శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 241 / Sripada Srivallabha Charithamrutham - 241

🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 241 / Sripada Srivallabha Charithamrutham - 241 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయం 50
🌻. ప్రభునామస్మరణం - భవభయహరణం 🌻

🌻. నామ కీర్తన - మహిమ 🌻
ఒకనాడు కడుపు నెప్పితో విలవిలలాడుతూ ఆ నెప్పిని భరించడం కంటె ఆత్మహత్యే మేలు అనే స్థితిలో ఉన్న ఒక వృద్ధ బ్రాహ్మణుడు కురుంగడ్డకు వచ్చారు. 

“నీవు పూర్వ జన్మలో ఎందరినో విషతుల్య వాగ్బాణాలతో, సూటి పోటి మాటలతోను హింసించావు. దాని ఫలితంగానే నీకు ఈ వ్యాధి సంక్రమించింది. కలియుగంలో భగవంతుని నామ స్మరణమే వాగ్దోషాలను పోగొట్టే సాధనం," అని శ్రీపాదులు వారితో చెప్పారు.

శ్రీచరణుల ఆదేశ ప్రకారం కురుంగడ్డలో మూడు రాత్రులు, మూడు పగళ్ళు 'శ్రీపాద శ్రీవల్లభ దిగంబరా!' అనే నామ కీర్తన చేసాము. ఆ మూడు రాత్రులు నన్ను కురుంగడ్డలో ఉండటానికి అనుమతి ఇచ్చారు. ఆ వృద్ధుని కడుపునెప్పి తగ్గింది.

🌻. వాయుయఙ్ఞం 🌻
భగవన్నామ స్మరణమే వాయు యఙ్ఞమని వివరిస్తూ శ్రీపాదులు ఇలా అన్నారు, " ఈనాడు వాయుమండలం అంతా తప్పుడుగా మాట్లాడబడే మాటలతో కలుషితమై ఉంది.

మానవుడు ఒక మాటని పలికేటప్పుడు ప్రకృతిలోని సత్త్వ, రజస్తమో గుణాలలో ఒకటిగాని, రెండు కాని లేదా మూడూ కాని రెచ్చగొట్టబడి అవి మంచికి దోహదం కలిగించ లేని కారణాన పంచభూతాలను అపవిత్రం చేస్తున్నాయి.

తద్వారా మానవుని శరీరం, మనసు, అంతరాత్మ, బుద్ధి, మేధ కల్మష భూయిష్టమై పాపకర్మలు చేస్తున్నాడు. తత్ఫలితముగ నానా రకాల కష్టాలను అనుభవిస్తున్నాడు. ఇది కార్య కారణాలనుండి ఉద్భవించే కర్మఫల విష వలయం.

దీనినుండి విముక్తుడు అవడానికి మానవుడు 'త్రికరణ శుద్ధిగా ఉండాలి, అంటే మనస్సులో తలచిందే మాటల్లో రావాలి, మాటల్లో వచ్చిందే కర్మలో ఆచరించాలి. ఇటువంటి వ్యక్తి మహనీయుడైతే, దీనికి పూర్తి విరుద్ధంగా నడిచేవాడు 'దురాత్ముడు'.

భగవన్నామ స్మరణతో వాయు మండలం పరిశుద్ధం అవడమే కాకుండా ఆ దివ్య నామం ఎప్పుడూ నాలుకపై నాట్యమాడటం వల్ల పవిత్రమైన మాటలు మాట్లాడటం అలవాటు అవుతుంది. మనసు భగవంతుని మీద లగ్నం అవడంవల్ల మనస్సు కూడా పవిత్రమై తద్వారా పవిత్ర కర్మలు చేయడానికి ప్రేరణ కలుగుతుంది.. కలియుగంలో దైవనామ స్మరణే ముక్తి దాయకం.

మానవుడు ఏ పనిలో నిమగ్నుడై ఉన్నప్పటికి మనసులో నామ సంకీర్తన నిరంతరం జరుగుతూ ఉండాలి. ఈ విధంగా వాయుమండలాన్ని పరిశుద్ధం చేసే యఙ్ఞమే వాయు యఙ్ఞం.

మన రోగాలే మన పాపాలు/మన పాపాలే మన రోగాలు ఒకసారి క్షయ, మధుమేహ, మరికొన్ని యితర వ్యాధులతో బాధపడుతున్న ఒక వ్యక్తి కురువపురానికి వచ్చారు.

ఆయనను చూడగానే ప్రభువులు కోపగించుకొని, "ఇతడు పూర్వ జన్మలో గజదొంగ. ఎందరో అమాయకుల సొమ్ము దొంగిలించి వాళ్ళకు కష్టాలు కలిగించాడు. కుమార్తె వివాహం కోసం ఎంతో కష్టపడి కూడబెట్టిన ఒక తండ్రి ధనం దొంగిలించి ఆ యువతి అకాల మృత్యువుకి కారణం అయినాడు," అని అతడి గురించి చెప్పారు.

