శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 239 / Sripada Srivallabha Charithamrutham - 239

✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయం 48
🌹. శ్రీపాదుల ధర్మబోధలు 🌹
శ్రీపాదులవారు సాధారణంగా గురువారంనాడు పంచదేవ్‌పహాడ్‌లో దర్బారు జరిపేవారు. వారు కృష్ణ మీదుగా నడిచి వచ్చేటప్పుడు కాలు పెట్టబోయే ప్రతిచోట ఒక పద్మం ఉదయించేది. వారు ఆ పద్మాల మీదుగా నడిచి వచ్చేవారు. ఆ కర్ర పాదుకలు ఎలా వాటిమీద నిలిచేవో ఊహకు అందని విషయం.
దర్బారు సాయంత్రం వరకు సాగేది. వారు మళ్ళీ ఇదే విధంగా నడుచుకుంటూ తిరిగి కురుంగడ్డ వెళ్ళేవారు. భక్తులు వారికి వచ్చేటప్పుడు స్వాగతం, వెళ్ళేటప్పుడు వీడ్కోలు ఇచ్చేవారు. ప్రతి శుక్రవారం స్త్రీలకు పసుపు కొమ్ములు పంచి ఇచ్చేవారు.
తమకంటె పెద్దవారయిన స్త్రీలను అమ్మా! సుమతీ! అనో, అమ్మా! అనసూయమ్మతల్లీ! అనో పిలిచేవారు. చిన్నవారిని అమ్మా! వాసవీ, అనికాని సురేఖా, రాధా, విద్యాధరీ! పేర్లతో కాని పిలిచేవారు. వృద్ధు లను ఆప్యాయంగా అమ్మమ్మా! అని, మగవారిని అయితే తాతా! అని పిలిచేవారు. ఇలా చిన్నవాళ్ళనైనా, పెద్దవాళ్ళ నైనా ఆపేక్షగా మర్యాదగా సంబోధించి మాట్లాడే వారు.
శుక్రవారం దర్బారు వీలునుబట్టి పంచదేవ్‌పహాడ్‌లోకాని, కురుం గడ్డలో కాని నిర్వహించేవారు.
ఆదివారం యోగవిద్య,
సోమవారం పురాణగాథలు
మంగళవారం ఉపనిషత్తులు
బుధవారం వేదాలు-వేదార్థాలు
గురువారం గురుతత్వం
శుక్రవారం శ్రీవిద్య
శనివారం శివారాధనమహత్యం
ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం ప్రబోధించేవారు. ఏ రోజయినా సరే భక్తుల యోగక్షేమాలు మాత్రం తప్పక అడిగి తెలుసుకొనేవారు. ప్రతిరోజు అన్నసంతర్పణ ఉండేది. గురువారం మాత్రం ప్రత్యేకమైన వంటలు చేయించి, స్వయంగా వడ్డించేవారు. అదృష్టవంతులు కొంతమందికి స్వహస్తాలతో తినిపించేవారు కూడా.
ఏదో ఒక తీపి పదార్థం ప్రసాదంలా పంచేవారు. భక్తులు జొన్నలు, రాగులు, వరి, కాయగూరలు మొదలైనవి తెచ్చేవారు. ఎలాంటి బాధతో వచ్చిన భక్తులైనా, ఆబాధ నివారణ అయ్యే దర్బారునుండి తిరిగి వెళ్ళేవారు.
శ్రీదత్తపురాణం చదవమని, దత్తుల అనుగ్రహం తప్పక లభిస్తుందని శ్రీచరణులు బోధించే వారు. రాత్రివేళ ఎవ్వరిని కురుంగడ్డలో ఉండనిచ్చేవారు కాదు. నాతో వచ్చిన వృద్ధ సన్యాసిని మాత్రం కొన్ని రోజులు ఉండని చ్చారు. తరువాత వారిని కాశీకి వెళ్ళమని, అక్కడే దేహం చాలించమని చెప్పారు.
భోజనం తయారుచేయడం, వంటపాత్రలు తోమడం, వచ్చిన భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడటం నా విధులు. ఏ వేళలో భక్తులు వచ్చినా వాళ్ళకు విధిగా భోజనం పెట్టాలని, వాళ్ళది ప్రసాద రూపంలో తప్పక తినాలని చెప్పేవారు.
ఎప్పుడయినా భోజన పదార్థాలు తక్కువగా ఉన్నాయని నేను చెప్తే, తమ కమండలంనుండి వాటిపైన కొద్దిగా నీళ్ళు చల్లేవారు. దానితో వంటకాలన్ని అక్షయంలా వస్తుండేవి. వారుమాత్రం ఏ అన్నమైనా సరే కేవలం గుప్పెడు మెతుకులు తినేవారు.
