శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 0 / Sripada Srivallabha Charithamrutham - 0
🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 0 / Sripada Srivallabha Charithamrutham - 0 🌹
✍️. మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
ఉపోద్ఘాతము
శ్రీపాద శ్రీవల్లభుల గురించి శ్రీ గురు చరిత్ర లో లభించెడి సమాచారం బహు స్వల్పం. కలియుగములో ప్రప్రథమ దత్తావతారం శ్రీపాద శ్రీవల్లభుడు . వారి జీవిత విశేషాలను గురించి బయట ప్రపంచానికి తెలిసినది బహు తక్కువ.
క్రీ. శ. 1320 లో శ్రీపాద శ్రీవల్లభుడు బ్రహ్మశ్రీ ఘండికోట అప్పలరాజు శర్మ గారికి, అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి సుమతీ మహారాణి కి తృతీయ సంతానంగా జన్మించినారు. శ్రీపాదుల వారికి శ్రీధర రాజశర్మ, రామ రాజశర్మ అను ఇద్దరు అన్నలును, శ్రీ విద్యాధరి, రాధ, సురేఖ అను ముగ్గురు చెల్లెండ్రును గలరు. వారు భారద్వాజ గోత్రీకులు. ఆపస్తంబ సూత్రులు.
శ్రీపాదుల వారి మాతామహులు బ్రహ్మశ్రీ మల్లాది బాపన్నావధానులు. వారి ధర్మ పత్ని అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి రాజమాంబ.
శ్రీపాదుల వారి దివ్య చరిత్రను శంకరభట్టు అను కన్నడ బ్రాహ్మణుడు సంస్కృతంలో రచించినాడు. దాని తెలుగు అనువాదం బాపన్నావధానులు గారి ౩౩వ తరం వాడినయిన నా వద్ద ఉన్నది. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం లో బాపన్నావధానులు గారి ౩౩వ తరం లోనే అది వెలుగులోనికి వస్తుందని చెప్పబడినది గాని అది ఏ సమయమున ఏ విధముగా అని వివరింపబడలేదు.
ఈ చరితామృతాన్ని బయట ప్రపంచానికి తెలియపరచవచ్చునా లేదా అనే విచికిత్స నాకుండినది. ఒకనాడు భీమవరం మావుళ్ళమ్మ గుడి ప్రాంతం లో నేను వెడుతుండగా ఒక వృద్ధుడైన యాచకుడు భోజనం కోసం డబ్బులు అర్తించెను. నేను 11 రూపాయలు ఇచ్చాను. తరువాత రెండు మూడు రోజుల్లో గాణగాపురం నుంచి శ్రీ నృసింహ సరస్వతుల వారి ఆశ్రమం నుంచి నాకు ప్రసాదం పోస్టులో వచ్చినది. నేను ఏ రోజునయితే వృద్ధ యాచాకుడికి 11 రూపాయలు ఇచ్చినానో అదే రోజున గాణగాపురం సంస్థానానికి నేను 11 రూపాయలు ఇచ్చినట్లు రశీదు కూడా అందులో జత చేయబడినది. వస్తావమునకు నేను గానగాపురానికి ఎంత మాత్రం డబ్బు పంపించలేదు.
శ్రీ నృసింహ సరస్వతీ స్వరూపుడైన శ్రీపాదుని సంకల్పం 'చరితామృతాన్ని లోకానికి వెల్లడి చేయు సమయము ఆసన్నమైనదని ' అని నేను గ్రహించి, ముట్టుకుంటే చిరిగిపోయేలా ఉండే పాత ప్రతిని జాగ్రతగా కాపీ చేసి, తెలుగు పాతప్రతిని చరితామృతంలో చెప్పబడిన విధంగానే విజయవాడ వెళ్లి కృష్ణా నదిలో నిమజ్జనం చేసితిని. కాపీ చేసిన ఆ కొత్త ప్రతిని పిఠాపురం లో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం వారికి చరితామృతంలో చెప్పబడిన విధంగానే పారాయణం చేసి వారికి అందజేసితిని.
ఈ సంవత్సరం (2001వ సంవత్సరము) విజయ దశమి నుండి ఆశ్వయుజ బహుళ ఏకాదశి వరకు శ్రీపాదుల వారి సంస్థానం లో దానిని శ్రీపాద సన్నిధిలో మొట్ట మొదటి సారిగా పారాయణం చేసి సంస్థానం వారికీ అందజేయడం జరిగినది.
మాకు శ్రీపాదుల వారి యందు వాత్సల్యభక్తి. ఈ మహాపవిత్రమైన గ్రంథాన్ని ఎవరైనా హేళనగా మాట్లాడితే నొచ్చుకునే సున్నిత స్వభావం మాది. కీర్తి ప్రతిష్ఠల కోసం గాని, దానం కోసం గాని వెంపర్లాడే వంశం అసలే కాదు మాది.
అయితే దత్తభక్తులకి అత్యంత అమూల్యమైన ఈ దివ్య చరిత్ర అందజేయడం మా విధి అని భావించి దీనిని వెలుగులోనికి తీసుకురావడం జరిగింది.
