శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 240 / Sripada Srivallabha Charithamrutham - 240

Image may contain: 1 person
🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 240 / Sripada Srivallabha Charithamrutham - 240 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయం 49
🌻. అగ్ని ఉపాసనయే అగ్ని యఙ్ఞం 🌻

శ్రీపాదులు ఒకసారి నాతో ఇలా అన్నారు," శంకరభట్టూ! మనం చేసేది అగ్నిఉపాసన. నీ అగ్ని ఉపాసన గాడిపొయ్యి వెలిగించి, వంట చేయడమే.

నీ గాడిపొయ్యిలోని అగ్నికి స్వతఃశక్తి లేదు. నా యోగాగ్ని కలవడంవల్ల ఆ పొయ్యిమీద నీవు చేసేవంట ప్రసాదరూపమై భక్తుల కష్టాలను, బాధలను పోగొట్టగల్గుతుంది. ఈ గాడిపొయ్యి ఇంకొక 9 సంవత్సరాలు మాత్రమే వెలుగుతుంది. అంటే నా 30వ యేట నేను నా శరీరాన్ని గుప్తపరచుకుంటాను.

ఆ తర్వాత 3 సంవత్సరాలు శ్రద్ధ ఉన్న భక్తులకు మాత్రమే తేజోరూపంలో దర్శనం ఇస్తాను. అటు తరువాత కూడా మనం మొదలు పెట్టిన ఈ అగ్నియఙ్ఞం ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగు తుంది’

🌷. కర్మధ్వంస విధానాలు 🌻
ఒకసారి నవదంపతులు శ్రీపాదుల దర్శనార్థం వచ్చారు. ప్రభువులు వారిద్దరిని పంచదేవ్ పహాడ్లోని తమ దర్బారు లో ఉండమని ఆదేశించారు. రెండోరోజు ఆ యువకుడు మరణించాడు. పాపం! ఆ యువతికి ఇది పరమదుస్సహ మైన వైధవ్యం, ఆమె శోకదేవతకు మారు రూపంలా ఉంది.

బంధువులు వచ్చారు, శవాన్ని ఏం చెయ్యాలో? శ్రీపాదులని ఏం అడగాలో? వారికి తెలియడంలేదు. అప్పుడే దర్బారు వచ్చిన శ్రీపాదులు కర్మ అనివార్యం అని సూచించారు. అప్పుడు ఆ స్త్రీ, "చైతన్యస్వరూపులు, అగ్నిరూపులు అయిన శ్రీపాదులకు అసాధ్యం అనేది ఏదీ లేదని విన్నాను. ఈ అభాగ్యురాలికి మాంగల్య భిక్షను ఇమ్మని," కోరింది.

వెంటనే శ్రీపాదులు "విశ్వాసో ఫలదాయకం," నాపైన నీకు అలాంటి దృఢమైన నమ్మకం ఉంటే నీ భర్త ఖచ్చితంగా సజీవుడు అవుతాడు. అయితే కర్మ సిద్ధాంతాలకు వ్యతి రేకం కాకుండా ఒక ఉపాయం చెప్తాను. నీ భర్త బరువుతో సమానంగా కట్టెలను తీసుకొని రా.

అవి గాడిపొయ్యిలో వేసి అన్నం వండుదాము. నీ వైధవ్యం, నీ భర్త శరీరం కాలి దగ్ధం అవడం, తరువాత వండే శ్రాద్ధాన్నం, మృత్యు రూపంలో ఉన్న కర్మస్పందనలు మొదలైన అమంగళాలు అన్ని కట్టెలతోపాటుగా కాలి భస్మం అవుతాయి," అని చెప్పారు ఆ రకంగా చేయగానే ఆమె భర్త తిరిగి జీవితుడు అయ్యాడు.

ఈ విధంగా శ్రీపాదులు తమ అగ్నియఙ్ఞం ద్వారా కొన్ని సార్లు భక్తుల కర్మలని కట్టెలలోకి ఆకర్షించి, వాటితో వండి, వాళ్ళ కర్మ ధ్వంసం చేసేవారు.

ఒకసారి ఒక బీద బ్రాహ్మ ణుడు జీవితంపై విసుగెత్తి ఆత్మహత్య చేసుకోవాలన్న తపనతో గురువుల వద్దకు వచ్చాడు. శ్రీపాదులు మండు తున్న కొరివిని తీసి ఆ బ్రాహ్మణుడికి వాత పెట్టారు.

