త్రిపురా రహస్యము - 64 / TRIPURA RAHASYA - 64

🌹. త్రిపురా రహస్యము - 64 🌹
🌻. స్వామి దత్తాత్రేయ  విరచిత ఆత్మ జ్ఞాన యోగము 🌻
✍️. బ్రహ్మ శ్రీ క్రోవి పార్థసారథి
📚. ప్రసాద్ భరద్వాజ
 
🌴. విద్యాగీత - 2 🌴

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పవలసినది” అన్నారు. ఆ మాటలు విన్న పరమేశ్వరి “నాయనలారా ! మీ ప్రశ్నలన్నింటికీ, ఒక్కొక్కదానికి విడివిడిగా సమాధానం చెబుతాను వినవలసినది. అంటూ ప్రారంభించింది. 
 
1. ఏది పరారూపం ; పరాప్రతిభయే నా పరారూపం. అందులోనుంచి ఈ జగత్తుయొక్క సృష్టిస్టితిలయాలు జరుగుతున్నాయి. ఈ ప్రతిభకే జ్ఞానము అని కూడా పేరు. అది స్వయంప్రకాశము. అది లేదు అని చెప్పటానికి వీలు. లేచు: అదే లేకపోతే ప్రశ్నించేవాడంటూ'ఉందడు. అసలు ప్రశ్నలు సమాధానాలే ఉండవు అయితే అది కంటికి కనిపించదు. అన్నింటియందు అఖండంగా ఉంటుంది. అదే నా పరారూపము. మాయతో కప్పబడిన అజ్ఞానులకు జగత్తు ఆకారంలో భాసిస్తుంది. జ్ఞానులకు తమయందే దర్శనమిస్తుంది. ద్వైతబుద్ధి లేనివారు ఆమెను సేవిస్తారు. ఇక్కడ సేవిస్తారు అంటే యజమాని సేవకుడు ఇద్దరున్నారు కదా ? అది ద్వైతం కదా అనుకుంటారేమో ? 
 
జ్ఞానియైనటువంటి వాడికి అద్వైతరూపం తెలిసినా, ద్వైతబుద్ధినీ కల్పించుకుని, దాన్ని  సేవిస్తుంటాడు. జనాకాది మహానుభావులు అదై ఎతులయినా, జ్ఞానులైనా, పూర్వజన్మలో వచ్చిన సంస్కారబుద్ధితో రాజ్యాన్ని పాలించారు. ఈ రకంగా వారు దేవిని సేవించి అద్వైత స్థితి పొందుతారు. చరాచర జగత్తుకూ సూత్రం ఏదైతే ఉన్నదో, అదే నా పరారూపం. 
 
2, ఏది అపరారూపం ; అనేక బ్రహ్మాండాలకు అవతల క్షీరసాగరంలో, నవరత్నమణి ద్వీపంలో, కందభవనంలో, చింతామణి గృహంలో పంచ ప్రేతాసనాసీనగా దర్శనమిచ్చే కామేశ్వరీ, కామేశ్వర మిధునరూపమే, భక్తులను అనుగ్రహించటం కోసం ఆవిర్భవించిన అపరారూపం. అదే సగుణబ్రహ్మ సదాశివుడు, ఈశానుడు, త్రిమూర్తులు. గణపతి, కుమారస్వామి, దిక్సాలురు, కుమారి, లక్ష్మి, అష్టవసువులు, సురలు, నాగులు, యక్ష కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్యగణాలన్నీ ఆ దేవి రూపమే. అంతా అపరాస్వరూపులే. అయినప్పటికీ, నా మాయకు లోనైనవారు నన్ను గూర్చి తెలుసుకోవటం లేదు. భక్తుల పూజలంది, వారి కోరికలు తీర్చేది నేనే. ఎవరు ఏ రూపంలో ధ్యానిస్తే, వారికి ఆ రూపంలో ప్రత్యక్షమవుతాను. 
 
౩. విశ్వర్యరూపం : నా ఐశ్వర్యము అనంతము. జ్ఞానమయమయిన నేను ఏ కారణాన్నీ అ పేక్షించకుండానే జగదాకారంగా 'ప్రకాశిస్తుంటాను. అయినప్పటికీ నా అసలు రూపానికి హాని ఉండదు. అసాధ్యమైన దానిని సాధించటమే నా ఐశ్వర్యము. నేనే అన్నిటికీ మూలాధారము. నేను అన్నిటిలోనూ ఉన్నాను. కేవలము చిద్రూపిణిని, నా మాయచేతనే నన్ను తెలుసుకోలేక, అనాదినుండి జనన మరణరూపమైన సంసార సాగరంలో పడి, నీచ ఉచ్చజన్మలు ఎత్తుతూ, గురుశిష్యులుగా మారి, శిష్యరూపంలో గురువునుండి మళ్ళీ ఆ తత్త్వాన్ని తెలుసుకుని ముక్తిని పొందుతున్నాను.  
 
సంసార బంధము సత్యం కాదు. అందుచేత నేను నిత్యముక్తనే. అయినప్పటికీ ఎన్ని పర్యాయములో ముక్తి పొందుతున్నాను. కారణ సామాగ్రి లేకుండానే ఈ జగత్తును సృష్టిస్తున్నాను. నా ఐశ్వర్యము యొక్క అల్పాంశవల్లనే ఈ జగత్తు సత్యమైనట్లు గోచరిస్తున్నది.

4. జ్హానస్వరూపం : నా జ్ఞానం అనేక విధాలుగా ఉన్నది. ఉపాసనారూపము. ద్రైతరూపము, అద్వైతరూపము, అపరోక్షానుభవము, తనకన్న ఇతరమైన దేవత, మంత్రము ఏదో ఒకటి ఉన్నది అనుకోవటమే ద్వైతము. అదికూడా అసత్యమే. అయినప్పటికీ భగవంతుణ్ణి స్మరించినంత మాత్రం చేతనే ఫలితము వస్తుంది కాబట్టి అవికూడా ఫలితాన్నిస్తాయి. 
 
