త్రిపురా రహస్యము - 72 / TRIPURA RAHASYA - 72

Image may contain: 1 person, standing and outdoor
🌹. త్రిపురా రహస్యము - 72 🌹
🌻. స్వామి దత్తాత్రేయ  విరచిత ఆత్మ జ్ఞాన యోగము 🌻
✍️. బ్రహ్మ శ్రీ క్రోవి పార్థసారథి
📚. ప్రసాద్ భరద్వాజ
 
🌴. గ్రంధ సారాంశము - 1 🌴
 
గురుదేవా ! హేమాంగదుని సమాధానాలవల్ల వసుమంతుని సందేహాలన్నీ తీరినాయి. మరి పరశురాముడి సందేహాలు తీరినాయా ? ఆ తరువాత ఏం జరిగిందో వివరించండి అన్నాడు నారాయణభట్టు. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు. 
 
వసుమంతుని కథ విన్న తరువాత పరశురాముడు దత్తాశ్రేయుడితో “గురుదేవా ! మీరు చెప్పినదంతా నేను వూర్తిగా ఆకళింవు చేనుకున్నాను. నా సందేహాలు తీరిపోయినాయి. ఆ పరబ్రహ్మ తత్త్వం నాకు తెలిసింది. అన్నిటిలోనూ ఉన్నది నా ఆత్మయే. అయినా బాగా గుర్తుంచుకోటానికి మీరు చెప్పిన విషయ సారాంశము మళ్ళీ ఒక్కసారి వినిపించండి” అన్నాడు. ఆ మాటలు విన్న దత్తాత్రేయుడు చెప్పటం ప్రారంభించాడు. 
 
“పరశురామా !” చిద్రూపమైన ఆత్మే నేను” అనుకుంటున్నావు కదా ! ఆ చిద్రూపమే -' పరమేశ్వరి. అందరికన్న అధికమైనది. సంపూర్ణమైనశక్తి కలది. స్వాతంత్ర్యము గలది. ఆమెనే పూర్జాహంతారూపిణీ అంటారు. ఆంతటా వ్యాపించి ఉంటుంది. అమెయే 'పరా' అంటే తనకన్న అధికమైనదేదీలేనిది. ఈ పరాచితి దుర్హటైక విధాయిని. అంటే ఘటనాఘటన సమర్భురాలు. 
 
సృష్టికాలంలో ఆ పరాచితి తనను తాను రెండుగా విభజించుకున్నది. అవే ప్రకృతి పురుషులు, శివశక్తులు ఆ శక్తిస్వరూపమే మాయ. 

ఈ మాయవల్లనే త్రిమూర్తులు ఆవిర్భవించి ఈ జగత్తును సృష్టించారు. వీరిలో బ్రహ్మ - సృష్టికర్త, విష్ణువు - స్థితికారకుడు రుద్రుడు - లయకారకుడు. ఈ జగత్తు అంతా నిజానికి అద్దంలో కనిపించే ప్రతిబింబం లాంటిది. అసలు ఈ జగళత్తే లేదు. అద్దంలో కనిపించే ప్రతిబింబము అద్దము వేరు కానట్లే, ఈ జగత్తు పరమాత్మ కన్న వేరు కాదు. 
 
ఈ రకంగా ఆ పరాచితి సదాశివుడు మొదలుకొని 84 లక్షల జీవరాసులతో కూడినట్టి ఈ చరాచర జగత్తుగా భాసిస్తున్నది. రామా ! నీకు దేహంలో అహం అనే భావన ఉన్నది. అయినా వివిధ ఇంద్రియాలతో వివిధ వ్యాపారాలు సాగిస్తున్నావు. 

అలాగే పరాచితి తాను పూర్ణాహంతకు ఆశ్రయమైనప్పటికీ పిపీలికాది బ్రవ్మ పర్యంతము ఉన్న అపూర్ణావాం భావాలకు ఆశ్రయంగానే ఉన్నది. తాను సంపూర్ణ జ్ఞాన స్వరూపమే అయినప్పటికీ, పరిచ్చిన్న జ్ఞానాలు అన్నీ తనను ఆశ్రయించే ఉంటాయి. 
 
