త్రిపురా రహస్యము - 70 / TRIPURA RAHASYA - 70

Image may contain: 3 people
🌹. త్రిపురా రహస్యము - 70 🌹
🌻. స్వామి దత్తాత్రేయ  విరచిత ఆత్మ జ్ఞాన యోగము 🌻
✍️. బ్రహ్మ శ్రీ క్రోవి పార్థసారథి
📚. ప్రసాద్ భరద్వాజ
 
🌴. వసుమంతుని సందేహాలు - 2 🌴

న: జ్ఞానులకు కర్మ ఉండటం అసంభవం కదా జ్ఞానాగ్ని ఈ కర్మను దగ్ధం చేస్తుంది కదా ? 
 
హే: జ్ఞానులందరికీ 1. అపక్వము 2. పక్వము 3. హతోదికము అని మూడు రకాల కర్మలుంటాయి. 
  
1. పరిపక్వం పొందని కర్మను అపక్వ కర్మంటారు. 2. కాలక్రమంలో పూర్తిగా పండిన కర్మను పక్వ కర్మ అంటారు. 3. జ్ఞానం కలిగిన తరువాత చేసిన హితోదికము 
వీటిలో అపక్వము, హతోదికము అనేవి జ్ఞానంవల్ల నశిస్తాయి. 

ఇంతకాలానికి పూర్తి అవుతాయి అని భగవంతుడు సంకల్పిస్తాడు. అఆ సంకల్పాన్నే 'నియతి' అంటారు. క్రమంగా ఉండే క్రియల సమూహమే కాలము ఈ కాలము కర్మలను పరిపక్వం చేస్తుంది. కాలక్రమంలో పూర్తిగా వండిపోయిన కర్మను పరిపక్వ కర్మ అంటారు. పరిపక్వ దశకు రాని దాన్ని అపక్వకర్మ అంటారు. 

జ్ఞానం కలిగిన తరువాత చేసిన కర్మ హతోదికము. ఆ కర్మకు ఫలితాన్ని ఇచ్చే శక్తి ఉండదు. అందుకే అది హతమైనది. అంకురం మాడిపోయిన బీజంలాంటిది. మొలక ఎత్తదు. విత్తనంపైకి వచ్చినందున ఉదితము. హతమై ఉన్నది. కాబట్టీ హతోదితము. ఇక్కడ కర్మ జరుగుతుంది. కాని ఫలితం మాత్రం రాదు. 
 
పక్వమైన కర్మనే ప్రారబ్బకర్మ అంటారు. ఇది లాగి విడిచిన బాణం లాంటిది. లక్ష్యాని ఛేదించి తీరుతుంది. అలాగే పక్వమైన కర్మ ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. ఆ కర్మ ఫలంగానే ఈ జగత్తు ప్రవర్తిల్లుతున్నది. 

అయితే జ్ఞానంలోని భేదాన్ని బట్టి వారి వ్యవహారాల్లోకూడదా భేదం కనిపిస్తుంది. మందజ్ఞానులకు సుఖదుఃఖాలు ఉంటాయి. మధ్యజ్ఞానులకు కూడా సుఖదుఃఖాలు ఉంటాయి కాని ఆవి అంతతీవ్రంగా ఉండవు. అస్పష్టంగా ఉంటాయి. ఇక ఉత్తమజ్ఞానుల సంగతి చూస్తే వారి దృష్టిలో సుఖదుఃఖాలు అన్నీ అసత్యాలే. కాబట్టి అవి కర్మఫలం కాదు. 
 
కర్మఫలం : కర్మఫలం పైన చెప్పిన ముగ్గురికీ వేరుగా ఉంటుంది. 
 
1. అజ్ఞానుల కర్మఫలం : సుఖదుఃఖాలు గాకముందే ఫలానా సుఖం లేదు దుఃఖం నాకు వస్తుంది అనుకుంటాడు. వచ్చినతరువాత వాటిని అనుభవించాను అనుకుంటాడు. ఈ భావనలే అతని ప్రారబ్దకర్మఫలానికి సృష్టినిస్తాయి. వాటినే ఎప్పుడూ ఆలోచించటంవల్ల అవి పెరిగి పోషింపబడి, మనస్సులో నిలిచి రాగద్వేషాలను పుట్టిస్తాయి. 
 
