త్రిపురా రహస్యము - 73 / TRIPURA RAHASYA - 73
🌹 . త్రిపురా రహస్యము - 73 🌹 (చివరి భాగం) 🌻. స్వామి దత్తాత్రేయ విరచిత ఆత్మ జ్ఞాన యోగము 🌻 ✍️. బ్రహ్మ శ్రీ క్రోవి పార్థసారథి 📚. ప్రసాద్ భరద్వాజ 🌴. గ్రంధ సారాంశము - 2 🌴 ప: మరి తమ ఆత్మే అయిన ఆ సుఖాన్ని అజ్ఞానులు ఎందుకని తెలుసుకోలేరు ? ద: స్త్రీ వల్ల ఒకసారి, ధనంవల్ల ఒకసారి ఇలా సుఖాలు కలిగినప్పుడు, స్త్రీ, ధనము విడివిడిగా కనిపిస్తాయి. అందుచేత వాటివల్ల కలిగే సుఖాలు కూడా విడివిడిగానే ఉంటాయి. అవేవీ శాశ్వతం కాదు. ఆత్మ సుఖమే శాశ్వతమైనది. ఈ విషయం తెలియని అజ్ఞాని ఆత్మ సుఖాన్ని పొందలేడు. ప: ఏదీ లేదు”. అనేది ఎందుకు ప్రమాణ సిద్దాంతము కాదు? ద : జగత్తు ఉన్నది అనటానికి ఒక జ్ఞానముండాలి. లేదు అనటానికి కూడా జ్ఞానముండాలి. అది ఎందుకు లేదో చెప్పాలి. అందుచేత ఈ జగత్తులోనే ఉంటూ, జగత్తే లేదంటే తానే లేనివాడౌతాడు. ప: అద్వైతము అంటే ద్వైతాన్ని నిషేధిస్తున్నారు. అసలు ద్వైత స్వరూపం ఏమిటి? ద : ద్వైత రూపమైన జగత్తు దర్పణ ప్రతిబింబంలాంటిది. దర్పణంలో ఉన్న ప్రతిబింబాన్ని సత్యము అనిగాని, అసత్యం అనిగాని అనలేము. జగత్తు కనిపిస్తోంది. అందుకని అది అసత్తు కాదు. నశిస్తుంది. అందుకని సత్తూ కాదు. అందుకే జగత్త