శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 89 / Sri Gajanan Maharaj Life History - 89
🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 89 / Sri Gajanan Maharaj Life History - 89 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. 18వ అధ్యాయము - 3 🌻
శ్రీగజానన్ మహారాజు పవిత్ర పాదాలు తలుచుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదు. ఇలా అనుకుంటూ భవ్ చేతులు కట్టుకుని తన రక్షణకువచ్చి ఈవ్యాధినుండి తనని నయంచెయ్యమని శ్రీమహారాజును ప్రార్ధించాడు.
అర్ధరాత్రి, చిట్టచీకటి, నక్కలు అరుస్తున్న సమయంలో, ఒకచక్కని ఎడ్లజోడితో గూడుకల ఒక ఎడ్లబండి డాక్టరు ఇంటికి వచ్చింది. డాక్టరు తన మంచంమీద నుండి ఈవిధంగా బండివచ్చి తన ఇంటిదగ్గర ఆగడం చూడగలిగాడు. ఒక బ్రాహ్మణుడు ఆబండిలోనుండి దిగి డాక్టరు ఇంటి తలుపు కొట్టాడు. అతని సోదరుడు తలుపుతీసి ఆవచ్చిన వ్యక్తిని రాకకు కారణం అడిగాడు.
ఆ బ్రాహ్మణుడు తనపేరు గజ అని షేగాంనుండి తీర్ధం, అంగారుతో భవ్వర్ కొరకు వచ్చానని అన్నాడు. ఇంకా, బాధిస్తున్న ఆ శరగడ్డకు ఈఅంగారు రాసి, నోటిలో తీర్ధంపొయ్యమని ఆయన సలహా ఇచ్చారు. ఆవిధంగా ఆరెండు వస్తువులు భవ్ సోదరునికి ఇచ్చి ఉండేందుకు తనదగ్గర సమయం లేదని ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు.
ఇది అంతా విన్న భవ్ వెంటనే ఆయన్ని వెనక్కి పిలవడానికి ఒకమనిషిని పంపించాడు. కానీ అతని అతాపతా గాని, ఆఎడ్లబండి జాడకాని వారికి తెలియలేదు. అప్పుడు భవ్ ఆ అంగారు గడ్డమీద రాసుకున్నాడు. వెంటనే అది చిట్టి చీము రావడం మొదలయింది. ఒక గంటలో మొత్తం చీము అంతా బయటకుపోయి భవకు గాఢనిద్ర పట్టింది. తదుపరి అతను పూర్తిగా కోలుకున్నాక శ్రీమహారాజుకు ధన్యవాదం తెలిపేందుకు షేగాంవెళ్ళాడు.
భవను చూసి నవ్వుతూ ఆరోజురాత్రి నువ్వు కనీసం గడ్డిఅయినా నా ఎడ్లకు ఇవ్వలేదు అని శ్రీమహారాజు అన్నారు. తీర్ధం అంగారు తెచ్చిన ఆ నిశాచరుడు శ్రీమహారాజే అని భవ్ అర్ధం చేసుకున్నాడు. భవ్ అప్పుడు కృతజ్ఞతా పూర్వకంగా షేగాంలో ప్రజలకు భోజనం తినిపించాడు.
ఒకసారి శ్రీమహారాజు చంద్రభాగ నదీతీరాన్న ఉన్న విఠలభగవానుని కలిసేందుకు పండరపూరు వెళ్ళారు. ఈయనతో పాటు అనేక మంది భక్తులు కూడా ఉన్నారు. ఆషాఢ ఏకాదశి శుభసందర్భంలో పండరపూరు వెళ్ళేందకు చాలామంది ఉండబట్టి, ప్రభుత్వం ప్రత్యేక రైలుబండ్లు ఏర్పాటు చేసింది.
జగ్గు, అబాపాటిల్, బాపునా మరియు అనేక మంది శ్రీమహారాజుతో ముందు నాగ్టరి వెళ్ళారు. నాగ్టరిలో ఒక కొండగుట్ట మీద ఒకసొరంగం ఉంది, చాలా ప్రాకృతిక సెలయేర్లు ఆకొండగుట్ట దగ్గర ఉండడంవల్ల ఆప్రదేశం నాగ్టరి అని పిలవబడింది. ఈనార్జరి దగ్గర ఉన్నగుహలోనే మహా యోగి అయిన శ్రీగోమాజి సమాధి తీసుకుని భగవంతునిలో కలసిపోయారు.
