శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 242 / Sripada Srivallabha Charithamrutham - 242

🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 242 / Sripada Srivallabha Charithamrutham - 242 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయం 51
🌻. శ్రీపాదులు అంతర్హితులగుట 🌻

ఆ రోజు హస్తా నక్షత్ర యుక్త అశ్వయుజ కృష్ణ ద్వాదశి. కృష్ణానదిలో స్నానంచేసి శ్రీపాదులు ధ్యానస్థులు అయ్యారు. నేను గాడిపొయ్యి వెలిగించడానికి ప్రయత్నిస్తున్నాను. కాని ఎంతకూ వెలగడం లేదు.

శ్రీపాదుల ఉత్తరువు ప్రకారం నేను ఇంకొక మారు స్నానంచేసి వచ్చాక వారు ఇలా చెప్పారు, "నాయనా! శంకరా! నేను గుప్తంగా ఉండే సమయం దగ్గరకు వచ్చింది. నేను కృష్ణానదిలో అంతర్ధానం అవుతాను. కాని అదృశ్యరూపంలో ఇక్కడ సంచరిస్తూనే ఉంటాను. నీవు రచించే శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం మహా పవిత్ర గ్రంథం. భక్తజనులకి అది కల్పతరువు కాగలదు.

మనోమయ జగత్తును సరిచేయడానికి, ఇహ పరసాధ నాలను సమకూర్చడానికి ఈ గ్రంథ పఠనం ఎంతో ఉప యోగపడుతుంది. నీవు వ్రాసే సంస్కృత ప్రతి నా మహా సంస్థానంలో ఔదుంబర వృక్షం క్రింద అనేక నిలువుల లోతులలో శబ్దరూపమై నిలచి ఉంటుంది; కాని చర్మ శ్రోత్రాలకు ఆ దివ్యశబ్దాలు వినబడవు. దీని తెలుగు అనువాదం బాపనార్యుల వారి 33వ తరంలో వెలుగులోకి వస్తుంది.

ఏ భాషలో చదివినా ఫలితాలు, నా రక్షణ ఒకే విధంగా ఉంటాయి. నీవు కన్న బిడ్డలా నాకు ఎంతో సేవ చేసావు. నా చెక్క పాదుకలని నీకు ఇస్తున్నాను. నా కోసం దుఃఖించకుండా ఇంకొక మూడు సంవత్సరాలు ఇక్కడే ఉండి, గ్రంథ రచన పూర్తి చేసుకొని, ఇదే అశ్వయుజ కృష్ణ ద్వాదశి రోజున నా పాదుకల వద్ద చదివి వినిపించు. ఆ రోజున నా దర్శనం కోసం వచ్చి ఈ చరితామృతాన్ని వినగలిగేవారు ఎంతో ధన్యులు.

తేజో రూపంలో కనబడుతూ నీకు నేను అనేక యోగ రహస్యాలని బోధిస్తాను." అని చెప్పి వారు నదిలో అంతర్హితులయ్యారు. నేను తల్లిని కోల్పోయిన బిడ్డలా ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పోయాను. తరువాత స్నానం చేసి ధ్యానంలో కూర్చుంటే శ్రీపాదుల తేజోమయ రూపం మనోనేత్రాల ముందు గోచరించింది.

శ్రీపాదరాజం శరణం ప్రపద్యే

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sripada Srivallabha Charithamrutham - 242 🌹
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 27
🌴 Virupaksha darshan in Panchadeva Pahad 🌴

🌻 The speciality of Thursday 🌻

Sri Dharma Gupta and I reached this side of Krishna. It was afternoon. It was Thursday also.

That was the most sacred time of the afternoon of Thursday when Guru Sarvabhouma took ‘bhiksha’ at different places at the same time. Sripada asked us to build a ‘kuteer’ with dry grass at Panchadeva Pahad, that too, in one day. This area was not familiar to us. To build a house, a land was needed.

🌻 The speciality of Panchadeva Pahad area 🌻

Like aimless travellers, we were moving here and there. We entered into the fields of a farmer. He was building a ‘gosala’ for the sake of his cows. A platform was being constructed at an elevated place for the owner to sit. The owner of the field welcomed us cordially and gave food. We were hungry. We were hesitating whether we could eat food given by a ‘sudra’.

The owner said, “Oh! You stole our cattle and sold them in other places, and you have come again with a mean intention to see if there are any more cattle to lift. Now you have a doubt whether to eat food given by a Sudra.” Thus, he curtly said. We understood.

That owner was thinking us as thieves. We ate the food reluctantly. During the course of conversation, we came to know that his name was Virupaksha. After eating, we both were tied to two trees.

I was a poor Brahmin. I lived on begging. I did not have any money. But Dharma Gupta had money. That farmer told his servants to take away money from him.

🌻 Sripada’s incomprehensible leelas 🌻

We understood that it was no use telling them about us. By the orders of the owner of the land, we became prisoners not knowing what to do. Meanwhile some ‘Mylars’ came. In these ‘Mylars’ there is a sect called ‘ganga kavillu’.

They will be carrying Sri Vasavee Kanyaka Parameswari peethas. They wear ‘tripundras’ (lines of vibhudi on fore head). With ‘je ghantas’ (victory bells) in their hands, they sing songs praising Sri Kanyaka Parameswari Devi.

The ‘ganga kavillus’ keep water vessels in ‘kavillu’ and come at the time of marriages and other auspicious occasions and on the occasion of birth day of Sri Vasavee Matha.

Apart from them, people called ‘veera musthis’ come with ‘prabhas’ (lighted sticks) tied around their waists shouting ‘jaya jaya’ and sounding ‘je ghantas’ in their hands.

On those ‘prabhas’ one can see swords, armors and many more different war symbols. Along with ‘Mylars’, Veera Mushtis also came to that place.

Some soldiers of Vishnu Vardhana King became Vasavee Matha’s disciples and along with ‘Bala Nagars’ fought with the soldiers loyal to Vishnuvardhana. The descendents of those soldiers who became devotees of Vasavee matha are called ‘Veera Mushtis’.

Because, they offered their money and lives in that sacred war, vysya prabhus would honour them on auspicious occasions.

That farmer gave food to Mylars and Veera Mushtis and honoured them.

Later, they released us and requested us to take part in the construction of ‘goshala’ (cow shed). We agreed. After the work was over, Virupaksha questioned me, ‘Do you know what ‘Mushti’ and ‘Veera Mushti’ are?’ I said that I did not know.
🌹 🌹 🌹 🌹 🌹