🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 2 / Sripada Srivallabha Charithamrutham - 2 🌹
*🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 2 / Sripada Srivallabha Charithamrutham - 2 🌹*
*✍ మల్లాది గోవింద దీక్షితులు*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*అధ్యాయము 1*
*🌴.చరితామృత రచయిత శంకరభట్టు, వ్యాఘ్రేశ్వర శర్మల వృత్తాంతము 🌴*
*అంతట నేను పెద్దపులి రూపములో నున్న ఆ జ్ఞానికి నమస్కరించితిని. వెంటనే ఆ పెద్దపులి 'ఓం'కారమును చేసినది. ఆ ధ్వనికి మొత్తం మరుత్వమలై అంతయును ప్రతిధ్వనించినది. సుశ్రావ్యముగా "శ్రీపాదరాజం శరణం ప్రపద్యే" అని ఆలాపించినది. నేను యీ వింత దృశ్యమును పరికించుచుంటిని.* *పెద్దపులి యొక్క రూపము నందలి అణువులన్నియును విఘటనము చెంది దాని నుండి కాంతిమయ దివ్యదేహధారి అయిన ఒక పురుషుడు అభివ్యక్తుడయ్యెను. ఆ దివ్య పురుషుడు వృద్ధ తపస్వికి నమస్కరించి ఆకాశమార్గమున కాంతిదేహముతో వెడలిపోయెను. నా యెదుట నున్న వృద్ధ తపస్వి మందహాసము చేసెను. నన్ను గుహలోనికి రమ్మని ఆహ్వానించెను. నేను మౌనముగా గుహలోనికి ప్రవేశించితిని.*
*వృద్ధ తపస్వి నేత్రయుగ్మము నుండి కరుణారసము ప్రవహించుచుండెను.* *కేవలము తన సంకల్ప ప్రభావముచే అతడు అగ్నిని సృజించెను. ఆ దివ్యాగ్ని లో హుతము చేయుతంకు కావలసిన పవిత్ర ద్రవ్యములను, కొన్ని మధుర పదార్థములను, పండ్లను సృజించెను. వైదిక మంత్రోచ్చారణ చేయుచు అతడు ఆ పదార్థములను ఆ దివ్యాగ్నిలో హుతము చేసెను.*
*ఆ వృద్ధ తపస్వి, "లోకములో యజ్ఞ యాగాది సత్కర్మలన్నియును లుప్తమయిపోవుచున్నవి. పంచ భూతముల వలన లబ్దిపొందిన మానవుడు పంచభూతాత్మకమైన దైవమును విస్మరించుచున్నాడు.* *దేవతా ప్రీతికరముగా యజ్ఞములు సలుపవలెను. యజ్ఞముల వలన దేవతలు సంతుష్టి చెందెదరు. వారి అనుగ్రహము వలన ప్రకృతి అనుకూలించును. ప్రకృతిలోని ఏ శక్తి వి విజ్రుంభించిననూ మానవుడు మనజాలడు. ప్రకృతి శక్తులను శాంతింప చేయకున్న అరిష్టములు సంభవించును. మానవుడు ధర్మ మార్గమును విడనాడిన యెడల ప్రకృతి శక్తుల వలన ఉపద్రవములు కలుగుచుండును. లోక హితార్థము నేను యీ యజ్ఞమును చేసితిని. యజమనగా కలయిక, అదృష్ట వశమున నీవు యీ యజ్ఞమును చూచితివి.* *యజ్ఞ ఫలముగా నీకు శ్రీదత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభ దర్శనము కలుగును. ఇది చాల అలభ్య యోగము. అనేక జన్మల నుండి చేసుకున్న పుణ్యమంతయునూ ఒక్కసారిగా ఫలితమివ్వనారంభించి యిటువంటి అలభ్య యోగమును కలిగించును" అని వచించెను.*
*నేను ఆ మహా పురుషునికి నమస్కరించి, "సిద్ధ వరేణ్యా! నేను పండితుడను గాను, యోగిని గాను, సాధకుడను గాను, అల్పజ్ఞుడను. నా యందు పరిపూర్ణ కటాక్షముంచి నాకు గల సందేహముల నివృత్తి చేయవలసినదని" కోరితిని. అందులకు ఆ వృద్ధ తపస్వి సమ్మతించిరి.*
*అంతట నేను "సిద్ధ వరేణ్యా! నేను శ్రీ కన్యకా పరమేశ్వరీ మాట దర్శనము చేసుకొన్నప్పుడు, అంబ నన్ను శ్రీపాద శ్రీవల్లభ దర్శనము కొరకు కురువపురము పొమ్మని చెప్పినది. ఇక్కడ తమ దర్శనము, వ్యాఘ్ర రూపములో ఉన్న మహాత్ముల వారి దర్శనము కలిగినది. ఇంతకూ వ్యాఘ్ర రూప మహాత్ములు ఎవరు? అసలు శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? ఈ నా సంశయములకు ఉత్తరామోసంగి నన్ను ధన్యుల చేయవలసినదని" ప్రార్థించితిని.*
*ఆ వృద్ధ తపస్వి ఇట్లు చెప్పనారంభించెను...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI PADA SRI VALLABHA CHARITHAMRUTHAM - 2 🌹*
*✍️ Satyaprasad*
*📚. Prasad Bharadwaj*
*CHAPTER 1*
*🌻 The Stories of Shankar Bhatt, the writer of ‘Charitamrutham’ and Vyaghreswara Sharma 🌻*
