త్రిపురా రహస్యము - 54 / TRIPURA RAHASYA - 54

🌹. త్రిపురా రహస్యము - 54 🌹
🌻. స్వామి దత్తాత్రేయ విరచిత ఆత్మ జ్ఞాన యోగము 🌻

✍️. బ్రహ్మ శ్రీ క్రోవి పార్థసారథి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. సమాధి స్థితి - 4 🌴

“నా చితాన్ని ఈ రూపంలోనే ఉంచుతాను” అని పట్టుదల ఉందాలి. మధ్యమధ్యలో ఆ చిత్తం క్షోభిస్తుంది. అయినప్పటికి తిరిగి మనస్సును దానియందే లగ్నం చెయ్యాలి. ఆరూపాన్ని వదలకూడదు. “తన చేతులతో మనస్సు యొక్క చెతులను నలిపివేసి, తన దంతాలతో దాని దంతాలను పిండిచేసి, తన అవయవాలతో దాని అవయవాలను ఆక్రమించి మనసును జయించాలి” ప్రాణాయామ ప్రత్వాహారాది సాధనాలతో మనస్సును వశం చేసుకుని, పరదేవతారూపంగా నిశ్చలంగా ఉండేటట్లు చెయ్యాలి. ఈ ప్రయత్నం ఎంతవరకు అంటే అపరోక్షజ్ఞానం కలిగెంతవరకు చెయ్యాలి. అప్పుడు “సో2_ హం” ఆ పరదేవతయే నేను. అనేటటువంటి వికల్పజ్ఞానం కలుగుతుంది. అదే సంసారానికి మూలమైన అజ్ఞానాన్ని తొలగిస్తుంది.

అ: రాజా ! సమాధి అంటే వికల్చ్పరహితమైన (ప్రకాశము. సవికల్పమైన దానిని స్మరింపగలము కాని నిర్వికల్పాన్ని ఏవిధంగా స్మరింపగలుగుతాము ? కేవలము వస్తువులకు సంబంధించిన ప్రకాశమే నిర్వికల్పం. దానివల్ల మనస్సులో ఏరకమైన స్మృతి (గుర్తు) రాదు. మనం వెడుతూ ఉన్నప్పుడు అనేకరకాల వస్తువులు కనిపిస్తాయి. వాటన్నింటిని మనం పట్లించుకోం. అవన్నీ నిర్వికల్పాలే: కావాలన్నా అవి మళ్ళీ గుర్తుకురావు. అందుచేత నిర్వికల్ప జ్ఞానం కలిగినప్పుడు ఏ అంశం ఎంతవరకు చూశామో అనుకుంటాము కాని అది ఏదో పూర్తిగా తెలియదు. అలాంటప్పుడు, సమాధిలో కలిగిన నిర్వికల్పానుభవస్మృతి కలగటం అసంభవం కదా ?

జ: సవికల్పం ద్వారానే స్మృతి కలుగుతుంది. అయితే కొంతమంది మహానుభావుల అనుభవం ప్రకారం శుద్ద పరమాత్మ సవికల్పానికి విషయం కానందువల్ల, నిర్వికల్పానుభవ స్మరణమే కలుగుతుంది. అంతేకావి సవికల్పమే స్మృతి కలిగిస్తుందనే నియమం ఏమీలేదు. వికల్పమంటే భేదభావమే. దారినపోయేవాడు ఎవరినో, దేన్నో చూశాను అనుకుంటాడు. కాబట్టి ఏ స్థితిలో ఏవస్తువు యొక్క రూపం ఎంతవరకు కనిపించిందో, అంతవరకే గుర్తుంటుంది. అందువల్ల “సర్వోవికల్పఃస్మృతి” - అన్ని వికల్పాలు స్మృతియె అయితే మన కోరికకు తగినదే మనకు గుర్తువస్తుంది. మునిబాలకా! తియ్యనిపండు మనకు ఇష్టమైందనుకో ఆ పండులోని తియ్యదనమే మనకు గుర్తుకు వస్తుంది. అలాగే నిర్వికల్ప సమాధియందలి శుద్ద స్వరూపప్రకాశమే స్మృతి రూపంలో భాసిస్తుంది.

