శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 235 / Sripada Srivallabha Charithamrutham - 235

🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 235 / Sripada Srivallabha Charithamrutham - 235 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయం 45
🌻. శ్రీసాయి అవతరణ 🌻
మధ్యాహ్నం భోజనాలు అయ్యాక మా కోరికపై భాస్కర పండితులు శ్రీపాదుల లీలలను మళ్ళీ వర్ణించసాగారు: "శ్రీచరణులు కాశీ మహాపుణ్యక్షేత్రంలో ఎందరికో యోగ, సిద్ధ శక్తులను ప్రసాదించారు.
క్రియా యోగాన్ని గృహస్థు లకు బోధించడానికి శ్రీశ్యామచరణులు అనే మహా మనీషిని అక్కడ జన్మించ వలసినదిగా ఆదేశించానని, వారికి హను మంతులచే క్రియాయోగదీక్షను ఇప్పించెదనని చెప్పారు.
తరువాత వారు బదరికావనం మీదుగా నేపాల్ వెళ్ళి అక్కడ ఒక పర్వతం పైన రామనామ ధ్యానంలో నిమగ్నులై ఉన్న హనుమంతునికి సీతారామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న సమేతులుగా దర్శనమిచ్చి అనంతకాలం అగ్నిబీజ రూపమైన రామనామాన్ని లెక్కకు అందనన్ని మార్లు జపం చేసి కాలాతీతుడు, కాలాత్మకుడు అయ్యారని చెప్పి కలియుగంలో ఒకమారు అవతరించాల్సి ఉందని, వారు ఇంద్రియ ప్రవృత్తులను శాంతింపచేయగల సమర్థులు అగుటచే శాయి అనే పేరుతో విఖ్యాతి చెందుతారని చెప్పారు.
అరబ్బీ భాషలో అల్ అనగా శక్తి, అహ్ అనగా శాక్త, శక్తిని ధరించినవాడు. అందువల్ల అల్లాహ్ అనగా శివ శక్తుల సంయుక్త స్వరూపమని, వారు తమ అవతారంలో శివశక్తి స్వరూపమైన అల్లా నామమును స్మరిస్తారని కూడా తెలిపారు.
🌻. హనుమ విన్నపాలు 🌻
అపుడు స్వామి జన్మించిన భారద్వాజ గోత్రంలోనే తాము కూడా జన్మించాలని, అంశావతారంలా కాక దత్తసాయు జ్యంతో మూలావతారంలాగా అవతరించాలనే తమ కోరికను హనుమంతులవారు తెలియజేసారు.
వెంటనే శ్రీపాదులు కాలపురుషుని పిలిచి, "ఇతనికి నా సాయు జ్యాన్ని ప్రసాదింప దలిచాను. కనుక హనుమలోని చైత న్యాన్ని దానికి అనుగుణంగా మార్చ వలసినది." అని ఆఙ్ఞా పించారు.
ఒక్క క్షణంలో హనుమయొక్క శరీరంలోని జీవా ణువులు అన్ని విఘటన చెంది దానిలోనుండి అనసూయా మాత ఆవిర్భవించి, ప్రసవవేదన పడసాగింది.
తన కన్నుల ఎదురుగా ఉన్న దత్తుడు తిరిగి తన గర్భంలో జన్మించ దలచినాడా? అని ఆశ్చర్య పడసాగింది. దానికి వారు ఆమె గర్భమందున్నది హనుమ అని, వారికి తాము సాయుజ్య స్థితిని ఇస్తున్నామని సమాధానం చెప్పారు.
ఇంతలో అనసూయ ముద్దులు మూటకట్టే మూడు తలల దత్త మూర్తికి జన్మనిచ్చింది. కొంతసేపటికి ఆ మూర్తి ఒక పసి పాపడిలా మారిపోయింది, అనసూయ ఆ నవజాతశిశు వుకు స్తన్యం ఇచ్చింది. కొంతసేపటికి ఆ శిశువు హనుమలా మారిపోయాడు.
తమలో లీనమై ఉన్న మహబూబ్ సుభానీ అను మహాఙ్ఞానిని వారిష్ ఆలీషా అనే పేరుతో అవతరింప చేస్తామని, వారు గురువై యోగరహస్యాలు బోధిస్తారని, తమనే నిరంతరం స్మరిస్తూ తమ చైతన్యంలో మనస్సును లీనంచేసి ఉన్న గోపాలరావు అనే మహా భక్తుడిని హిందూ ధర్మాన్ని ఉపదేశించడానికి వారికి గురువుగా ప్రసాదిస్తున్నామని, అతడు వెంకటేశ్వర భక్తుడై వెంకూశా పేరుతో వారి సాయిబాబా అవతారంలో గురువు అవుతారని శ్రీపాదులు హనుమతో చెప్పారు.
