🅃🅁🄸🄿🅄🅁🄰 🅁🄰🄷🄰🅂🅈🄰 - 52 / త్రిపురా రహస్యము - 52


🌹 🅃🅁🄸🄿🅄🅁🄰 🅁🄰🄷🄰🅂🅈🄰 - 52 / త్రిపురా రహస్యము - 52 🌹
🌻 🅃🄷🄴 🄼🅈🅂🅃🄴🅁🅈 🄱🄴🅈🄾🄽🄳 🅃🄷🄴 🅃🅁🄸🄽🄸🅃🅈 🌻
✍️ 𝑅𝒶𝓂𝒶𝓃𝒶𝓃𝒶𝓃𝒹𝒶 𝒮𝒶𝓇𝒶𝓈𝓌𝒶𝓉𝒽𝒾
📚 𝒫𝓇𝒶𝓈𝒶𝒹 𝐵𝒽𝒶𝓇𝒶𝒹𝓌𝒶𝒿

CHAPTER 12
🌴 The Appearance of the Reality of the Universe Depends on the Strength of Will of Creation - 3 🌴

47-49. Perfectly peaceful and cheerful in mind, he beckoned to his son and said to him: Boy, do not repeat this fault. Wrath wrecks penance. Penance is only possible and can progress without obstruction because the king protects yogis. To interfere with a sacrifice is always reprehensible and never to be countenanced by the good. Be a good boy and return the horse and the princes immediately. Do it at once so that the sacrifice may be performed at the appointed hour.

50. Directed thus, the sage’s son was immediately appeased. He went into the hill, returned with the horse and the princes and released them with pleasure.

51-53. Mahasena sent the princes with the horse to the town. He was surprised at what he saw and saluting the Sage asked him respectfully: Lord, please tell me how the horse and the princes were concealed in the hill. Then the Sage replied:

54-66. Listen, O King, I was formerly an emperor ruling the empire bounded by the seas. After a long while the grace of God descended on me and I grew disgusted with the world as being but trash in the light of consciousness within. I abdicated the kingdom in favour of my sons and retired into this forest. My wife, being dutiful, accompanied me here. Several years were passed in our penance and austerities. Once my wife embraced me and this son was born to her when I was in samadhi. She brought me to my senses, left the babe with me and died. This boy was brought up by me with love and care. When he grew up, he heard that I had once been a king. He wished to be one also and besought me to grant his prayer. I initiated him in yoga, which he practised with such success that he was able by the force of his will to create a world of his own in this hill which he is now ruling. The horse and princes were kept there. I have now told you the secret of that hill. After hearing it Mahasena asked again:

67. I have with great interest heard your wonderful account of this hill. I want to see it. Can you grant my prayer?

68. Being so requested, the Sage commanded his son saying: Boy! Show him round the place and satisfy him.

69. Having said thus, the Sage again lapsed into samadhi; and his son went away with the king.

70. The sage’s son entered the hill without trouble and disappeared, but Mahasena was not able to enter. So he called out for the sage’s son.

71. He too called out to the king, from the interior of the hill. Then he came out of it and said to the king:

72-74. O King, this hill cannot be penetrated with the slender yogic powers that you possess. You will find it too dense. Nevertheless you must be taken into it as my father ordered. Now, leave your gross body in this hole covered with bushes; enter the hill with your mental sheath along with me. The king could not do it and asked:

75. Tell me, saint, how I am to throw off this body. If I do it forcibly, I shall die.

76. The saint smiled at this and said: You do not seem to know yoga. Well, close your eyes.

77. The king closed his eyes; the saint forthwith entered into him, took the other’s subtle body and left the gross body in the hole.

78. Then by his yogic power the saint entered the hill with this subtle body snatched from the other which was filled with the desire of seeing the empire within the bowels of the hill.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🌹. త్రిపురా రహస్యము - 52 🌹
🌻. స్వామి దత్తాత్రేయ విరచిత ఆత్మ జ్ఞాన యోగము 🌻

✍️. బ్రహ్మ శ్రీ క్రోవి పార్థసారథి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. సమాధి స్థితి - 2 🌴

“సకల హం” అతడు నేనే. అనేటటువంటి పప్రత్యభిజారూపమైనటువంటి గుర్తింపుతో కూడిన సవికల్ప జ్ఞానమే అజ్ఞానాన్ని రూపుమాపుతుంది. వైరాగ్యము, ముముక్షత్వము మొదలైన జ్ఞానసాధనాలు గల పురుషుడు వేదాంతాన్ని వినటంచేత అతడికి పరోక్షమైన ఆత్మతత్త్వజ్ఞానం కలుగుతుంది.

