🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 3 / Sripada Srivallabha Charithamrutham - 3 🌹
*🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 3 / Sripada Srivallabha Charithamrutham - 3 🌹*
*✍ మల్లాది గోవింద దీక్షితులు*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*అధ్యాయము 1*
*🌴.చరితామృత రచయిత శంకరభట్టు, వ్యాఘ్రేశ్వర శర్మల వృత్తాంతము - 2 🌴*
*ఆ వృద్ధ తపస్వి యిట్లు చెప్పనారంభించెను. నాయనా! ఆంధ్ర దేశమునందు గోదావరీ మండలమందు అత్రి మహర్షి తపోభుమిగా ప్రసిద్ధి గాంచిన ఆత్రేయపుర గ్రామమునందు శ్రోత్రియమైన కాశ్యప గోత్రము నందు ఒక బ్రాహ్మణుడు జన్మించెను. అతనికి తల్లిదండ్రులు వ్యాఘ్రేశ్వర శర్మ అని నామకరణము చేసిరి. తండ్రి మహాపండితుడైనను అతడు మాత్రము పరమశుంఠ అయ్యెను. విద్యాభ్యాసము ఎంతకాలము చేసిననూ సంధ్యా వందనము కూడా చేయజాలడయ్యెను. "వ్యాఘ్రేశ్వర శర్మా అహంభో అభివాదయే" అని మాత్రము అనుచుండెను. తోటివారు పలుకు సూటిపోటి మాటలకు అతడు కలత చెందెను. తల్లిదండ్రుల అనాదరణ కూడా ఎక్కువయ్యెను. హిమాలయములందు మహాతపస్వులు ఉందురనియూ, వారి కరుణా కటాక్షముచే ఆత్మజ్ఞానము సిద్ధించుననియూ, అతడు విని యుండెను. తిలదానములు పట్టుతకును, అభావామేర్పడినపుడు అబ్దీకములకు పోవుటకునూ తప్ప, ఎవరునూ అతనిని పిలువకపోవుట వలన అతనిలో ఆత్మన్యూనతా భావమేర్పడెను.*
*ఒకానొక బ్రాహ్మీముహూర్తమున అతనికి స్వప్న దర్శనమైనది. ఆ స్వప్నమందు దివ్యమైన కాంతితో విరాజిల్లుచున్న ఒక దివ్య శిశువు కనిపించెను. ఆ శిశువు నభోమండలము నుండి భూమి మీదికి దిగి వచ్చుచుండెను. వాని శ్రీ చరణములు భూమిని తాకగనే యీ భూమండలము దివ్యకాంతి తో నిండిపోయెను. ఆ దివ్య శిశువు వ్యాఘ్రేశ్వర శర్మ వైపునకు నెమ్మదిగా అడుగులు వైచుచూ వచ్చి, "నేనుండగా నీకు భయమెందులకు? ఈ గ్రామమునకును నాకునూ ఋణానుబంధము కలదు. ఋణానుబంధము లేనిదే శునకమైననూ మన వద్దకు రాజాలదు. నీవు హిమాలయ ప్రాంతమైన బదరికారణ్యమునకు పొమ్ము నీకు శుభామగును" అని పలికి అంతర్థానమయ్యేను.*
*వ్యాఘ్రేశ్వర శర్మ బదరికారణ్యమునకు చేరెను. మార్గ మధ్యమున అతనికి అయాచితముగా భోజనము సిద్ధించుచుండెను. అయితే అతడు బయలుదేరినది మొదలు ఒక కుక్క అతనిని అనుసరించి వచ్చుచుండెను. కుక్కతో పాటు అతడు బదరికారణ్యములో సంచరించ సాగెను. అతడు తన సంచారములో ఊర్వశీకుండమున పుణ్యస్నానములు చేసెను. తనతో పాటు ఆ కుక్క కూడా పుణ్యస్నానములు చేసెను. అదే సమయమందు ఆ ప్రాంతములకు ఒక మహాత్ముడు తన శిష్యులతో ఊర్వశీకుండమునకు పుణ్యస్నానము నిమిత్తము వచ్చెను. వ్యఘ్రేశ్వరుడు ఆ మహాత్ముని పాదపద్మములకు మ్రొక్కి తనను శిష్యునిగా స్వీకరించవలసినదని ప్రార్థించెను. ఆ మహాత్ముడు దయతో అంగీకరించెను. ఆ మహాత్ముడు వ్యాఘ్రేశ్వరుని శిష్యునిగా స్వీకరించిన తక్షణమే ఆ కుక్క అంతర్థానమయ్యెను.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI PADA SRI VALLABHA CHARITHAMRUTHAM - 3 🌹*
*✍️ Satyaprasad*
*📚. Prasad Bharadwaj*
CHAPTER 1
*🌻 The Stories of Shankar Bhatt, the writer of ‘Charitamrutham’ and Vyaghreswara Sharma 🌻*
He was disturbed by the ridicule of his colleagues. Parents also neglected him. He heard that there would be great ‘tapasvis’ in Himalayas and one could get ‘Atma Jnana’ by their grace. He was called only to take donation of gingilli seeds and in ceremonies of departed souls, when others were not available. So he developed an inferiority complex.
One early morning in Brahmi Muhurtham, he had a dream. In that dream he saw a divine baby having divine light around him. That baby was coming from the sky above on to the earth. When His Sri Charanas (feet) touched earth, the ‘Bhumandalam’ was filled with divine light. That baby came to Vyaghreswara Sharma with slow steps and said “why do you fear when I am with you? I owe much to this village. Without debt, even a dog cannot come to us. You go to Badarikaranyam in Himalayas. It will be auspicious to you.” Then the baby disappeared.
Vyaghreswara Sharma reached Badarikaranyam. On the way he was getting food without any effort. From the time he started, one dog accompanied him. He was roaming in Badarikaranyam along with the dog. In his journey, he took sacred bath in Urvasi Kundam. Along with him, the dog also took sacred bath. At the same time, one mahatma came to that area along with his disciples to take sacred bath in Urvasi Kundam. Vyaghreswara paid obeisance to that mahatma’s lotus feet and prayed him to take him as his disciple. That mahatma kindly agreed. Immediately after he was accepted as a disciple of that mahatma, the dog disappeared.
The mahatma said, ‘Vyaghreswara! The dog which came along with you is the merit acquired in your previous births. You could come here directed by ‘kaala’ (time) and take bath in Urvasi Kundam. You are attracted to the ‘tapo bhoomi’ of Nara and Narayana. All this is indeed Sripada Srivallabha’s grace!’
Vyaghreswara Sharma humbly questioned, “Gurudev! Who is Sripada Srivallabha? How did he develop affection on me?” The mahatma said, ‘My Dear! Sripada Srivallabha is none other than ‘Sri Datta Prabhu’. In Tretha Yuga, Maharshi Bharadwaj conducted a great ‘yajna’ called ‘Savitrukathaka Chayanam’ in Sri Peetikapuram.
For that, he invited Lord Shiva and Parvathi. According to the boon granted to Bharadwaja, many Mahatmas, Sidda Purushas, Jnanis and Yogis took birth in Bharadwaja Gothra. This fact as well as the fact that Savitrukathaka Chayanam was performed in Sri Peetikapuram was mentioned in ‘Pyngya Brahmanam’. Though they are not seen in other parts of the country, the ‘Pyngya Brahmanam’ and ‘Sandra Sindhu Vedam’ are carefully protected in the village ‘Shambala’ which will be the place of birth of ‘Kalki’ Avatar.
🌹 🌹 🌹 🌹 🌹