ఇది అక్షర సత్య గ్రంథం. దీనిలో వ్రాయబడిన ప్రతి అక్షరమూ శక్తివంతమైనది. సత్యమైనది. ఈ గ్రంథంలో అతిశయోక్తులు గాని, అర్థం పర్థం గాని వర్ణనలు గాని ఉండవు. పెద్దగా పాండిత్య అనుభవం లేని శంకరభట్టు చేత వ్రాయబడింది. అతడు కన్నడ దేశస్థుడు. అతడు యోగ్యుడు కనుకనే శ్రీపాదుల వారు అతన్ని అనుగ్రహించారు.
ఈ గ్రంథాన్ని నిత్య పారాయణ గ్రంథంగా చేసుకోవాలి. ఎటువంటి కష్టనష్టములేదురయినా, సంకట పరిస్థితులు ఎదురయినా ఈ గ్రంథ పారాయణం చేసి 11 మందికి సరిపడా ద్రవ్యాన్ని అన్నదానం కోసం వినియోగిస్తే తప్పకుండా వెంటనే ఫలితాన్ని పొందవచ్చు. ఇది సాక్షాత్తూ శ్రీపాద శ్రీవల్లభులచే ఆ విధంగా హామీ పొందబడి వారి జీవితకాలంలోనే వ్రాయబడిన గ్రంథం.
అందుచేత దత్తభక్తులు ఈ గ్రంథాన్ని పారాయణం చేసి మీ జీవితాల్లోనే అనుభవం పొందండి. అనుభవం ద్వారా యిది అక్షర సత్య గ్రంథమనేది మీకే అర్థమవుతుంది.
దత్త సేవలో,
✍️ మల్లాది గోవింద దీక్షితులు, భీమవరం
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sripada Srivallabha Charithamrutham - 0 🌹
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj
🌻 INTRODUCTION 🌻
The information available in Sri Guru Charitra about Sri Sripada Srivallabha is very little. The very first Datta incarnation in Kaliyuga is Sri Sripada Srivallabha. The details of His life known to outside world are very meager. In 1320 A.D. Sripada Srivallabha was born as the third child to Brahmasri Ghandikota Appalaraju Sharma and Akhanda Lakshmi Sowbhagyavati Sumati Maharani. Ghandikota family belongs to the lineage of Sage Bharadwaja. They are of ‘Aapstamba Sootra’ tradition. After Sri Sripada, three sisters namely Sri Vidyadhari, Radha and Surekha also were born to them. The maternal grandfather of Sri Sripada was Brahmasri Malladi Baapannavadhanulu. His ‘dharma patni’ was Akhanda Lakshmi Sowbhagyavati Rajamamba. A Brahmin by name Shankar Bhatt wrote the divine biography of Sri Sripada in Sanskrit. It’s Telugu translation is with me belonging to the 33rd generation of Sri Bapannavadhanulu. In Sripada Srivallabha Charitamrutam it was stated that it would come into light during the 33rd generation of Sri Bapannavadhani but, it was not explained at what time and in which way it would take place I was having a doubt whether this Charitamrutam can be made known to the outside world or not. One day when I was in the area of Maavullamma Temple in Bhimavaram, an old beggar asked money for meals. I gave him 11 rupees. Within two or three days, ‘prasad’ from the ashram of Sri Nrusimha Saraswati Ganugapur, came through post. A receipt was also enclosed in that showing the day of receipt which tallied with the day on which I gave 11 rupees to the old beggar. In reality I did not send any money to Ganugapur. I realized that Sripada in the form of Sri Nrusimha Saraswati wished that, ‘the time to reveal Charitamrutam to the world has arrived’. Having realized it, I carefully copied the old book which was brittle and was tearing by mere touch. As mentioned in the ‘Charitamrutam, I went to Vijayawada and immersed the old copy in Krishna River. The new book which I copied was handed over after performing ‘parayana’ to Sripada Srivallabha Maha Samsthan as directed in the Charitamrutam. This year from Vijaya Dasimi (year 2001) to Aswayuja Bahula Ekadasi the ‘parayana’ was done for the first time in the presence of Sripada in Sri Sripada Srivallabha Maha Samsthan and the book was handed over to Samsthanam. We have affectionate devotion towards Sri Sripada. Ours is a delicate nature and we will be pained if anyone speaks jeeringly about this most sacred book. Our family is one that never craves for name, fame or money. However, we deemed it our duty to hand over this divine biography which is very precious to the Datta devotees to the Samsthanam. So this was brought to light. This book is one in which every letter is true. Every letter written in this book is powerful and true. In this book there are no hyperboles or meaningless descriptions. This was written by Shankar Bhatt who did not have much of scholarship. He was a Kannadiga.
Sri Sripada granted him grace because he was worthy. This book should be made into a book of daily ‘parayana’. When faced with any sort of troubles, losses or difficult situations, if a devoted reading of this book is made and money sufficient for food for 11 people is donated, result will definitely be obtained at once. This kind of assurance was received actually from Sri Sripada Srivallabha and the book was written during His life time. Therefore, let Datta devotees make a devoted reading of this book and derive experience in their lives.
You will understand through experience that this book is an ‘Akshara Satya Grandham’.
In Service of Datta, Malladi Govinda Deekshithulu. 🙏
🌹 🌹 🌹 🌹 🌹