అద్వైతమైన ఆ పరమాత్మ స్వరూపాన్నే నేను అనేటటువంటి జ్ఞానం వల్ల సంసార దింధనానికి కారణమైన అజ్ఞానం నశిస్తుంది. ఘటజ్ఞానము, పటజ్ఞానము అని అనేక రకాలుగా కనిపించే అజ్ఞానమే వికల్చము. అది ఒకటిగా ఉంటే నిర్వికల్పము అని చెప్పబడుతుంది.

మనోవ్యాపారాలు వదిలిన వెంటనే వికల్పం పోతుంది. ఎప్పుదైతే వికల్పం పోయిందో, నిర్వికల్పం దానంతట అదే వస్తుంది. బొమ్మలను తుడిచేస్తే గోడ శుభ్రంగా

ఉన్నట్లుగానే, వికల్పాలుపోతే మనస్సు నిశ్చలమవుతుంది. అద్దానికి ఎదురుగా ఏ వస్తువులూ లేకుండా చేస్తే అద్ధం స్వచ్చంగా ఉంటుంది. అలాగే వికల్పాలను వదిలేస్తే చాలు. ఇంకేం చెయ్యనక్కరలేదు. నిర్వికల్ప స్థితి లభిస్తుంది. దీన్ని మించిందిలేదు. పండితులు కూడా మాయలోపడి దీన్ని గురించి తెలుసుకోలేక పోతున్నారు. కేవలం సూక్ష్మబుద్ది గలవారు మాత్రమే దీన్ని గుర్తిస్తారు.

ఈ జ్ఞానానికి యోగ్యులు మూడు రకాలుగా ఉన్నారు. 1. ఉత్తములు 2. మధ్యములు 3. అధములు. ఒకసారి చెప్పగానే విషయాన్ని అర్ధం చేసుకునేవారు ఉత్తములు. వీరు జ్ఞానం పొందటానికి పెద్దగా కష్టపడనవసరం లేదు.

మునిబాలకా ! ఎవరిదాకానో ఎందుకు ? నా విషయమే చెబుతా విను. ఒకసారి నిండువేసవిలో, పండు వెన్నెలలో ఇంటి ముందరిభాగంలో ప్రియురాలితో సుఖంగా

ఉన్నాను. అప్పుడు ఆకాశంలో వెళ్ళే సిద్ధులు కొందరు అద్వైతతత్త్వాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. అది విన్నాను, నాకు వెంటనే ఆతత్త్వం అర్ధమైంది. ఆలోచించాను. అతి తక్కువకాలంలోనే దాన్ని గురించి తెలుసుకున్నాను నేను కూడా సమాధిస్థితి పొందాను. కొంతసేపటికి లేచాను. ఆ స్టితి చాలా బాగుంది, మహదానందంగా ఉంది, అదే బ్రహ్మానందస్ధితి, మళ్ళీ ఆస్టితిలోకి వెళ్లాలి అనుకున్నాను. ఇంతకాలం వ్యర్థంగా గడివాను. నాక్షాత్తూ చింతామణిని దగ్గర ఉంచుకుని భిక్షాటన చేశాను. ఈ ఆనందం తెలుసుకోలేక ఐపొిక సుఖాలకోసం ప్రాకులాదాను. లోకంలో అందరూ ఇలాగే అవుతున్నారు. బాహ్యసుఖాలు శాశ్వతం కాదు. ఇంక ఇవిచాలు. ఈ సుగంధద్రవ్యాలు, పళ్ళు, పూలు, తినుబండారాలు, సుందరాంగులు ఏవీ అవసరం లేదు. ఇవన్నీ నశించిపోయేవే ఇంతకాలం అజ్ఞానంతో గడిపినందుకు సిగ్గుపడుతున్నాను.

