త్రిపురా రహస్యము - 53 / Tripura Rahasya - 53


🌹. త్రిపురా రహస్యము - 53 / Tripura Rahasya - 53 🌹
🌻. స్వామి దత్తాత్రేయ విరచిత ఆత్మ జ్ఞాన యోగము 🌻

✍️. బ్రహ్మ శ్రీ క్రోవి పార్థసారథి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. సమాధి స్థితి - 3 🌴
అ: అలా అయితే పరోక్షజ్ఞానం అవసరం లేదా ?

జ; అలాకాదు, నమాధిస్టితికి చేరే ముందు శాస్త్రవిజ్ఞానం, గురూపదేశం ఉండితీరాలి. అంటే పరోక్షజ్ఞానం ఉండాలి. పరోక్షజ్ఞానం లేనివారికి సమాధిస్టితి అపరోక్షజ్హానం కలుగదు. ఎలాగంటే, ఒకడికి రత్నము అంటే ఎలా ఉంటుందో తెలియదు. ఊరికే పేరు మాత్రం విన్నాడు. ఆతడు ఒకనాడు రాజుగారి దగ్గర రత్నాన్ని చూశాడు. కాని అది రత్నము అని అతడికి తెలియలేదు. ఇంకొకడు రత్నాన్ని ఎప్పుడూ చూడలేదు. కాని దాన్ని గురించి పూర్తిగా విన్నాడు, తెలుసుకున్నాడు. ఇప్పుడు రాజుగారి దగ్గర కనపడింది. వెంటనే ఇది రత్నము అని గుర్తుపట్టెేశాడు. అంతకు ముందు రత్నాన్ని గురించి తెలుసుకున్నవాడు కూడా దాన్ని పరిశీలించి చూడకపోతే గుర్తించలేడు. అంటే దాన్ని గురించి గతంలో పూర్తిగా తెలుసుకుని ఉండాలి. ఇప్పుడు దృష్టిని కేంద్రీకరించి వరిశీలించాలి. ఈ రెండూ

లేని మొదటివాడు రత్నాన్ని చూసినా ఉపయోగంలేదు. వాడు ఎంత తెలివిగలవాడైనా ఫలితముండదు. అలాగే శాస్త్రజ్ఞానంలేని మూఢులు ఆత్మను గుర్తించలేరు. ఏకాగ్రత, పరిశీలన లేకపోతే పండితుల పాండిత్యం కూడా వ్యర్ధమే. కాబట్టి “దేహం కన్నవేరైన చిద్రూపమే నేను” అనే శాస్త్రవిజ్ఞానాన్ని సాధించాలి. అప్పుడే ఆపరోక్ష జ్ఞానం సిద్ధిస్తుంది.

బాగా ప్రకాశిస్తున్న నక్షత్రం ఆకాశంలో కనిపిస్తున్నప్పటికీ, 1. దానిని గురించి వినని, చూడని వాడు. 2. విన్నప్పటికీ దాన్ని గుర్తించాలనే పట్టుదల లేనివాడు. వీరిద్దరూ కూడా దాన్ని గుర్తించలేరు. సూర్యుడు అస్తమించిన తరువాత, శుక్రనక్షత్రం వడమటి దిక్కున తెల్లగా ప్రకాశిస్తుంది అని తెలసినవాడు, నేను ఆ నక్షత్రాన్ని చూసితీరాలి అనే పట్టుదల, దీక్ష ఉంటి దాన్ని చూడగలుగుతాడు.

