శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 231 / Sripada Srivallabha Charithamrutham - 231

Image may contain: 1 person, text that says "నిరంతరము శ్రీపాదుల వారి స్మరణలోనూ. ధ్యాసలోనూ, ఉండెడి ఈ పరిసర ప్రాంగణమంతయునూ శుభప్రదములు పవిత్రములు అయిన దివ్యస్పందనలతో నిండియుండు......."
🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము  - 231  / Sripada Srivallabha Charithamrutham - 231 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయం 44
🌻. పృథ్వీ- జల యజ్ఞాల వివరణ 🌻

🌻. పృథ్వీ యజ్ఞం 🌻

ఆ మరునాడు స్నాన, సంధ్యాదులు ముగించాక మేము, త్రిపురాంతకేశ్వరుని ఆలయానికి వెళ్ళాము. అక్కడే భాస్కరపండితులు శ్రీపాదుల మహిమ గురించి వివరించడం మొదలు పెట్టారు,"

 నాయనలారా! శ్రీపాదులు పీఠికా పురంలో అవతరించడంవల్ల అక్కడ భూమి చైతన్యాన్ని పొందింది. వారి మహా సంస్థాన నిర్మాణం తరువాత మెల్లమెల్లగా అక్కడ భూమి జాగృతమై భూమండలాన్ని అంతా జాగృతం చేస్తుంది. 

ఇలా జాగృతమైన ప్రదేశాలలో ఉన్న జనులు శ్రీపాదుల దివ్యాకర్షణ శక్తి వల్ల పీఠికా పురానికి ఆకర్షింపబడుతారు. శ్రీచరణులు సంచరించిన ప్రదేశాలన్ని కూడా జాగృతిని చెందుతాయి.
 
వారి శరణాగతి లోకి వెళ్ళినవారు అప్రయత్నంగానే ఆయా స్థలాలకు ఆకర్షింపబడుతారు. ఇంతేకాదు, ప్రతి జీవిలోను పృథ్వీ తత్వం ఉంటుంది. ఏ సాధకుల పృథ్వీతత్వం వారి దివ్య కరుణవల్ల జాగృతం అవుతుందో వాళ్ళు తప్పకుండా ప్రభువులు సంచరించిన పీఠికాపురం, కురువపురం మొదలైన ప్రదేశాలకి ఆకర్షింప బడుతారు. 

"అయ్యా! పృథ్వీ తత్వం జాగృతం అయిన వారందరూ భౌతికంగా ఆయా ప్రదేశాలు దర్శిస్తారా?" అని నేను నా సందేహాన్ని వ్యక్తం చేసాను. దానికి వారు నవ్వుతూ, “భౌతికంగా దర్శించినా, దర్శించ లేకపోయినా, సాధకుల పరిణతి స్థాయిని బట్టి వాళ్ళ చైతన్యం ఆయా ప్రదేశాలతో అనుసంధానం చెంది వాళ్ళు ఆ పురవాసులే అవుతారు. భౌతిక పీఠికాపురం వ్యాపించి ఉన్నంతమేరా స్వర్ణపీఠికాపురం ఉంది, ఇది కేవలం దత్తుని చైతన్యంతో నిర్మితమైనది. 

చెక్కు చెదరని భక్తి, శ్రద్ధలవల్ల ఏ క్షణాన సాధకుని చైతన్యం ఈ దివ్య చైతన్యంతో కలుస్తుందో ఆ క్షణంనుండి అతను స్వర్ణపీఠికా పురవాసే అవుతాడు. ఇది చర్మ చక్షువులకు కాక, ఙ్ఞాన చక్షువులకు, యోగ చక్షువులకు మాత్రమే కనిపిస్తుంది. 

అలాగే భౌతిక కాశి ఉన్నంతమేర స్వర్ణకాశి వ్యాపించి ఉంది, నేను కాశీకి వెళ్ళు తున్నాను, అక్కడే నివసిస్తాను అని ఎవరయితే దృఢంగా నిర్ణయం తీసుకొని మానసికంగా తాపత్రయపడుతారో వాళ్ళు భౌతికంగా ఎక్కడ ఉన్నా వాళ్ళకి కాశీవాస ఫలితం తప్పక లభిస్తుంది" అని విశదీకరించారు. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sripada  Srivallabha  Charithamrutham - 231 🌹
✍️  Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 24
🌻 Siva  in  the  form  of  ‘Pancha  Bhutas’ 🌻

The Pancha Bhutas (earth, water, fire, air and sky) are Siva’s forms. In our body, Pridhwi tatwam (earth) is present in Mooladhara. As a representative of that, sadhakas worship ‘Parthiva Lingam’. 

There is jala (water) tatwam in swadhisthana. Jala lingam represents that. Manipura chakram will have ‘agni tatwam’ and agni lingam represents it. 

Vishuddhi chakram has got Vayu (air) tatwam. Vayu lingam represents it. The one which is in heart, the place of ‘aakasa’ (sky) is called Chidambara lingam. This is called ‘aakasa lingam’ also and it has no form at all. The worship, darshan and propitiation of these ‘Pancha Bhuta’ lingas give great fruit. 

The Chidambara secret behind the screen in Chidambara kshetram is - there will be nothing if the screen is removed. The pure ‘aakaasa’ is Siva’s atma lingam. Hrudayam (heart) is the place of ‘chit’. So the aakaasa is the place of ‘atma’. 

Aakasa has no form. Yogis who concentrate their mind with unwavering looks in dhyana for ‘self manifestation’, will have their ‘Hrudaya aakasam’ (the subtle sky in their heart) opened. 

They see in their hearts all this creation, all brahmandas, stars and starlets. ‘Runam’ means ‘sin’. The one having no ‘Runam’ is ‘Arunam’. Parameswara is ‘Daharaakaasa’. 

He is there in Arunachalam in the form of Arunachaleswara, the hill of ‘arunachala’ and in the form of a great siddha. His darshan will remove all sins. 

The same Arunachaleswara manifested now in human form in Peethikapuram in the form of Sripada Srivallabha and is at present staying with divine lustre in Kurungadda with the intention of uplifting us. Kurungadda is equal to Arunachala Hill. 

Sri Arunachaleswara who is in the form of Ardhanareeswara, is indeed Sripada Srivallabha. The Maha Siddha in Arunachala is also in the attire of ‘Yathiswara’. 

Just like the hill of Arunachala the form of Siva, the Kurungadda is indeed the form of Sripada. There are Siva and Shakti in Arunachala Siva lingam. Similarly Siva and Shakti are there in Sripada Srivallabha form. 

The darshan of Parameswara in the form of Maha Siddha in Arunachalam, is extremely difficult. But the darshan of Maha Siddha in Sripada Srivallabha form is extremely easy’. 

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