మహద్దిపాటిల్ కు మొదటి గురువు శ్రీగోమాజీ మహారాజు. ఈయననుండే పాటిల్ సామ్రాజ్యం సంరక్షణ మరియు ప్రగతికోసం శ్రీమహద్దిపాటిల్ ఆశీర్వాదం పొందాడు. అందువల్లనే పండరపూరు వెళ్ళేప్పుడు, షేగాం పాటిల్ ముందు నాగ్టరి వెళ్ళి, శ్రీగోమాజికి తమనమస్కారాలు తెలిపి ముందుకు వెళ్ళేవారు. ఈ ఆనవాయితీ వల్లనే పండరపూరు వెళుతూ వీళ్ళుముందు నాగ్టరిలో దిగారు. హరిపాటిల్ తో పాటు, శ్రీమహారాజు, బాపునా ఇంకా ఒక 50 మంది ఇతరులు ఉన్నరు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Gajanan Maharaj Life History - 89 🌹
✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj
🌻 Chapter 18 - part 3 🌻
Then they returned to Mundgaon with Baija and, thereafter, never obstructed her for going to Shegaon with Pundalik. Now I will tell you a story about how Shri Gajanan Maharaj always protects his devotees. There was one Dr. Bhau Kavar, in charge of the Govt. Hospital at Khamgaon. He got a nasty, boil, and eminent doctors were brought from Buldana, Akola and Amravati for its treatment.
All attempts with medicines and even surgery failed to give him any relief. He was restlessly lying in bed due to the unbearable pain. His older brother was very much worried over the ailment of Bhau. Then there remained no other alternative, but to remember the holy feet of Shri Gajanan Maharaj.
Thinking so, Bhau folded his hands and prayed to Shri Gajanan Maharaj to come to his rescue and cure him of the ailment. It was about midnight with pitch darkness and foxes were howling nearby, when a bullock cart, with a hood above, and a fine pair of bullocks, came to doctor's door.
The doctor could see the cart coming and stopping at his door from his bed. A Brahmin got down from the cart and knocked at the door of doctor's house. His brother opened the door and asked the person the purpose of his visit.
The Brahmin said that his name was Gaja and had come from Shegaon with 'Tirtha' and 'Angara' for Bhau Kavar. He further advised him to apply the Angara to the painful boil of Bhau and to put the Tirtha in his mouth. Thus giving these two things to Bhau's brother, the Brahmin went away, saying that he had no time to stay. Hearing all this, Bhau immediately sent a man to call that Brahmin back, but could not get any trace of him, nor of the bullock cart he came in.
Then Bhau applied that Angara to the boil, which immediately burst emitting out pus. In an hour all the pus passed away and Bhau slept soundly. Subsequently he was completely cured and went to Shegaon to pay his respects to Shri Gajanan Maharaj . Looking at Bhau, Shri Gajanan Maharaj smilingly said, “That night you did not give even grass to my bullocks. Bhau understood that the nocturnal visitor with the Tirtha and Angara was Shri Gajanan Maharaj himself.
Bhau, then, as a token of thanks giving, fed the people at Shegaon. Once Shri Gajanan Maharaj left for Pandharpur to meet God Vithal on the bank of Chandrabhaga. There were many devotees with him. The government had arranged several special trains for going to Pandharpur as a lot of people were going there for the auspicious occasion of Ashadi Ekadasi.
Jagu, Aba Patil, Bapuna and many others with Shri Gajanan Maharaj first went to visit Nagzari. There is an underground cave on a hillock at Nagzari. The place gets its name from the many natural water springs that arre placed near that hillock. The great saint, Shri Gomaji Maharaj, had attained communion (Samadhi) with God in a cave at Nagzari. Shri Gomaji Maharaj was the first Guru of Mahadji Patil who got blessings at his hands for the welfare and prosperity of Patil dynasty.
That is why the Patils of Shegaon, while going to Pandharpur, first visit Nagzari to pay their respects to Shri Gomaji and then go on ahead. With this tradition, they entrained at Nagzari for Pandharpur. Alongwith Shri Gajanan Maharaj was Hari Patil, Bapuna and about 50 other people.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
26 Oct 2020