శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 94 / Sri Gajanan Maharaj Life History - 94
🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 94 / Sri Gajanan Maharaj Life History - 94 🌹 ✍️. దాసగణు స్వామి 📚. ప్రసాద్ భరద్వాజ 🌻. 19వ అధ్యాయము - 2 🌻 భక్తులు హరిపాటిల్ కు తను షేగాంకు ముఖ్యుడని మరియు బుటే ఒకగొప్ప షాహుకారని, మరి సహజంగా ఒక ఏనుగు ఇంకొక ఏనుగుతో తలపడాలి తప్ప తమలాంటి నక్కకాదని గుర్తుచేసారు. జాంబుమాలితో యుద్ధానికి హనుమంతుని ఎన్నుకున్నారు, అర్జునుడిని కర్ణునితో, అలా అంటూ హరిపాటిల్ ను నాగపూరు వెళ్ళి శ్రీమహారాజును షేగాం వెనక్కు తేవలసిందిగా వాళ్ళు అర్ధించారు. శ్రీకృష్ణుడు ఏవిధంగా అయితే అయిష్టంగా హస్తినాపూరులో బసచేసారో, అదేవిధంగా శ్రీమహారాజుకూడా అయిష్టంగానే శ్రీబుటేతో బసచేసారు, కానీ అతను అది లక్ష్య పెట్టక శ్రీమహారాజు షేగాం వెళ్ళేందుకు వదలలేదు. బుటే పవిత్రడు, మించిమనిషి అయినప్పటికీ ఆస్తిమీద చాలాగర్వం ఉండేది. శ్రీమహారాజుతో పాటు అనేకమంది ప్రజలకుకూడా ఇతను భోజనం పెట్టేవాడు, మరియు భజనలు రోజంతా జరిగేవి. కానీ షేగాంనుండి వచ్చిన ప్రజలను శ్రీమహారాజును చూసేందుకు అనుమతించబడేవారు కాదు. ఒకసారి కొంతమంది శ్రీమహారాజును వెనక్కు తీసుకు రావడానికి షేగాంనుండి వెళ్ళారు కానీ వాళ్ళు రిక్తహస్తాలతో వెన...