సమాధి దశలు కలుగుతున్నప్పటికీ, ఏకాగ్రత లేకపోవటంచేతనే మూఢులు ఆపరాచితిని గూర్చి తెలుసుకోలేకపోతున్నారు. రత్నరాశుల మీద మనం నడుస్తున్నాం కాని అవి రత్నాలని గుర్తించలేకపోతున్నాం. అలాగే మనలోనే ఉన్న ఆత్మని మనం గుర్తించలేకపోతున్నాం. అప్పుడే పుట్టి న శిశువుకు లాగానే మనకు కలిగే నిర్వికల్పస్టితులు నిరువయోగమవుతున్నాయి. అందుచేతనే ఈ నమాధులవల్ల శిశువుకున్న అజ్జానంపోవట్లేదు, మనకు కూడా అది ఉపయోగించదు. అందుచేతనే వికల్పరూపమైన ప్రత్యభిజ్ఞా రూపమైన జ్ఞానము, ఈ సంసారబంధనానికి మూలమైన అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది.

అష్టావక్రా ! అనేక జన్మలలో పుణ్యం చేస్తేనేగాని మోక్షాపేక్ష కలగదయ్యా ! అసలు పుట్టి నవారిలో చేతనత్వం కలగటమే దుర్లభం. అందులోనూ మానవజన్మ మరీ దుర్లభం. అందులోనూ సూక్ష్మబుద్ధి ఉండటమనేది మరీ దుర్లభం. స్థావరజంగమాత్మకమైనది ఈజగత్తు. స్థావరములు అంటే స్థిరంగా ఉండేవి. పర్వతాలు, చెట్లు చేమలు మొదలైన జంగమాలు కదిలేవి, నడిచేవి, పశుపక్ష్యాదులు, స్థావరాలలో జంగమాలు నూరోవంతు కూడాలేవు. జంగామాలలో మానవులు వందోవంతులేరు. ఇక మానవులలో ఎక్కువమంది అజ్ఞానులు, పశుప్రాయులు వీరికి మంచి చెడు, పాపము, పుణ్యము అనే విచక్షణ ఉండదు. వీరిలో చాలామంది ఐహిక సుఖాలకై వెంపర్లాడతారు. మిగిలిన వారిలో ఎక్కువమంది అశాశ్వతమైన స్వర్లసుఖాలకై వెంపర్లాడతారు. వీరంతా ద్వైతమునే నమ్ముతారు. వీరి దృష్టిలో భగవంతుడు వేరు, భక్తుడు వేరు. లోకంలో ఇంకొకరకం వారున్నారయ్యా, వారికి అద్వైతతత్త్వం తెలుసు. కాని వారికి ద్వైతము మీదనే ఆసక్తి. వీరు అద్వైతాన్ని ఆక్షేపిసారు కూడా. పరమేశ్వరి యొక్క మాయ చాలా చిత్రమైనది. ఆ మాయకు లొంగిపోయి, చేతికి దొరికిన చింతామణిని గాజురాయి అని పారేసినట్లుగా వీరు, అందుబాటులో ఉన్న అద్వైత ఆత్మతత్త్వాన్ని ఉపేక్షిస్తున్నారు. పరదేవతను ఆరాధించి, ఆమెను సంతోషపెట్టిన వారు మాయ నుండి విముక్తులవుతారు. వారికి (శ్రద్ధ కలుగుతుంది. ఆత్నాద్వైతతత్త్వము అవగతమవుతుంది.

అప్పుడు వారికి పరమశాంతి కలుగుతుంది. ఆస్థితికి చేరిన వారు పురుషార్ధమైన మోక్షము పొందుతారు.