అయితే అన్ని ధ్యానాలలోకీ కామేశ్వరీ కామేశ్వర ధ్యానం శ్రేష్టమైనది. దీన్నే అపర(బ్రహ్మ ధ్యానం అంటారు. ఇది మోక్షసాధనం. నేనే శ్రీవిద్యను. నన్ను ధ్యానించనిదే అద్వైతాన్ని ఎవరూ పొందలేరు. 'ఆత్మ అంటే దేహం కాదు'*. అనే జ్ఞానం శాన్తాలవల్లగాని, తర్మంవల్లగాని కలగదు. అది కేవలము గురూపదేశం వల్లనే కలుగుతుంది. 
 
5, జ్ఞానానికి ఫలం : విజ్ఞానంవల్ల శారీరక, మానసిక దుఃఖాలన్నీ నశిస్తాయి. సుషుప్తిలో కూదా ఈ భావన కలుగుతుంది. కాని సుషుప్తి తరువాత మళ్ళీ దుఃఖం కలుగుతుంది. భయం కలుగుతుంది. అందుకే అది సమాధి స్టితి కాదు. సమాధిస్టితి కలిగిన తరువాత దుఃఖము, భయము ఉండవు. అద్వైతము పూర్తిగా తెలిస్తే ఇది పాము, ఇది తేలు అనే తేదాలుండవు. అద్వైతం అవిద్యను నాశనం చేస్తుంది. ఎప్పుడైతే అవిద్య నశించిందో, అప్పుడు ద్వైత భావాలు రావు. భయమనేది ఉండదు. ద్వైతాన్ని వదలివేయటమే మోక్షము. ఆత్మస్వరూపానికి వేరెనదంతా భయం కలిగిస్తుంది. సృష్టిలో ప్రతిదానికీ అంతమున్నది. ఏదైనా సరే పుట్టింది అంటే గిట్టకమానదు. అటువంటివే భయానికి హేతువులు. ఇవన్నీ అజ్ఞానం వల్లనే కలుగుతాయి. అద్వైతభావన వీటన్నింటినీ పొగొడుతుంది. ఎప్పుడైతే బంధనాలనుంచి విముక్తి లభించిందో, అదే ముక్తి మోక్షము అదే జ్ఞానానికి ఫలితము. 
 
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 TRIPURA RAHASYA - 64 🌹
🌻 THE MYSTERY BEYOND THE TRINITY 🌻
✍️ Ramanananda Saraswathi
📚 Prasad Bharadwaj

CHAPTER 15
🌴 Nature of the Self - 3 🌴

51-52. Just then, a female ascetic appeared in their midst, to whom the offended assembly looked for help. Encouraging them in their hopes, the charming maiden with matted locks and hermit’s clothes was highly honoured by the king and she spoke in sweet and yet firm tones: 

53. Oh child! Son of Kahoela! You are indeed very accomplished, for these Brahmins have been rescued by you after you defeated Varuni in debate.

54-56. I want to ask of you a short question, to which please give a straight answer, explicit and unreserved. What is that condition reaching which there will be all-round immortality; knowing which all doubts and uncertainties will disappear; and established in which all desires will vanish? If you have realised that unbounded state, please tell me directly. Being approached by the ascetic, the son of Kaheola replied with confidence: 

57-58. I know it. Listen to what I say. There is nothing in the world not known to me. I have studied all the sacred literature with great care. Therefore hear my answer. 

59-63 What you ask is the primal and efficient cause of the universe, being itself without beginning, middle or end, and unaffected by time and space. It is pure, unbroken, single Consciousness. The whole world is manifested in it like a city in a mirror. Such is that transcendental state. 

On realising it, one becomes immortal; there is no place for doubts and uncertainties, as there is none at the sight of a reflection in a mirror; there is no more reason for ignorance as at the sight of innumerable reflected images; and there will be no more room for desire, because transcendence is then experienced. It is also unknowable because there is no one to know it, besides itself. Ascetic! I have now told you the truth as contained in the scriptures. 

64-71. After Ashtavakra had finished, the hermit spoke again: Young Sage! What you say, is rightly said and accepted by all. But I draw your attention to that part of your answer where you admitted its unknowability for want of a knower outside of consciousness; and also that its knowledge confers immortality and perfection. 

How are these two statements to be reconciled? Either admit that consciousness is unknowable, is not known to you, and thus conclude its nonexistence; or say that it is, and that you know it — and therefore it is not unknowable. You evidently speak from second-hand knowledge, gathered from the scriptures. Clearly, you have not realised it and so your knowledge is not personal. 

Think now — your words amount to this: You have a personal knowledge of the images but not of the mirror. How can that be? Tell me now if you are not ashamed of this prevarication before King Janaka and his assembly. Being thus reprimanded by the ascetic, he could not speak for some time because he felt mortified and ashamed; so he remained with bent head thinking it over. 

72-73. However, the Brahmin youth could not find any satisfactory answer to her question, so he submitted to her in great humility: O Ascetic! Truly I cannot find the answer to your question. I submit to you as your disciple. Pray tell me how the two scriptural statements are to be reconciled. But I assure you that I have not told a deliberate lie, for I know that any merits a liar may have are counteracted by his lies so that he is condemned as unworthy.

74. Thus requested, the ascetic was pleased with Ashtavakra’s sincerity and said to him, in the hearing of the assembly:

75. Child, there are many who being ignorant of this sublime truth, live in a state of delusion. 

Continues.....
🌹 🌹 🌹 🌹 🌹