అజ్ఞానులకు ఆత్మస్వరూపం తెలియదు. దేహమే ఆత్మ అనుకుంటారు. ఈ జగత్తే సత్యము అని నమ్ముతారు. సుఖదుఃఖాలు సత్యము అని నమ్మి వాటిని అనుభవిస్తారు. 
 
మధ్యమజ్డానులు : వీరు మధ్యమధ్య ఆత్నానుసంధానం చేసుకుంటారు. అందువల్ల వారి భావాలు ఎల్లప్పుడూ సాగవు. ఆ కారణంగా వారి ప్రారబ్బకర్షకు అంత బలం ఉండదు. అందుకనే వారికర్మ ఫలం తక్కువగా ఉంటుంది. 
 
మధ్యమజ్ఞాని బ్రహ్మ ఒక్కటే సత్యమని ఈ జగత్తు అంతా మిధ్య అని మధ్యమధ్యలో అనుకుంటాడు. ఆ భావన పూర్తిగా ఉండదు కాబట్టి దేహమే ఆత్మ అనుకుంటాడు. అయితే బ్రహ్మ ఒక్కటే సత్యము అనే భావన అతనికి పూర్వం నుంచీ ఉన్నది కాబట్టి అది మధ్యమధ్య పైకి వచ్చి ఈ జగత్తే సత్యము అనే మిధ్యాజ్ఞానాన్ని తొలగిస్తుంది. 

ఈ రకంగా సత్యజ్ఞానము, మిధ్యాజ్ఞానము ఒక్కొక్కటిగా పైకి కనిపిసాయి. సత్యజ్ఞానం వచ్చినపుడు కర్మఫలం కనపడదు. మిధ్వాజ్ఞానం ఉనప్పుడు కర్మఫలం కనిపిస్తుంది. సాధనవల్ల సత్యజ్ఞానం ఎక్కువై, మిధ్యాజ్ఞానం తగ్గిపోతుంది. అయినా లోకవ్యవహారం కోసం మిధ్యాజ్ఞాన  
వాసనను కోరి తెచ్చుకుని దానితో వ్యవహరిస్తాడు. 
 
ఉత్తమ జ్ఞానులు : వీరికి జ్ఞానం కలగకముందు ప్రారబ్ద కర్మ సంపూర్ణంగా ఉన్నా జ్ఞానం కలిగిన తరువాత కర్మఫలం నాశనం అవుతుంది. అది బయటకు సుఖదుఃఖాలుగా కనిపించినప్పటికీ, కాలిపోయిన బట్టలాగా ఉపయోగం ఉండదు. జ్ఞానికి సుఖదుఃఖాలు అంటవు. రంగస్థలంమీది నటుదులాగా అభినయిస్తాడు. అంతేకాని అవి అతన్నంటవు. 
 
ఉత్తమజ్ఞానికి స్వరూప న్మృతి ఎప్పుడూ నిరవధికంగా ఉంటుంది. అందువల్ల అతనిదృష్టిలో సమాధి స్థితికీ, వ్యవహారస్థితికీ తేడా ఉండదు. మధ్యమజ్ఞాని విషయంలో ఇది కొంచెం తక్కువ ఉంటుంది. 
 
ప్రతి కారణానికీ ఒక కార్యం ఉంటుంది. అలాగే ప్రాణులు అనుభవించే సుఖదుఃఖాలకూడా ఒక కారణం ఉండి తీరాలి. మనకి (ప్రత్యక్షంగా కనపడని ఆ కారణాన్నే కర్మ అంటున్నాము. జ్ఞానులు కూడ అందరిలాగే ఈ లోక వ్యవహారంలో ఉంటున్నారు. కాబట్టి వారుకూడా కర్మఫలాన్ని అనుభవించి తీరాల్సిందే. అయితే ఈ విషయం మంద జ్ఞానులకు మాత్రమే వర్తిస్తుంది. 

