శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 0 / Sripada Srivallabha Charithamrutham - 0
🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 0 / Sripada Srivallabha Charithamrutham - 0 🌹 ✍️. మల్లాది గోవింద దీక్షితులు 📚. ప్రసాద్ భరద్వాజ ఉపోద్ఘాతము శ్రీపాద శ్రీవల్లభుల గురించి శ్రీ గురు చరిత్ర లో లభించెడి సమాచారం బహు స్వల్పం. కలియుగములో ప్రప్రథమ దత్తావతారం శ్రీపాద శ్రీవల్లభుడు . వారి జీవిత విశేషాలను గురించి బయట ప్రపంచానికి తెలిసినది బహు తక్కువ. క్రీ. శ. 1320 లో శ్రీపాద శ్రీవల్లభుడు బ్రహ్మశ్రీ ఘండికోట అప్పలరాజు శర్మ గారికి, అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి సుమతీ మహారాణి కి తృతీయ సంతానంగా జన్మించినారు. శ్రీపాదుల వారికి శ్రీధర రాజశర్మ, రామ రాజశర్మ అను ఇద్దరు అన్నలును, శ్రీ విద్యాధరి, రాధ, సురేఖ అను ముగ్గురు చెల్లెండ్రును గలరు. వారు భారద్వాజ గోత్రీకులు. ఆపస్తంబ సూత్రులు. శ్రీపాదుల వారి మాతామహులు బ్రహ్మశ్రీ మల్లాది బాపన్నావధానులు. వారి ధర్మ పత్ని అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి రాజమాంబ. శ్రీపాదుల వారి దివ్య చరిత్రను శంకరభట్టు అను కన్నడ బ్రాహ్మణుడు సంస్కృతంలో రచించినాడు. దాని తెలుగు అనువాదం బాపన్నావధానులు గారి ౩౩వ తరం వాడినయిన నా వద్ద ఉన్నది. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం లో బాప...