🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 1 / Sripada Srivallabha Charithamrutham - 1 🌹
*🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 1 / Sripada Srivallabha Charithamrutham - 1 🌹*
*✍ మల్లాది గోవింద దీక్షితులు*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*అధ్యాయము 1*
*🌴.చరితామృత రచయిత శంకరభట్టు, వ్యాఘ్రేశ్వర శర్మల వృత్తాంతము 🌴*
*భాగము 1*
*శ్రీ మహా గణాధిపతికి, శ్రీ మహా సరస్వతికి, అస్మద్గురు పరంపరకు, శ్రీకృష్ణ భగవానునికి, సమస్త దేవీదేవతా గణములకు ప్రణామాంజలులు సమర్పించి, శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీదత్త ప్రభువు యొక్క నవావతరణ ( శ్రీపాద శ్రీవల్లభుడు) వైభవము ను వర్ణింపదలచినాను.*
*శ్రీ దత్తాత్రేయుడు అతి ప్రాచీనుడు, నిత్య నూతనుడు, శ్రీ దత్తాత్రేయుల వారు ఈ కలియుగములో ఆంధ్ర దేశము నందలి గోదావరీ ప్రాంత ప్రదేశమయిన శ్రీ పీఠికాపురమను గ్రామము నందు శ్రీపాద శ్రీవల్లభుడు అను నామము తో అవతరించిరి. వారి దివ్య చరిత్రను, దివ్యలీలా వైభవమును వర్ణించుటకు మహా మహా పండిత వరేణ్యులకే అసాధ్యము. అటువంటిది ఎంత మాత్రము విద్యాగంధములేని అల్పజ్ఞుడనయిన నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకోనుట కేవలము వారి సంకల్పము, దైవాజ్ఞ, వారి దివ్యాశీస్సుల వలననేననియు సర్వ జనులకు వినయ పూర్వకముగా తెలియజేసు కోనుచున్నాను.*
*నా పేరు శంకరభట్టు. నేను కర్ణాటక దేశస్థుడను. స్మార్తుడను, భారద్వాజ గోత్రోద్భవుడను. శ్రీకృష్ణ భగవానుని దర్శనార్థము నేను ఉడుపి క్షేత్రమునకు వెళ్ళితిని. అచ్చట బాలకృష్ణుడు నెమలి పింఛముతో, ముగ్ధ మనోహరముగా దర్శనమిచ్చి, కన్యాకుమారి లోని శ్రీ కన్యకా పరమేశ్వరీ దర్శనార్థము పోవలసినదని నన్ను ఆజ్ఞాపించెను.*
*నేను కన్యాకుమారిలోని శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవిని దర్శించితిని. సాగరత్రయ సంగమ ప్రదేశమున పుణ్యస్నానములు చేసితిని. ఒకానొక మంగళవారము శ్రీ దేవి దర్శనార్థము గుడిలో ప్రవేశించితిని. పూజారి నిష్ఠగా దేవికి పూజ చేయుచుండెను. అతడు నా చేతిలోని ఎర్రరంగు గల పుష్పములను గ్రహించి పూజ చేయుచుండగా, అంబ నా వైపు కరుణాపూరిత దృష్టి తో చూచుచు, " శంకరా! నీ హృదయము నందు గల పవిత్ర భక్తికి సంతసించితిని. నీవు కురువపురమునకు పోయి అందుగల శ్రీపాద శ్రీవల్లభుల వారిని దర్శించి జన్మ సార్థక్యమును పొందుము. శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శన మాత్రముననే నీ మనస్సునకు, ఆత్మకు, సర్వేంద్రియములకు అనిర్వచనీయమైన అనుభవము కలుగునని" చెప్పెను.*
*నేను అంబ అనుగ్రహమును పొంది పుణ్యధామము నుండి ప్రయాణమును సాగించుచు స్వల్ప దూరములోనే యున్న మరుత్వమలై అను గ్రామమునకు వచ్చితిని. శ్రీ హనుమంతుడు సంజీవిని పర్వతమును తిరిగి హిమాలయములకు తీసుకొని పోవునపుడు దానిలో నుండి ఒక ముక్క జారి క్రింద పడినదనియు దానినే మరుత్వమలై అని పిలిచెదరనియు తెలుసుకొంటిని.*
*మరుత్వమలై గ్రామమునందు గల ఆ కొండ చూడచక్కనైనది.* *దానిలో కొన్ని గుహలు కలవు. ఆ ప్రదేశము సిద్ధ పురుషులు అదృశ్య రూపమున తపస్సు చేసుకోను పర్వత భూమి అని తెలుసుకొంటిని. నా అదృష్టరేఖ బాగున్న యెడల ఏ మహా పురుషులనైనా దర్శింపలేకపోవుదునాయని ఆ గుహలందు చూచుచుంటిని. ఒక గుహ ద్వారము వద్ద మాత్రము ఒక పెద్దపులి నిలబడియున్నది. నాకు సర్వాన్గాముల యందును వణుకు, దడ పుట్టినవి. భయ విహ్వాలుడనయిన నేను ఒక్కసారిగా శ్రీపాదా! శ్రీవల్లభా! దత్తప్రభూ! అని బిగ్గరగా అరచితిని. ఆ పెద్దపులి సాధుజంతువువలె నిశ్చలముగా ఉండెను. ఆ గుహనుండి ఒక వృద్ధ తపస్వి బయటకు వచ్చెను. మరుత్వమలై ప్రాంతమంతయును ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ నామము ప్రతిధ్వనించినది.*
*అంతట ఆ వృద్ధతపస్వి "నాయనా! నీవు ధన్యుడవు. శ్రీదత్త ప్రభువు యీ కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ నామమున అవతరించినారని, మహా సిద్ధపురుషులకు, మహా యోగులకు, జ్ఞానులకు, నిర్వికల్ప సమాధిస్థితి యందుండు పరమహంసలకు మాత్రమే వేద్యము. నీవు అదృష్టవంతుడవు కావుననే ఇచ్చటకు రాగలిగితివి. ఇది తపోభూమి. సిద్ధభూమి. నీ కోరిక సిద్ధించును. నీకు తప్పక శ్రీవల్లభుల దర్శన భాగ్యము కలుగును. ఈ గుహ ద్వారము వద్దనున్న యీ పెద్దపులి ఒక జ్ఞాని. ఈ జ్ఞానికి నమస్కరింపుము," అని వచించెను.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI PADA SRI VALLABHA CHARITHAMRUTHAM - 1 🌹*
