త్రిపురా రహస్యము - 4 / Tripura Rahasya - 4
🌹. త్రిపురా రహస్యము - 4 / Tripura Rahasya - 4 🌹
🌻. స్వామి దత్తాత్రేయ విరచిత ఆత్మ జ్ఞాన యోగము 🌻
✍️. బ్రహ్మ శ్రీ క్రోవి పార్థసారథి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴 2. త్రిపురోపాసన - దీక్ష 🌴
మరుత్తు అనే మహరాజు సుగుణ సంపన్నుడు. ఆ రాజు ఒక యజ్ఞము చెయ్యాలి అనుకుని, ఆ యజ్ఞాన్ని చేయించ వలసినదిగా బృహస్పతిని కోరాడు. ఇతడు యజ్ఞం చెయ్యటం ఇంద్రుడికి ఇష్టం లేదు. అందుకని ఇంద్రుడు ముందుగానే బృహస్పతి దగ్గరకు వెళ్ళి ఆ యజ్ఞం చేయించవద్దు అని చెప్పాడు. ఇంద్రుని మాట ప్రకారం బృహస్పతి యజ్ఞం చేయించను అన్నాడు. ఆ మాటలు విన్న మరుత్తు విచారంతో తిరగసాగాడు.
అప్పుడు నారదుడు వచ్చి సంవర్తుణ్ణి అర్ధించు. అతడు మహాపండితుడు, జ్ఞాని. అతడు వచ్చి నీ యాగం చేయిస్తాడు అని చెప్పాడు. మరుత్తు సంవర్తుడ్డి ఆశ్రయించాడు. సంవర్తుడు సరేనన్నాడు. సంవర్తుడు యాగం చేయించటం ఇంద్రుడికి ఇష్టం లేదు. అందువల్ల అనేక ఆటంకాలు కలిగించాడు, బెదిరించాడు. భయపెట్టాడు. అయినా బెదరలేదు. యజ్ఞం పూర్తి చేయించాడు సంవర్తుడు.
అసలు ఈ ప్రపంచం దేని నుంచి పుట్టింది ? ఎక్కడకు వెడుతోంది ? దేనిలో లయమవుతున్నది ? ఈ జగత్తు అంతా మిధ్య, ఈ మాట తెలిసి కూడా జనులు వారి పనులు వారు చేస్తున్నారు. బాగా ఆలోచించి చూస్తే లోక వ్యవహారమంతా కూడా ఒక గ్రుడ్డివాడి చెయ్యి పట్టుకుని ఇంకొక గ్రుడ్డివాడు నడిచి వెడుతున్నట్లుంది. వాళ్ళందరిదాకా ఎందుకు? నా సంగతి చూస్తేనే తెలుస్తున్నది. బాల్యం ఎలా గడిచిందో గుర్తు లేదు.
కౌమార, యవ్వన దశలు వేరువేరుగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొకరకంగా ఉన్నది. ఆ రోజుల్లో ఇరవై ఒక్కసార్లు రాజులమీద యుద్ధం ప్రకటించి, వారి వంశనాశనం చేశాను. పరమేశ్వరుణ్ణి గురించి తపస్సు చేసి భార్గవాస్త్రము, గండ్రగొడ్డలి పొందాను. మరి ఇప్పుడు ఈ రకంగా ఉన్నాను. ఎప్పుడు ఏ పని చేసినా అది మంచిపనే అని నమ్మ చేశాను. దేనివలన నాకు సుఖము కలగలేదు. మనం చేసిన పనికి ఫలితము ఏది అని భావిస్తున్నామో, అది ఫలితము కాదు. విమర్శ చెయ్యనంత వరకే ఆ ఫలితము. ఒక ఫలితము వచ్చిన తరువాత ఇంకొక దానికి ప్రయత్నిస్తున్నాము. అంటే మొదటిది ఫలం కాదనే కదా అర్ధం. అది సంపూర్ణ ఫలాన్నిస్తే, ఇంకొకటి ఎందుకు ? అసలు ఈ పనులు మనం ఎందుకు చేస్తున్నాము ?
