శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 229 / Sripada Srivallabha Charithamrutham - 229
🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 229 / Sripada Srivallabha Charithamrutham - 229 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయం 43
🌻. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళీ, రాజరాజేశ్వరీ - 2 🌻
ఇక సరస్వతిమాతను ఉపనిషత్తులలో ఉద్గీత అని దశమహా విద్యలలో మాతంగి అని వర్ణించారు. అయితే దివ్యనైపుణ్యానికి, ఆత్మ చైతన్యకర్మలకు మహాసరస్వతి ప్రతీక.
ఈ మహాతల్లి అనుగ్రహం వలన మనకు కర్మలను నిర్వహించడంలో నేర్పు వస్తుంది, దివ్య ఙ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో, ఆత్మ చైతన్యాన్ని జీవితానికి ఎలా అన్వ యించాలో, అనేక శక్తుల సామరస్యత వలన సంతోషం ఏ రకంగా కలుగుతుందో తెలుస్తుంది.
అనఘాలక్ష్మిలో రాజ రాజేశ్వరి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలు పరిపూర్ణంగా ఉంటాయి. రూపం లక్ష్మిలా ఉంటుంది. అలాగే అనఘుని రూపం విష్ణువులా ఉండి, ఆయనలో త్రిమూర్తుల లక్షణాలు పరిపూర్ణంగా ఉంటాయి.
కాబట్టి అనఘా సమేత అనఘుని ఆరాధించడం సర్వ శ్రేయోదాయకం. వివిధ దేవతలను ఆరాధించడం వల్ల సర్వశుభాలు కలుగుతాయి. అయితే దత్తారాధనవల్ల ఆయా దేవతలిచ్చే శుభఫలాలు తొందరగా కలుగుతాయి.
దత్తుడు సర్వదేవతా స్వరూపుడు, అవతార సమాప్తిలేని మహా అవతారం అవడంవల్ల ఇది సాధ్యం అవుతుంది," అని వివరించి సుఖం, హర్షం, పార వశ్యం, ఆనందం ఇవి వేరు వేరు భావాలని, ఆనందం ఆధ్యాత్మికమైనదని, అది పరమేశ్వరునికి సంబంధించిన విషయం అని,
పారవశ్యం యోగికి కలిగే అనుభవమని, కోరికలు లేనివారికి కలిగేది హర్షం అని, స్థూలంగా చూస్తే సుఖం భౌతికమైనది అని, సాధారణంగా సుఖం అందరికి అందుబాటులో ఉంటుందని కాని సుఖంయొక్క నిర్వచనం వ్యక్తులను బట్టి మారుతుంటుందని, సుఖంతోపాటు దుఃఖం అనివార్యమని చెప్పారు.
తరువాత నన్ను ఉద్దేశించి, "నాయనా! శంకరభట్టూ! నీవు వ్రాయబోయే గ్రంథం శాశ్వతమైన, అనశ్వరమైన గురుసార్వభౌముల తత్వాన్ని, లీలలను యధాతధంగా చిత్రించే గ్రంధం.
దీన్ని భక్తి, శ్రద్ధలతో ఏ భాషలో చదివినా ఒకే రకమయిన చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఇందులోని ప్రతి అక్షరం బీజాక్షర శక్తిని కలిగి ఉంటుంది," అని నేను వ్రాయబోయే శ్రీచరణుల చరితామృత విశిష్టతని అభివర్ణించారు.
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sripada Srivallabha Charithamrutham - 229 🌹
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj
Chapter 24.
🌻 Explanation of Ardhanareeswara Tatwam - 3 🌻
Yogi, by doing sadhana with breath in his body will get the siddhi of everything in the kaala chakra. He will get the knowledge of everything in the past, present and future.
One should understand this kaalachakra as the Ardhanareeswara tatwa and as a couple who can never be separated. The day and night; the pournami and amavasya will be appearing one after the other.
One is the basis for the other. There can not be day without night and night without day. The Ardha Nareeswaras called mothers and fathers are becoming the cause for the running of this creation.
The inner meaning, of saying that Siva is the cause of destruction, is that old creation goes and new creation comes. While changes are occurring in this creation naturally, creation of new things, their presence for sometime, and their destruction are inevitable.
To get siddhi of all the astras, shastras and mantras mentioned in the Adharvana Veda, one should have the grace of Eesana Rudra who is the head of these ‘astra, shastra vidyas’.” I prayed Sri Dharma Gupta to explain the close relationship between Arudra Star and Siva Parvathi.
Sri Dharma Gupta said, ‘Siva gives darshan as hunter Rudra who holds his bow and arrow aiming a running antelope. He appears in Arudra star in that form in the sky. He looks like a hunter.
🌻 The influence of the movement of Planets 🌻
This form of hunter Rudra appears in the constellation of stars across the Midhuna and Karkataka Rasis in one corner. When the cruel planets Shani, Kuja and Rahu move close to this constellation of stars, wars spreading across the globe and ‘pralayas’ happen.
The wars between Gods and Demons; and the Maha Bharatha war occurred due to such positions of stars only.
Vedas described the destroyer of kaala as fierce Rudra wearing bow and arrow in the form of ‘Manyu’ devatha. That Rudra murthi’s weapon is not Trishul. It is Dhanush only.
In the month of Maagha, the Chaturdasi (14th day) before Amavasya is called Maha Siva Rathri. Every week, the Chaturdasi that comes before Amavasya is called Maasa Siva Rathri.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