త్రిపురా రహస్యము - 56 / TRIPURA RAHASYA - 56
🌹. త్రిపురా రహస్యము - 56 🌹
🌻. స్వామి దత్తాత్రేయ విరచిత ఆత్మ జ్ఞాన యోగము 🌻
✍️. బ్రహ్మ శ్రీ క్రోవి పార్థసారథి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. సమాధి స్థితి - 6 🌴
🌴. దృక్కు - దృశ్యము - 2 🌴
స:కుండ, వస్త్రము మొదలైన వాటికి భాసకమైన సామాన్య జ్ఞానము, నా స్వరూపమే కదా !
ద: అలా ఎన్నటికీ కాదు. ఘటపటాదులను వ్రకాశింపచేసే జ్ఞానము, ఘటపటాది రూపంలోనే ఉంటుంది. అందుకని భానకంగా ఉండే జ్ఞానంకూడా సామాన్యం కారు. అది నీ రూపం కాదు. అయితే కేవలం సామాన్యజ్ఞానమె నీ స్వరూపం. అటు నువ్వు ఇతరమైన ఆపేక్ష ఏదీ లేకుండా ప్రకాశిస్తున్నావు. సామాన్యము, విశేషము అనేవి ఒకటి లేకుండా ఇంకొకటి ఉండవు. ఆ రెండూ అవినాభావంగా ఉంటాయి. అయితే ఆత్మ అనేది సామాన్య, విశేషాలకు రెండింటికీ అతీతమైనది.
ప: గురుదేవా ! నేను చిద్రూపుడను అనే భావన నాకు కలగటం లేదు. 'ఈ దేహాన్నే నేను” అనే భావమే కలుగుతోంది. ఎందుకని ?
ద; దేహము మొదలైనవాటిని సంకల్పించేటప్పుడు నీకు, 'నేను దేహము” అనే భావన కలుగుతోందే తప్ప దేహం ఆత్మగా అనిపించదు. శరీరాన్ని కాకుండా ఇతరమైన వస్తువులను చూసేటప్పుడు, లేదా సంకల్పించేటప్పుడు ఘటము నేనే, పటము నేనే అనుకోవు కదా ! పోనీ ఈ దేహము చిదాత్మకము. నాకు సంబంధించినది. కాబట్టి నేనే ఈ. దేహము ,_అనుకుంటావా ? అలా అయితే కనిపించే వస్తువులు కూడా ఆత్మకు సంబంధించినవే అందుచేత అవి కూడా నీ దేహమే అనాలి కదా ? అందువల్ల దృశ్యము లేనటువంటి దృక్కు మాత్రమే నువ్వు ఈ దృక్కు అనేది ఎప్పుడూ దృశ్యము కాదు. దృక్కు ఎల్లప్పుడూ స్వప్రకాశము.
నువ్వు దృక్స్వరూపుడివి. ఆ దృక్కే దేశకాలాలను బట్టి విచిత్ర రూపాలతో ప్రకాశిస్తూ 'ప్రతిబింబాలతో నిండిన అద్దంలాగా ఉన్నది. ఎదురుగా ఉన్న బింబాలను గనక తొలగిస్తే, అద్దం స్వచ్చంగా శుద్దరూపంతో ప్రకాశిస్తుంది. ఆ శుద్ద చితి ఉన్నదే, అదే నీ రూపం.
ఒక్కసారి గనక ఆ పరాచితి దర్శనమయినట్లెతే, ఆ చితిలోనే ఉన్నదేహాదులు ఇంక స్ఫురించవు. లావు, సన్నము మొదలైన నీ ఆకారము, నీ కులము, గోత్రము ఇవేవీ గుర్తుకు రావు. భ్రాంతులన్ని నశించిపోతాయి. అజ్ఞానము కూడా నశిస్తుంది. అప్పుడు కలిగేది క్షణిక సమాధి కాదు. అది ప్రత్యభిజ్ఞారూపమైన సవికల్ప సమాధి. పరశురామా! మోక్షమనేది ఎక్కడో లేదు. సంకల్పాలను వదలివేసిన మరుక్షణం, స్వస్వరూపం భాసించు మోక్షము. ఇక్కడ గుర్తుంచీకోవలసినది ఒకటే. తన స్వరూపం ఎప్పుడూ ఉండేదే. క్రొత్తగా పొందేది ఏదీ లేదు.