రామా ! నువ్వు దేహాత్మ బుద్ధితో ఉన్నప్పుడు, దేహరూపంతో రూపరసగంధాలను గ్రహించలేవు. అయినప్పటికీ ఇంద్రియాలతో తాదాత్వం పొందినప్పుడు రూపాదులను గ్రహించగలవు. అదే విధంగా పరమేశ్వరుడుకూడా బ్రహ్మము మొదలు స్తంభము వరకు గల పదార్దాలతో అభిన్నుడే అయినా, బ్రహ్మాదుల శరీరాలతో తాదాత్మ్యం పొందినప్పుడు అన్ని పనులు చేస్తాడు. ఆ దేహాలలో ఉండి వారి పనులు చేస్తాడు. 
 
నువ్వు సహజంగా నిర్వికల్పమైన చిద్రూపుడవు. అయినా ప్రతిబింబాలను పోలిన దేహేంద్రియాలకు ఆశ్రయంగా ఉన్నావు. 

అలాగే ఆ పరాచితి సర్వాంతర్యామి. అందుచేత ఏ పనీ చెయ్యదు. ఈ జగత్తంతా ఆమెలోనే లీనమై ఉన్నది. ఆ పరాచితి అందరూ అనుభవించే ఆనందాల పెద్దముద్ద. అందుకే అందరూ ఆ ఆనందాన్నే కోరతారు. ఆనందమే ఆమె స్వరూపం, అదే ఆత్మ స్వరూపం కూడా, 
 
ప; జనులు దేహము, స్తీ, ధనము మొ॥ వాటిని కోరుతున్నారు మరి అవి కూడా ఆత్మ అవుతాయా 
 
ద: దేహము, స్రీ, ధనము. వీటిని ఆత్మసుఖం కొరకు కోరుతున్నాము. వాటికోసం వాటిని ప్రేమించటం లేదు, ఒకవేళ దేహాన్నే కోరితే స్వర్గసుఖాల కోసం ఉపవాసాలెందుకు చేస్తాం ? సుఖరూపమైన ఆత్మని కోరతాం. ఆత్మ కోసమే మిగిలినవన్నీ మనకు ప్రియమవుతున్నాయి. 
 
ప: స్త్రీ, ధనము మొదలైన సుఖాలు ఆత్మకన్న భిన్నంగా భోగ్యాలుగా కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు అవి భోక్త అయిన ఆత్మ స్వరూపమే అనటం ఎలా కుదురుతుంది ? 
 
ద: ఆకాశానికి కదలిక లేదు. అయినా ఒక కుండను తీనుకు వెడుతుంటే అందులో అకాశం కదిలి వెడుతున్నట్లు కనిపిస్తుంది. చిదాత్మ మనకు జ్ఞేయం కాదు. అది స్పష్టంగా కనపడదు. శరీరాలతో పరిచ్చిన్నమైనప్పుడు ఆ ఆత్మయే వేద్యమవుతుంది. అలాగే అభోగ్యం అయిన ఆత్మేసుఖం స్త్రీ, ధనాదిరూపమైన ఉపాదులతో పరిచ్చిన్నమైనప్పుడు ఆ ఉపాదులవల్ల అది భోగ్యంగా కనిపిస్తుంది. 
 
ప; ఆత్మసుఖాన్ని కోరుతుందే కాని దుఃఖాన్ని కోరదు అనటానికి ప్రమాణం ఏది? 
 
ద: ఆనందము అంటే స్త్రీ సుఖం కాదు. భోగభాగ్యాలు అంతకన్నా కాదు. అది అత్మానందం. 
 
ప: ఆత్మస్వరూపమే సుఖమైతే, ఆత్మ ఎప్పుడూ ఉండేదే కదా ? మరి ఆ సుఖం ఎప్పుడూ ఎందుకు దొరకదు ? 
 
