త్రిపురా రహస్యము - 69 / TRIPURA RAHASYA - 69

Image may contain: 3 people
🌹. త్రిపురా రహస్యము - 69 🌹
🌻. స్వామి దత్తాత్రేయ  విరచిత ఆత్మ జ్ఞాన యోగము 🌻
✍️. బ్రహ్మ శ్రీ క్రోవి పార్థసారథి
📚. ప్రసాద్ భరద్వాజ
 
🌴. వసుమంతుని సందేహాలు - 1 🌴 
 
గురువర్యా ! బ్రహ్మ్నరాక్షసుని ప్రశ్నలకు హేమాంగదుడు సమాధానాలు చెప్పాడు. అతడికి శాపవిమోచనం కూడా జరిగింది కదా ! తరువాత ఏం జరిగిందో వివరించండి అన్నాడు కృష్ణశర్మ. చెప్పటం మొదలుపెట్టాడు రత్నాకరుడు. 
 
శాపవిమోచనం పొందిన వసుమంతుడు హేమాంగదునితో “రాజపుత్రా ! నిన్నాక విషయం అడుగుతాను తత్వాన్ని తెలుసుకున్న నువ్వు లోకవ్యవవారాన్ని ఏ విధంగా నిర్వర్తించగలుగుతున్నావు?” అన్నాడు ఆ మాటలు విన్న హేమాంగదుడు చెప్పటం ప్రారంభించాడు. “బ్రాహ్మణోత్తమా ! నిన్ను అజ్ఞానం ఇంకా వదలలేదు. అసలు జ్ఞానం రెండు రకాలుగా ఉంటుంది. 

1. ఆత్మ స్వరూపమైనది 2. అజ్ఞానాన్ని నాశనం చేసే “సో హం రూపమైన ప్రత్యభిజ్ఞా రూపమైనది. లౌకిక వ్యవహారము అత్మజ్ఞానానికన్న వేరైనదా? లేక ప్రత్యభిజ్ఞానానికన్న వేరైెనదా? ఒకవేళ లోక వ్యవహారంవల్ల ఆత్మరూపజ్ఞానం గనక నాశనమైతే, అది కలలో కలిగే జ్ఞానంలాంటిదే అవుతుంది. అటువంటి జ్ఞానము మోక్షసాధనం కాలేదు. లోకవ్యవహారం ఆత్మజ్ఞానాన్ని నాశనం చెయ్యలేదు. 
 
వ: సో హం జ్ఞాన ప్రామాణ్యానికి వ్యవహారం బాధకం కావచ్చును కదా ? 
 
హే: ఒకపేరు కలిగి, ఒక రూపంతో ప్రకాశించే స్వరూపమే సంకల్పం. ఈ సంకల్పంవల్లనే ' ఇవ్వటం, పుచ్చుకోవటమనేది జరుగుతుంది. శ్రవణాది సాధనాలవల్ల పరోక్షజ్ఞానం కలుగుతుంది. నిధిధ్యానరూపమైన సంకల్పంవల్ల సాక్షాత్‌ జ్ఞానం కలుగుతుంది. వెంటనే ఒక్కక్షణం సో హం అనే ప్రత్యభిజ్ఞారూవ విశేషజ్ఞానం కలుగుతుంది. దీనితో అవిద్య నశిస్తుంది.' నేను, నాది అనే భావాలు కలగవు. అందువల్ల “సోహం రూప ప్రత్యభిజ్ఞానము అప్రమాణము” అనే జ్ఞానంకూడా కలగదు. 

అంటే - లౌకిక వ్యవహారజ్ఞానమనేది ప్రత్యభిజ్ఞారూప జ్ఞానానికి విరుద్ధం కాని, బాధకంగాని కాదు. అలాంటప్పుడు జ్ఞాని వ్యవహారాలలో ఉన్నా ముక్తుడుగానే ఉంటాడు. 
 
న : రాకుమారా ! భిన్నసంకల్పాలు లేసి స్వరూపాన్న చితి అంటున్నారు. ఆ సంకల్పాలు లేనిదే వ్యవహారాలు కుదరవు అప్పుడు స్వరూపంలో లేనివి, స్పరూప విరుద్ధమైన సంకల్పాలు స్వరూపంలో భాసిస్తాయి. అనగా భ్రాంతి కలుగుతుంది. భ్రాంతి అంటే జ్ఞానస్వరూపమైన చితి, తద్విరుద్ధమైన సంకల్పంగా మారి భాసించటమే. త్రాడు పాములాగా కనపడటం భ్రాంతి. అందువల్ల జ్ఞానికూడా వ్యవహరిస్తున్నాడు. అంటే తిరిగి భ్రమలో పడ్డట్లే కదా ? 
 