అపుడు హనుమ సీతతో, "తల్లీ! మీరు ప్రేమతో ఇచ్చిన మాణిక్య హారాన్ని, దానిలో ఎక్కడైనా రామనామం ఉందేమో చూడ టానికని నేను విరగకొట్టి, రామనామం లేకపోవడంతో పారేసాను. ఆ అపరాధం మన్నించండి," అని ప్రార్థించారు.
దానికి శ్రీపాదులు ఆ మాణిక్య హారమే మాణిక్యప్రభువులనే గురు స్వరూపంగా అవతరిస్తుందని తమ సన్నిధిలో కారణం లేని కార్యం జరగదని విశదీకరించారు.
🌻. కురుంగడ్డ వాసం 🌻
తరువాత శ్రీపాదులు ద్రోణగిరి అని పిలువబడే సంజీవని పర్వతం వద్దకి వెళ్ళి అక్కడి ఋషిపుంగవులతో కొంతకాలం గడిపి, కల్కి ప్రభువు జన్మించే శంబల గ్రామానికి వెళ్ళారు.
అక్కడనుండి అనేక దివ్య క్షేత్రాలను దర్శిస్తూ, మహర్షు లను ఆశీర్వదిస్తూ గోకర్ణానికి వెళ్ళి అక్కడే మూడు సంవ త్సరాలు గడిపి లెక్క లేనన్ని లీలలు చేసారు. తరువాత శ్రీశైలం వెళ్ళి అక్కడ సిద్ధపురుషులను సమావేశపరిచి వారికి దివ్య-ఙ్ఞానయోగాన్ని బోధించారు. మరికొంతకాలానికి కురుంగడ్డ చేరారు.
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sripada Srivallabha Charithamrutham - 235 🌹
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj
Chapter 25
🌻 Description of Rudrakshas 🌻
Wearing Rudrakshas is compulsory for Siva devotees. Among them, there are Brahma jathi, Kshatriya Jathi, Vysya Jathi, Sudra Jathi rudrakshas. The white Rudrakshas belong to Brahma jathi. It is very difficult to get them. Red and Honey coloured rudrakshas belong to Kshatriya jathi.
The rudrakshas in the colour of Tamarind seed belong to Vysya jathi. Black rudrakshas belong to Sudra jathi. Commonly one gets Rudrakshas with 5 to 16 faces in plenty. If rudrakshas are put in milk or water, they sink.
The rudrakshas not having weight or tender rudrakshas should not be worn. If rudraksha is kept under copper ‘uddarini’ and if a copper pancha patra is kept underneath, they revolve in a clock wise fashion.
They cause poverty. So householders (Grihasthu) should not use them. If they use, death of wife, breakdown of family and sanyasa yogam will occur.
Such things can be used by sanyasis. Kaalaagni Rudra said, ‘Brahmins should use white rudrakshas. Kshatriyas should use red coloured rudrakshas. Vysyas should use light yellow coloured rudrakshas. Sudras should use black rudrakshas.
Then they will get good favourable results, sins get destroyed and all desires will be fulfilled. Ekamukhi (one faced) rudraksha is Siva’s form. Two faced (dwi mukhi) rudraksha is Ardhanareeswara’s form.
Trimukhi (three faced) rudraksha is Agni form. Chaturmukhi (four faced) rudraksha is Brahma’s form, Pancha mukhi (five faced) rudraksha is Kaalaagni Rudra’s form. Shanmukhi (six faced) rudraksha is Karthikeya’s form. Sapta mukhi (seven faced) rudraksha is Manmadha’s form.
Ashta mukhi (eight faced) rudraksha is Rudra Bhairava’s form. Nava mukhi rudraksha (nine faced) is Kapila muni’s form. It is very difficult to get this.
This contains nine Shakti’s – Vidya Shakti, Jnana Shakti, Kriya Shakti, Shanta Shakti, Vama Shakti, Jyesta Shakti, Roudra Shakti, Anga Shakti, and Pasyanthi.
So, the Nava mukhi rudraksha is Dharma Devatha’s form. Dasa mukhi (ten faced) rudraksha is Vishnu’s form. Ekadasa (eleven faced) rudraksha is indeed ‘Rudramsa’ form.
Dwadasa Mukhi (twelve faced) rudraksha is the form of Dwadasa adityas. In this way, there is a close relation between rudrakshas and different forms of Gods.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