మునివుత్రా ! మోక్షప్రాప్తి ఎలా జరుగుతుందో చెబుతాను విను. అనలు దేవతాభక్తి కలగాలంటే అనేక జన్మలలో పుణ్యం చెయ్యాలి. సత్సాంగత్యం ఉండాలి. దేవతామహాత్యం వినాలి. ఆరకంగా భక్తితో దేవతారాధన చేస్తే ఆమె అనుగ్రహం కలుగుతుంది. దానివల్ల నిత్యానిత్య వివేకం కలుగుతుంది. దానివల్ల విషయవాంఛలు నశిస్తాయి. వైరాగ్యం కలుగుతుంది. ఆ తరువాత (శ్రేయోమార్గ మందు ఆసక్తి కలుగుతుంది. గురువు దగ్గర ఉపదేశం పొందటం వల్ల అద్వైతజ్ఞానం కలుగుతుంది. శాన్త్రజ్ఞానమే పరోక్షమైన అద్వైతజ్ఞానం. ఆ తరువాత ఈ అద్వైతజ్ఞానము సరియైనదా కాదా అని విచారించి, అది సత్యమే అని గ్రహించి ఒక నిశ్చయానికి వస్తాడు. దాన్నే నిశ్చయజ్ఞానం అంటారు. ఈ నిశ్చయజ్ఞానం వల్ల అనుమానాలన్నీ తీరిపోతాయి. అవ్వుడు మనస్సును పరమాత్మరూపంగా భావించి ధ్యానం చెయ్యాలి.

🌻. AMRUTASYA PUTRAAHA 🌻
https://chat.whatsapp.com/HrBxBAaKb0g73IXeMhwXmx

Telegram group :
🌻. చైతన్య విజ్ఞానం - Chaitanya Vijnanam
https://t.me/joinchat/Aug7plAHj-Ex1nwp4bfuEg

Telegram Channel :
🌻. చైతన్య విజ్ఞానం - Chaitanya Vijnanam
https://t.me/Spiritual_Wisdom

My Facebook group :
🌻. చైతన్య విజ్ఞానం - Chaitanya Vijnanam
https://www.facebook.com/groups/465726374213849/

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 TRIPURA RAHASYA - 53 🌹
🌻 THE MYSTERY BEYOND THE TRINITY 🌻

✍️ Ramanananda Saraswathi
📚 Prasad Bharadwaj

CHAPTER 12
🌴 The Appearance of the Reality of the Universe Depends on the Strength of Will of Creation - 4 🌴

80-82. He was alarmed on looking in all directions and requested the saint: Do not forsake me lest I should perish in this illimitable space. The saint laughed at his terror and said: I shall never forsake you. Be assured of it. Now look round at everything and have no fear.

83-95. The king took courage and looked all round. He saw the sky above, enveloped in the darkness of night and shining with stars. He ascended there and looked down below; he came to the region of the moon and was benumbed with cold. Protected by the saint, he went up to the Sun and was scorched by its rays. Again tended by the saint, he was refreshed and saw the whole region a counterpart of the Heaven. He went up to the summits of the Himalayas with the saint and was shown the whole region and also the earth.

Again endowed with powerful eyesight, he was able to see far-off lands and discovered other worlds besides this one. In the distant worlds there was darkness prevailing in some places; the earth was gold in some; there were oceans and island continents traversed by rivers and mountains; there were the heavens peopled by Indra and the Gods, the asuras, human beings, the rakshasas and other races of celestials. He also found that the saint had divided himself as Brahma in Satyaloka, as Vishnu in Vaikunta, and as Siva in Kailasa, while all the time he remained as his original-self, the king ruling in the present world.

The king was struck with wonder on seeing the yogic power of the saint. The sage’s son said to him: This sightseeing has lasted only a single day according to the standards prevailing here, whereas twelve thousand years have passed by in the world you are used to. So let us return to my father.

96. Saying so, he helped the other to come out of the hill to this outer world.

Thus ends the Chapter XII on “Sightseeing in the Ganda Hill” in Tripura Rahasya.

79. Once inside he roused up the sleeping individual to dream. The latter now found himself held by the saint in the wide expanse of ether.

[Note: The ativahika sarira (astral body), is exhaustively treated in Yoga Vasishta.]

80-82. He was alarmed on looking in all directions and requested the saint: Do not forsake me lest I should perish in this illimitable space. The saint laughed at his terror and said: I shall never forsake you. Be assured of it. Now look round at everything and have no fear.

Continues..
🌹 🌹 🌹 🌹 🌹