ఈ విధంగా ఆలోచించి మళ్ళీ అంతర్ముఖుడవుదామనుకున్నాను. ఇంతలో ఒక ఆలోచన వచ్చింది. సమాధిలో నేననుభవించన సుఖము సర్వదా ్రకాశమేకదా ! మరి ఇప్పుడు దాన్ని క్రొత్తగా సాధించటం ఏమిటి ? ఇంతవరకూ లేనిది, ఏదైనా ఇప్పుడు దొరకుతోందా ? గతంలో లేకుండా, ఇప్పుడు దొరికే సుఖం శాశ్వతం ఎలా అవుతుంది?

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 TRIPURA RAHASYA - 54 🌹
🌻 THE MYSTERY BEYOND THE TRINITY 🌻

✍️ Ramanananda Saraswathi
📚 Prasad Bharadwaj

CHAPTER 12
🌴 The Appearance of the Reality of the Universe Depends on the Strength of Will of Creation - 5 🌴

83-95. The king took courage and looked all round. He saw the sky above, enveloped in the darkness of night and shining with stars. He ascended there and looked down below; he came to the region of the moon and was benumbed with cold. Protected by the saint, he went up to the Sun and was scorched by its rays. Again tended by the saint, he was refreshed and saw the whole region a counterpart of the Heaven. He went up to the summits of the Himalayas with the saint and was shown the whole region and also the earth.

Again endowed with powerful eyesight, he was able to see far-off lands and discovered other worlds besides this one. In the distant worlds there was darkness prevailing in some places; the earth was gold in some; there were oceans and island continents traversed by rivers and mountains; there were the heavens peopled by Indra and the Gods, the asuras, human beings, the rakshasas and other races of celestials.

He also found that the saint had divided himself as Brahma in Satyaloka, as Vishnu in Vaikunta, and as Siva in Kailasa, while all the time he remained as his original-self, the king ruling in the present world. The king was struck with wonder on seeing the yogic power of the saint.

The sage’s son said to him: This sightseeing has lasted only a single day according to the standards prevailing here, whereas twelve thousand years have passed by in the world you are used to. So let us return to my father. 96. Saying so, he helped the other to come out of the hill to this outer world.

Thus ends the Chapter XII on “Sightseeing in the Ganda Hill” in Tripura RAHASYA.
🌻🌻🌻🌻🌻

CHAPTER 13

🌴 How Wakefulness and Dream are Similar in Nature and Objects are Only Mental IMAGES - 1 🌴

1-2. The sage’s son made the king sleep, united his subtle body with the gross one left in the hole, and then woke him up.

3. On regaining his senses, Mahasena found the whole world changed. The people, the river courses, the trees, the tanks, etc., were all different.

4-30. He was bewildered and asked the saint: O great one! How long have we spent seeing your world? This world looks different from the one I was accustomed to!

Thus asked, the sage’s son said to Mahasena: Listen king, this is the world which we were in and left to see that within the hill. The same has undergone enormous changes owing to the long interval of time. We spent only one day looking round the hill region; The same interval counts for twelve thousand years in this land; and it has accordingly changed enormously.

Look at the difference in the manners of the people and their languages. Such changes are natural. I have often noticed similar changes before. Look here! This is the Lord, my father in samadhi. Here you stood before, praising my father and praying to him. There you see the hill in front of you.

By this time, your brother’s progeny has increased to thousands. What was Vanga, your country, with Sundara, your capital, is now a jungle infested with jackals and wild animals.

There is now one Virabahu in your brother’s line who has his capital, Visala, on the banks of the Kshipra in the country of Malwa; in your line, there is Susarma whose capital is Vardhana in the country of the Dravidas, on the banks of the Tambrabharani. Such is the course of the world which cannot remain the same even for a short time.

For in this period, the hills, rivers, lakes, and the contour of the earth have altered. Mountains subside; plains heave high; deserts become fertile; plateaux change to sandy tracts; rocks decompose and become silt; clay hardens sometimes; cultivated farms become barren and barren lands are brought under tillage; precious stones become valueless and trinkets become invaluable; salt water becomes sweet and potable waters become brackish;

Continues..
🌹 🌹 🌹 🌹 🌹