త్రిపురా రహస్యము - 57 / TRIPURA RAHASYA - 57

Image may contain: one or more people
🌹. త్రిపురా రహస్యము - 57 🌹
🌻. స్వామి దత్తాత్రేయ విరచిత ఆత్మ జ్ఞాన యోగము 🌻

✍️. బ్రహ్మ శ్రీ క్రోవి పార్థసారథి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. సమాధి స్థితి - 7 🌴
🌴. దృక్కు - దృశ్యము - 3 🌴

ప: గురుదేవా ! చిన్నసందేహం, ఘటాదులు భాసించేటప్పుడు ఆత్మభాసించదు కదా ?

ద: ప్రతిబింబాలు భాసిస్తున్నప్పుడు, అద్దంకూడా భాసిస్తూనే ఉంటుంది. అసలు అద్దం అంటూ లేకపోతే వ్రతిఖింబాలే ఉండవు కదా ! అలాగే కుండ మొదలైన వస్తువులు భాసించే సమయంలో కూడా ఆత్మభాసిస్తూనే ఉంటుంది. ఆత్మకన్న భిన్నమైనది ఏదీలేదు.

పూర్ణ్జస్వరూపము యొక్క నిరంతర స్మరణే మోక్షము. దృశ్యభావాలు ఎప్పుడైతే తొలగించబడతాయో, అప్పుడే చితిపూర్ణ స్వరూపంతో ప్రకాశిస్తుంది. ప్రతిబింబాలు గనక ఉన్నటైతే అద్దం యొక్క రూపం పూర్తిగా కనపడదు. దృశ్యము లేకపోతే, అవిద్య ఆవరించకపోతే, చితిని పరిచ్చేదం చేసేవి ఏవీ లేవు కాబట్టి అది పూర్ణంగా ప్రకాశిస్తుంది.

ప : కాలాదులు చితిచేత ప్రకాశ జ్ఞానరూపాలవుతాయా ?

ద: చితిచేత అవి ప్రకాశింపబడవు. చితి అంటే జ్ఞానానికి విషయం కానిది ఏదీ ఉండదు. చితితో వ్యాప్తమైన కాలాదులు చితికి పరిచ్చే దాన్ని కలిగించలేవు. సూర్యకాంతితో ప్రకాశించే వస్తువులు సూర్యునికి పరిచ్చేదాన్ని కలిగించలేవు.

వ్యాప్తము అంటే - అల్ప దేశంలో ఉందేది.

వ్యాపకము అంటే - అధిక దేశంలో ఉండేది.

ఇక్కడ దృశ్యము వ్యాప్తము, చితివ్యాపకము చితికి బయట, ఆవల ఉన్న వస్తువు, చితికి పరిచ్చేదాన్ని కలిగించవచ్చు. అయితే చితికి వెలుపల, చితిని ప్రకాశింపచేశేది ఏదీ లేదు. చితికి వెలుపల ఉన్న వస్తువు కూడా చితి సంబంధం లేకుండా ప్రకాశించదు.

ప; చితి దేశకాలాలను సంపూర్ణంగా వ్యాపించదు. వాటిలో కొంత భాగాన్ని మాత్రమే వ్యాపిస్తుంది. అలాంటప్పుడు చితివ్యాప్తము కాని అంశాలు చితికి పరిచ్చేదాలు కావచ్చు కదా ?

ద : చితి వ్యాపించని అంశాలు ్రకాశించవు. కాబటి అవి లేనట్లే. లేనివి ఏ రకంగా పరిచ్చేదాన్ని చేస్తాయి ? కాబట్టి బహి : పదార్ధముకూదా చితిలో మునిగి ఉన్నదే. తనలో ఉన్న వస్తుపులు తనకు పరిచ్చేదకాలు కావు. చైతన్యంకూడా చితిలోనిదే.