You could come here because of your luck. This is the place of penance (tapo bhumi) and also siddha bhumi. Your desire will be fulfilled. You will certainly have the fortune of having Srivallabha’s darshan.
The tiger present at the entrance of the cave is a ‘Jnani’. You salute to this ‘Jnani’.” I gave my salutations to that Jnani in the form of tiger. Immediately that tiger uttered ‘Aum’. The whole of Maruthwa Malai reverberated to that sound. It also sang pleasingly ‘Sripada rajam Sharanam Prapadye’. I was looking at this strange sight.
Then atoms in that form of tiger burst and a man with a divine glowing body appeared. After paying obeisance to that old monk, the divine person left into the sky with a glowing body. The old monk smiled. He invited me into the cave. I silently entered the cave. Grace was flowing from the eyes of the old monk. By mere wish, he created fire. He also materialized some items required to be offered into that divine fire, some sweet preparations and fruits. Chanting Vedic mantras, he offered all those materials into the fire.
He said, In this world, the good deeds like Yajnas and Yagas are becoming scarce. The man who is benefited by the five elements (Pancha Bhutas), air, water, sky, fire and earth, is ignoring God who is the source of these elements. One has to perform sacrifices (yajnas) to please Gods. With that, Gods will be satisfied and by their grace, the nature (prakruthi) becomes favorable to man. Man cannot withstand, if any power of nature becomes violent. If these powers of nature are not pacified, calamities occur. If man deviates from the righteous path problems come from the powers of nature. I did this sacrifice for the welfare of the world.
The meaning of ‘Yaajan’ is ‘Union’. You could see this yajna because of your good fortune. As the fruit of this yajna, you will have the darshan of Sripada Srivallabha, who is the embodiment of Lord Datta. This is a rare achievement. Such achievements occur when the merit acquired in many previous births start giving results at a time.”
I saluted to that great person and requested him, ‘Oh! Greatest among Siddhas! I am not a scholar, not a ‘Yogi’, not even a ‘Sadhaka’ (practitioner of spiritual discipline). I know very little.
Please keep complete grace on me and dispel my doubts’. The old monk agreed. Then I prayed, ‘Oh! Greatest among Siddhas! When I had darshan of Mother Kanyaka Parameswari, she told me to go to Kuruvapuram for the darshan of Sripada Srivallabha. Here I had your darshan and the darshan of the mahatma in the form of tiger. Who is that mahatma in the tiger form? Who is Sripada Srivallabha?`
That old monk started telling like this, ‘My Dear! In Godavari area in Andhra Desam, there is a village named Atreyapuram which is famous as the ‘Tapo Bhumi’ of Atri Maharshi. There, one Brahmin was born in Kasyapa gotra (known for Vedic pundits). He was named Vyaghreswara Sharma by his parents. Though the father was a great pundit, the son became dull headed. Though he had education, he could not even do ‘sandhya vandanam’. He used to say only “Vyaghreswara Sharma Aham Bho Abhivadaye”.
🌹 🌹 🌹 🌹 🌹