సుఖదుఃఖాలవల్ల వారి అంతఃకరణలో మార్పు వస్తుంది. అలా మార్పు కలిగించేదే కర్మఫలము. అంటే సుఖదుఃఖాలు తనవిగా భావించినవ్పుడే ఆ కర్మఫలాలు అందుతాయి. ఒకవేళ సుఖదుఃఖాలను తమవిగా భావించకపోతే అవి అంతః కరణలో మార్పు తేలేవు. కాబట్టి అది కర్మఫలం కాదు. జ్ఞానుల అంతఃకరణలో ఈ మార్పు ఉండదు. అందువల్లనే వారికి కర్మఫలాలుండవు. 
 
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 TRIPURA RAHASYA - 70 🌹
🌻 THE MYSTERY BEYOND THE TRINITY 🌻
✍️ Ramanananda Saraswathi
📚 Prasad Bharadwaj

CHAPTER 16
🌴 On Consciousness, Control of Mind, and Sleep - 5 🌴

The argument that the universe is illusory, being a figment of imagination like a hare’s horn, is extended further by the statement that the creation leading up to it must be equally illusory. Then the coexistence of Siva and Sakti is useless; and Siva being incomprehensible without Sakti, the idea of Godhead falls to pieces. 

But the scriptures point to God as the primal essence from which the world has sprung, in which it exists, and into which it resolves. That statement will then be meaningless. Why should the other scriptural statement ‘There is no more than One’ alone be true? Is it to lend support to the argument of illusion? The proper course will be to look for harmony in these statements in order to understand them aright.

Their true significance lies in the fact that the universe exists, but not separately from the primal Reality — God. Wisdom lies in realising everything as Siva and not in treating it as void. 

The truth is that there is one Reality which is consciousness in the abstract and also transcendental, irradiating the whole universe in all its diversity from its own being, by virtue of its self-sufficiency, which we call Maya or Sakti or Energy. 

Ignorance lies in the feeling of differentiation of the creatures from the Creator. The individuals are only details in the same Reality.

In sleep, the insentient phase of stupor overpowers the sentient phase of deliberation. But the factor of illumination is ever present and that alone cannot become apparent to men, in the absence of deliberation. Therefore, sleep is said to be the state of ignorance, as distinguished from wakefulness which is conceded to be knowledge.]

73. This conclusion is admitted by the wise also. Sleep is the first born from Transcendence (vide Ch. XIV, sloka 59), and also called the unmanifest, the exterior, or the great void. 

74-76. The state prevailing in sleep is the feeling ‘There is naught’. This also prevails in wakefulness, although things are visible. But this ignorance is shattered by the repeated upspringing of thoughts. The wise say that the mind is submerged in sleep because it is illumining the unmanifest condition. The submersion of mind is not, however, peculiar to sleep for it happens also at the instant of cognition of things. 

77. I shall now talk to you from my own experience. This subject is perplexing for the most accomplished persons. 

78. All these three states, namely, samadhi, sleep and the instant of cognition of objects, are characterised by absence of perturbation. 

79. Their difference lies in the later recapitulation of the respective states which illumine different perceptions. 

80. Absolute Reality is manifest in samadhi; a void or unmanifest condition distinguishes sleep and diversity is the characteristic of cognition in wakefulness. 

81. The illuminant is however the same all through and is always unblemished. Therefore it is said to be Abstract Intelligence. 

82. Samadhi and sleep are obvious because their experience remains unbroken for some appreciable period and can be recapitulated after waking up. 

83. That of cognition remains unrecognised because of its fleeting nature. But samadhi and sleep cannot be recognised when they are only fleeting. 

84. The wakeful state is iridescent with fleeting samadhi and sleep. Men when they are awake can detect fleeting sleep because they are already conversant with its nature. 

85-86. But fleeting samadhi goes undetected because people are not so conversant with it. O Brahmin! Fleeting samadhi is indeed being experienced by all, even in their busy moments; but it passes unnoticed by them, for want of acquaintance with it. Every instant free from thoughts and musings in the wakeful state is the condition of samadhi. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