శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 238 / Sripada Srivallabha Charithamrutham - 238

🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 238 / Sripada Srivallabha Charithamrutham - 238 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయం 47
🌻. శ్రీపాదుల మాతృభక్తి 🌻
శ్రీపాద శ్రీవల్లభ దర్బారులో భోజనం సమృద్ధిగా, అక్షయంగా వస్తూనే ఉంది. అందరం తినగా మిగిలినది కృష్ణా నదిలో జలచరాలకు వేసారు. వాటికి కూడా శ్రీపాదుల ప్రసాదం లభించింది.
శ్రీపాదులవారి పనులన్ని అసాధారణంగాను, రోమాంచకంగాను ఉంటాయి అని శ్రేష్ఠిగారు తెల్పినపుడు, శ్రీచరణులు దానికి జవాబు చెప్తూ, "నానుండి వెలువడే ఒక చిన్న కిరణాన్నే ఈ భూమి తట్టుకోలేదు.
అందుకనే నన్ను నేను మాయలో దాచుకుంటూ, అవసరమని తోచిన పుడు మాత్రమే లీలలను ప్రదర్శిస్తాను. తాతా! నేను ఎత్త లేని బరువు, పరిష్కరించలేని సమస్య, ఈయలేని వరము, చేయలేని కార్యము ఈ సృష్టిలో లేవు.
పీఠికాపురం నుండి మిమ్మల్ని ఇక్కడకు ఇలా రప్పించడం చాలా చిన్న విష యం," అని వివరించారు. తరువాత ముగ్గురు అమ్మమ్మలు ప్రేమతో వారికి హల్వా, పెరుగు, వెన్న తినిపించారు.
వాళ్ళు శ్రీపాదులను పెండ్లి కుమారుడిగా చూడాలన్న తమ కోరికను వెల్లడించారు.
దానికి వారు కల్కి అవతారంగా శంబల గ్రామంలో జన్మించినపుడు సింహళంలో పద్మావతి అనే పేరున జన్మించిన అనఘాలక్ష్మిని వివాహం చేసుకుంటా నని, దానిని వాళ్ళు తప్పక చూడగల్గుతారని హామీ ఇచ్చారు. రాజశర్మ, "నాయనా! నీవు దత్త ప్రభువని తెలి యక ఏదయినా అపరాధం చేసినట్లయితే క్షమించమ,"ని ప్రార్థించారు.
"నాన్నా! నేను మీ బిడ్డను. తండ్రి బిడ్డను క్షమించమని అడగడం ఎంత విడ్డూరం! మీరు వాత్సల్యం కురిపిస్తూ నా అభివృద్ధికి తోడ్పడాలే తప్ప ఇలాంటివి మాట్లాడకూడదు," అని సమాధాన పరిచారు.
🌻. దివ్య శిశువులు ఇరువురు 🌻
పెళ్ళికొడుకుగా చూడవలసిన కుమారుని యతీశ్వరునిగా చూస్తున్నందుకు కళ్ళనీళ్ళు పెట్టుకున్న తల్లి ధ్యాసను మరలుస్తూ, "అమ్మా! నాకు ఆకలిగా ఉందని అనసూయా మాత దగ్గరకు వెళ్ళితే నాకంటె ముందు ఆ రాక్షసి వాసవి అక్కడ చేరి అమ్మ వద్ద పాలన్ని తాగేసి, నీవు సుమతీ మాత దగ్గరకి తొందరగా వెళ్ళి పాలు తాగు, లేదా ఆ పాలు కూడా నేనే తాగేస్తాను అని బెదిరిస్తుంది, చూడమ్మా!" అంటూ పసిపాపలా మారిపోయారు.
సుమతి ఆ శిశువును తన ఒడిలోకి తీసుకొని స్తన్యం ఇస్తూ, ప్రేమగా వాసవీ! అంటు పిలిచారు. మరుక్షణమే పూర్తిగా శ్రీపాదుల లాగే ఉన్న పసిపాప సుమతి ఒడిలోకి వచ్చింది సుమతీ మాత ఇద్దరు పిల్లలకుచెరోవైపు స్తన్యపానం ఇస్తూ తన దుఃఖ మంతా మరిచిపోయింది.
విన్నపాలు వినవలె....
వచ్చినవారిలో వెంకయ్య అనే పంటకాపు ఉన్నారు అతని యింటి దగ్గరే శ్రీపాదులు అన్ని వర్ణాలవారికి దత్తదీక్షను ఇచ్చారు.