చితిలో ఉండే ప్రపంచం, చితికన్న భిన్నం కాదు. ఘటపటాదులన్నీ ఆకాశంలో ఉన్నట్లుగా, ప్రపంచమంతా చితిరూపంలోనే ఉండి, భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తుంది. చితికన్న బాహ్యపదార్ధం ఉన్నదనుకోవటం (భ్రమ అంతే.

ప : గురుదేవా ! నాకు కొన్ని సందేహాలున్నాయి. శుద్ధచితి ఒక్కటే విచిత్రమైన రూపాలతో (ప్రకాశిస్తూ ఉంటుంది, అన్నారు. కాని చితిప్రకాశము. చైతన్యము - ప్రకాశించబడేది. ఈ రెండూ వేరువేరు అని జనులనుకుంటున్నారు. చితి స్వప్రకాశము. దైతన్యము దృశ్యప్రపంచము. కాబట్టి చితిచైతన్యావ్ని ప్రకాశింపచేస్తుంది. అంటున్నారు. ఈ రెండూ ఒకటే అంటున్నారు. (చితి జగత్తు ఒక్కటే) కాంతిచేత ప్రకాశింప చెయ్యబడే వస్తువు కాంతికన్న వేరైనట్లె, చితిచేత ప్రకాశింపచేయబడే వస్తువు చితికన్న వేరు కావాలి కదా 7? మరి చిదాత్మకమెలా అవుతుంది ?

2. సంకల్పాలను వదలివేస్తే చాలు నిర్వికల్ప నమాధి సిద్ధిస్తుంది. అదే సంసార బంధనాలను తెంచివేసే నిర్వికల్ప జ్ఞానమని, అదే ఆత్మస్వరూపమని జనక మహారాజు చెప్పాడు. ఇందులో కూడా నాకు సందేహమున్నది. మనస్సు ఆత్మకు జ్జాన సాధనం. మనస్సు లేకపోతే ఆత్మకు జ్ఞానం కలగదు. అప్పుడు ఆత్మజడం అవుతుంది కదా ? మనస్సు వల్లనే ఆత్మకు బంధమోక్షాలు కలుగుతున్నాయి. సవికల్పమైన మనస్సు బంధము. అదే నిర్వికల్పమైకే మోక్షము. అలాంటప్పుడు మనస్సే ఆత్మ ఎలా అవుతుంది ?

8. భ్రాంతికి విషయమైన ప్రపంచం అసత్యమే అయినప్పటికీ, భ్రాంతి అనేది ఒకటి ఉంది కదా ? మరి ఆ (భ్రాంతి అసత్యం కాదు కదా ? ఇక్కడ ఆత్మ, భ్రాంతి అనేవి రెండూ ఉన్నప్పుడు అద్వైతం ఎలా సిద్ధిస్తుంది ?

4. త్రాడులోని పాములాంటి అసత్య పదార్దాలు ఎందుకూ పనికి రావు. ఎండమావుల వల్ల దప్పిక తీరదు. పైగా అవి స్థిరంగా ఉండవు. ప్రపంచంలోని అన్ని పదార్దాలు స్థిరంగానే ఉంటాయి. వాటివల్ల కొంత ప్రయోజనం కలుగుతుంది కదా ! కనిపించేదంతా (భ్రమ అంటున్నారు. అసలు (భ్రాంతికూడా అందరికీ ఒకే రూపంలో ఎందుకు కలుగుతుంది? (తాడును చూసి అది పామే అని ఎందుకు అనుకోవాలి ? నీటిధార లేదా కర్ర అనుకోవచ్చు కదా ? దూరంగా ఒక మొద్దును చూసినవ్చుడు అది మనిషి, చెట్టు, దెయ్యము ఇలా రకరకాలుగా అనుకోవచ్చు కదా ?

మహానుభావా ! దయచేసి నా యీ అనుమానాలను తీర్చండి.