తరువాత ఆ వ్యాధి పీడితుని దీనాలాపాలకు కరుణించి పంచదేవపహాడ్ దర్బార్ లోని గోశాలలో పడుకోమని ఆదేశం ఇచ్చారు. అతనికి మంచినీళ్ళు కూడా ఇవ్వవద్దని నిషేధించారు.

ఆ రాత్రికి ఆతని కలలో రాక్షసులు కన్పించి పీక నొక్కు తున్నట్లు కొంతసేపు, చాతీపై పెద్ద రాతిబండ పెట్టి దానిపై ఒక బలిష్ఠుడైన పహిల్వాను కూర్చున్నట్లు మరికొంతసేపు కనిపించి విపరీతమైన బాధకు గురి అయ్యాడు.

దీనితో అతను కర్మ విముక్తిని పొంది స్వస్థుడు అయ్యాడు. భౌతికంగా అనేక సంవత్సరాలు పడవలసిన బాధను మహా ప్రభువులు కొద్ది క్షణాలు మానసికంగా అనుభవింపచేసి అతన్ని కర్మవిముక్తుణ్ణి, ఆరోగ్య వంతుణ్ణి చేసారు.

శ్రీపాద రాజం శరణం ప్రపద్యే

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sripada Srivallabha Charithamrutham - 241 🌹
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 26
🌻 Kanayaka Puranam - 3 🌻

Sripada Srivallabha will leave his ‘yathi’ form and manifest as Padmavathi Venkateswara. Sri Padmavathi will be born in Simhala desam, Sri Prabhu will be born in Shambala village.

At the end of Kaliyugam, their marriage will happen. Sri Kalki Prabhu will come to Brihat Sila Nagaram. ‘I’ in the form of Vasavee Kanyaka, my Prabhu in the form of Nagareswar will bring Sripada Srivallabha with honours. I also will tie ‘raksha bandhan’ to my brother as a token of love.

With affection on me, My brother, will give divine ornaments, vajras, vydhuryas and divine royal clothes and perform our marriage grandly. Our divine marriage will be witnessed by the couple belonging to 102 gothras who entered Agni kundam with me.

After that, we, the newly married couple will come to Peethikapuram. That Maha Prabhu who is in Kalki form will give darshan in the form of his previous avathar Sripada Srivallabha, in the midst of thousands of devotees.

My Dear! Silada! When our marriage happens, along with Kalki Prabhu, you also will take part as my brother in the marriage celebrations and be blessed.’

My Dear! on the western side of this tributary Kingdom with capital Brihit Sila Nagaram, Gosthani river is there as one boundary. On the southern side, there is Antharvedi. Godavari river is there on East and North. In Kusuma Shresti’s house, there is a metallic hand and metallic hand bell for giving ‘mangala harathi’.

Together they weigh 16½ veesas (1 veesa is equal to 120 tolas). Similarly, in the house of Bhaskaracharya also there are metallic hand and a hand bell used for giving mangala harathi. They also weigh 16½ veesas together.

This metallic hand and hand bell present in Bhaskaracharya’s house will reach Peethikapuram after my Maha Samsthan is established and remain many feet deep under the Oudumbar tree near our Murthis. After they reach, my Charithamrutham will come into light.

My Dear! Tomorrow is the birth day of Sri Vasavi Kanyaka. Moreover it is Friday. According to the calculations in sandra sindhu vedam, it is highly sacred time. You build one small house with dry grass in that place called Pancha Deva Parvatham.

You go immediately. All the things required will be arranged. Tomorrow I will do ‘darbar’ there. Woman seeking the fortune of ‘mangalyam’ will certainly have to take the ‘pasupu kommu’ (turmeric tuber) distributed there.

The fortune of ‘mangalyam’ will be granted to them, who keep it in the puja mandir. Tomorrow I will narrate the story of Sri Kanyaka Parameswari in totality. All my devotees who come to Pancha Deva Pahad tomorrow will be blessed.

It is due to the merit of many births of yours, you will be able to hear the incidents of the most sacred Vasavee Kanyaka avathar from me. From now, I will do darbar on every Friday. It can be at Kurungadda or Pancha Dev Pahad or at any other place according to My convenience.

Every Thursday, dharma will be taught. It can be at Kurungadda or Panchadeva Pahad. Many changes are going to come in future. In the coming centuries, Bharata Desam will come under the rule of Mlecchas and white people. The ways of fate are wonderful.

Only by the flow of spiritual power, liberation will come to this karma bhumi and vedabhumi. If Datta is not forgotten, Datta will not forget. Forgetfulness is like death. Rememberance will give new birth.

End of Chapter 26

Continues...
🌹 🌹 🌹 🌹 🌹