ఆవిషయాలను బాగా మననం చేస్తే సంశయాలు తొలగి పోతాయి. అప్పుడు నిధి ధ్యానం చెయ్యాలి. దీనివల్ల ఇంతవరకు మనకున్నటువంటి “దేహమే నేను' అనేభావంపోయి శుద్ధ (ప్రత్యగాత్మ జ్ఞానం కలుగుతుంది.

ఆ తరువాత ఉపనిషత్తులలో చెప్పినట్లుగా “పరమాత్మ ప్రత్యగాత్మలు ఒక్కటే' అనే అఖందడాకార జ్ఞానం కలుగుతుంది. దీన్నే 'సో_ హం' రూపప్రత్యాభిజ్ఞా జ్ఞానము అంటారు. ఇది సంసార బంధనాలకు మూలమైన అజ్ఞానాన్ని నశింపచేస్తుంది.

అ: ఈ జ్ఞానంలో కూడా అతడు (సఖ) నేను (అహమ్‌) అని రెండు దశాలున్నాయి కాదా ? మరి అలాంటప్పుడు ఇది అద్వైతము ఎలా అవుతుంది ? దీనివల్ల ద్వైతభావం ఏరకంగా నశిస్తుంది.

జ: రాముడు అనేవ్యక్తి సోముడదనే వ్యక్తిని కాశీలో కలుసుకున్నాడు. కొంతకాలానికి అతడు విజయవాడ వచ్చాడు. ఇప్పుడు సోముడు ఎవరు ? అంటే కొంతకాలం క్రితం కాశిలో కలిసిన వాదే ఇతడు ఈ సోముడు. ఇక్కడ సోముడు, ఇతడు వీరిద్దరూ వేరువేరు కాదు. ఇద్దరూ ఒక్కటే అలాగే 'సో హం” కూడా.

అ: అయితే దీన్ని సవికల్ప జ్ఞానం అని ఎందుకంటున్నారు ?

జ: అతడు, నేను అనే రెండు శబ్దాలకు ఐక్యము లేనందువల్ల భేదమున్నట్లుగా కనిపిస్తోంది. వికల్పము అనేభావంతో ఇవి సమానంగా కనిపిస్తున్నాయి. రెండు శబ్దాలు భాసింపని నిర్వికల్ప జ్ఞానం కన్న ఇది విలక్షణమైనది. అందువల దీనిని సవికల్పము అంటున్నాము. అంత మాత్రం చేత ఇది ద్వైతము కాదు.

అ: నిర్వికల్ప సమాధి రూపమైన జ్ఞానానికి, ప్రత్యభిజ్ఞా జ్ఞానానికి, ఈరెండింటికీ విషయం ఆత్మేకదా ! అలాంటప్పుడు నిర్వికల్ప సమాధి అజ్ఞానాన్ని ఎందుకు

నశింపచెయ్యలేదు ?

జ; రెండింటికీ విషయం ఒక్కటే. అయినప్పటికీ అజ్జానరూపమైన కారణస్వరూపాల్లో భేదం ఉన్నది. సః, అహమ్‌ అనే రెండు శబ్దాల అర్ధజ్ఞానము కలిగి, ఇతర విషయాల నుండి పరావృతమైన మనస్సు ప్రత్యభిజ్ఞానానికి కారణం. 'ఆ ఘటమే ఇది' అనేటటువంటి జ్ఞానానికి, 'ఘటం'” అనే జ్ఞానానికి ఫలంలో తేడా ఉన్నట్లే ప్రత్యభిజ్జకు, సమాధికీ తేడా ఉన్నది.

