శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 228 / Sripada Srivallabha Charithamrutham - 228
🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 228 / Sripada Srivallabha Charithamrutham - 228 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయం 43
🌻. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళీ, రాజరాజేశ్వరీ - 1 🌻
జగన్మాతయొక్క - మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళీ, రాజరాజేశ్వరీ మొదలైన నాలుగు రూపాలు విశ్వ పరిపాలన కోసం ఆవిర్భవించాయి. జగన్మాతకు 3 స్థాయిలు ఉన్నాయి:
1. అతీతస్థాయి, అంటే సృష్టి జరగడానికి ముందు ఉన్న స్థాయి, అవ్యక్తమైన స్థాయి;
2. విశ్వస్థాయి, అంటే సృష్టింపబడిన జీవులనందరిని తనలో వహిస్తున్న స్థాయి;
3. వ్యక్తిస్థాయిలో ఆమె మానవ వ్యక్తిత్వానికి, దివ్య ప్రకృతికి మధ్య మధ్యవర్తిగా ఉండి శీఘ్ర పరిణతికి ప్రేరణను, సహా యాన్ని అందచేస్తుంది. ఇదే అనఘాలక్ష్మి అవతరణలోని ముఖ్య ఉద్దేశం. ఈ తల్లి మూడు విభిన్న లోకాలలో మూడు విభిన్న భూమికలలో ఉంటుంది. పరార్ధగోళాలలో అనంతమైన స్థితి, శక్తి, ఆనందం నిండిన లోకాలున్నాయి.
ఇక్కడి జీవులు చక్కటి పరిపూర్ణతతో, ఏ మార్పులు లేని ఏకత్వంతో జీవిస్తుంటారు. ఇక్కడ ఆమెది విశ్వచైతన్య భూమిక, అంటే సత్, చిత్, ఆనందం, అంటే శాశ్వతమైన సత్యం, అఖండ ఙ్ఞానం, ఆనందం మిళితమైన భూమిక; ఈ లోకాలకు కింద స్థాయిలో దివ్యచైతన్య సృష్టికి చెందిన లోకాలున్నాయి.
ఇక్కడ అనఘాలక్ష్మి దివ్య చైతన్య మహాశక్తిగా ఉంటుంది. ఇక్కడ ప్రతి ప్రక్రియలో ఇచ్ఛా, ఙ్ఞాన శక్తులు ప్రయత్నం లేకుండానే పరిపూర్ణతను పొందుతాయి. అఖండమైన ఆనందమే తప్ప ఇక్కడ దుఃఖం, అసత్యం, బాధ అనేవే ఉండవు.
దీనికి కింద మన లోకంలో అఙ్ఞానభూమిక ఉన్నది. ఇక్కడి అనుభవాలన్ని అపరిపూర్ణతకు, వైఫల్యానికి, పరిమితులకు లోబడి ఉంటాయి, అని చెప్పి తరువాత జగన్మాత యొక్క నాలుగు రూపాలు, వాటిలోని బేధాల గురించి ఇలా చెప్పారు: "కాళీ అనేది విధ్వంసక శక్తి. కష్టాలు చుట్టు ముట్టిన సంఘర్షణలో ప్రతిదానిని ఛిన్నాభిన్నం చేస్తూ పోయే అఙ్ఞానంలోని ప్రకృతిశక్తి ఆమె. అయితే మహాకాళి ఉన్నత భూమికకు చెందినది.
ఆమె సాధార ణంగా బంగారు రంగులో కనిపిస్తుంది. ఆమె అసురులకు భయంకరి. రాజ రాజేశ్వరి వివేకానికి ప్రతినిధి అయితే మహాకాళి బలానికి, శక్తికి ప్రతినిధి. కాళిశక్తిలోని ప్రచండమైన తీవ్రత, ఆవేశం దైవం మీదనే కాలు మోపేంతవరకు వస్తే కాని తగ్గదు. సంఘర్షణ, వినాశంతో ఆమె ఆగిపోతుంది.
