Seeing the Supreme Self mirrored in all beings as well as his individual Self, the advaita-bhavana, the non-dual inalienable experience gave way to exhilaration. He and his Preceptor, as also he and his Maker all appeared but as one, indistinct from one another, as Bimba and Pratibimba. Like the Cuckoo who experiences the first showers of rain, he sang with gay abandon:

“Compassionate is Datta,
my own Divine Preceptor,
Controller of inner core,
maintainer of triple shore
Converting my mundane life to be entirely pure.

Indivisible, Inviolable,
In-dweller of the Universe,
Verily, as Consciousness,
He abides in the Universe.
Bestowing unsurpassed,
illumined splendour,
Has taken humble Manik to meet his mentor.”
*****
Continues....
🌹 🌹 🌹 🌹 🌹