🌻. దివ్య ఉపదేశాలు 🌻
వారి దివ్య దర్శనం అయ్యాక కూడా తమ దుష్ట ప్రవృత్తు లను మార్చుకోనివారికి విచిత్రమైన కష్టాలు వచ్చేవి. తిరిగి వాటి నివారణ కోసం ప్రభువుల వద్దకు పరుగెత్తుకు వచ్చే వారు. చనిపోయిన పెద్దలకు శ్రద్ధతో తప్పక శ్రాద్ధకర్మలు చేయాలని బోధించేవారు.
ఎవరిపైన తమకు పక్షపాత ధోరణి లేదని, అష్టాదశ వర్ణాలవారు తమ దృష్టిలో సమానులే అని, వాళ్ళు అనుసరించే ధర్మకర్మలను బట్టి తాము ఫలితాలను ఇస్తామని చెప్పేవారు. నీవు నీ గురువుకి నమ స్కరిస్తే, అతడు తన గురువుకి నమస్కరిస్తాడని, ఆ శృంఖల చివరకు ఆదిగురువైన తమ వరకు వచ్చి తమకే చెందుతుందని అనేవారు.
దేవతలకు కోపం వస్తే గురువు రక్షిస్తారని, గురువునకే కోపం వచ్చినట్లయితే రక్షించేవారు ఎవ్వరూ ఉండరని హెచ్చరించేవారు. ఈ సృష్టిలో ఎవ్వరిని ద్వేషించ వద్దని, తిరిగి ఆ భావం కూడా తమకే వచ్చి చేరుతుందని ఉద్బోధించేవారు.
రాత్రివేళలలో దేవతలు విమానాలలో, హిమాలయాలలోని యోగులు దివ్యకాంతిమయ దేహాలతో గురుసార్వభౌముల దగ్గరకు కురుంగడ్డ వస్తుండేవారు.
కురుంగడ్డ విశేష మహిమాన్విత క్షేత్రమని, అక్కడ ఉన్న ఈశ్వరుడు జాగృత మూర్తి అని, అక్కడ దేవతలు, మహర్షులు, సిద్ధులు మారు వేషాలలో తిరుగుతుంటారని శ్రీవల్లభులు చెప్పేవారు. తమ దర్శనం సమస్త పాపాలను పోగొట్టి శుభఫలితాలను ఇస్తుందని చెప్పేవారు.
వ్యక్తులు చేసే కర్మలు అన్ని ధర్మ సమ్మతములై ఉండాలని, హృదయంలో నిరంతరం భగవన్నామాన్ని స్మరిస్తూ తమ తమ కర్మలను చేస్తుండాలని చెప్పుతుండేవారు. శ్రీపాదుల దివ్యవచనాలను అనుసరిస్తూ మన జీవితాలను తీర్చి దిద్దుకోవాలని ప్రార్థిస్తున్నాను.
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sripada Srivallabha Charithamrutham - 239 🌹
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj
Chapter 26
🌻 Kanayaka Puranam 🌻
Sri Kanyaka Puranam is there in the Sanat Sujatha Samhitha, in Skanda Brihit Puranam. Brihat Sila Nagaram is also called Jyestha Sailam.
There were 18 towns namely Brihat Sila Nagaram, Niravadyapuram, Veeranarayanam, Vishalapuram, Asantamu, Narasapuram, Dhanadapuram, Dharmapuram, Jagannadham, Kalingapuram, Panchalapuram, Palakolanu, Trigunapuram, Bhimapuram, Ghantasalam, Peethikapuram. Kusuma Shreshti was ruling these towns with Brihat Sila Nagaram as the capital. 18 is Jaya Sankhya (victory number).
In these eighteen towns, there were Vysya nagara Swamis belonging to 714 gothras. Only 102 were naturally formed gothras. There were strict rules made for these 102 gothras.
The people of other gothras said that they would also follow those strict rules. So they were also included in Vysya nagara Swamis and so the number of gothras went upto to 714.
The people belonging to 102 gothras who followed strict austerities, used to live in Brihat Sila Nagaram. They used to worship ‘Arya Maha Devi’ (Parvathi Devi).
They were called Arya Vysyas because they migrated from Aryavartham and they were revered, used to worship Arya Mahadevi and were following strict austerities different from other important vysyas. The people belonging to the remaining gothras requested to include them also in Arya Vysyas.
Bhaskaracharya used to be the Guru of Kusuma Shresti. My grandfather Bapannavadhani was the same Bhaskaracharya in his previous birth.
After hearing the petition of people of other gothras, Bhaskaracharya said, ‘My Dear people! It is not possible to decide the value without testing the eligibility. There is an ‘Agni Pareeksha’ (test of fire) before taking decisions confirming the eligibility.
People who pass the ‘Agni Pareeksha’ will certainly be given the title ‘Arya Vysya’. Otherwise, it is not possible. Is it acceptable to you all?” Everybody heard this and agreed.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