త్రిపురా రహస్యము - 3 / Tripura Rahasya - 3

Image may contain: 3 people
🌹. త్రిపురా రహస్యము - 3 / Tripura Rahasya - 3 🌹
🌻. స్వామి దత్తాత్రేయ  విరచిత ఆత్మ జ్ఞాన యోగము 🌻
✍️. బ్రహ్మ శ్రీ క్రోవి పార్థసారథి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴 2. త్రిపురోపాసన - దీక్ష 🌴

దత్తాత్రేయుని ఎదురుగా కూర్చున్నాడు పరశురాముడు. ఏకాగ్రతతో గురువుగారు చెప్పేది వింటున్నాడు. దత్తాత్రేయుడు కూడా అమితవాత్సల్యముతో పరశురాముడికి త్రిపురా మాహాత్మ్యము అంతా వివరించాడు.

విన్నాడు పరశురాముడు. భక్తి పారవశ్యంలో మునిగి పోయినాడు. బాహ్య ప్రపంచాన్ని మరచి పోయాడు. తదేక ధ్యానంతో నిశ్చలంగా కూచున్నాడు. బాహ్యజ్ఞానము పూర్తిగా కలిగింది. శరీరంమీద రోమాలు పులకించాయి.  నేత్రములనుండి ఆనంద బాప్పములు రాలుతున్నాయి. వళ్ళు జలదరిస్తోంది. తన స్థితి తనకు తెలియటంలేదు. అంతా అనంద పారవశళ్యం. వర్ణింపనలవి కానిది. అనుభవైక వేద్యం. ఆ స్థితిలోనే పరశురాముడు భక్తి పారవశ్యంతో గురువైన దత్తాశత్రేయుడి పాదాలు రెండూ పట్టుకున్నాడు. సాష్టాంగప్రణామం చేశాడు. లేచాడు. మాట్లాడ లేకపోతున్నాడు. ఆనందపారవశ్యంతో స్వరం గద్గద మవుతున్నది. అప్పుడు అంటున్నాడు “గురుదేవా! నేను ధన్యుణ్ని. నిజంగా నా జన్మ చరితార్ధమైంది. మీ అనుగ్రహంవల్ల కృతకృత్యుడనైనాను”.

ఆ మాటలు విన్న దత్తాత్రేయుడు చాలా సంతోషించాడు. శిష్యుని యొక్క ఆనందము చూసి తాను మహదానందం పొందాడు. గురువు అంటే త్రిమూర్తి స్వరూపుడు. సాక్షాత్తూ పరబ్రహ్మయే. గురువు గనక సంతోషిస్తే మృత్యువుకూడా మన జోలికి రాదు. బ్రహ్మపదవి తృణ ప్రాయమవుతుంది. గురుకృప చేత అంతా సిద్ధించినట్లే.

“ఓ గురుదేవా ! మీ దయ వలన త్రిపురా మహాత్యము పూర్తిగా విన్నాను. ఇప్పుడు ఆ దేవిని ఉపాసించాలి అనుకుంటున్నాను. కాబట్టి నా మీద దయతో ఉపాసనా క్రమాన్ని వివరించండి” అని ప్రార్ధించాడు.

శిష్యుడికి దీక్ష ఇవ్వాలి అంటే, శిష్యుడు ఆ విద్యకు అర్హుడో కాదో ముందుగా తేల్చుకోవాలి. పరశురాముడికి త్రిపురోపాసన మీద అమితమైన భక్తి శ్రద్ధలున్నాయి వాటిని పరిక్షించాడు దత్తాత్రేయుడు. శిష్యుడు దీక్షకు తగినవాడు అని నిర్ణయించుకున్న తరువాత అతడికి దీక్షనిచ్చాడు. త్రిపురోపాసన అనేది చాలా గొప్పది. దీక్షలన్నిటిలోకి చాలా ఉత్తమమైనది. తత్త్వాన్ని సంపూర్ణంగా బోధిస్తుంది.

అటువంటి దీక్షను దత్తాత్రేయుడు పరశురాముడికి ఇచ్చాడు. ఉపాసనకు కావలసిన యంత్ర, మంత్ర, తంత్రాలను వివరంగా చెప్పాడు. సాక్షాత్తూ దత్తాత్రేయుడి ముఖం నుండి ఉపాసనాక్రమం తెలుసుకున్నందుకు పరమానందం చెందాడు పరశురాముడు. ఉపాసన ప్రారంభించాడు.