ప: అలా అయితే శ్రవణము, మననము ఇవన్నీ దేనికి ?
ద; మోక్షమనేది క్రొత్తగా మనం పొందుతాము అనుకోవటం కేవలం అజ్ఞానం, శ్రవణము వలన, మననము వలన ఈ రకమైన అజ్ఞానం తొలగిపోతోంది. అంతవరకే వాటి పని. మోక్షమనేది స్వర్గాదులవంటిది కాదు. స్వర్గము మొదలైనవి యజ్ఞయాగాదుల వల్ల ప్రాప్తిస్తాయి. పుణ్యఫలం పూర్తికాగానే యజ్ఞయాగాదులు కూడా నశించిపోతాయి. కాని మోక్షం అలాంటిది కాదు. అది నిత్యము సత్యమైనది. కాని ఆత్మస్వరూపమైనది. ఆత్మ స్వరూపం అపరిఛిన్నము. పరివూర్ణ వైన ఆత్మ న్వరూవమే మోక్షము, ఆత్మస్వరూపంలోనే మోక్షమున్నది అనుకుంటే అది దర్పణంలోని ప్రతిబింబం వంటిదే అవుతుంది. అనగా - ప్రతిబింబం దర్పణంకన్న వేరైనది కానట్లే, మోక్షం కూడా ఆత్మకన్న వేరైనది కాదు. ..
“చెరసాల నుంచి విముక్తుడైనాడు” అన్నప్పుడు చెరసాల అనే బంధం నశించింది అని అర్థం. అంతేకాని అంతకన్న ఇతరమైన విముక్తి అంటూ ఏదీ లేదు. అలాగే మోక్షము అంటే, బంధాలు నశించటమే. అజ్ఞానం తొలగిపోవటమే.
ప : స్వప్నంలో సత్యంగా భాసించే స్వప్నజగత్తు, జాగ్రదావస్థ్టలో అసత్యంగా భాసిస్తుంది. అంటే, స్వప్న జగత్తే ఒకసారి సత్యము, ఇంకొకసారి అసత్యము అనిపిస్తుంది. అలాగే, ఆత్న్మకూడా సత్యము, అసత్యము రెండూ కావచ్చు కదా! ఆత్మ, మోక్షము ఈ రెండూ కూడా అదే విధంగా ఉభయాత్మకాలు ఎందుకు కాకూడదు ?
ద: నాయనా ! ముందుగా 'బాధ' అనే శబ్దానికి అర్ధం తెలుసుకోవాలి. బాధ అంటే - అభావ జ్ఞానం. అంటే ఒక వస్తువు 'లేదు' అనే రూపంలో ఉండేటటువంటి
జ్ఞానం. ఒక వస్తువు 'నేదు' అనే సమయంలో ఉండేటటువంటి 'లేదు' అనే జ్ఞానాన్నె 'బాధ' అంటారు. అది ఘటము, పటములాంటి వస్తుజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. ఇక్కడ ఉండటం,లేకపోవటం అని రెండు దశలున్నాయి. అవి వేరువేరు కాలాల్లో, వేరువేరు దేశాల్లో సంభవించవచ్చు. కాబట్టి ఘట, పటాది వస్తు విషయంలో అది జరగవచ్చు. ఇటువంటి బాధ కలగటానికి అవకాశమున్న ఘటపటాది దృశ్య ప్రపంచాన్ని 'అసత్యము' అంటారు. అయితే అత్మ 'నేను' అనేది ఒకే కాలంలో ఏ దేశంలోనూ కూదా 'లేను' అనిభాసించదు. అందువల్ల దానికి బాధ లేదు. కాబట్టీ అది అసత్యం కాదు.
