త్రిపురా రహస్యము - 2 / Tripura Rahasya - 2

Image may contain: 3 people, people standing
🌹. త్రిపురా రహస్యము - 2 / Tripura Rahasya - 2 🌹
🌻. స్వామి దత్తాత్రేయ  విరచిత ఆత్మ జ్ఞాన యోగము 🌻
✍️. క్రోవి పార్థసారథి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴 ప్రస్తావన 🌴

జమదగ్ని, ప్రసేనజిత్తుని కుమార్తె రేణుకను వివాహం చేసుకున్నాడు. ఈమెకు ఐదుగురు కుమారులు కలిగారు. అందులో ఆఖరువాడు రాముడు. రేణుక నీరుతీసుకు రావటానికి నదికి వెళ్ళి, ఆ నదిలో జలకాలాడుతున్న చిత్రరధుదనే గంధర్వుణ్ణి చూస్తూ అలా కొంతకాలము ఉండిపోయింది. దాంతో ఇల్లు చేరటం ఆలస్యమయింది.

చిత్రరధునితో ఈమె వ్యభిచరించింది అని జమదగ్ని కోపించి, కుమారులను పిలిచిరేణుకను సంహరించమన్నాడు. వారందకు అంగీకరించ లేదు. అందుకని వారిని భస్మంచేసి,చివరగా రాముణ్తీ పిలిచి తల్లిని సంహరించమన్నాడు.

తండ్రి మాటకు ఎదురాడకుండా,తల్లిని సంహరించి, ఈ వార్తను తండ్రికి తెలియ చేశాడు రాముడు. దానికి జమదగ్నిఆనందించి ఏదైనా వరం కోరుకో మన్నాడు. తల్లిని, సోదరులను మళ్ళీ బ్రతికించమన్నాడు రాముడు. ఈ రకంగా రేణుక ఆమె పుత్రులు పునర్జీవితులైనారు.

హయహయుడనే మహారాజు, జమదగ్ని మహర్షిని సంహరించాడు. భర్త శవంమీదపడి రేణుక విలపిస్తూ, ఇరవై ఒక్కసార్లు గుండెలు బాదుకున్నది.

అది చూసిన పరశురాముడుఇరవై ఒక్కసార్లు క్షత్రియులతో యుద్ధం చేసి, వారందరినీ సంహరిస్తాను అని శపధం చేశాడు. అన్నమాట ప్రకారం ఇరవై ఒక్కసారి దండయాత్ర చేసి బాలురను, వృద్ధులు వదిలి మిగిలిన రాజులందర్నీ సమూలంగా నాశనం చేశాడు.

ఈ రకంగా క్షత్రియకులాన్ని నాశనం చేసిన పరశురాముడు, రామావతారంతో, తన అవతారం పరిసమాప్తి గావించి మోక్షగామియై దత్తాశ్రేయుణ్ణి గురువుగా ఎంచుకున్నాడు.

అనసూయ, అత్రి మహర్షుల కుమారుడు దత్తాత్రేయుడు. అత్రిమహర్షి విష్ణువునుగూర్చి తపస్సు చేయగా, విష్ణువు 'నేను నీకు దత్తుడనౌతాను' అన్నాడు. ఆ తరువాతత్రిమూర్తుల అంశతో అత్రి మహర్షికి ఒక కుమారుడు కలిగాడు. అతడే దత్తాత్రేయుడు. అందరికీ ఆత్మవిద్య బోధించిన వాడు.

గురుసాంప్రదాయాన్ని లోకానికి అందించిన వాడు. సద్గురువు లందరికీ మూల పురుషుడు. గురువు అంటే అజ్ఞానపు చీకట్లను పారద్రోలేవాడుఅని అర్ధం.

గుకారశ్చాంధకారస్తు  రుకార స్తన్నిరోధకఃl
అంధకార వినాశిత్వాత్‌ గురురిత్య భిధీయతే ll

'బృ' అంటే చీకటి. 'రు అంటే దాన్ని పోగొట్టేది. అజ్ఞానపు చీకట్లను పారద్రోలి,జ్ఞానాన్నిస్తాడు కాబట్టే అతనికి “గురువు” అని పేరు వచ్చింది.

