శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 237 / Sripada Srivallabha Charithamrutham - 237

🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 237 / Sripada Srivallabha Charithamrutham - 237 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయం 45
🌻. గురుసార్వభౌముల లీల 🌻
మేము తిరుగు ప్రయాణానికి బయలుదేరుతున్నప్పుడు, నాల్గు కుటుంబాలవారు మాతోపాటుగా కురువపురం రావడానికి నిశ్చయించుకున్నారు. 18 గుఱ్ఱపుబండ్లను సమకూర్చారు. ప్రయాణం చాలా రోజులు పడుతుంది అని తెలిసినా శ్రీపాదులను చూడబోతున్నాం అనే భావన ముందు ఇది పెద్ద విషయంలా వారికి తోచలేదు.
18 గుఱ్ఱపు బండ్లు ఉన్నట్లుండి ఒక్కసారి నేలమీద కాక ఆకాశంలో పరిగెత్తుతున్నట్లు అనిపించింది. బండ్లు తోలేవాళ్ళతో సహా అందరికి మత్తు ఆవహించింది. మేము తెల్లవారుఝామున బయలుదేరితే మధ్యాహ్నానికల్లా ఒక గ్రామం దగ్గర బళ్ళు ఆగాయి. బండ్లు ఆగడం, మాకు మత్తు వదలడం ఒకేసారి జరిగాయి.
🌻. పంచదేవ్‍పహాడ్‍లో గురువారం దర్బార్ 🌻
మేము బండ్లు దిగి బాటసారులని అది ఏ ఊరు అని అడి గాము. వారది పంచదేవ్పహాడ్ అని, ఆ రోజు గురువారం కాబట్టి శ్రీపాదుల దర్బారుకి వెళ్ళుతున్నా మని, అక్కడ ఆ మహాప్రభువులు అందరి బాధలను నివా రించి, అందరికి కడుపు నిండుగా భోజనాలు పెడ్తారని చెప్పారు.
ఇంత తక్కువ సమయంలో మేము అక్కడికి ఎలా చేరామో మాకు అర్థం కాలేదు. మాకు అది కలా? నిజమా? అన్న సందేహం శ్రీపాదులని చూసేంతవరకు దూరం కాలేదు.
సుమతీదేవి శ్రీపాదులను కౌగిలించుకొని కన్నీరు పెట్టు కున్నారు. తల్లిని ఊరడిస్తూ శ్రీపాదులు," అమ్మా! అనసూయమాతతో సమానమైన సాధ్వివి, నిర్గుణ, నిరాకార పరతత్వాన్ని బిడ్డగా పొందిన భాగ్యశాలివి. నీవు కంటతడి పెడితే భూమిలో పంటలు పండుతాయా?” అంటూ తమ దివ్య హస్తాలతో ఆమె కన్నీరు తుడిచారు.
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sripada Srivallabha Charithamrutham - 237 🌹
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj
Chapter 26
🌻 The Story of Sri Kanyaka Parameswari’s Birth 🌻
We reached Kurungadda early in the morning for darshan of Sripada Srivallabha. Sri Dharma Gupta had a strong desire to know the things related to the origin of Kali Yugam from Sripada Srivallabha.
On that day Sripada looked very pleased and with nectarine looks spreading His grace allowed us to touch His divine lotus feet.
Sri Dharma Gupta prayed Sripada to tell us how Kali Yugam started and make us blessed. Sri Charana said, ‘My Dear! ‘kaalam’ (time) is paramatma’s opulent form (virat swaroopam). Sun is also called kaalaatmaka.
The time taken for Sun, starting from Dhanishta star, going round Shravana star and coming back to Dhanishta, is called Brahma Kalpam.
In Brahma Kalpam, one half is ‘shrishti kalpam’ (the time of creation) and the other half is ‘pralaya kalpam’ (the time of pralaya).
It is like the experience of day and night for common people. In the ‘kaala’ related to pithru devathas, one half is ‘shukla paksham’ and the other half is ‘krishna paksham’.
For ‘samvatsara purusha’, 6 months is ‘uttarayanam’ and the other 6 months is ‘dakshinayanam’. Yogi will have darshan of this kala chakram (the cycle of time) in his body only.
This secret vidya is called ‘Taaraka Raja Yoga Vidya’. People who do not know this will not understand ‘kala jnanam’.
In Taraka Raja Yogam, the body is thought of as Brahmanda. All the ‘lokas’ (worlds) are in that. The site of thinking in our head is called Brahma lokam. There is Vishnu lokam in the umbilicus.
There is Rudra lokam in our heart. In our sperm, pithrudevathas (Janyu devathas) will be there. These janyu devathas will transfer the fruit of karma done by previous generations to the coming generations.
‘Time’ is very much essential for reaching these fruits of previous karmas in a sequential way.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