ద: శరీరంలోని షట్చక్రాలలో ధ్వని ఉంది. అయినా బాహ్యధ్వనుల మూలంగా దాన్ని వినలేకపోతున్నాం. అదే చెవులు మూసుకున్నప్పుడు దాన్ని వినగలం. అలాగే దైనందిన కార్యకలాపాల్లో అనేక కోరికలు, కర్తవ్యాలు, వాసనలు, దుఃఖాలు ఉన్నాయి. వీటి మూలంగా ఆత్మసుఖాన్ని పొందలేము. అదే సుషుప్తి లేక సమాధిస్థితిలో ఆ సుఖాన్ని పొందగలుగుతాము. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 TRIPURA RAHASYA - 72 🌹
🌻  THE MYSTERY BEYOND THE TRINITY 🌻
✍️  Ramanananda Saraswathi
📚  Prasad Bharadwaj

CHAPTER 17
🌴 On the Uselessness of Fleeting Samadhis and the Way to Wisdom - 2 🌴

19-23.  The Brahmin youth asked further: O King, why are not all liberated if their lives are so iridescent with momentary  samadhi, if it be the enlightener of the unmanifest void in sleep? Liberation is the direct result of unqualified  samadhi.  The Self being pure intelligence, why does it not recognise itself and remain always liberated? Ignorance is dispelled by pure intelligence, which is samadhi, and this is the immediate cause of salvation. Please tell me, so that all my doubts may be set at rest.

The king replied as follows: 

24-26. I will tell you the secret.  The cycle of births and deaths is from time immemorial caused by ignorance, which displays itself as pleasure and pain, and yet is only a dream and unreal. Being so, the wise say that it can be ended by knowledge. By what kind of knowledge? Wisdom born of realisation (viz., ‘I am  That’).

[Commentary:  An aspirant for wisdom first turns away from the pleasures of life and absorbs himself in the search for knowledge, which he learns from a Master.  This is hearsay knowledge. In order to experience it, he ponders over it and clears his doubts.  Then he applies the knowledge to himself and tries to feel his immortal being, transcending the body, mind, etc.; he succeeds in feeling his Self within. Later he remembers the Vedic teaching imparted by his Guru that the Self being unqualified, cannot be differentiated from God and experiences his unity with the Universal Self.  This is in short the course of wisdom and liberation.]

 27-29. Ignorance cannot be expelled by means of knowledge devoid of thoughts, for such knowledge is not opposed to anything whatsoever (including ignorance). Knowledge devoid of thoughts is like the canvas used in painting; the canvas remains the same whatever picture may be painted on it. Unqualified knowledge is simple light; the objects are manifest by and in it. 

[Commentary:  The mirror is clear and uniform when there are no objects to reflect; the same appears variegated by images reflected in it. So also the Self is pure intelligence and clear when not contaminated by  thoughts.  This state is called  nirvikalpa. When soiled by thoughts, it is savikalpa.] 

30. Ignorance is only that knowledge which is called savikalpa  (with thought) and nothing else.  That (ignorance) exists in many ways in the form of cause and effect.  (For ignorance is only the original contamination, i.e. cause, continuing as effect).

 [Commentary:  Pure  intelligence (God) in His insentient aspect functions as  Maya  or the self-contained  entity, projecting ignorance as creation.]

31-34.  The casual ignorance is said to be of the nature of absence of knowledge of the wholeness of one’s  own Self.  The Self that is Consciousness should only be whole on account of the exclusion of limitation. For,  it is that which brings about time and the rest which are the causes of limitation.  That kind of knowledge of the Self which exists as the non-wholeness (of the Self) can alone be the causal ignorance of the nature of ‘I exist here at this time’. That is the embryonic seed from which shoots forth the sprout of the body as the individualised self (growing up into the gigantic tree of the cycle of births and deaths). 

The cycle of births and deaths does not end unless ignorance is put to an end.  This can happen only with a perfect knowledge of the Self, not otherwise. 

35-38. Such wisdom which can destroy  ignorance is clearly of two sorts; indirect and direct. Knowledge is first acquired from a Master and through him from the scriptures. Such indirect knowledge cannot fulfil the object in view.  Because theoretical knowledge alone does not bear fruit; practical knowledge is necessary which comes through  samadhi  alone. Knowledge born of  nirvikalpa samadhi  generates wisdom by the eradication of ignorance and objective knowledge.

Continues...
🌹 🌹 🌹 🌹