శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 236 / Sripada Srivallabha Charithamrutham - 236

🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 236 / Sripada Srivallabha Charithamrutham - 236 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయం 45
🌻. అశ్వాల వ్యోమ యానం 🌻
మేము ఇచ్చిన శ్రీపాదులవారి పాదుకలను భాస్కర పండితులు పూజామందిరంలో పెట్టారు. వాటిపైన వేసిన అక్షతలు వృద్ధి పొందసాగాయి.
మేమిద్దరం అది చూసి ఆశ్చర్య పడుతుంటే ఆ రోజు ఉత్తరాఫల్గునీ నక్ష్తత్రమని, శ్రీనివాసుల కళ్యాణం ఆ నక్షత్రంలోనే జరిగిందని, తాము సాక్షాత్తు పద్మావతీ సమేత వేంకటేశ్వరులని తెలపడానికే శ్రీపాదులు ఈ లీల చేసారని చెప్పి భాస్కర పండితులు మాకు కొన్ని మంత్రాక్షతలు ఇచ్చారు.
మేము మా ప్రయాణం సాగించాము. కొంతదూరం ఎడ్లబండిపై వెళ్ళాం, వాళ్ళకి కొన్ని మంత్రాక్షతలు ఇచ్చాము. తరువాత కొండవీడు వెళ్తున్న గుఱ్ఱపు బండిలో ఎక్కి. వాళ్ళకి కూడా కొన్ని మంత్రాక్షతలు ఇచ్చాము. ఆ బండి ఆసామి వైశ్య ప్రముఖులు అయిన ధనగుప్తులు. కొండవీడులో జరుగ బోతున్న కుమారుని వివాహానికి వాళ్ళు వెళ్లుతున్నారు. వారు మాతో ఇలా చెప్పారు,
🌻.. ధనగుప్తుల అనుభవాలు 🌻
"నేనొకసారి వ్యాపారపు పనిమీద పీఠికాపురానికి వెళ్ళాను. అక్కడ శ్రీపాదులను కలిసాను, వారు నాతో," నీ కుమారుని వివాహ సందర్భంలో మీకు నా ఆశీసులతో అక్షతలు ఇస్తాను.
ఎవరిద్వారా అక్షతలు మీకు లభిస్తాయో ఆ బ్రాహ్మ ణునికి 11 వరహాలు దక్షిణగా ఇవ్వండి, అతనితో ఉన్న వైశ్య ప్రముఖుని కుమారునికి మీ కుమార్తెను ఇచ్చి వివాహం చేయండి, వారికి 100వరహాలు ఇచ్చి కొండవీడులో నిశ్చయ తాంబూలాలు తీసుకోండి," అని చెప్పారని తెలియజేసారు. ధనగుప్తులవారి కుటుంబాన్ని కూడా కొండవీడు వివాహా నికి ఆహ్వానించారు. అక్కడే ధర్మగుప్తుల కుమారునికి ధన గుప్తుల కుమార్తెతో నిశ్చయ తాంబూలాలు జరిగాయి.
నాకు 11, ధర్మగుప్తులకి 100 వరహాలు ఇచ్చారు. వజ్రాలకు సంబంధించిన వ్యాపారం కోసం ధర్మగుప్తులు అక్కడే ఉండి పోయారు, నన్ను గుఱ్ఱపు బండిలో విజయవాటిక పంపి వాళ్ళ బంధువుల ఇంట్లో బస ఏర్పాటు చేసారు. కృష్ణా నదిలో స్నానం చేసి దుర్గాదేవి దర్శనానికి వెళ్ళాను. అక్కడ శ్రీపాదుల దర్శనానికై తహతహలాడుతున్న ఒక వృద్ధ సన్యాసి కలిసారు.
ఈ మారు నేను, ఆ వృద్ధ సన్యాసి పీఠికాపుర ప్రయాణం మొదలుపెట్టాం. దారిలో రాణ్మహేంద్రవరంలో గోదావరిలో స్నానం చేసి మార్కండేశ్వరుని, కోటిలింగేశ్వరుని దర్శిం చాము.
కొద్దిరోజుల ప్రయాణం తరువాత పీఠికాపురం చేరుకొన్నాము. సత్యఋషీశ్వరులైన బాపనార్యుల ఇంట్లో బస చేసి, ఆ నాల్గు కుటుంబాలవారినుండి, ఇతరుల నుండి శ్రీచరణుల లీలలు ఎన్నో విన్నాం. వారి లీలల్ని వర్ణించ డానికి వేయి నాల్కలున్న ఆదిశేషువుకే సాధ్యం కానపుడు నాబోటి వారెంత? కొన్ని కొన్ని లీలలను మాత్రమే గ్రంథస్థం చేస్తున్నాను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sripada Srivallabha Charithamrutham - 236 🌹
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj
Chapter 25
🌻 Description of Rudrakshas - 2 🌻
Sripada has incorporated into his ‘chaitanyam’ the tatwa (philosophy) of Ganeswara who is the lord of all ‘Pravrithi’ and ‘Nivruthi’ ganas.
So he is the divine form of 33 crores of Gods combined. Moreover without His will, not even one atom or sub atom will be able to move. He is the ‘kaarana’ roopam (cause) and the source of all movements.
He is the cause of all causes. If He is thought of as Siva form, He will appear as Vishnu. He will appear as Siva, if thought of as Vishnu. If we reduce our tendencies of argument, and surrender to Him, He will show His real form.”
Thus he told me different types of Shiva worship, things related to rudrakshas and many other things, and said that he would also come with me to Kurungadda to have darshan of Sripada with an intention to fulfil his life. We both came to Kurungadda and had darshan of Sripada Srivallabha Guru Sarvabhouma.
He opened His eyes from yoga nidra and said, ‘Oh! What discussions! What discussions! There is a person called Sripada! He is Siva Swaroopa! Am I Sripada or Sripada had come as ‘I’. Who am I really? Sir! Dharma Gupta! Please explain a little.’
Dharma Gupta told Sripada ‘Swami! When I started for Sri Mahaguru’s darshan from Peethikapuram, my brother-in-law Venkatappaiah Shresti told me.’ ‘Don’t fall into ‘ajnana’ by arguing with Sripada. Merely surrender to Him and receive His grace.’ So, I will only keep quiet to all your questions.
When Vedas also kept quiet unable to explain your philosophy, who am I to attempt? What is my knowledge?’ Sripada was pleased. He told me and Dharma Gupta to pay obeisance to His feet.
Immediately after touching His feet, we lost consciousness and stayed in dhyana for a long time. It was becoming evening ‘sandhya’. Sripada told us to start from Kurungadda and go to the other side of Krishna.
We did that. Myself and Dharma Gupta spent time in the night with narrations of Sripada’s divine leelas. It can not be said that His leelas will be like this or that.
We lay down to sleep. We heard a sweet voice from somewhere. Some yogis were chanting the name ‘Sripada Srivallabha Digambara’.
End of Chapter 25
Continues...
🌹 🌹 🌹 🌹 🌹