త్రిపురా రహస్యము - 68 / TRIPURA RAHASYA - 68
🌹. త్రిపురా రహస్యము - 68 🌹
🌻. స్వామి దత్తాత్రేయ విరచిత ఆత్మ జ్ఞాన యోగము 🌻
✍️. బ్రహ్మ శ్రీ క్రోవి పార్థసారథి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. బ్రహ్మ రాక్షసుడు - 2 🌴
ఆ చెట్టు దగ్గరకు రాగానే రుక్మాంగదుణ్ణి తనతో వాదించి గెలవమన్నాడు బ్రవ్మారాక్షస రూపంలో ఉన్న వసుమంతుడు. సహజంగానే పండితుడైన రుక్కాంగదుడు వాదనకు దిగాడు. కాని అతని కుతర్మం ముందు నిలవలేక ఓడిపోయాడు. ఓడిపోయినవాణ్ణి చంపి తినటం ఆ రాక్షసుని ఆచారం. అందుకని రుక్నాంగదుడ్ని తినటానికి ఉపక్రమించాడు.
అప్పుడు అతని తమ్ముడే హేమాంగదుడు రాక్షసుణ్ణి వారించి మేమిద్దరం కలిసి నీతో వాదనకు వచ్చాం. ఒకడు ఓడిపోయాడు అంటే సగం ఓడినట్టు, అంతేకాని పూర్తిగా కాదు. నన్ను కూడా ఓడించి మా ఇద్దరినీ కలిపి భక్షించు అన్నాడు. దానికి రాక్షసుడు దొరికిన ఆహారం పోతుంది కాబట్టి ఒప్పుకోలేదు. చివరకు తను అడిగిన ప్రశ్నలకు హేమాంగదుడు గనక సమాధానం చెప్పగలిగితే, అతడి అన్నను చంపకుండా వదిలేస్తాను అన్నాదు. సరే అన్నాడు హేమాంగదుడు.
ప్రశ్నలు అడగటం ప్రారంభించాడు రాక్షసుని రూపంలో ఉన్న వసుమంతుడు.
1. రా: ఆకాశం కన్న విశాలమైనది, పరమాణువుకన్న సూక్ష్మమైనది ఎది ?
హే: బ్రహ్నరూపమైన సామాన్యచైతన్యము
2. లా: దాని స్వరూపమేది ?
హే: స్పురణ
3. రా; అది ఎక్కడ ఉంటుంది.
హే : తనలోనే, తన స్వరూపంలోనే
4. రా: ఒకే వస్తువు అతి విశాలము, అతిసూక్ష్మము ఎలా అవుతుంది.
హే: అన్నిటికీ ఉపాదాన కారణము. అన్నింటా వ్యాపించి ఉంటుంది కాబట్టి అతివిశాలము గ్రహించటానికి వీలులేనిది కాబట్టి అతిసూక్ష్మము
5. అరా; స్పురత్వమంటే ఏమిట్ ?
హే: చైతన్యము
6. రా: ఆత్మ అంటే ఏమిటి ?
హే: చిన్నాత
. రా: చైతన్యం ఎక్కడ ఉన్నది ?
హే; బుద్దిలో
8. రా; దాన్ని పొందటానికి సాధనమేమిటి ?
హీ: ఏకా(గచిత్తము
9. రా: దానిని పొందితే కలిగే ఫలితమేమిటి ?
హే: జన్మరాహిత్యము
10. రా: బుద్ది అంటే ఏమిటి ?
హే: అవ్యక్తమనే జడశక్తి ఆవరించిన చైతన్యము
11. రా: దాని ఏకాగ్రత అంటే ఏమిటి ?
హే : దృశ్యానికి విముఖ్యమై, స్వాత్మలో విశ్రమించటము.
12, రా: జన్మ అంటే ఏమిటి ?
హే: దేహమే ఆత్మ అనే బుద్ధి
18. రా: వైతన్యప్రాప్తి ఎందుకు కలగటం లేదు ?
హే: అవివేకం వల్ల
14. రా: దేనితో చైతన్యం పొందవచ్చు ?
హే: ఆత్మతో
15. రా: దేహాత్మరూపమైన జన్మ ఎందుకు కలుగుతుంది ?
హే: కర్శృత్వాఖిమానంవల్ల
16. రా; అవివేకం అంటే ఏమిటి ?
హే; దేహమే ఆత్మ అనే భావం
17. రా: ఆత్మ అంటే ఏమిటి ?
హే: నీ స్వరూపమే ఆత్మ
18. రా: కరత్వాభిమానమంటే ఏమిటి ?
హే: నేనే కర్తను అనే అభిమానము.
19. రా; అవివేకం దేనితో నశిస్తుంది ?
హే: ఆలోచనతో
20. రా: ఆలోచన ఎలా కలుగుతుంది ?
హే: వైరాగ్యంతో
21. రా: వైరాగ్యానికి కారణం ఏమిటి ?
హే: విషయాలయందు దోషదృష్టి
22. లా; విచారమంటే వమిటి ?
హే: జిజ్ఞాసతో కూడిన దృక్, దృశ్యాల పరిక్ష
23. రా; వైరాగ్యమంటే ఏమిటి ?
హే: దృశ్యముల యందు రాగాన్ని వదలటం
24. రా; దోషదృష్టి అంటే ఏమిటి ?
హే: దృశ్యమే దుఃఖ సాధనమని తెలుసుకోవటం
25. రా: దేనివలన ఇవి కలుగుతాయి ?
హే: దేవతానుగ్రహంవల్ల
26. రా; దేవతానుగ్రహం దేనివల్ల కలుగుతుంది ?