అందుచేతనే ముందుగా నా గురుదేవులు విరజానందనాధ, సదానందనాధ, శుకానందనాధులకు ప్రణమిల్లి, ధర్మసంస్థాపన కోసం ఏర్పాటయిన శృంగేరీ, బదరీ, ద్వారక, పూరి, కంచి, పుష్పగిరి, కుర్తాళం పీఠాధిపతులకు సాష్టాంగదండ ప్రణామాలాచరించి, గన్నవరం భువనేశ్వరీ పీఠాధిపతులకు, గుంటూరు శృంగేరీ శ్రీవిరూపాక్ష పీఠాధిపతులకు వందనాలర్పించి, అవధూత శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానందస్వామి వారికి, విశ్వయోగి శ్రీశ్రీశ్రీ విశ్వంజీ మహరాజ్‌వారికి, శ్రీశ్రీశ్రీ వాసుదేవానందగిరిస్వామివారికి, శ్రీశ్రీశ్రీ మాతాశివచైతన్యవారికి, శ్రీశ్రీశ్రీ చంద్ర కాళీ ప్రసాద మాతాజీ వారికి నమస్కరించి, హరితస గోత్రీకుడనైన క్రోవి పార్థసారథి అను నేను “త్రిపురా రహస్య దీపిక' అనే జ్ఞాన ఖండాన్ని, అందరికీ అర్థమయ్యే రీతిలో, శులభశైలిలో వ్రాయటానికి ఉపక్రమిస్తున్నాను. జ్ఞానవృద్దులు, వయోవృద్దులు, పరమేశ్వరి భక్తులు, ఉపాసకులు, యోగులు, పండితులు, మోక్షగాములు అందరూ నా యీ సాహసాన్ని మన్నించి, నన్ను ఆశీర్వదింతురు గాక.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 TRIPURA RAHASYA - 2 🌹
🌻 THE MYSTERY BEYOND THE TRINITY 🌻
✍ Ramanananda Saraswathi
📚 Prasad Bharadwaj

CHAPTER - 1

14. Again he arose, and being filled with ecstasy, his voice choked with emotion as he said: 'Lucky am I; blessed am I; through Thy Grace O Lord!'

15. That expanse of Grace called Siva, here incarnate as my Guru, is indeed gracious to me; gaining whose pleasure even the Lord of creation, looks a pigmy.

16. Does not the God of Death verily merge into the Self, if only one's master is pleased with one?
That Supreme Being is gracious indeed, just in so much as is my Master, for reasons unknown to me.
Note: — The meaning is that the Guru, being God, is mercy incarnate and requires no incentive to show grace.

17. The Guru's grace gained, I have gained all! Thou hast now kindly opened out to me the glory of Tripura.

18. I now desire fervently to worship Her Transcendental Majesty. Kindly tell me, my Master, how it is to be done.

19-22. Being thus requested, Datta Guru satisfied himself as to the fitness of Parasurama, whose zeal for and devotion to Tripura worship were intense; and he duly initiated him into the method of Her worship. After initiation into the right method, which is more sacred than all others and leads directly to Realisation, Parasurama learned from the sweet tips of Sri Guru all the details regarding recitation figures for worship and different meditations, one after another — like a honey bee collecting honey from flowers. Bhargava (i.e., Parasurama) was overjoyed.

23. Being then permitted by his holy master, he thirsted to practise the sacred lore; he went round his master, made obeisance to him and retired to the Mahendra Hill.
Note: — To walk round gently and peaceful, always keeping the centre to one's right, is a sign of respect to the object in the centre.

24. There, having built a clean and comfortable hermitage, he was engaged for twelve years in the worship of Tripura.

25. He incessantly contemplated the figure of that Holy Mother Tripura, performing at the same time his daily tasks and the special ceremonies connected with Her worship and recitations; twelve years thus passed in a flash. Then on a certain day while the son of Jamadagni was sitting at ease, he fell into a reverie.
🌹 🌹 🌹 🌹 🌹