ఆత్మ లేదా దృక్కు - దీనికన్న వేరైన జగత్తు 'సో£ హం' సమాధిస్టితిలో భాసించదు. అప్పుడు జగత్తు లేదనిపిస్తుంది. అందుకని దృశ్యమైనది అంతా బాధితమే. అసత్యమే అవుతుంది. ఈ విధంగా భావము, అభావముగా రెండు రకాలుగా ఉండేవన్నీ బాధితులే. ఇవన్నీ అసత్యాలే. దేనికైతే అభావన ఉండదో అది సత్యమైనది. అదే సర్వాత్మ పరాచితి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 TRIPURA RAHASYA - 56 🌹
🌻 THE MYSTERY BEYOND THE TRINITY 🌻
✍️ Ramanananda Saraswathi
📚 Prasad Bharadwaj
CHAPTER 13
🌴 How Wakefulness and Dream are Similar in Nature and Objects are Only Mental IMAGES - 3 🌴
49. King, listen! People are deluded by the illusion cast by Her Divine Majesty. They partake of misery that is due to the ignorance of their selves. Their misery is meaningless.
50. As long as the ignorance of the self lasts, so long will there be misery.
51-52. Just as a dreamer is foolishly alarmed at his own dreams or as a fool is deluded by the serpents created in a magic performance, so also the man ignorant of the Self is terrified.
53-55. Just as the dreamer awakened from his fearful dream or the man attending the magic performance informed of the unreal nature of the magic creations, no longer fears them but ridicules another who does, so also one aware of the Self not only does not grieve but also laughs at another’s grief. Therefore, O valiant hero, batter down this impregnable fortress of illusion and conquer your misery by realisation of the Self. In the meantime be discriminating and not so foolish.
56-58. After hearing the sage’s son, Mahasena said: Master, your illustration is not to the point. Dream or magic is later realised to be illusory, whereas this hard concrete universe is always real and purposeful. This is unassailed and persistent. How can it be compared to the evanescent dream? Then the sage’s son answered:
59. Listen to what I say. Your opinion that the illustration is not to the point is a double delusion, like a dream in a dream.
[Note: The Commentary says that the first delusion is the idea of separateness of the universe from oneself and that the second is the idea that dream objects are an illusion in contradistinction to those seen while awake. This is compared to the illusion that a dreamer mistakes the dream-rope for a dream-serpent. (The dream is itself an illusion and the mistake is an illusion in the illusion.)]
60-70. Consider the dream as a dreamer would and tell me whether the trees do not afford shade to the pedestrians and bear fruits for the use of others. Is the dream realised to be untrue and evanescent in the dream itself? Do you mean to say that the dream is rendered false after waking from it? Is not the waking world similarly rendered false in your dream or deep sleep? Do you contend that the waking state is not so because there is continuity in it after you wake up? Is there no continuity in your dreams from day to day? If you say that it is not evident, tell me whether the continuity in the wakeful world is not broken up every moment of your life. Do you suggest that the hills, the seas and the earth itself are really permanent phenomena, in spite of the fact that their appearance is constantly changing? Is not the dream-world also similarly continuous with its earth, mountains, rivers, friends and relatives? Do you still doubt its abiding nature? Then extend the same reasoning to the nature of the wakeful world and know it to be equally evanescent.
The ever-changing objects like the body, trees, rivers and islands are easily found to be transitory. Even mountains are not immutable, for their contours change owing to the erosion of waterfalls and mountain torrents, ravages by men, boars and wild animals, insects, thunder, lightning, storms and so on. You will observe similar change in the seas and on earth. Therefore I tell you that you should investigate the matter closely. (You will probably argue as follows:)
Continues...