శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 1 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 1
🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 1 🌹 🌻. చతుర్థ దత్తావతారము 🌻 ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ సాయినాథాయ నమః ఓం శ్రీ గురుదేవ దత్తాయ నమః ఉపోద్ఘాతము: శ్రీ ప్రభువు యొక్క భక్తకార్య కల్పద్రుమ మహామంత్రాన్ని బిరుదావళి అంటారు. ఈ ఘోష ఎన్నో సంవత్సరాలనుండి అఖండంగా పఠించబడుతుంది. శ్రీప్రభు సంప్రదాయం యొక్క సారమంతా దీంట్లో నిక్షిప్తమై ఉన్నది. అందుకని ప్రభు సంప్రదాయకులకు ఇది అత్యంత మహత్వపూర్ణమైనది మరియు మంగళప్రదమైనది. *ఏదైనా మహత్తరమైన కార్యం ప్రారంభించడానికి ముందు బిరుదావళి పఠిస్తూ ప్రభు నామం జయజయకారం చేయడం ప్రభు భక్తుల ప్రథమ కర్తవ్యం. ఈ బిరుదావళిలో మాణిక్ ప్రభు మహారాజు గారి చరిత్ర బీజరూపంలో నిక్షిప్తమై ఉన్నది.* ప్రభు యొక్క అదిభౌతిక, అధిదైవిక, ఆధ్యాత్మిక స్వరూపం యొక్క యదార్థ వర్ణన ఈ బిరుదావళిలో ఉన్నది. *ఈ మహామంత్రం నిరంతరంగా చేసే భక్తులకు ప్రభువు యొక్క విశాలత్వం, సర్వవ్యాపకత్వం అనుభవమై ప్రభువు ఎప్పుడూ తమతో ఉంటారని నిశ్చలమైన విశ్వాసము కలుగుతుంది.* *బిరుదావళి* శ్రీ భక్తకార్య కల్పద్రుమ గురుసార్వభౌమ శ్రీమద్రాజాధిరాజ యోగిమహారాజ త్రిభువన