బాధ పడుతున్న ఆ బ్రాహ్మణుడితో తాము కనక ఆ పని చేసి ఉండక పోయినట్లయితే అతడు నిజంగానే ఆత్మహత్య చేసుకొనేవాడని, తాము అశుభ స్పందనలను రద్దు చేసా మని చెప్పి ఆ చల్లారిన కొరివిని ఇంటికి తీసుకుపొమ్మని ఆఙ్ఞాపించారు.

ఇంటికి వెళ్ళి చూస్తే అది బంగారంగా మారి ఉంది. దానితో అతని దరిద్రబాధ తీరిపోయింది. ఒక్కొక్క సారి భక్తులని ప్రత్యేకమైన కాయకూరలు తెమ్మని చెప్పి, వారి కర్మలని వాటిలోకి ఆకర్షించి, వండించి, దానిని ప్రసా దంలా పంచేవారు.

వివాహం కాని ఒక యువతికి కుజదోషం పోవడానికి కందులు తెమ్మని వాటితో వంటకం చేయించి ఆ అమ్మాయితో సహా అందరిని తినమని ఆదేశించారు. కర్మబంధ విముక్తురాలైన ఆ అమ్మాయికి చక్కటి వరుడు దొరికి వివాహం అయ్యింది.

కొందరిని వంటకి ఆవు నెయ్యి తెమ్మనేవారు. జబ్బు పడ్డ భక్తునికి ఆ రాత్రంతా ఆరకుండా దీపం వెలిగించి ఉంచమని చెప్పారు. నిర్భాగ్య స్థితిలో ఉన్న మరొక భక్తుని వారం రోజులపాటు అఖండ దీపం ఆవు నేతితో వెలిగించి ఉంచమని చెప్పారు.

అతడికి లక్ష్మీకటాక్షం సిద్ధించింది. ఈ విధంగా భక్తులకు వారి మీద ఉన్న నమ్మ కానికి అనుగుణంగా రకరకాల పద్ధతుల ద్వారా, భక్తుల బాధలను తీర్చేవారు.

శ్రీపాదరాజం శరణం ప్రపద్యే

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sripada Srivallabha Charithamrutham - 240 🌹
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 26
🌻 Kanayaka Puranam - 2 🌻

In those days Vysyas used to worship Parameswari very much. Due to intense devotion, some people used to offer their children to Parameswari. Such ‘offered girls’ used to be called ‘goura balikas’. The boys were called ‘Bala nagaras’. There used to be a strict rule that Goura balikas should be married to Bala nagaras only.

Bhaskaracharya used to give special deeksha called ‘chaitanya kriya yogam’ to Gaura balikas and Bala nagaras. They used to be transformed into yogins and yogis from the childhood.

Bhaskaracharya’s belief was that children born to such people would be superior and their families would be happy with wealth and luck and live with mutual love like ‘Gouri and Shankar’. These 18 towns were specially sacred ones. Nagareswara Mahadeva was the head of those divine towns and Kusuma Shresti was the King ruling those towns.

Bhaskaracharya’s wish was that one new type of creation should be brought into the prakruthi (nature). As there was no issue to the Kusuma Shresti couple, Bhaskaracharya conducted ‘Puthra Kameshti Yagam’. Arya Mahadevi manifested in that yajna kundam and gave two fruits to them.

As a result, on one Dasami in the first half of the month of ‘Vysakha’, on Friday in the Punarvasu star, Vasavee Kanyaka was born. As a twin brother to Vasavee Kanyaka, one male child was also born.

They named this male child ‘Virupaksha’. Vasavee Kanyaka was really My divine sister.

Virupaksha was born with the ‘amsa’ of Nandeeswara as Her twin brother. Previously Silada Maharshi went to Himalayas while taking stones as food.

He had darshan of Hymavathi Maha Devi and prayed, ‘Amma! You are the daughter of a mountain (saila puthri). Because I eat stones, I am also a ‘Saila Puthra’.

Please grant me the fortune of being born as your brother. Sri Hymavathi said, ‘Maharshi! In this birth, I will marry Parameswara.

You be our vahana (vehicle) as Nandeeswara. When I take birth in Kaliyugam as Kanyaka Parameswari, you will also be born as my twin brother.

I am gifting you the same stone on which I did tapas. You take this stone to ‘jyesta sailam’. At the time of ‘sankusthapana’, this stone should be kept in the pit and a fort should be built on it.

In Kaliyugam, the Sadvysya King Kusuma Shresti will build this fort. Later, I and the couples belonging to 102 gothras will enter into ‘agni kundam’ and reach Kailasam again.

At the end of Kaliyugam, my brother Sripada Srivallabha takes avathar as Kalki, kill crores of people of bad character and establish ‘dharma’.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