శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 1 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 1
🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 1🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః
ఓం శ్రీ సాయినాథాయ నమః
ఓం శ్రీ గురుదేవ దత్తాయ నమః
ఉపోద్ఘాతము:
శ్రీ ప్రభువు యొక్క భక్తకార్య కల్పద్రుమ మహామంత్రాన్ని బిరుదావళి అంటారు. ఈ ఘోష ఎన్నో సంవత్సరాలనుండి అఖండంగా పఠించబడుతుంది. శ్రీప్రభు సంప్రదాయం యొక్క సారమంతా దీంట్లో నిక్షిప్తమై ఉన్నది. అందుకని ప్రభు సంప్రదాయకులకు ఇది అత్యంత మహత్వపూర్ణమైనది మరియు మంగళప్రదమైనది. *ఏదైనా మహత్తరమైన కార్యం ప్రారంభించడానికి ముందు బిరుదావళి పఠిస్తూ ప్రభు నామం జయజయకారం చేయడం ప్రభు భక్తుల ప్రథమ కర్తవ్యం. ఈ బిరుదావళిలో మాణిక్ ప్రభు మహారాజు గారి చరిత్ర బీజరూపంలో నిక్షిప్తమై ఉన్నది.* ప్రభు యొక్క అదిభౌతిక, అధిదైవిక, ఆధ్యాత్మిక స్వరూపం యొక్క యదార్థ వర్ణన ఈ బిరుదావళిలో ఉన్నది. *ఈ మహామంత్రం నిరంతరంగా చేసే భక్తులకు ప్రభువు యొక్క విశాలత్వం, సర్వవ్యాపకత్వం అనుభవమై ప్రభువు ఎప్పుడూ తమతో ఉంటారని నిశ్చలమైన విశ్వాసము కలుగుతుంది.*
*బిరుదావళి*
శ్రీ భక్తకార్య కల్పద్రుమ
గురుసార్వభౌమ
శ్రీమద్రాజాధిరాజ యోగిమహారాజ
త్రిభువనానంద అద్వైత అభేద
నిరంజన నిర్గుణ నిరాలంబ
పరిపూర్ణ సదోదిత సకలమతస్థాపిత
శ్రీ సద్గురు మాణిక్యప్రభు
మహారాజ్ కీ జయ్!
*శ్రీ మాణిక్ ప్రభు పంచభూతాలను కూడా ఆజ్ఞాపించే శక్తి కలవారని నిరూపించారు. విశ్వశ్రేయస్సు ఆయన ధ్యేయమై, వారి సన్నిధిలో, దర్శనంతో, స్మరణతో అచేతనమైనది కూడా చైతన్యవంతమై అంతా ప్రభు రూపమై ఉండేది. దేశకాల పరిస్థితులకు అనుగుణంగా జనులకు జనన, మరణ బాధలేని ఆనందమును పొందేట్లు చేసే వాతావరణమును సృష్టించాలని వ్యక్తిగా ఒక సుక్షేత్రంలో, ఒక విశిష్ట సమాజంలో జన్మించారు.*
మాణిక్ ప్రభువు భౌతికముగా మానవరూపంలో కనిపించినా ఆయన సర్వ వ్యాపకత్వం అనే సమాధి స్థితిని అందుకున్నారు.
*ప్రభు యొక్క బిరుదావళిలో ఆయన అఖిలాండకోటి నాయకునిగాను, భక్తుల కోరికలను తీర్చేవారిగాను, జగద్గురువుగాను, సర్వశక్తిమంతులుగాను, గురువులలో సార్వభౌముడిగాను, యోగులలో మహారాజువంటివారిగాను, సర్వులకూ ఆనందాన్నిచ్చే వారిగాను, అద్వితీయులుగాను, గుణాతీతులుగాను, స్థితప్రజ్ఞులుగా కీర్తించబడ్డారు. జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం మరియు ఔదార్యం కలిగి సర్వకాలాల్లోనూ విరాజిల్లే ప్రభువై ప్రపంచంలోని సర్వ ధర్మములను ఒకే తాటిపైకి తెచ్చి జగద్గురువై మాణిక్ ప్రభు పేరుతో వచ్చిన దత్తుడికి సదా జయమగుగాక.*
తరువాయి భాగం రేపు చదువుకుందాం......
ఓం సాయిరామ్
దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 1 🌹
✍️. Nagesh D. Sonde
📚. Prasad Bharadwaj
🌻 01. Introduction 🌻
The Truths which are enshrined in the Vedic Hymns are Perennial in substance and Universal in application.
They are therefore, referred to as Sanatana, Nitya and Apaurusheya. The Vedas do not propound any particular thought or seek to establish any particular system of philosophy.
They do not owe their origin to any one particular person, prophet or preacher. They are the product of supra-sensory perception of the Seers who, it is said, have ‘seen’ the hymns.
The Vedas are Wisdom, eternal and all-comprehensive. They are available for all, irrespective of whether one is faithful or an agnostic.
The ‘Seers’ saw the Satya (that which ever IS), the Rta (the Cosmic Order), the Dharma (the Perennial Principles) in their pristine pure vision and what they saw, they experienced and what they experienced they stored in their hearts and expressed through mental concepts.
Their expressions are, therefore, eternal and universal because what they expressed was not conditioned by Time, Space or Place.
Since their intention was (to) ‘Let noble thoughts come to us from every side’ (Rig Ved.I.89.1), their hearts and minds were ever receptive to the resonance of the Eternal Sound, AUM, the Primal Source of all Wisdom.
Therefore, the Vedas were called the breath of Brahman, the Wisdom itself, the Brahman.
Seer Atri was one such ‘Seers’ who had ‘seen’ and experienced the Brahman, the eternal Wisdom. The Vedas contain many of the hymns seen by him and the members of his family.
To him was born a son, the product of the Grace or the Divine Will, which was the manifestation of all three Primal Energies of Brahma, Vishnu and Maheshvar.
Legend says that since he was ordained with the three energies, he was endowed with the concentrated wisdom of the three God-heads, or symbolically three heads.
Hence he came to be called ‘Dattatreya’. In the Vedas, we do not find any hymns which are attributed to him, but then he had not descended on this earth to recount his personal experiences but to establish SatyaRta-Dharma, in all its entirety, which had lost their potency with the flux of time.
In Brahma Purana (213.106-112), it is declared that his descent is for the purpose of establishing the Vedic values, which had lost their purity due to the passage of time.
“The Compassionate Shri Dattatreya, who was the descent of Shri Vishnu, the in-dweller of all creatures, resurrected the Vedas, the rituals and the sacrifices and provided proper place to the fourfold order, when the Vedas, the rituals and sacrifices were losing their hold, when righteousness was on the wane and unrighteousness was gaining strength, when Truth was declining and untruth was gaining, when human beings were suffering and dharmic values were hampered.”
Continues......
🌹 🌹 🌹 🌹 🌹