"ఇంతటి దివ్యలీల జరిగిన ఈ దర్బారు ప్రదేశం, దీనికి ఆనుకొని ఉన్న విశాల భూభాగం విశ్వవిఖ్యాతి పొందాలి," అని వెంకయ్య తన కోరిక వ్యక్తం చేసారు. భవిష్య త్తులో పక్కా భవన నిర్మాణం జరుగుతుందని, అందులో గోశాల కూడా ఉంటుందని శ్రీపాదులు చెప్పారు.
నా కన్నుల ముందే జరిగిన ఈ లీలని నేను యథాతథంగా వ్రాస్తున్నానే తప్ప ఇందులో ఏ రకమైన అతిశయోక్తి లేదు. తరువాత కొంతసేపటికి మళ్ళీ అందరం మగతలోకి జారుకున్నాం. కనులు తెరిచి చూస్తే శ్రీపాదులు, నేను, ఆ సన్యాసి తప్ప మిగిలిన ఎవ్వరూ లేరు. వాళ్ళని ఏదైనా రాక్షసమాయ బలి తీసుకుందా? అని నాకు భయం వేసింది.
శ్రీపాదులు ఇలా తెలిపారు, "నా సన్నిధిలో ఏ రాక్షసమాయ పని చేయదు. వారందరిని తిరిగి క్షేమంగా పీఠికాపురం చేర్చాను. నన్ను ఎవరు ఏ భావంతో సేవిస్తారో వారిని ఆ విధంగానే నేను తరింపచేస్తాను."
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే
సశేషం
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sripada Srivallabha Charithamrutham - 238 🌹
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj
Chapter 26
🌻 The indicators of end of kali yugam 🌻
Pithru devathas are not the elders who died. They are the janyu devathas who receive the fruits of ‘shraadha’ and give higher states to the departed souls. They do not have any birth.
Yogi sees the yoga chakras in his body as the six seasons in the external year. In one year, there are 12 ‘pournamis’ and 12 ‘amavasyas’. Learn that these 24 parvas are the 24 letters of Gayathri chadassu.
Narayana, who is ‘kala swaroopa’ is worshipped as ‘samvatsara purusha’ by some people. This vidya is called Dwadasakshari vidya. There are 12 letters in the mantra, one letter for each month. Learn that these following are the indicators of end of Yuga.
Rivers and streams overflow and cause endless damage. The earth keeps moving with earthquakes often, reminding the pralayam Sun, Moon etc over step their orbits.
In the day, there will be darkness and Sun is not seen. Seeing frightful comets in the sky is also an indicator. At the end part of Dwapara yugam, the Kali purusha who is the lord of Kali yuga did intense penance in an island in the western sea.
All these things were made known by Veda Vyasa Maharshi in his ‘Bhavishya Purana’.
🌻 Birth of Mleccha race 🌻
Seeing Veda mantras, yajnas and tapas everywhere, the Kali purusha prayed with extreme grief. “Prabhu! Dharma is raging everywhere like agnihotra. How can I spread my influence? In accordance with the promise given to you, I have to spread my Yuga dharma. It appears impossible to me.”
Then the Lord of Universe showed Kali an island in the west sea. There He showed Adam and Eve (Aadamudu and Havyavathi) who are the root couple of mleccha race. He created a beautiful garden for their play.
In reality, they both are born together i.e. brother and sister. Kali entered there in the form of a serpant and incited unjust lust between them and encouraged them to beget children. Then they became fallen from dharma and their divine powers disappeared.
From these couple mleccha race which was the root of Kali dharma emerged. In the last part of Dwapara Yugam i.e. 2800 years before the end of Dwapara Yuga, their children started multiplying in the mleccha desam. It was mentioned in the ‘Prathi sarga parvam’ of Bhavishya Purana.
Adam and Eve who were created at Neelachalam, took the fruit of sin and produced children who would abuse the arya dharma and eat everything and would not follow tradition.
I have to take Kalki avathar and destroy crores of people fallen from dharma and establish Satya Yuga again. This is my programme in the distant future.
Then Dharma Gupta said, ‘Swami! I have a desire for many days to learn the story of Sri Vasavee Parameswari avathar from you. Please tell me.’ Sri Charana, with a pleasing lotus face, said smiling.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