ఆ రకంగా కర్మలు చేసినందువల్ల దుఃఖనాశనము జరుగుతుందా ? కర్తవ్య శేషం ఉన్నంతవరకు దుఃఖం నాశనం కాదు. ఈ 'కర్తవ్యము' అనేది ఉవ్నదే, అదే దుఃఖాలన్నింటికి మించిన మహా దుఃఖము. అది ఉన్నంత వరకు సుఖం కలగదు.
అయితే కర్తవ్యతా శేషమున్నప్పటికీ సుఖము కలుగుతున్నది కదా ? అంటారు. అది నిజం కాదు. ఒక వ్యక్తికి శరీరమంతా కాలిపోయింది. ఇప్పుడు అతడి పాదాలకు చల్లని మంచి గంధం రాస్తే అతడికి సుఖము కలుగుతుందా ? గుండెల్లో బాకు దిగబడి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న వాడిని అప్సరాంగన వచ్చి కౌగిలించుకుంటే అది
సుఖంగా ఉంటుందా ? రోగంతో ఊపిరాడక దగ్గుతున్న వాడికి మంచి సంగీతం వినిపిస్తే అది వాడికి సుఖంగా ఉంటుందా ? లేదే ? మరి సుఖం అంటే ఏమిటి ? కోరికలన్నీ తీరిపోయి ఇంక చెయ్య వలసినది, అనుభవించ వలసినది ఏమీ లేదు అని నిర్ణయించి నప్పుడు, అంటే కర్తవ్యత లేనప్పుడు, అదే నిజమైన సుఖము.
కాబట్టి కర్తవ్యతా శేషమున్న మనిషికి సుఖము అంటే ఉరి తియ్యబోయే వాడికి పూలదండ వేసినందువల్ల వచ్చే సుఖమే. ఈ సుఖం వల్ల అతడికి ఆనందం కలగదు.
కర్తవ్యాలు, కోరికలూ అన్నీ తీరిపోయిన వారికే సుఖమనేది కలుగుతుంది. అంతేగాని బోలెడు కర్తవ్యం ముందుండగా, లోకయాత్రలో సుఖమున్నదని దాని కోసం ప్రయత్నిస్తుంటారు. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి, కర్తవ్యము కొండలా వుంది. దాని క్రింద నలిగిపోతూ కూడా సుఖమున్నది అనుకుంటున్నాడు మానవుడు. సుఖదుఃఖాల అవగాహన పూర్తిగా లేకపోవటం చేత ఈ స్టితి కలుగుతోంది.
ఈ లోకంలో చక్రవర్తి మొదలు భిక్షకుని వరకూ అందరూ ప్రతి రోజూ సుఖం పొందటానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. సుఖం పొందుతూనే ఉన్నారు. కాని అందరి సుఖము ఒకలాగా ఉండదు. ఎవరి సుఖము వారిది. రాజు విలాసాలతో, విందులతో సుఖం పొందితే, భిక్షకుడు గంజిత్రాగి త్రోవపక్కన చెట్టు క్రింద సుఖం పొందుతాడు. ఈ రకంగా సుఖం పొందుతూ తాము కృతకృత్యులమయ్యామని అందరూ అనుకుంటూనే ఉన్నారు. వారికిమల్లేనే నేను కూడా నడుస్తున్నాను. అంధకూప న్యాయం లాగా వారిని అనుసరిస్తున్నాను.
అంధకూపన్యాయము అంటే (గ్రుడ్డి వాళ్ళు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని వరుసగా పోతున్నారు. ముందు వాడు ఒక నూతిలో పడ్డాడు. మిగిలినవారికి కూడా ముందు ఏముందో తెలియదు కాబట్టి అందరూ నూతిలోనే పడతారు. నేను అసలు తెలివి లేకుండా, ఆలోచన లేకుండా ఈ పనులు చేస్తున్నాను. ఇప్పుడు నా గురువు దగ్గరకు మళ్ళీ వెళ్ళి, గురుపాదాలు ఆధారంగా ఈ దుఃఖ సాగరాన్ని దాటుతాను” అని నిర్ణయించుకున్న వాడైై బయలుదేరి గంధమాదన పర్వతం మీద ఉన్న గురువును సమీపించాడు. ఆ సమయంలో గురువైన దత్తాత్రేయుడు ధ్యానంలో ఉండి కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తున్నాడు.