గురువుకు ప్రదక్షిణ చేసి మహేంద్రగిరి చేరి అక్కడ పన్నెండు సంవత్సరాలు ఉపాసన చేశాడు. ఉపాసన కాలంలో కూడా నిత్యనైమిత్తిక కర్మలు, జపము, పూజ మొదలైనవన్నీ చాలా శద్ధగా చేసేవాడు. సదా ఆ త్రిపురాదేవినే ధ్యానిస్తూ ఉందేవాడు.

ఈ రకంగా ఉపాసనతో పన్నెండేళ్ళు గడిపాడు. ఒకానొక రోజున ప్రశాంత చాతావరణంలో ఆశ్రమ ప్రాంగణంలో కూర్చుని ఉన్నాడు. ఎందుకో గతం గుర్తుకు వచ్చింది. చాలాకాలం క్రితం సంవర్తుడిని ఏదో ఒక ప్రశ్న అడీగాడు. దానికి ఆయన సమాధానం కూడా చెప్పాడు. ఆయన చెప్పింది ఏమిటో అర్దం కాలేదు. కనీసం తాను అడిగింది ఏమిటో, ఆయన చెప్పింది ఏమిటో కూడా గుర్తు లేదు. ఇప్పుడు దత్తాత్రేయుడు త్రిపురా మహాత్మ్యము వివరించాడు.

“త్రిపురోపాసన' దీక్ష నిచ్చాడు. అయినప్పటికీ సంవర్తుడు చెప్పినది అర్ధం కాలేదు. ఆయనను సృష్టి విషయమై ఏదో ప్రశ్నించాడు. ఆయన చెప్పింది తనకు అర్ధం కాలేదు. ఆలోచిస్తున్నాడు పరశురాముడు.

అంగిరసుడు బ్రహ్మమానస పుత్రుడు. ఇతడికి పదిమంది కుమారులు, ఎనిమిది మంది కుమార్తెలు కలిగారు. దేవగురువైన బృహస్పతి ఇతని కుమారుడే. బృహస్పతి తరువాతి వాడు సంవర్తుడు. పిచ్చివాడిలాగా అడవులలో తిరుగుతూ ఉండేవాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 TRIPURA RAHASYA - 3 🌹
🌻 THE MYSTERY BEYOND THE TRINITY 🌻
✍ Ramanananda Saraswathi
📚 Prasad Bharadwaj

CHAPTER - 1

26 - 27. "I did not understand even a little of what Samvarta told me whom I met formerly on the way."

28. "I have also forgotten what I asked my Guru. I heard from him the Gospel of Tripura, .....

29. ....... but it is not clear to me what Samvarta said in reply to my query on creation."

30. "He mentioned the story of Kalakrit, but went no further, knowing that I was not fit for it."

31. "Even now I understand nothing of the workings of the universe. Where does it rise from, in all its grandeur?"

32. "Where does it end? How does it exist? I find it to be altogether transient."

33. "But worldly happenings seem permanent; why should that be? Such happenings seem strangely enough to be unconsidered."

34. "How strange! They are on a par with the blind man led by the blind!"

35. "My own case furnishes an example in point. I do not even remember what happened in my childhood."

36. "I was different in my youth, again different in my manhood, still more so now; and in this way, my life is constantly changing."

37-38. "What fruits have been reaped as the result of these changes is not clear to me. The end justifies the means as adopted by individuals according to their temperaments in different climes and in different times. What have they gained thereby? Are they themselves happy?

39. "The gain is only that which is considered to be so by the unthinking public. I however cannot deem it so, seeing that even after gaining the so-called end, the attempts are repeated.
Note: — Since there is no abiding satisfaction in the gain, it is not worth having.

40-41. "Well, having gained one purpose, why does man look for another? Therefore, what the man is always after should be esteemed the only real purpose — be it accession of pleasure or removal of pain. There can be neither, so long as the incentive to effort lasts."

42. "The feeling of a need to work in order to gain happiness (being the index of misery) is the misery of miseries. How can there be pleasure or removal of pain so long as it continues?

43-45. "Such pleasure is like that of soothing unguents placed on a scalded limb, or of the embrace of one's beloved when one is lying pierced by an arrow in the breast; or of the sweet melodies of music heard by an advanced consumptive!

46. "Only those who need not engage in action, are happy; they are perfectly content, and self-contained, and they experience happiness which extends to all the pores of the body.
🌹 🌹 🌹 🌹 🌹