హే : భక్తివల్ల
27. రా: భక్తి ఎందుకు కలుగుతుంది ?
హీ: సత్సంగంవల్ల
28. రా: దేవత ఎవరు?
హే: జగత్తును నియమించే పరాచితి
29. రా: భక్తి అంటే ఏమిటి ?
హే: త్రికరణాలను దేవతపై లగ్నం చెయ్యటం
30. రా: సత్పురుషులు ఎవరు?
హే; శాంతము, దయగలవారు
31. రా: లోకంలో ఎప్పుడూ భయంతో ఉండేవాళ్ళు ఎవరు ?
హే: ధనవంతులు
32. రా: ఎప్పుడూ దుఃఖించే వారెవరు ?
హే: పెద్దకుటుంబీకులు
33. రా; ఎప్పుడూ దీనంగా ఉండేవారెవరు ?
హే: ఆశగలవారు
34. రా:;భయం లేని వాడెవరు ?
హీ; సంఘ రహితుడు
35. రా; దుఃఖం లేనివాదెవరు ?
హే: మనసును జయించినవాడు
36. రా: దీనుడు కాని వాడెవడు ?
హే: జ్ఞాని
37. రా: ఎవరిని లోకంలో గుర్తించలేము ?
హే : జీవన్ముక్తుని
38. రా: విదేహుదైనా కనపడే వాడెవరు ?
హే: జీవన్ముక్తుడు
39. లా: నిష్కియుదైనా సక్రియుడెవరు ?
హే : జీవన్ముక్తుడు
40. రా: ఉన్నదేది ?
హే: దృక్కు
41. రా: లేనిదేది ?
హే: దృశ్యము
42, రా: అత్యంతము అసంభవమేది ?
హే: లోకవ్యవహారము. దృశ్యమే లేదు కాబట్టి దృశ్య వ్యవహారం కూడా లేదు.
ఈ రకంగా రాక్షసుని ప్రశ్నలన్నింటికీ హేమాంగదుడు సమాధానం చెప్పాడు. ఆ సమాధానాలు విన్న వసుమంతుడికి శాపవిమోచనం జరిగింది. అని దత్తాత్రేయుడు చెప్పాడు అంటూ ఇరవై ఒకటవ అధ్యాయాన్ని పూర్తి చేశాడు రత్నాకరుడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 TRIPURA RAHASYA - 68 🌹
🌻 THE MYSTERY BEYOND THE TRINITY 🌻
✍️ Ramanananda Saraswathi
📚 Prasad Bharadwaj
CHAPTER 16
🌴 On Consciousness, Control of Mind, and Sleep - 3 🌴
35-45. Even the learned are perplexed on this point. External perceptions of the mind are dependent on two conditions. The first is elimination of other perceptions and the second is fixation on the particular item of perception. If the mind is simply turned away from other perceptions, the mind is in an indifferent state, where there is absence of any kind of perception. Therefore concentration on a particular item is necessary for the perception of external things. But since consciousness is the Self and not apart from the mind, concentration on it is not necessary for its realisation. It is enough that other perceptions (namely, thoughts) should be eliminated from the mind and then the Self will be realised.
If a man wants to pick out one particular image among a series of images passing in front of him, as reflections on a mirror, he must turn his attention away from the rest of the pictures and fix it on that particular one.
If on the other hand, he wants to see the space reflected, it is enough that he turns away his attention from the pictures and the space manifests without any attention on his part, for, space is immanent everywhere and is already reflected there. However it has remained unnoticed because the interspatial images dominated the scene.
Space being the supporter of all and immanent in all, becomes manifest if only the attention is diverted from the panorama. In the same way, consciousness is the supporter of all and is immanent in all and always remains perfect like space, pervading the mind also. Diversion of attention from other items is all that is necessary for Selfrealisation. Or do you say that the Self-illuminant can ever be absent from any nook or corner?
46. There can indeed be no moment or spot from which consciousness is absent. Its absence means their absence also. Therefore consciousness of the Self becomes manifest by mere diversion of attention from things or thoughts.
47. Realisation of Self requires absolute purity only and no concentration of mind. For this reason, the Self is said to be unknowable (meaning not objectively knowable).
48. Therefore it was also said that the sole necessity for Self-realisation is purity of mind. The only impurity of the mind is thought. To make it thought-free is to keep it pure.
49. It must now be clear to you why purity of mind is insisted upon for Realisation of Self. How can the Self be realised in its absence?
50-51. Or, how is it possible for the Self not to be found gleaming in the pure mind? All the injunctions in the scriptures are directed towards this end alone. For instance, unselfish action, devotion and dispassion have no other purpose in view.
52. Because transcendental consciousness, viz., the Self, is manifest only in the stain-free mind. After Janaka had spoken thus, Ashtavakra continued to ask:
53-54. O King, if it is as you say that the mind made passive by elimination of thoughts is quite pure and capable of manifesting Supreme Consciousness, then sleep will do it by itself, since it satisfies your condition and there is no need for any kind of effort.
55. Thus questioned by the Brahmin youth, the king replied: I will satisfy you on this point. Listen carefully. 56-63. The mind is truly abstracted in sleep. But then its light is screened by darkness, so how can it manifest its true nature? A mirror covered with tar does not reflect images, but can it reflect space also? Is it enough, in that case, that images are eliminated in order to reveal the space reflected in the mirror? In the same manner, the mind is veiled by the darkness of sleep and rendered unfit for illumining thoughts. Would such eclipse of the mind reveal the glimmer of consciousness?
Continues....
🌹 🌹 🌹 🌹 🌹