త్రిపురా రహస్యము - 57 / TRIPURA RAHASYA - 57
🌹. త్రిపురా రహస్యము - 57 🌹 🌻. స్వామి దత్తాత్రేయ విరచిత ఆత్మ జ్ఞాన యోగము 🌻 ✍️. బ్రహ్మ శ్రీ క్రోవి పార్థసారథి 📚. ప్రసాద్ భరద్వాజ 🌴. సమాధి స్థితి - 7 🌴 🌴. దృక్కు - దృశ్యము - 3 🌴 ప: గురుదేవా ! చిన్నసందేహం, ఘటాదులు భాసించేటప్పుడు ఆత్మభాసించదు కదా ? ద: ప్రతిబింబాలు భాసిస్తున్నప్పుడు, అద్దంకూడా భాసిస్తూనే ఉంటుంది. అసలు అద్దం అంటూ లేకపోతే వ్రతిఖింబాలే ఉండవు కదా ! అలాగే కుండ మొదలైన వస్తువులు భాసించే సమయంలో కూడా ఆత్మభాసిస్తూనే ఉంటుంది. ఆత్మకన్న భిన్నమైనది ఏదీలేదు. పూర్ణ్జస్వరూపము యొక్క నిరంతర స్మరణే మోక్షము. దృశ్యభావాలు ఎప్పుడైతే తొలగించబడతాయో, అప్పుడే చితిపూర్ణ స్వరూపంతో ప్రకాశిస్తుంది. ప్రతిబింబాలు గనక ఉన్నటైతే అద్దం యొక్క రూపం పూర్తిగా కనపడదు. దృశ్యము లేకపోతే, అవిద్య ఆవరించకపోతే, చితిని పరిచ్చేదం చేసేవి ఏవీ లేవు కాబట్టి అది పూర్ణంగా ప్రకాశిస్తుంది. ప : కాలాదులు చితిచేత ప్రకాశ జ్ఞానరూపాలవుతాయా ? ద: చితిచేత అవి ప్రకాశింపబడవు. చితి అంటే జ్ఞానానికి విషయం కానిది ఏదీ ఉండదు. చితితో వ్యాప్తమైన కాలాదులు చితికి పరిచ్చే దాన్ని కలిగించలేవు. సూర్యకాంతితో ప్రకాశించే వస్తువులు సూర్యునికి పరిచ్చేదా...