గురువుకు సాష్టాంగ ప్రణామం చేశాడు పరశురాముడు, శిష్యుణ్ణి లేవదీసి వాత్సల్యంతో కుశలప్రశ్నలు వేశాడు దత్తాత్రేయుడు. గురు స్పర్శ తో ఊరట చెందినవాడై, “గురుదేవా ! మీ
దయకు పాత్రుడైన వాడికి ఇంకా కోరికలు, కష్టాలు అనేవి ఉండవు. నదీతీరంలో ఉన్నవాడికి, నీటి కరువుండదు కదా! నా మనసు సదా మిమ్ములనే తలస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకు మిమ్మల్ని చూడాలనిపించింది. ఇక్కడికి వచ్చాను. స్వామీ ! చాలాకాలం నుండి ఒక్క అనుమానం నన్ను పీడిస్తోంది. మీ దగ్గర దాన్ని నివృత్తి చేసుకుంటాను. మీరు అనుమతిస్తే, నా సంశయము వివరిస్తాను” అన్నాడు పరశురాముడు.
ఆ మాటలు విన్న దత్తాత్రేయుడు. “భార్గవా ! నీ గురుభక్తికి, జిజ్ఞాసకూ చాలా ఆనందించాను. నీ సంశయము ఏమిటో అడుగు. దాన్ని తీరుస్తాను” అన్నాడు. అంటూ మొదటి అధ్యాయాన్ని పూర్తి చేశాడు రత్నాకరుడు.
సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹 🌹 TRIPURA RAHASYA - 4 🌹
🌻 THE MYSTERY BEYOND THE TRINITY 🌻
✍ Ramanananda Saraswathi
📚 Prasad Bharadwaj
🌻 Lord Dattreya Teachings 🌻
CHAPTER - 1
47. "Should there still be a few pleasurable moments for others, they are similar to those enjoyed by one who, while writhing with an abdominal pain, inhales the sweet odour of flowers.
48. "How silly of people with innumerable obligations ever to be busy seeking such moments of pleasure in this world!"
49. "What shall I say of the prowess of undiscriminating men? They propose to reach happiness after crossing interminable hurdles of efforts!"
50. "A beggar in the street labours as much for happiness as a mighty emperor."
51-52. "Each of them having gained his end feels happy and considers himself blessed as if he had reached the goal of life. I too have been unwittingly imitating them like a blind man following the blind. Enough of this folly! I will at once return to that ocean of mercy — my Master."
53. "Learning from him what is to be known, I will cross the ocean of doubts after boarding the boat of his teachings."
54. Having resolved thus, Parasurama of pure mind immediately descended the hill in search of his Master.
55. Quickly reaching the Gandhmadan Mountain, he found the Guru sitting in padmasana posture as if illumining the whole world.
56. He fell prone before the Master's seat and, holding the Guru's feet with his hands, pressed them to his head.
57. On Parasurama saluting him thus, Dattatreya gave him his blessings, his face lit with love, and he bade him rise saying:
58. "Child! rise up. I see you have returned after a long time. Tell me how are you? Are you in good health?"
59. He rose as commanded by his Guru, and took his seat in front of and close to him as directed. Clasping his hands, Parasurama spoke with pleasure.
Note: — Clasping the two hands with fingers directed towards the object, is a sign of respect.
60. "Sri Guru! Ocean of Mercy! Can any one drenched with Thy kindness ever be afflicted by ailments even if destiny so decree?"
61. "How can the burning pains of illness touch one who is abiding in the refreshing moon of Thy nectarlike kindness?"
Note: — The moon is believed to be the store of nectar with which the pitris feed themselves.
62-64. "I feel happy in body and mind, being refreshed by Thy kindness. Nothing afflicts me except the desire to remain in unbroken contact with Thy holy feet. The very sight of Thy holy feet has made me perfectly happy, but there are a few longstanding doubts in my mind."
🌹 🌹 🌹 🌹 🌹