*✍️ Satyaprasad*
*📚. Prasad Bharadwaj*
CHAPTER 1
*🌻 The Stories of Shankar Bhatt, the writer of ‘Charitamrutham’ and Vyaghreswara Sharma 🌻*
Rendering my salutations to Sri Maha Ganadhipathi, Sri Maha Saraswathi, the lineage of my Gurus, Sri Krishna Bhagawan and all Gods and Goddesses, I have now decided to describe the glory of Sripada Srivallabha who is the latest manifestation of Sri Lord Datta, who is the Lord of Crores of Universes.
Sri Dattatreya is the oldest and the eternal one. In this ‘Kaliyuga’, he is born with the name of Sripada Srivallabha in the village Sri Peethikapuram, which is in the Godavari region of Andhra Pradesh. It is impossible even for great scholars to describe His divine history and the glory of His divine plays. Not having any scholarship and with limited knowledge, I have taken the task of describing His history. I humbly submit to all, that it is all due to His decision, His direction and His divine blessings. I am Shankar Bhatt and I belong to Karnataka region. I am a ‘Smarta’ and worship both Lord Vishnu & Lord Shiva. I belong to Bharadwaja Gothra (lineage).
I went to Udipi to have darshan of Sri Krishna Bhagawan. There, Balakrishna gave me darshan as a pretty boy with a tuft of peacock feathers on his head and ordered me to go to Kanyakumari to have darshan of Sri Kanyaka parameswari. I had darshan of Sri Kanyaka parameswari in Kanyakumari. I took bath in the holy confluence of three seas there. On one Tuesday, I entered the temple for darshan of Sri Devi. The priest was doing worship to Devi with rapt attention. He took red coloured flowers from me and did worship.
The Mother looked at me with graceful looks and said ‘Shankara! I am pleased with the innocent devotion present in your heart. You go to ‘Kuruvapuram’ and have darshan of Sripada Srivallabha and get your life fulfilled. With mere darshan of Sripada Srivallabha, you will have indefinable experiences in your mind, soul and all your senses. Having got the blessings of ‘Mother’, I started from that holy place and reached a village named ‘Maruthwa Malai’, which was nearby. I learnt that while Sri Hanumantha was taking the ‘Sanjeevini Hill’ back to Himalayas, a piece fell from it at that place and so it was named ‘Maruthwa Malai.
That hill present in the Maruthwa Malai village was good looking. It had some caves in it. I learnt that it was the place where “Siddha Purusha’s” (illumined souls) did penance incognito. I was looking into the caves to find some Siddha Purusha if I was fortunate enough. I found a big tiger at the entrance of a cave. All my body parts started trembling and I was palpitating. Frightened, I once shouted loudly ‘Sripada! Srivallabha! Datta Prabhu!’ That tiger remained calm and immobile like a domestic animal. One old monk came out of that cave. Suddenly that place of Maruthwa Malai reverberated the name ‘Sripada Srivallabha’.
That old monk said, “My dear! You are blessed. Only great siddha purushas, great yogis, Jnanis and Paramahamsas who remain in ‘Nirvikalpa Samadhi’ only know that Sri Datta Prabhu has manifested Himself as Sripada Srivallabha in this ‘Kali’ yugam.
🌹 🌹 🌹 🌹 🌹