ఇక నిర్వికల్పజ్ఞానము అజ్ఞానాన్ని తొలగించలేదు. ఎందుకంటే నిర్వికల్ప జ్ఞానానికీ దేనితోనూ విరోధం లేదు. ప్రతిబింబాలకు నిర్వికల్పమే ఆధారము, అద్దానికి, ప్రతిబింబానికి విరోధం లేదు. అద్దం ప్రతిబింబాన్ని నాశనం చెయ్యదు. అసలు 'నిర్వికల్పం'” అంటే - ప్రతిబింబంలేని అద్దంలాగా, జ్ఞేయం లేని జ్ఞానం మాత్రమే. తెరమీద ఉన్న చిత్రాలు

అద్దంలో ప్రతిబింబాలుగా కనిపిసాయి. అలాగే శుద్ధజ్ఞానంలోనే సంకల్పదశలో వికల్ప జ్ఞానాలన్నీ భాసిస్తున్నాయి. అందుచేత వికల్పాలతో కూడిన జ్ఞానమే అజ్ఞానం. అజ్ఞానమనేది రెండురకాలుగా ఉంటుంది.

1. కారణరూపము 2. కార్యరూపము 'నేను పరిపూర్జుడను' అనే జ్ఞానం లేకపోవటమే కారణరూపమైన అజ్ఞానం.

అ: ఖ్యాతి లేకపోవటమన్నా, జ్ఞానంలేకపోవటమన్నా ఒకటే కాదా ?

జి : దేశకాలాలకు ఆధారం చిదాత్మ అటువంటి చిదాత్మలో ఈ దేశకాలాలు విభాగాలను సృష్టించలేవు. అటువంటి జ్ఞానం లేకుండా, 'నేను ఇక్కడ ఇప్పుడున్నాను'

అనుకున్నప్పుడు, ఆత్మకు సంబంధించినటువంటి పరిపూర్ణజ్ఞానం భాసించటం లేదు.

అసంపూర్ణత్వమే భాసిస్తున్నది. ఇందులో నేను, ఇక్కడ, ఇప్పుడు అంటే నేను అనే ఆకారము, దేశము, కాలము ఈ ముడూ ఆత్మను పరిచ్చిన్నం చేస్తున్నాయి. అంటే భాగాలుగా చేస్తున్నాయి. ఈ రకంగా పరిపూర్ణమైన ఆత్మకు అపరిపూర్ణత కలిగించే జ్ఞానాన్నే “మూలజ్ఞానము” అంటారు. ఇదే కారణరూప అజ్ఞానం. దీని మూలంగానే నేను సన్నగా ఉన్నాను, లావుగా ఉన్నాను, నేను గ్రుడ్డివాడిని అనే జ్ఞానం కలుగుతుంది. ఇక్కడ ఆత్మకు దేహానికి, ఆత్మకు నేత్రానికి ఐక్యాన్ని ఆరోపణ చేస్తున్నాము.

దీన్నే కార్యరూప అజ్ఞానము అంటారు. అజ్ఞానంవల్లనే సంసార బంధనాలు కలుగుతున్నాయి. పరిపూర్ణమైన ఆత్మ విజ్ఞానం కలగనంతవరకు అజ్ఞానం పోదు.

ఇక పరిపూర్ణ ఆత్మవిజ్ఞానం రెండువిధాలుగా ఉంటుంది. 1. పరోక్షము 2. అపరోక్షము.

గురూపదేశంవల్ల, శాస్త్రాలను చదవటంవల్ల వరోక్షజ్ఞానం కలుగుతుంది. దీనివల్ల మోక్షం సిద్దించదు. దీర్హకాలసమాధి వల్ల పరిపక్వత పొందిన ఆత్మవిజ్ఞానం మాత్రమే చిరకాల వాసనలవల్ల వాతుకుపోయిన అజ్ఞానాన్ని ద్వైతభావాన్ని సమూలంగా నాశనం చేస్తుంది. ఇదే పరోక్షజ్ఞానము.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹

Telegram group :
🌻. చైతన్య విజ్ఞానం - Chaitanya Vijnanam
https://t.me/joinchat/Aug7plAHj-Ex1nwp4bfuEg

Telegram Channel :
🌻. చైతన్య విజ్ఞానం - Chaitanya Vijnanam
https://t.me/Spiritual_Wisdom

My Facebook group :
🌻. చైతన్య విజ్ఞానం - Chaitanya Vijnanam
https://www.facebook.com/groups/465726374213849/