శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 230 / Sripada Srivallabha Charithamrutham - 230
🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 230 / Sripada Srivallabha Charithamrutham - 230 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయం 44
🌻. స్వర్ణపీఠికాపుర వర్ణన. 🌻
భాస్కర పండితులు తిరిగి వివరించసాగారు :
శ్రీపాదులవారు పీఠికాపురాన్నీ, తాము సంచరించిన ప్రాంతాలనూ జాగృతపరచి, భూచైతన్యాన్ని ముందుకు తీసుకు వెళ్ళడానికి... పృధ్వీతత్త్వ యజ్ఞం ప్రారంభించారు.
దీనివలన అక్కడి భూమి జాగృతమై ప్రజలు అక్కడకు ఆకర్షింపబడతారు. అంతే కాకుండా వారిలో గల శబ్ద, స్పర్శ, రూప, రస, గంధమైన భూతత్త్వం కూడా శుద్ధి చేయబడుతుంది.
భౌతిక పీఠికాపురము,భౌతిక కాశి ఎలా ఉన్నాయో... అలాగే స్వర్ణపీఠికాపురం, స్వర్ణ కాశీ అనేవి... చైతన్యంతో నిర్మించబడి ఉంటాయి. సాధకుడిలో ఆ చైతన్యానికి సంబంధించిన పదార్థం నిర్మించ బడినప్పుడు... అతడు స్వర్ణపీఠికాపురవాసి, స్వర్ణకాశివాసి అవుతాడు.
🌻. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు పంచకోశాలు. 🌻
మన చైతన్యం ఈ పంచకోశాల యాత్రను చేయడమే '' పంచకోశయాత్ర " అవుతుంది. శ్రీపాదులవారి అనుగ్రహంతో సాధకుడికి పంచకోశయాత్ర చేయగలిగే శక్తి లభిస్తుంది.
అందువల్లనే వారు పంచమహా యజ్ఞాలనూ వారి యోగశక్తితో నిర్వహించడానికి ప్రతీకగా, కురుంగడ్డ సమీపంలోని పంచదేవపహాడ్ లో దర్బారు నిర్వహించారు. పుణ్య నదులన్నీ పాపులైన మానవుల వల్ల అపవిత్రం అయినప్పుడు, మహాపురుషులు స్నానం చేయడం వల్ల తిరిగి పుణ్యవంతం అవుతాయి.
అంతేకాకుండా మానవులలో రస స్వరూపంలో ఉన్న జలతత్త్వం శుద్ధి చేయడానికి జల యజ్ఞాన్ని చేయాలని సంకల్పించి, ప్రతిరోజూ గంగానదిలో స్నానం చేయదలిచారు. వారి అవతారం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.... మహా యోగులనూ, సిద్ధులను అనుగ్రహించి, వారి ద్వారా ధర్మాన్ని ఉద్ధరించడం.
శ్రీపాదులవారు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు ఒక సన్నాసి కుక్కుటేశ్వరాలయంలో ధ్యానంలో ఉండగా, అతనిని తీక్షణంగా చూసి అతడు అంతర్ముఖుడు అయ్యేటట్లు చేశారు.
అప్పుడు అతడు తన రక్తంలో కూడా చిన్న చిన్న చేపలను పోలిన కణాలు ఉన్నట్టు, మూలాధారం
దగ్గర ఉన్న వాసనలను గ్రహించే కణాలు కూడా చేప ఆకారంలోనే ఉన్నట్టు తెలుసుకుని
మత్స్యావతార ప్రక్రియ యొక్క అంతరార్థాన్ని గ్రహించాడు.
మూలాధారం దగ్గర ఉన్న కణాలను
గురించి జ్ఞానం కలిగితే సర్వ వాసనలను నియంత్రించగలిగే శక్తి కలుగుతుంది. పరాశర మహర్షి మత్స్యగంధిని యోజన గంధిగా మార్చిన యోగ ప్రక్రియ కూడా ఇదేనని గ్రహించాడు.
శరీరంలోని అనుభూతులన్నీ సువాసనా భరితంగా మారినట్లైతే, భౌతికంగా కూడా సువాసనలు
వెదజల్లబడతాయి. ఆ రకంగానే పతివ్రతలు సువాసినులు అవుతారని తెలుసుకున్నాడు.
కూర్మం తన డిప్పలో శిరస్సును దాచుకున్నట్టు, మహాయోగి అంతర్ముఖుడై యోగాలను
చేసి, కర్మ బంధం నుండి విడుదల పొందుతాడని కూర్మావతారాన్ని గురించి కూడా శ్రీపాదులవారు ఆ సన్యాసికి తెలియజేశారు అని భాస్కర పండితులు వివరించారు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sripada Srivallabha Charithamrutham - 230 🌹
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj
Chapter 24
🌻 The influence of Shani is removed as a result of worshipping Siva at Shani Pradosha time 🌻
When Mahasivarathri comes on a Tuesday (Mangal vaaram) it is very important. When Triodasi (thirteenth day) comes on Saturday, it is called Shani Triodasi.
To avoid the problems that occur due to Shani, one should do Siva worship on ‘Shani triodasi’ day and give donation of ‘til’ (gilgelly) to please Shani. Siva is the supporting God for Shani. So if Siva is worshipped with gingelly oil, problem of Shani effect will be removed.
If Siva is worshipped at the ‘Pradosha time’ (evening sandhya time) all the faults in karma will vanish and people get happiness and peace.
Shani is responsible for doing karma. Siva is responsible for death. Any man who wants to burn away the different kinds of sins due to inauspicious karmas, should do Siva worship at Shani pradhosha time.
He will also get his body, mind, intellect, ego, inclination and atma purified with new auspicious divine glowing vibrations and get a new birth. Shani will be pacified in this way.
In the night on Saturdays the supporting Gods of all types of karma faults i.e. the unfortunate or unlucky powers in the black form remaining incognito and the great destructive powers, reside in ‘Maha Kaali’ who is the Shakti form of ‘Maha Kaala’.
On the next day, i.e. Sunday morning, that ‘Maha Shakti’ which pervades the ‘Savithri Mandalam’ (Bhanu Mandalam) will grace the sadhaka and he starts a new life.
The bundles of sinful acts which are inauspicious will get burnt in Parameswara’s ‘Yogaagni’.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