సాయి తత్వం - మానవత్వం - 59 / Sai Philosophy is Humanity - 59
🌹. సాయి తత్వం - మానవత్వం - 59 / Sai Philosophy is Humanity - 59 🌹 🌴. అధ్యాయము - 8 🌴 📚. ప్రసాద్ భరద్వాజ 🌻. బాయి జాబాయ యొక్క ఎవలేని సేవ 🌻 1. తాత్యాకోతే పాటీలు తల్లి పేరు బాయజాబాయి. ఆమె ప్రతిరోజు మధ్యాహ్నము తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకొని, సమీపముననున్న చిట్టడవిలో ముండ్లు పొదలు లెక్కచేయక క్రోసులకొద్ది దూరమునడచి, ఆత్మధ్యానములో నిశ్చలముగ యెక్కడో కూర్చునియున్న బాబాను వెదకి పట్టుకొని, భోజనము పెట్టుచుండెను. 2. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి, వారి యెదుట విస్తరొకటి వేసి తాను తెచ్చిన రొట్టె కూర మొదలగు భోజన పదార్థములను వడ్డించి, కొసరికొసరి వాటిని బాబాచే తినిపించుచుండెను. 3. ఆమె భక్తివిశ్వాసములు అద్భుతమైనవి. ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరువలేదు. 4. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడగు తాత్యాపాటీలును యెంతో ఆదరించి ఉద్ధరించెను. ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసముండెను. 5. కొన్ని సంవత్సరముల తదుపరి బాబా యడవులకు బోవుట మాని మసీదులోనే కూర్చుండి భోజనము చేయసాగిరి. 6. అప్పటినుంచి పొలములో తిరిగి బాబాను వెతకిపట్టుకొను శ్రమ బాయజాబాయికి తప్పినది. సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 🌹....