హే; బ్రాహ్మజోత్తమా ! భ్రమకూ, అభ్రమకూ మధ్యగల భేదం నీకు తెలియటం లేదయ్యా! జ్ఞానుల వ్యవహారం భ్రమకాదు. ఆకాశం నీలం రంగు కాదు అని దానితత్త్వం తెలిసిన వాళ్ళకి కూడా అది నీలంగానే కనిపిస్తుంది. అంతమాత్రాన ఆకాశం నిలం అన్నవారి జ్ఞానము భ్రమకాదు. ఆకాశతత్త్వం తెలియని అజ్ఞానికిఆది భ్రమ. తత్త్వవేత్త “ఆకాశము నీలము” అంటే అది యదార్ధమే అవుతుంది. ఎందుకంటే తత్త్వవేత్తకు దానిలో 'వ్రామాణ్యబుద్ధి లేదు. చచ్చిన పామువలన ఏ అపకారము జరగనటే, ప్రామాణ్యబుద్ధి లేని వ్యవహారమువల్ల ఏ దోషము అంటదు. 

జ్ఞాని ఆ వ్యవహారము సత్యము కాదు అని తెలిసికూడా అది సత్యమన్నట్లుగా ప్రవర్తిస్తాడు. ఈ వ్యవహారము ఆతడికి బంధకము కాదు. తత్త్వ్వజ్ఞుడు కానివాడికి వ్యవహారము బంధకమవుతుంది. ప్రతిబవింబమైన బనుగును చూసి అది నిజం ఏనుగు అనుకుంటాడు. 
 
ఈ విధంగా జ్ఞాని, అజ్ఞాని ఇద్దరూ లోకవ్యవహారాలు చేస్తున్నా, వారి జ్ఞానంలో భేదమున్నది. జ్ఞాని అయినవాడు వ్యవహారం జరుపుతున్నా అది అతన్నంటధు. అతడు నిమిత్తమాత్రుడు. 

అయితే అజ్జానంవల్ల కలిగిన భ్రమ, జ్ఞానంవల్ల నశిస్తుంది. కర్మఫలం వలన వచ్చిన అజ్ఞానము, కర్మక్షయం అయ్యేవరకు ఉంటుంది. కర్మక్షయం కాగానే వ్యవహార భావనకూడా పోతుంది. అప్పుడు ఈ జగత్తు కనిపించదు. అంతా పరబ్రహ్మ స్వరూపమే ఉంటుంది. కాబట్టి జ్ఞానులకు భ్రాంతి అనేది ఉండనే ఉండదు.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 TRIPURA RAHASYA - 69 🌹
🌻 THE MYSTERY BEYOND THE TRINITY 🌻
✍️ Ramanananda Saraswathi
📚 Prasad Bharadwaj

CHAPTER 16
🌴 On Consciousness, Control of Mind, and Sleep - 4 🌴

Would a chip of wood held in front of a single object to the exclusion of all others reflect the object simply because all others are excluded? Reflection can only be on a reflecting surface and not on all surfaces. Similarly also, realisation of the Self can only be with an alert mind and not with a stupefied one. Newborn babes have no realisation of the Self for want of alertness.

Moreover, pursue the analogy of a tarred mirror. The tar may prevent the images from being seen, but the quality of the mirror is not affected, for the outer coating of tar must be reflected in the interior of the mirror. So also the mind, though diverted from dreams and wakefulness, is still in the grip of dark sleep and not free from qualities. This is evident by the recollection of the dark ignorance of sleep when one wakes. 

64. I will now tell you the distinction between sleep and samadhi. Listen attentively. 

There are two states of mind:

(1) Illumination and (2) Consideration. 

65. The first of them is association of the mind with external objects and the second is deliberation on the object seen. 

66. Illumination is unqualified by the limitations of objects: deliberation is qualified by the limitations pertaining to the objects seen, and it is the forerunner of their clear definition. 

[Note: The mind first notes a thing in its extended vision. The impression is received only after noting the thing in its non-extensive nature, and becomes deeper on musing over the first impression.] 

67. There is no distinction noted in the preliminary stage of simple illumination. The thing itself is not yet defined, so illumination is said to be unqualified. 

68. The thing becomes defined later on and is said to be such and such, and so and so. That is the perception of the thing after deliberation. 

69-70. Deliberation is again of two kinds: the one is the actual experience and is said to be fresh, whereas the other is cogitation over the former and is called memory. The mind always functions in these two ways. 

71-72. Dreamless slumber is characterised by the illumination of sleep alone, and the experience continues unbroken for a time, whereas the wakeful state is characterised by deliberation repeatedly broken up by thoughts and therefore it is said not to be ignorance. 

Sleep is a state of nescience, though it consists of illumination alone, yet it is said to be ignorance for the same reason as a light though luminous is said to be insentient. 

[Note: Pure intelligence is made up of luminosity, but is not insentient like a flame. It is gleaming with consciousness, thus differing from the flame. For intellect is evidence as thinking principle. 

Therefore it is called Absolute Consciousness, active principle, vibratory movement, all-embracing Self, or God. Because of these potentialities it creates the universe.

Sri Sankara has said in Soundarya Lahari: Siva owes his prowess to Sakti; He cannot even stir in Her absence. Siva should not therefore be considered to be a mere inexpressible entity depending for His movements upon Maya (like a man on his car). Sri Sankara continues: Siva is yoked by Thee, Oh Sakti, to His true being. Therefore a blessed few worship Thee as the endless series of waves of bliss, as the underlying basis of all that is, as the Supreme Force, maintaining the universe, and as the Consort of Transcendence. Thus the identity of Siva and Sakti with each other or with Transcendence is evident.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