ద: పరశురామా ! చాలామంచి ప్రశ్నలు వేశావయ్యా,. వీటన్నింటికీ సమాధానాలు చెబుతాను విను. “

1. చితి, త్రిపుర ఒక్కటే. అయినప్పటికీ విచిత్ర రూపాలతో ్రకాశిస్తున్నది. అద్దం ఒకటే అయినా అందులో అనేక ప్రతిబింబాలు కనిపిస్తున్నట్లే ఇది కూడా జరుగుతోంది. మనస్సు స్వప్నంలో దృశ్యము, ద్రష్టలుగా కనిపిస్తోంది. సుషుప్తిలో నిర్వికారంగా ఉంటుంది. అలాగే చితికూడా చిత్రవిచిత్ర ప్రపంచంగా భాసిస్తుంది.

“2, రెండుగా ఉన్నట్లు కనిపించి నంతమాత్రాన ద్వైతమున్నదని కాదు. స్వప్నంలో చితి, చైతన్యము రెండూ కనిపిస్తున్నాయి. అయినా అది సత్యం కాదు కదా ? స్వప్నంలో కనిపించే ద్వైతం సత్యం కాదుకదా?

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 TRIPURA RAHASYA - 57 🌹
🌻 THE MYSTERY BEYOND THE TRINITY 🌻

✍️ Ramanananda Saraswathi
📚 Prasad Bharadwaj

CHAPTER 13
🌴 How Wakefulness and Dream are Similar in Nature and Objects are Only Mental IMAGES - 4 🌴

71-76. Dream and wakefulness resemble each other in their discontinuous harmony (like a chain made up of links). There is no unbroken continuity in any object because every new appearance implies a later disappearance. But continuity cannot be denied in the fundamentals underlying the objects! Because a dream creation is obliterated and rendered false by present experience — what distinction will you draw between the fundamentals underlying the dream objects and the present objects? If you say that the dream is an illusion and its fundamentals are equally so, whereas the present creation is not so obliterated and its fundamentals must therefore be true, I ask you what illusion is? It is determined by the transitory nature, which is nothing but appearance to, and disappearance from, our senses.

Is not everything obliterated in deep sleep? If you maintain however, that mutual contradiction is unreliable as evidence and so proves nothing, it amounts to saying that self-evident sight alone furnishes the best proof. Quite so, people like you do not have a true insight into the nature of things.

77-79. Therefore take my word for it, the present world is only similar to the dream world. Long periods pass in dreams also. Therefore, purposefulness and enduring nature are in every way similar to both states. Just as you are obviously aware in your waking state, so also you are in your dream state.

80. These two states being so similar, why do you not mourn the loss of your dream relations?

81. The wakeful universe appears so real to all only by force of habit. If the same be imagined vacuous it will melt away into the void.

82-83. One starts imagining something; then contemplates it; and by continuous or repeated association resolves that it is true, unless contradicted. In that way, the world appears real in the manner one is used to it. My world that you visited furnishes the proof thereof; come now, let us go round the hill and see.

85. Saying so, the sage’s son took the king, went round the hill and returned to the former spot.

86-87. Then he continued: Look, O King! The circuit of the hill is hardly two miles and a half and yet you have seen a universe within it. Is it real or false? Is it a dream or otherwise? What has passed as a day in that land, has counted for twelve thousand years here. Which is correct? Think, and tell me.

88. Obviously you cannot distinguish this from a dream and cannot help concluding that the world is nothing but imagination. My world will disappear instantly if I cease contemplating it. Therefore convince yourself of the dreamlike nature of the world and do not indulge in grief at your brother’s death.

90. Just as the dream creations are pictures moving on the mind screens, so also this world, including yourself, is the obverse of the picture depicted by pure intelligence and it is nothing more than an image in a mirror. See how you will feel after this conviction. Will you be elated by the accession of a dominion or depressed by the death of a relative in your dream?

91. Realise that the Self is the self-contained mirror projecting and manifesting this world. The Self is pure unblemished consciousness. Be quick! Realise it quickly and gain transcendental happiness!

Thus ends the Chapter on “The Vision of the Hill City” in Tripura Rahasya.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