కాని మహాకాళి నిరోధక శక్తులను నాశనంచేసి సాధకుడు ప్రగతి మార్గంలో పయనించేలా తోడ్పడుతుంది. ఇక మహాలక్ష్మి పరిపూర్ణ మైన పరిపూర్ణతకు ప్రతీక, అంటే వివేకం, సౌందర్యం, బలం అన్ని సమ పాళ్ళలో పరిపూర్ణంగా ఉంటాయి.
మహాలక్ష్మి పరమప్రేమ, ఆనందాలకు అధిదేవత. లక్ష్మి భౌతిక వస్తు సంచయానికి మాత్రమే ప్రతీక. అయితే మహాలక్ష్మి భౌతిక వస్తు సంచయం, భౌతిక శక్తులు, భౌతిక జీవులు వీటిని దివ్యానంద సామరస్యానికి అనుకూలంగా మలిచి, దివ్య జీవనాన్ని ప్రసాదించగల మహాశక్తి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sripada Srivallabha Charithamrutham - 228 🌹
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj
Chapter 24.
🌻 Explanation of Ardhanareeswara Tatwam - 2 🌻
There is a sticky divine medicine called Shilajit. People who eat it will remain youthful always. In ancient times, Shilada Maharshi used to take stones as food and live. He only had manifested as Nandeeswar. Srikrishna was born in Rohini star in Vrishabha Rasi.
Arudra star is the place of Rudra. Midhuna rasi tells the ‘ardhanareeswara’ tatwa of Uma Maheswar. Before this rasi, Vrishabha rasi appears in the sky. That Vrishabham is Nandeeswar. Nandi indicates Dharma.
Siva burnt Manmadha the form of ‘kaama’ belonging to ‘basic prakriti’ (lust). Then Manmadha became a ‘Niraakaara’ (formless) which indicates the form of ‘kama’ belonging to dharma of ‘dampatya’ (wedlock) (higher prakriti).
Krishna joined as a disciple at Upamanya rishi and did ‘Siva’ upasana with great austerities. He got the grace of Siva and with Rukmini Devi, had a son by name ‘Pradyumna’.
This Pradyumna is the same as the Manmadha belonging to basic prakriti and got burnt by Siva. The Vrishabha is the place of Manmadha and ‘Kaama sthan’ (place of desires). All desires bound by dharma, belong to higher prakruthi.
To indicate that it is within dharma to have them fulfilled, ‘Vrishotsarjanam’ is done. The tantric siddhis and powers are horrible and dangerous like tigers. Siva kept them under His control. Tiger is the ‘vaahana’ (vehicle) of Shakti.
To indicate that He kept the Shakti under Him like wife, He wears the skin of a tiger. The most sacred Ganga in Siva’s jatajutam indicates pure Brahmajnanam, the constantly flowing ‘prajna’ (wisdom) and amrit siddhi (immortality).
The moon crecent indicates the most happiest blissful state caused by eternal peace. So the philosophy of ‘chandra kalaadhara’ is the ground for amrit siddhi and a pleasant blissful state. The inner meaning of Ardhanareeswara tatwam:
The prana shakti (life force) remains divided into two and one part lies in the ovaries of woman as egg and the other part lies as sperm in man. The jeevi forms with the union of these two. The male and female parts lie together in creatures like earth worm.
But the female and male ‘tatwas’ will be present in both in humans. The power in the right half of body should be known as ‘purusha Shakti’ and the power in left half of the body as ‘stree shakti’.
Similarly, the power of breath that travels in the right half of body should be known as ‘Pingala naadi’ and the power that flows in the left half of body should be known as Ida naadi. While doing pranayama, when breath is taken from right nostril, heat is generated in the body. So it is called ‘surya nadi’. If breath is taken from left nostril, the body cools.
It is called ‘chandra naadi’. In the body of ‘kaala purusha’, the six months from Mesha Raasi to Tula Raasi give heat and are called Surya naadi. The next six months from Aswayujam to Phalgunam become Chandra naadi.
We should understand that by the movement of Sun and Moon, Pournami and Amavasya are happening.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